అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'పుష్ప 2'. ఈ మూవీ విడుదలైన ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్ల క్లబ్‌లో చేరడంతో చిత్ర యూనిట్ సంబరాలు చేసుకుంది. ఈ మూవీ ఇంతటి విజయానికి కారణమైన అందరికీ ధన్యవాదాలు చెబుతూ థాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు, ఎగ్జిబిటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ వేదికపై అల్లు అర్జున్ మాట్లాడుతూ మొదటిసారి దర్శకుడు సుకుమార్ పూర్తి పేరును రివీల్ చేశారు.
'పుష్పపై ఇది లవ్ కాదు.. వైల్డ్ లవ్. పుష్ప2 విజయం క్రెడిట్ అంతా ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌ను రూల్ చేస్తోన్న మా దర్శకుడు 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి'కి చెందుతుంది. ఆయన విజన్ నుంచే ఈ సినిమా పుట్టింది. ఈ చిత్రం కోసం ఆయన హార్డ్ వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఈ విజయం క్రెడిట్ మొత్తం నీ సొంతమే డార్లింగ్' అంటూ సుకుమార్‌పై బన్నీ ప్రశంసలు కురిపించారు.
సుకుమార్ పేరుతో నెటిజన్లకు పరీక్ష పెట్టిన బన్నీ
టాలీవుడ్‌లో ఇప్పటి వరకు సుకుమార్‌గా అందరికి ఆయన పరిచయమే.. అయితే, మొదటిసారి ఆయన్ను 'బండిరెడ్డి సుకుమార్ రెడ్డి' అని అల్లు అర్జున్ కామెంట్ చేయడంతో నెటిజన్లు అందరూ కాస్త తికమక అయ్యారు. వాస్తవంగా ఆయన పేరు సుకుమార్ బండిరెడ్డి అని నెట్టింట కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఆయన తండ్రి పేరు తిరుపతి రావు నాయుడు అని ఆయన వికిపీడియాలో కూడా ఉంది. బన్నీ చేసిన కామెంట్‌తో ఆయన ఏ సామాజిక వర్గానికి చెందుతారోనని గూగుల్‌లో నెటజన్లు తెగ వెతుకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు సమీపంలోని మట్టపర్రు గ్రామంలో సుకుమార్ జన్మించారు. దర్శకుడు కాక ముందు గణితం అధ్యాపకుడిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 2004లో ఆయన మొదటి చిత్రం 'ఆర్య' సంచలన విజయం సాధించి అల్లు అర్జున్ను స్టార్‌గా నిలబెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment