హీరో సూర్యకు తమిళంలో ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ ఉంది. వైవిధ్యమైన కథాంశాలకు కేరాఫ్ అడ్రస్గా ఉంటాయి సూర్య సినిమాలు. తాజాగా 'మనం' ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 24 సినిమాలో నటిస్తున్నాడు సూర్య. ఫస్ట్ లుక్తో ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచిన ఈ సినిమా తాజాగా మరోసారి ఆసక్తి రేకెత్తిస్తోంది. సూర్య తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరో పోస్టర్ ను రిలీజ్ చేశాడు. ఇప్పటివరకు కనిపించని ఓ స్టన్నింగ్ లుక్లో ఉన్నారు సూర్య.
ఇప్పటికే 24 టైం ట్రావెల్కు సంబంధించిన ఓ థ్రిల్లర్ స్టోరీ అనే ప్రచారం ఊపందుకుంది. ఈ సినిమాలో సూర్య త్రిపాత్రాభినయం చేస్తున్నాడు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. సూర్య సరసన సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.
#24TheMovie @2D_ENTPVTLTD @StudioGreen2 @deepakbhojraj @arrahman #vikramkumar Found both interesting!Hope you like!! pic.twitter.com/2V7QKT7upV
— Suriya Sivakumar (@Suriya_offl) January 23, 2016