మహిళల ప్రశ్నలకు బిత్తర పోయిన బొత్స | Botsa satyanarayana faces public ire in visakhapatnam | Sakshi
Sakshi News home page

మహిళల ప్రశ్నలకు బిత్తర పోయిన బొత్స

Published Fri, Oct 17 2014 8:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

మహిళల ప్రశ్నలకు బిత్తర పోయిన బొత్స

మహిళల ప్రశ్నలకు బిత్తర పోయిన బొత్స

విశాఖ : తుఫాను బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ... అక్కడ బాధితులు అడిగిన ప్రశ్నలకు బిత్తరపోయారు. సాయంపై మహిళలు వేసిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలో ఆయనకు అర్ధం కాలేదు. విశాఖలోని 21వ వార్డులో బొత్స గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు ఆయనను నిలదీశారు.

"ప్రధాన రోడ్లపై శ్రమదాన కార్యాక్రమాన్ని నిర్వహించి ఫోటోలు తీసుకున్న తర్వాత వెళ్లిపోవటం కాదు... ముందు వీధుల్లోకి వచ్చి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోండి..' అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం ఉన్న ప్రజా ప్రతినిధులెవ్వరూ రాలేదు. మీరు వచ్చారు అయితే పైపైనే పనులు చేపట్టి వెళ్లిపోతే వీధుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎవరు స్పందిస్తారంటూ బొత్సను నిలదీశారు. కాసేపు ఏమి జవాబు ఇవ్వాలో అర్థం కాని ఆయన తర్వాత మహిళలకు నచ్చజెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement