
ప్రముఖ సినీ నటుడు సూర్య ఇంటి ముందు తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతకు ఏర్పాటు చేశారు. తాజాగా ఆయన నటించిన ఎదుర్కుమ్ తునిందవన్ సినిమాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ చిత్రాన్ని పీఎంకే పార్టీ నాయకులు, వన్నియర్ సంఘంకు చెందిన వారు వ్యతిరేకిస్తున్నారు.
పైగా కడలూరు, విల్లుపురం జిల్లాలలో సినిమా విడుదలపై నిషేధం విధించాలని వారు కడలూరు కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. దీంతో చెన్నైలోని సూర్య నివాసం వద్ద తుపాకీ కలిగిన పోలీసులతో భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.గతంలోనూ సూర్య నటించిన జై భీమ్ సినిమా వివాదాస్పదం కావడంతో అతని ఇంటికి భద్రత కల్పించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment