సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్‌తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్‌హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది.
తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది
తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment