సినీ ప్రముఖులకు భారీ షాక్
- హీరో సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, ప్రియల తదితరులకు వారెంట్లు
- నీలగిరి కోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై: తమిళ సినీరంగానికి చెందిన ప్రముఖ నటీనటులకు నీలగిరి కోర్టు షాకిచ్చింది. హీరో సూర్య, ఓ హీరోయిన్ సహా ఏడుగురికి మంగళవారం వారెంట్ జారీచేసింది. హీరో సూర్యకు పీటీ వారెంట్ .. మిగిలిన ఆరుగురికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
హీరోయిన్ ప్రియ, వెటరన్ నటుటు శరత్‌కుమార్, సత్యరాజ్, కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్‌లకు నీలగిరి జిల్లాకోర్టు వారెంట్లు జారీచేసింది. పరువునష్టం కేసులో వీరందరికీ వారెంట్లు జారీ అయ్యాయి. సదరు నటీనటులు గతంలో పలు సందర్భాల్లో పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాత్రికేయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి.
గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏడుగురు ప్రముఖులకు ఒకేసారి వారెంట్లు జారీకావడం సినీ పరిశ్రలో కలకలం రేపింది. కోర్టు ఆదేశాలపై నటీనటులు స్పందించాల్సిఉంది.