
10 లక్షల మంది తరలింపు
చైనాలో తుపాను బీభత్సం
బీజింగ్: చైనా తూర్పు ప్రాంతంలో ‘చాన్-హోమ్’ తుపాను విరుచుకుపడుతోంది. శనివారం ఇది తీరం దాటడంతో జెజియాంగ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లో పెనుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. 10 లక్షల మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది విమాన,, రైలు సర్వీసులను రద్దు చేసి, 30 వేల నౌకలను రేవులకు తిరిగి రప్పించారు.
51 భారీ, మధ్యతరహా రిజర్వాయర్లలో నీటిమట్టం ప్రమాద హెచ్చరికను దాటింది. వంద ఇళ్లు, 82 వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాణనష్టం సంభవించినట్లు వార్తలేవీ రాలేదని, తుపాను ఈశాన్య దిశగా కదుతోందని అధికారులు తెలిపారు. ఈ విపత్తు వల్ల రూ. 2 వేల కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా.