tamil actors
-
రెమ్యూనరేషన్లో ఆల్ టైమ్ రికార్డ్.. వారీసుకు రూ.150 కోట్లు..!
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న తాజాచిత్రం 'వారీసు'. తెలుగులో వారసుడు పేరుతో ఈనెల 14న రిలీజ్ కాబోతోంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా విజయ్‌కు జోడీగా నటించింది. సంక్రాంతి కానుకగా తమిళంలో ఈనెల 11న విడుదల కానుంది. దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రానికి విజయ్ తీసుకున్న పారితోషికంపై నెట్టింట చర్చ కొనసాగుతోంది. ఈ సినిమాకు భారీగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వారీసు కోసం విజయ్ రూ.150 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా విజయ్ నిలవనున్నారు. దాదాపు ఇది బాలీవుడ్, సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ రెమ్యూనరేషన్‌ను మించిపోయింది. అంతే కాకుండా కోలీవుడ్‌లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో విజయ్ ఒకరు. (ఇది చదవండి: సంక్రాంతి బరినుంచి తప్పుకున్న వారీసు? నెట్టింట జోరుగా ప్రచారం) విజయ్ సినిమాల ఎంపికలోనూ ఎప్పుడూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటారు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్‌లతో సహా యువ దర్శకుతలతో జతకట్టాడు. విజయ్ పూర్తిగా స్క్రిప్ట్‌ల ఆధారంగా సినిమాలను నిర్ణయిస్తాడని.. కమర్షియల్‌తో పాటు ఎంటర్టైనర్కు సంబంధించిన అన్ని అంశాలు ఉండేలా చూస్తానని నెల్సన్ అన్నారు. విజయ్‌కి ఓవర్సీస్లోనూ ప్రజాదరణ ఎక్కువగా ఉంది. అలాంటి ఆదరణ ఉన్న చాలా తక్కువ మంది దక్షిణాది నటుల్లో ఈయన ఒకరు. వారిసు సినిమా తమిళంలో జనవరి 11న, హిందీలో జనవరి 13న, తెలుగులో సంక్రాంతి స్పెషల్‌గా 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో ప్రభు, శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్, షామ్, యోగి బాబు, సంగీత ప్రధాన పాత్రల్లో నటించారు. -
ఇది ప్రభుత్వంపై స్టార్ హీరోల నిరసన గళమా?
చెన్నె: ఎంతో ఉత్కంఠ రేపిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మంగళవారం ముగిశాయి. ఓటేసేందుకు అగ్ర తారలు తరలివచ్చినప్పటికీ సాధారణ ఓటర్లు అంతగా ఆసక్తి కనబర్చలేదని పోలింగ్ శాతం చూస్తే అర్ధమవుతోంది. అయితే పోలింగ్ రోజు పలు ఆసక్తికర సంఘటనలు తమిళనాడులో చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా సినీ నటులు వినూత్నంగా ఓటేయడానికి ముందుకువచ్చారు. పోలింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓటేయడానికి వచ్చారు. తదనంతరం నటీనటులు, సినీ పరిశ్రమకు చెందిన వారంతా ఓటేసేందుకు తరలివచ్చారు. ఈ క్రమంలో అగ్రనటులు అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జయం రవి ముఖ్యంగా వారు వేసుకున్న మాస్క్‌లతో పరోక్షంగా డీఎంకే పార్టీకి మద్దతు తెలిపినట్లు సమాచారం. అజిత్, విజయ్, విక్రమ్, శింబు తదితరులు నలుపు రంగు మాస్క్ ధరించి ఓటేసేందుకు వచ్చారు. డీఎంకే పార్టీ జెండాలో నలుపు ఉంటుంది. అందుకే ఆ పార్టీకి ఓటేయాలని పరోక్షంగా పిలుపునిచ్చినట్లుగా తమిళనాడులో చర్చ నడుస్తోంది. దీంతోపాటు విజయ్ సైకిల్ మీద రావడం తమిళనాడే కాక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆసక్తికర చర్చ సాగింది. అయితే విజయ్ పెట్రోల్, డీజిల్ ధరలు నిరంతరం పెరుగుతుండడానికి నిరసనగా సైకిల్‌పై వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్ రోజున అభిమానులు, ఓటర్లకు ఆ విషయం గుర్తు చేసేందుకు విజయ్ సైకిల్ ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక నటుడు విక్రమ్ కూడా పోలింగ్ కేంద్రానికి నడుచుకుంటూ వచ్చాడు. ఆయన కూడా ఇదే విషయం ప్రస్తావించేందుకు నడుచుకుంటూ వచ్చాడని సమాచారం. శింబు ఈ చర్యలతో పరోక్షంగా అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రచారం చేసినట్లు అందరూ భావిస్తున్నారు. దీనిపై తమిళనాడులో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ పరిణామం అధికార పార్టీకి ప్రతికూల ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఇక అగ్రనటుడు రజనీకాంత్, సూర్య, కార్తీ తెల్లటి మాస్క్ ధరించి వచ్చారు. ఓటేసే సమయంలో నటుడు అజిత్ ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఓటేయడానికి వచ్చే సమయంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించగా అతడి ఫోన్‌ను లాగేసుకున్నాడు. మరికొద్దిసేపటి తర్వాత వార్నింగ్ ఇచ్చేసి ఫోన్ తిరిగిచ్చేశాడు. చదవండి: బెంగాల్ మినహా పూర్తయిన ఎన్నికలు.. పోలింగ్ శాతం ఇలా.. -
సినీ ప్రముఖులకు భారీ షాక్
- హీరో సూర్య, శరత్‌కుమార్, సత్యరాజ్, ప్రియల తదితరులకు వారెంట్లు - నీలగిరి కోర్టు సంచలన ఆదేశాలు చెన్నై: తమిళ సినీరంగానికి చెందిన ప్రముఖ నటీనటులకు నీలగిరి కోర్టు షాకిచ్చింది. హీరో సూర్య, ఓ హీరోయిన్ సహా ఏడుగురికి మంగళవారం వారెంట్ జారీచేసింది. హీరో సూర్యకు పీటీ వారెంట్ .. మిగిలిన ఆరుగురికి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. హీరోయిన్ ప్రియ, వెటరన్ నటుటు శరత్‌కుమార్, సత్యరాజ్, కమెడియన్ వివేక్, వర్ధమాన నటుడు అరుణ్ విజయ్, దర్శకుడు చరణ్‌లకు నీలగిరి జిల్లాకోర్టు వారెంట్లు జారీచేసింది. పరువునష్టం కేసులో వీరందరికీ వారెంట్లు జారీ అయ్యాయి. సదరు నటీనటులు గతంలో పలు సందర్భాల్లో పాత్రికేయులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాత్రికేయ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏడుగురు ప్రముఖులకు ఒకేసారి వారెంట్లు జారీకావడం సినీ పరిశ్రలో కలకలం రేపింది. కోర్టు ఆదేశాలపై నటీనటులు స్పందించాల్సిఉంది. -
కపాల దీక్షకు కోలీవుడ్ మద్దతు
-
ఢిల్లీలో రోడ్డెక్కిన నటులు
విపరీతమైన కరువుతో బాధపడుతున్న తమిళనాడు రైతులకు మద్దతుగా తమిళ నటులు కూడా రోడ్డెక్కారు. హీరో విశాల్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్ ఇద్దరూ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. అప్పటికే అక్కడకు భారీ సంఖ్యలో చేరుకున్న రైతులతో కలిసి జంతర్ మంతర్ వదద్ రోడ్డు మీద కూర్చున్నారు. నల్లటి దుస్తులు వేసుకున్న విశాల్, ప్రకాష్ రాజ్ ఇద్దరూ కలిసి రైతులకు అనుకూలంగా నినాదాలు చేశారు. రైతులు కూడా మెడలో కపాలాలు ధరించి.. కరువు తీవ్రతను ప్రతిబింబించేలా నిరసన వ్యక్తం చేశారు. రైతుల రోదనలను ఎవరూ వినిపించుకోవడం లేదని, అందుకే ఇక్కడ తీవ్రస్థాయిలో ధర్నా చేస్తున్నామని ప్రకాష్ రాజ్ అన్నారు. తమ నిరసనలతోనైనా సంబంధిత మంత్రులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన చెప్పారు. -
చీపురు పట్టిన సినీ తారలు
చెన్నై : సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ హీరోలమే అనిపించుకుంటున్నారు. మన నటీమణులు. ఇటీవల తుపాన్ తమిళ ప్రజలను నిలువనీడ కూడా చేసి కనీవినీ ఎరుగని కష్టనష్టాలకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితి మన సినీ తారల్ని కలచి వేసింది. ఆదుకోవడానికి మేము సైతం అంటూ ప్రజల ముందుకు వచ్చారు. తుపాన్ నివారణకు విరాళాలను అందిస్తున్నారు. అంతటితో ఆగలేదు వారి చేయూత పలు సహాయ కార్యక్రమాలతో అన్నార్థులను ఆదుకుంటున్నారు. తాజాగా చెన్నై నగరాన్ని శుద్ధి చేయడానికి చీపుర్లు పట్టారు. సింగార చెన్నైగా పేరు గాంచిన చెన్నై నగరాన్ని తుపాన్ దుర్భరంగా మార్చేసింది. చెత్త చెదారంతో దుర్వాసనలతో నిండిపోయింది. అలాంటి నగరాన్ని శుద్ధి చేయడానికి సినీ తారలు చీపుర్లు పట్టడానికి కూడా వెనుకాడలేదు. నెక్ట్స్ స్టెప్ ఫౌండేషన్ సంస్థతో కలిసి నగరంలోని చెత్తా చెదారాన్ని ఊడ్చేయడానికి నడుం బిగించారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం చెన్నై ఎగ్మూర్ గంగిరెడ్డి వీధిలోని శుద్ధి చేసే కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ప్రారంభించారు. ఇందులో నడిగర్ సంఘం కోశాధికారి కార్తీతో పాటు నటుడు ఆర్.రితీష్, ఉదయ, నటి వరలక్ష్మి, లలితకుమారి, శ్రీమాన్ మహేంద్రన్, సౌందరరాజన్, ప్రేమ్‌కుమార్ పాల్గొన్నారు. పరిశుభ్ర పరిచిన ప్రాంతాల్లో వైద్యబృందం ప్రజలకు రోగ నివారణ వైద్యసేవలను అందించారు. నగరాన్ని శుద్ధి పరిచే కార్యక్రమంలో 25 మందికి పైగా పాల్గొన్నారు. తదుపరి పుదుపేట ప్రాంతాన్ని శుభ్రపరిచారు.