Hero Suriya
-
ఆ సినిమాతోనే నేను జ్యోతిక లవ్ లో పడ్డాం
-
జ్యోతిక నాకన్నా ఒక మంచి నటి..!
-
తెలుగు వారికి తెలుగులో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను..!
-
హీరో సూర్య పిల్లలు ఇప్పుడెలా ఉన్నారో చూశారా? (ఫొటోలు)
-
బీస్ట్ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటో
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం తన శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య42గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కంగువ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇటీవలె ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం సూర్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. తన పాత్రకు తగ్గట్లు లుక్ మార్చుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు సూర్య. తాజాగా జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న సూర్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. -
జైభీమ్ వివాదం: హైకోర్డులో సూర్య దంపతులకు ఊరట
హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభిచింది. జై భీమ్ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. గురువారం(ఆగస్ట్ 11) ఈ కేసుపై విచారించిన మద్రాస్ న్యాయస్థానం ఈ పటిషన్‌ను రద్దు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది సూర్య నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ అయితే కొన్ని సామాజిక వర్గాల మాత్రం ఈసినిమాను వ్యతిరేకించాయి. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజికవర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సైదాపేట కోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ మేకర్స్ చెన్నై హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇది రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవితం ఆధారం తీసిన సినిమా అని, ఓ కేసులో ఆయన ఎలా పోరాడో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. అంతేకాని ఎవరి మనోభవాలను దెబ్బతీయాలనేది తమ ఉద్ధేశం కాదంటూ సూర్య కోర్టుకు వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు ఈ పటిషన్‌పై విచారించిన చెన్నై హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది. -
హీరో సూర్య ఇంటికి పోలీసు భద్రత
ప్రముఖ సినీ నటుడు సూర్య ఇంటి ముందు తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతకు ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన నటించిన ఎదుర్కుమ్ తునిందవన్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు. పైగా కడలూరు, విల్లుపురం జిల్లాలలో సినిమా విడుదలపై నిషేధం విధించాలని వారు కడలూరు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీంతో చెన్నైలోని సూర్య నివాసం వద్ద తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.గతంలోనూ సూర్య నటించిన జై భీమ్ సినిమా వివాదాస్పదం కావడంతో అతని ఇంటికి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. -
‘జై భీమ్’ సినిమాలో చూపింది సత్యమేనా?
జైభీమ్ సినిమా కలిగించిన సంచలనం సరే.. కానీ ఒక నిర్మాతగా తనకున్న స్వేచ్చని హీరో సూర్య దుర్వినియోగ పరచారు. డీఎంకే పార్టీ మద్దతు దారుడు, జైభీమ్ నిర్మాత, హీరో సూర్య అగ్ని(వన్ని) కులక్షత్రియుల భుజంపై గన్ పెట్టి, హిందూ మతంపై ఎక్కుపెట్టిన, మతపర వ్యాపారాత్మకమైన మూలకాన్ని నింపిన తూటాను పేల్చాడు. విలన్ పాత్రధారుడైన పోలీస్ అధికారి ఇంట్లో ఒక సన్నివేశంలో అగ్ని(వన్ని)కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను ప్రత్యేకించి కనిపించేటట్లు పెట్టడం సదుద్దేశం ఎలా అవుతుంది? (చదవండి: వివక్షకు విరుగుడు ప్రశ్నించడమే!) తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలలో వహ్నికుల క్షత్రియులుగానూ, ఆంద్ర, తెలంగాణా రాష్ట్రాలలో అగ్నికుల క్షత్రియులుగానూ జీవో నంబర్ 297/తేదీ.13–06–1921 అనుసరించి అధికారికంగా ధ్రువీకరించబడుతున్న అగ్ని, వన్ని కులక్షత్రియులు, పవిత్రమైనదిగా ఆరాధించే తమ జాతి లోగోను ప్రతినాయకుడి ఇంట్లో పెట్టడం ద్వారా జాతి వివక్షదారులు వన్నియర్స్ అన్న అవాస్తవాన్ని చిత్రీకరించారు. ఈ అగ్ని, వన్ని కులక్షత్రియుల అగ్నికుండం లోగో ఉన్న క్యాలండర్ ప్రతినాయకుడి ఇంట్లోకి గాల్లో కొట్టుకు వచ్చి రాలేదు అన్నది వాస్తవం. ఇది తప్పు అని గొడవ చేస్తే, ఆ సన్నివేశంలో అగ్ని(వన్ని) కులక్షత్రియుల లోగో ఉన్న క్యాలండర్‌ను తొలగించి, జై భీమ్ సినిమాలో నిజ జీవితంలో గిరిజన రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరు వాస్తవానికి ఆంథోనిరాజు. కానీ, జై భీమ్ సినిమాలో రాజన్నను కొట్టి చంపిన పోలీస్ అధికారి పేరుని గురుమూర్తిగా మార్చారు. (చదవండి: జైభీమ్.. నాటి పోరాటం గుర్తొచ్చింది!) యధార్థ చరిత్ర అని చెప్పిన జై భీమ్ సినిమాలో హీరో తదితర కొన్ని ముఖ్యమైన పాత్రలకు నిజ జీవితంలోని పేర్లే పెట్టారు. కానీ, విలన్ పాత్రధారి పేరుని మాత్రం హిందూ పేరుగా మార్చి పెట్టారు. సినిమా కలెక్షన్స్ పెంచుకోవడానికి, పూర్తి వ్యాపారాత్మక కోణంలో ఆలోచించి సినిమా టైటిల్‌ను జైభీమ్ అని పెట్టిన చిత్ర నిర్మాణ బృందం, అదే వ్యాపారాత్మక కోణంలో ప్రతి నాయకుడిని హిందువుగా చూపించాలన్న అనైతిక చర్యకు పాల్పడింది. ఒక పవర్ఫుల్ సందేశాన్ని అందించే అవకాశాన్ని చిత్ర నిర్మాణ బృందం ముఖ్యంగా నిర్మాత, హీరో సూర్య స్వార్థానికి వాడుకోవడం సమర్థనీయం కాదు. (చదవండి: ప్రజాభీష్టంతోనే మూడు రాజధానులు...) – చింతా శ్రీకృష్ణ బాబు వ్యవస్థాపక అధ్యక్షులు దక్షిణ భారత అగ్నికుల క్షత్రియ ప్రాచీన వారసత్వ పరిశోధనా సంస్థ -
ఇంత ప్రేమ ఇంతకుముందెన్నడూ చూడలేదు: హీరో సూర్య
సాక్షి, హైదరాబాద్: తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన జైభీమ్ వివాదం, ఈ నేపథ్యంలో తనకు లభిస్తున్న స్పందనపై సూర్య సంతోషాన్ని వ్యక్తం చేశారు. తమకు అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సూర్య బుధవారం ట్వీట్ చేశారు. (Jai Bhim: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది ) జైభీమ్ మూవీని ఆదరిస్తున్న తీరు, ప్రేమ అపారమైనది. ఇంతకు ముందెప్పుడూ ఇలాంటి ప్రేమ చూడలేదంటూ సూర్య తన ఆనందాన్ని ప్రకటించారు. ఈ సమయంలో తమకు అందించిన విశ్వాసం, భరోసాకు ఎంత కృతజ్ఞతతో ఉన్నానో మాటల్లో చెప్పలేనంటూ ట్వీట్ చేశారు. జైభీమ్ సినిమా వివాదం నేపథ్యంలో హీరో సూర్యకు సోషల్ మీడియాలో భారీ మద్దతు లభించింది. స్టాండ్ విత్ సూర్య అంటూ నెటిజనులు సూర్య అండ్ టీంకు అండగా నిలబడు తున్నారు. కాగా ఈ మూవీలో ప్రకాష్ రాజ్ చెంపదెబ్బ సీన్‌పై వివాదం సమసిపోకముందే ఈ సినిమాలోని పలు అంశాలు ఓ వర్గం వారికి కించపరిచేలా ఉన్నాయని పీఎంకే ఎంపీ అన్బుమణి రాందాస్ ఆరోపించిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు, నిర్మాతపై చర్యలు తీసుకోవాలని కోరుతూ పీఎంకే మైలాడుతురై జిల్లా కార్యదర్శి పన్నీర్ సెల్వం అక్కడి పోలీస్ సూపరింటెండెంట్‌కు లేఖ రాశారు. ఈ ఆరోపణలను హీరో సూర్య ఖండించారు. మరోవైపు హీరో సూర్యని కొట్టిన వారికి ఏకంగా లక్ష రూపాయలు బహుమతిగా ఇస్తామని పీఎంకే పార్టీ నేతలు సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే జైభీమ్ సినిమా వివాదంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయ వద్దని, ఆవేశకావేశాలకు లోను కావద్దని తన ఫ్యాన్స్‌కు పిలుపు నిచ్చారు. అన్ని వర్గాలు, కులాల వారిని సమంగానే చూడాలని ఎవరినీ కించపరచొద్దంటూ ఒకలేఖ రాశారు. అటు నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కిన జైభీమ్ సినిమా ఓటీటీలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీ రేటింగ్‌లో టాప్ ప్లేస్‌లో దూసుకు పోతోంది. Dear all, this love for #Jaibhim is overwhelming. I’ve never witnessed this before! Can’t express in words how thankful I am for the trust & reassurance you all have given us. Heartfelt thanks for standing by us ✊🏼 — Suriya Sivakumar (@Suriya_offl) November 17, 2021 -
జైభీమ్: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
సాక్షి, హైదరాబాద్: సినిమా అంటే ఫైట్లు, ఫీట్లు, ఐటెం సాంగ్‌లు కాదని నిరూపించిన మూవీ జై భీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపిన మూవీ. అంతేకాదు సింపుల్ బడ్జెట్‌తో ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా సగటు ప్రేక్షకుడిలో ఆలోచన రేకెత్తించిన సినిమాగా ప్రశంసలు దక్కించుకుంది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోత్మకంగా తెరకెక్కించిన వైనం శభాష్ అనిపించుకుంది. ఈ మూవీ బ్లాక్ బ్లస్టర్హిట్ అవ్వడమే కాదు అనేక రికార్డులతో దూసుకుపోతోంది. తాజాగా ఐఎండీబీలో రేటింగ్స్‌లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ ‘ది షాషాంక్ రిడంప్షన్’ అధిగమించి ప్రపంచవ్యాప్తంగా విమర్శకులను ఆకట్టుకుంటోంది. 1994లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు ఐఎండీబీ సినిమాల జాబితాలో టాప్ ఉంది. ప్రస్తుతం 2.5 మిలియన్ల ఓట్లతో 9.3 రేటింగ్‌తో ఉండగా, జై భీమ్ 73 వేలకు పైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది తమిళ హీరో సూర్య, నటి జ్యోతిక దంపతులకు వారి మూవీలు, ఫ్యాన్స్‌లో వారికున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ప్రాధాన్యమున్న సినిమాలతో, అనేక ప్రయోగాలకు శ్రీకారం చుట్టడమే కాదు కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అవుతున్నారు.. ఈ మూవీ ఓటీటీలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ మూవీగా జైభీమ్ నిలిచింది. అరుదైన చిత్రాల జాబితా లిస్టులో చోటు సంపాదించుకుని 9.6 రేటింగ్‌తో తన ప్రత్యేకతను చాటుకుంటోంది. -
Jai Bhim IMDB Rating: మరో ఘనత, హాలీవుడ్ క్లాసిక్ హిట్‌ను దాటేసింది
-
గ్యాంగ్ లీడర్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
గ్యాంగ్ .. బ్యాంగ్.. దుమ్మురేపిన సూర్య
సాక్షి, హైదరాబాద్: ‘గ్యాంగ్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హీరో సూర్య డ్యాన్సులతో దుమ్మురేపారు. తొలిసారి ఈ సినిమాలో తన పాత్రకు తానే తెలుగులో డబ్బింగ్ చెప్పుకొన్నానని, తన ప్రయత్నం తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని సూర్య అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కాబోతున్న తమ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఈ వేడుకలో హీరోయిన్ కీర్తిసురేష్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రముఖ నటి రమ్యకృష్ణతోపాటు పలువురు చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొన్నారు. -
సినీ ప్రముఖులకు భారీ షాక్
- హీరో సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, ప్రియల తదితరులకు వారెంట్లు - నీలగిరి కోర్టు సంచలన ఆదేశాలు చెన్నై: తమిళ సినీరంగానికి చెందిన ప్రముఖ నటీనటులకు నీలగిరి కోర్టు షాకిచ్చింది. హీరో సూర్య, ఓ హీరోయిన్ సహా ఏడుగురికి మంగళవారం వారెంట్ జారీచేసింది. హీరో సూర్యకు పీటీ వారెంట్ .. మిగిలిన ఆరుగురికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హీరోయిన్ ప్రియ, వెటరన్ నటుటు శరత్‌కుమార్, సత్యరాజ్, కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్‌లకు నీలగిరి జిల్లాకోర్టు వారెంట్లు జారీచేసింది. పరువునష్టం కేసులో వీరందరికీ వారెంట్లు జారీ అయ్యాయి. సదరు నటీనటులు గతంలో పలు సందర్భాల్లో పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాత్రికేయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏడుగురు ప్రముఖులకు ఒకేసారి వారెంట్లు జారీకావడం సినీ పరిశ్రలో కలకలం రేపింది. కోర్టు ఆదేశాలపై నటీనటులు స్పందించాల్సిఉంది. -
సూర్యకు అభినందనల వెల్లువ
విభిన్న కథాంశంతో వెండితెర మీదకు వచ్చిన 24 హీరో సూర్యను పలువురు టాలీవుడ్, కోలీవుడ్ హీరోలు అభినందనలతో ముంచెత్తుతున్నారు. సినిమాలో ట్విస్టులు అదిరిపోయాయని, కథాంశం కూడా చాలా బాగుందని చెబుతున్నారు. మంచి ఓపెనింగ్ కూడా వచ్చిందని మెచ్చుకుంటున్నారు. తాను ఈ సినిమాను ఎంతగానో లవ్ చేశానని, ముఖ్యంగా చివరి 20 నిమిషాలు అదిరిపోయిందని టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ అన్నాడు. విజువల్స్, ట్విస్టులు, సూర్య నటన చాలా బాగున్నాయని, ఈ సినిమాను తప్పనిసరిగా చూడాల్సిందేనని ట్వీట్ చేశాడు. ఇక 'అ.. ఆ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న హీరో నితిన్ కూడా ఈ సినిమాపై స్పందించాడు. ముందుగా టీమ్ 24కు కంగ్రాట్స్ చెప్పాడు. సినిమా గురించి చాలా అద్భుతాలు వింటున్నానని, ఈ మాస్టర్ పీస్తో శ్రేష్ట్ మూవీస్‌కు కూడా అనుబంధం ఉన్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు. దర్శకుడు విక్రమ్‌కు, హీరో సూర్యకు థాంక్స్ చెప్పాడు. ఇక ఈ సినిమాకు రాక్‌స్టార్ ఓపెనింగ్ వచ్చిందని, ఆల్ ద బెస్ట్ అని కోలీవుడ్ హీరో మాధవన్ అన్నాడు. ఇది చాలా పెద్ద సినిమా అవుతుందని కూడా చెప్పాడు. Loved #24TheMovie. Esp last 20 mins. The visuals, twists & @Suriya_offl' s performance as Mani & Athreya were superb. 24 is a must watch! — Allu Sirish (@AlluSirish) 6 May 2016 CONGRATS team24!hearing amazing stuff bt d film!happy tht sreshth movies is associated with this master piece..thanku vikram n @Suriya_offl — nithiin (@actor_nithiin) 6 May 2016 @Suriya_offl wish you all the very best for a rock star opening bro....This is the big one ... Go @24 — Ranganathan Madhavan (@ActorMadhavan) 6 May 2016 -
ప్రివ్యూ టాక్: 24 సినిమా ఎలా ఉందంటే..
తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు నటించిన చిట్ట చివరి చిత్రం.. మనం. ఈ సినిమాను అత్యంత ధైర్యంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్ కుమార్ విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కూడా చూశాడు. ఈ సినిమా విడుదలై ఇప్పటికి ఏడాది కావస్తున్నా.. ఇప్పటికీ చాలామంది దీనిగురించి చర్చించుకుంటున్నారు. ఆ సినిమా దర్శకుడు విక్రమ్ కుమార్ నుంచి వచ్చిన మరో చిత్రం.. సూర్య హీరోగా నటించిన '24'. శుక్రవారం విడుదలవుతున్న ఈ సినిమాకు ఇప్పటికే బోలెడంత హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ఈ సినిమాను ఆకాశానికెత్తేశాడు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ప్రివ్యూ చూసిన తరణ్.. తన భావావేశాన్ని ఆపుకోలేక ఈ సినిమా గురించి వరుస ట్వీట్లతో మోతెక్కించాడు. విక్రమ్ తన నైపుణ్యాన్ని మరోసారి ప్రదర్శించాడని, 24 సినిమా సబ్జెక్టును చాలా మేధస్సుతో డీల్ చేశాడని తరణ్ అన్నాడు. ఈసారి మూడు పాత్రలలో నటించిన సూర్య కూడా అవార్డు విన్నింగ్, నాకౌట్ పెర్ఫార్మెన్సు చూపించాడని ప్రశంసించాడు. ముఖ్యంగా చెడ్డవాడైన విరోధి పాత్రలో అదరగొట్టాడని చెప్పాడు. ఈ సినిమాను కేవలం బాగుందని చెప్పలేమని.. ఇందులో ఇంకా చాలా ఉన్నాయని అన్నాడు. ఇంత మంచి సబ్జెక్టును తీసుకున్నందుకు మొత్తం సినిమా టీమ్‌కు అభినందనలు చెప్పాడు. ఇలాంటి సినిమా తీయాలంటే ధైర్యం, సబ్జెక్టు మీద పట్టు, వాటన్నింటితో పాటు ఆర్థిక దన్ను అన్నీ ఉండాలని తెలిపాడు. టైటిళ్లతో మొదలుపెట్టి ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, తర్వాత 2.40 గంటల పాటు ఒక రోలర్ కోస్టర్‌లో తిరుగుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతికి లోనవుతారని తరణ్ అన్నాడు. ఈ సినిమాకు అతిపెద్ద బలం దాని కాన్సెప్టేనని, దానికి తోడు ఇందులో కావల్సినంత వినోదం, ఎవరూ ఊహించలేని ట్విస్టులు, మలుపులు ఉంటాయంటూ ప్రేక్షకులను ఊరించాడు. సూర్య - సమంతల మధ్య సన్నివేశాలు కూడా చూడదగ్గవేనని, మంచి ఇంటర్వెల్ పాయింటు ఉందని తెలిపాడు. It requires courage, conviction, command over the medium and of course, financial strength to bring to life a film like #24TheMovie... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie grabs your attention from the titles itself and for the next 2.40 hours you're hooked on to this terrific roller coaster ride... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Biggest strength of #24TheMovie is its concept. It also packs loads of entertainment and unpredictable twists and turns that win you over... — taran adarsh (@taran_adarsh) 5 May 2016 High points: Dramatic start, cute light moments [Suriya-Samantha], fab interval point, emotional moments, the culmination #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Vikram Kumar, who directed the terrific #Manam [Telugu], displays his mastery yet again. He handles the subject with brilliance #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 Suriya, in triple roles this time, delivers an award-worthy, knockout performance. He's stupendous as the evil antagonist #24TheMovie — taran adarsh (@taran_adarsh) 5 May 2016 #24TheMovie is not just a good looking film, but has lots to offer. Kudos to the team for pulling off the subject with élan! — taran adarsh (@taran_adarsh) 5 May 2016 -
రికార్డు స్థాయిలో సినిమా విడుదల!
ఒక ప్రాంతీయ భాష సినిమాను అమెరికాలో విడుదల చేయాలంటే అందుబాటులో ఉండే స్క్రీన్లు తక్కువ. మరీ ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేసినా కష్టమన్న ఉద్దేశంతో నిర్మాతలు ఆగుతారు. కానీ ఇటు తెలుగు, అటు తమిళం రెండు భాషల్లో విడుదలవుతున్న సూర్య కొత్త సినిమా '24'ను మాత్రం.. అమెరికాలో రికార్డు స్థాయిలో ఏకంగా 267 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళ వెర్షన్లు రెండింటినీ 267 స్క్రీన్లలో విడుదల చేస్తున్నామని, మే 5వ తేదీన స్పెషల్ ప్రీమియర్లు వేయాలని కూడా చూస్తున్నామని సినిమా వర్గాలు తెలిపాయి. సినీ గెలాక్సీ ఇంక్ సంస్థ ఈ సినిమాను పంపిణీ చేస్తోంది. ఇదే సంస్థ ఇటీవల తమిళ హీరో విజయ్ నటించిన 'తెరి' సినిమాను కూడా అమెరికాలో పంపిణీ చేసింది. 24 సినిమాలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటిస్తున్నారు. టైమ్ మిషన్ కాన్సెప్టు ఆధారంగా ఈ సినిమా నడుస్తుంది. ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో నటిస్తున్నాడు. దీనికి ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, సూర్య సొంత బ్యానర్లోనే సినిమాను నిర్మించారు. భారతదేశంలో మే 6వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.