Suriya's Massive Workout For Kanguva Latest Pic Goes Viral - Sakshi
Sakshi News home page

Hero Suriya: బీస్ట్‌ మోడ్‌లో హీరో సూర్య.. వైరల్‌ అవుతున్న లేటెస్ట్‌ ఫోటో

Published Fri, May 12 2023 3:08 PM | Last Updated on Fri, May 12 2023 3:27 PM

Hero Suriya Workout For Kanguva Latest Pic Goes Viral - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్య ప్రస్తుతం తన శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య42గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కంగువ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. ఇటీవలె ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కోసం సూర్య సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు.

తన పాత్రకు తగ్గట్లు లుక్‌ మార్చుకునేందుకు బాగానే కష్టపడుతున్నాడు సూర్య. తాజాగా జిమ్‌లో వర్కవుట్‌ చేస్తున్న సూర్య ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. కాగా ఈ సినిమాలో సూర్యకు జోడీగా బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement