హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభిచింది. జై భీమ్ చిత్రంలోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు పటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. గురువారం(ఆగస్ట్ 11) ఈ కేసుపై విచారించిన మద్రాస్ న్యాయస్థానం ఈ పటిషన్‌ను రద్దు చేసింది. న్యాయమూర్తి జస్టిస్ ఎన్ సతీష్ కుమార్ ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ఈ రోజు ఉత్తర్వులు ఇచ్చారు. కాగా గతేడాది సూర్య నటించిన చిత్రం జై భీమ్. టూడీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జ్యోతిక, సూర్య కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
చదవండి: 3,4 రోజుల వసూళ్లకే సంబరాలు చేసుకోవద్దు: తమ్మారెడ్డి భరద్వాజ
అయితే కొన్ని సామాజిక వర్గాల మాత్రం ఈసినిమాను వ్యతిరేకించాయి. ముఖ్యంగా హిందూ వన్నియార్ల సామాజికవర్గానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి తమ మనోభావాలు దెబ్బతిసే విధంగా జై భీమ్ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ సైదాపేట కోర్టులో మొదట పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఈ పిటిషన్‌ను రద్దు చేయాలని కోరుతూ జైభీమ్ మేకర్స్ చెన్నై హైకోర్టును కోరిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఇది రిటైర్డ్ అడ్వకేట్ చందు నిజ జీవితం ఆధారం తీసిన సినిమా అని, ఓ కేసులో ఆయన ఎలా పోరాడో ఉన్నది ఉన్నట్లు చూపించాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. అంతేకాని ఎవరి మనోభవాలను దెబ్బతీయాలనేది తమ ఉద్ధేశం కాదంటూ సూర్య కోర్టుకు వివరణ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో నేడు ఈ పటిషన్‌పై విచారించిన చెన్నై హైకోర్టు ఈ కేసును రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment