పుష్ప-2 సినిమా క్రేజ్‌ వేరే లెవెల్.. ఆ లిస్ట్‌లో టాప్ ప్లేస్! | IMDB latest List Of Most Awaited Indian Movies In 2024 | Sakshi
Sakshi News home page

IMDB List: తగ్గేదేలే.. రిలీజ్ డేట్‌పై మేకర్స్ మరోసారి క్లారిటీ!

Published Tue, Jul 23 2024 8:23 PM | Last Updated on Tue, Jul 23 2024 9:01 PM

IMDB latest List Of Most Awaited Indian Movies In 2024

టాలీవుడ్‌లో మోస్ట్‌ అవైటేడ్ చిత్రాల్లో పుష్ప-2: ది రూల్ ఒకటి. అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబోలో పుష్ప మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. గతంలోనే ఆగస్టు 15న రిలీజ్ చేస్తామని ప్రకటించిన మేకర్స్.. మరోసారి వాయిదా వేశారు. దీంతో పుష్ప-2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తాజాగా ఐఎండీబీ ప్రకటించిన జాబితాలోనూ పుష్ప-2 మొదటిస్థానంలో నిలిచింది. ఇండియావ్యాప్తంగా 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల జాబితాలో టాప్‌ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత స్థానాల్లో దేవర, వెల్‌కమ్‌ టూ ద జంగిల్, గోట్, కంగువా, సింగమ్ ఏగైన్, తంగలాన్, భూల్ భూలయ్యా-3, ఆరోన్‌ మే కహాన్‌ దమ్‌ తా, స్త్రీ-2 చిత్రాలు నిలిచాయి. టాలీవుడ్ మూవీ తొలిస్థానంలో నిలవడంతో బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అయితే ఈ జాబితాపై పుష్ప-2 మేకర్స్ కూడా స్పందించారు. డిసెంబర్‌ 6న వచ్చేస్తున్నాం.. తగ్గేదేలే అంటూ ఓ వీడియోను షేర్ చేసింది. దీంతో పుష్ప-2 మరోసారి వాయిదా పడుతుందన్న రూమర్లకు చిత్రబృందం చెక్ పెట్టింది. డిసెంబర్‌ 6న విడుదల చేయనున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. కాగా.. ఈ మూవీ మరో నెల రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement