అవే నా అందాన్ని పెంచాయ్‌: నటి | heroien sai pallavi acts with surya in tamil movie | Sakshi
Sakshi News home page

అవే నా అందాన్ని పెంచాయ్‌: నటి

Published Tue, Dec 26 2017 5:44 PM | Last Updated on Tue, Dec 26 2017 8:27 PM

heroien sai pallavi acts with surya in tamil movie  - Sakshi

సాక్షి, చెన్నై: ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం. ఆ ప్రేమ గురించి యువ హీరోయిన్‌ సాయిపల్లవి ఏమంటుందో తెలుసుకుందాం! మలయాళ చిత్రం ప్రేమమ్‌తో అందర్ని ఆకర్షించింది సాయిపల్లవి. ఆ ఒక్క చిత్రమే ఈ నేచురల్‌ బ్యూటీ జీవితాన్ని మార్చేసింది. కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో క్రేజీ నటిగా మారిపోయింది. టాలీవుడ్‌ ప్రేక్షకులు ఈ అమ్మడి నటనకు ‘ఫిదా’ అయిపోయారు. తన అభిమాన హీరో సూర్యతో నటించే అవకాశం రావడంతో మయ ఖుసీ అయిపోతున్న సాయిపల్లవి ఒక పత్రికతో తన ఆనందాన్ని పంచుకున్నారు.

సాయిపల్లవి మాట్లాడుతూ.. ‘నాకు డాన్స్‌ అంటే ప్రాణం. చదువుకుంటూనే డాన్స్‌ నేర్చుకున్నాను. సినిమాల్లో నటించాలన్న ఆసక్తి ఉంది. అయితే నాన్నకు మాత్రం నన్ను డాక్టరుగా చూడాలన్న ఆశ. దీంతో డాక్టరు విద్య కోసం నాన్న జార్జియా పంపారు. ఆ సమయంలో దర్శకుడు అల్పోన్సా ఫోన్‌ చేసి నేను దర్శకత్వం వహించనున్న ప్రేమమ్‌ చిత్రంలో నటిస్తావా అని అడిగారు. అంతే ఎగిరి గంతేసి నటించడానికి సమ్మతించాను. ఆ చిత్రం నాకు చాలా మంచి పేరు తెచ్చి పెట్టింది. నా ముఖానికి మొటిమలు ఎక్కువ.

అయినా ఎలాంటి మేకప్‌ లేకుండా నటించాను. అవే నా ముఖానికి అందాన్ని రెట్టింపు చేశాయని చాలా మంది ప్రశంసించారు. సహజ సిద్ధమైన అందాలతో నటిస్తేనే ఆత్మవిశ్వాసం పెరుగుతుందని నా భావన. నేను కాలేజీలో చదువుతున్న చాలా మంది ప్రేమిస్తున్నామని చెప్పారు. నిజం చెప్పాలంటే నాకు ప్రేమ అంటే ఇష్టం ఉండదు. నటన అంటేనే ఇష్టం. హీరో సూర్య అంటే చిన్నతనం నుంచి ఇష్టం. అలాంటి నటుడితో జంటగా నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది’ అని సాయిపల్లవి చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement