ఏ స్త్రీ బాధపడకూడదు | surya on twitter | Sakshi
Sakshi News home page

ఏ స్త్రీ బాధపడకూడదు

Published Sat, Sep 30 2017 1:46 AM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

surya on twitter - Sakshi

‘‘ఏ దుర్గా గర్భస్రావానికి గురి కాకూడదు.ఏ సరస్వతీ స్కూల్‌కు వెళ్లకుండా ఉండకూడదు. ఏ లక్ష్మీ డబ్బు కోసం తన భర్తను బతిమాలకూడదు. ఏ పార్వతీ వరకట్న వేధింపులకు గురికాకూడదు. ఏ సీతా మనోవేధన చెందకూడదు.ఏ కాళికీ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఇవ్వకూడదని ఈ నవమికి అందరూ ప్రార్థించండి. హ్యాపీ నవరాత్రి’’.

దసరా సందర్భంగా హీరో సూర్య తన ట్విట్టర్‌లో ఈ విధంగా పోస్ట్‌ చేశారు. ఆడవాళ్ల పట్ల ఆయనకున్న గౌరవభావాన్ని, వారికే కష్టం రాకూడదని కోరుకునే మంచితనాన్ని ఈ ట్వీట్‌ చాటుతోంది. అందుకే ‘‘చాలా బాగా చెప్పారు అని కొందరు, మీ అభిమానిగా ఉండటం గర్వంగా ఉందని మరికొందరు’’ స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement