ప్రపంచవ్యాప్తంగా 'పుష్ప' ట్రెండ్ కొనసాగుతుంది. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎక్కడ చూసిన భారీ వసూళ్లతో అనేక రికార్డ్స్ దాటుకుని దూసుకెళ్తున్న ఈ సినిమా విడుదలైన 6 రోజుల్లోనే రూ.1002 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. విడుదలైన ఆరు రోజుల్లోనే అత్యంత వేగంగా వెయ్యి కోట్ల మైలురాయిని అందుకున్న చిత్రంగా పుష్ప2 రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్‌లో కూడా ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 375 కోట్లు వసూలు చేసింది. అక్కడ ఇంత వేగంగా ఈస్థాయి వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా నిలిచింది. తాజాగా థ్యాంక్యూ ఇండియా పేరుతో ఢిల్లీలో ఒక మీడియా సమావేశాన్ని పుష్ప టీమ్ ఏర్పాటు చేసింది. అందులో చిత్ర నిర్మాతలతో పాటు అల్లు అర్జున్, సుకుమార్ పాల్గొన్నారు. భారీ కలెక్షన్స్, పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్‌పై అల్లు అర్జున్ కీలక వ్యాఖ్యలు చేశారు.
'రికార్డ్స్ అనేవి శాశ్వితంగా ఉండిపోవు. బహుశా వచ్చే సమ్మర్‌లోనే పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్స్ శ్మాస్ కావచ్చు కూడా.. నంబర్స్ అనేవి ఎప్పటికీ శాశ్వంతగా ఉండిపోవని నేను నమ్ముతాను. రూ. 1000 కోట్లు అనేది అభిమానుల ప్రేమకు ప్రతిబింబం. ఈ నంబర్స్ తాత్కాలికంగా ఉంటాయి. కానీ, వాళ్ల ప్రేమ మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. రికార్డులు అనేవి ప్రతిసారీ బద్దలవుతూనే ఉండాలి. కొత్త రికార్డులు క్రియేట్ అవుతూనే ఉండాలని నేను ఎక్కువగా నమ్ముతా. మరో మూడు నెలలపాటు ఈ సంతోషాన్ని ఎంజాయ్ చేస్తాను. వచ్చే వేసవిలోపు ఈ రికార్డులన్నీ బద్దలు కావాలని కోరుకుంటున్నా. తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ పరిశ్రమ ఏదైనా కావచ్చు వచ్చే పుష్ప రికార్డ్స్‌ను మరో సినిమా దాటాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో పురోగతి అనేది ఉండాలని ఆశిస్తున్నాను.'
బాహుబలి 2, ఆర్‌ఆర్‌ఆర్, కల్కి 2898 ఏడీ తర్వాత ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఫుల్ రన్‌లో కొనసాగుతున్న ఈ చిత్రం సుమారు రూ. 1500 కోట్ల కలెక్షన్స్ అందుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
#AlluArjun about 1000cr in todays #Pushpa2TheRule event:
"The 1000cr number is just reflection of Love. Number is temporary & but love is forever. I want these numbers to be broken at least by next summer irrespective of any Industry. That is progression" pic.twitter.com/NjUnwlciBA— AmuthaBharathi (@CinemaWithAB) December 12, 2024
Comments
Please login to add a commentAdd a comment