హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తన నెలరోజుల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు.
విశాఖతో హైదరాబాద్ : హుదూద్ తుఫాను బాధితుల సహాయార్ధం కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీ హనుమంతరావు తన నెలరోజుల జీతాన్ని సీఎం సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. ఆయన బుధవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావును కలిసి చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా వీహెచ్ మాట్లాడుతూ తనకు విశాఖతో ప్రత్యేక అనుబంధం ఉందని, ఈనెల 18న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నట్లు తెలిపారు.