
నటి సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డాక్టర్ కావాల్సిన ఈమె నటనపై ఉన్న ఆసక్తితో నటి అయ్యారు. ఈమె మంచి డ్యాన్సర్ కావడంతో నిరూపించుకోవడానికి పెద్దగా శ్రమ పడాల్సిన అవసరం లేకపోయింది. చదువుకుంటున్న రోజుల్లోనే చిన్న వేషాలు వేసిన సాయి పల్లవి మలయాళ చిత్రం ప్రేమమ్‌తో కథానాయకిగా గుర్తింపు పొందారు.
ఆ తర్వాత తమిళం, తెలుగు, మలయాళం భాషలో నటిస్తూ బాగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తెలుగులో బాగా పాపులర్ అయ్యారు. గ్లామర్‌కు దూరంగా నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్నారు. ఇటీవల పలు అవకాశాలను దూరం చేసుకున్నారు. కారణం ఏమైనా ప్రస్తుతం ఈమె చేతిలో ఒక చిత్రం కూడా లేదు. త్వరలో కమలహాసన్ నిర్మించనున్న చిత్రంలో శివ కార్తికేయన్‌కు జంటగా నటించడానికి సిద్ధమవుతున్నారు.
కాగా సాయి పల్లవి గురించి తాజాగా ఒక వార్త సమాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈమె జార్జియాలో ఎంబీబీఎస్ చేసిన విషయం తెలిసిందే. దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి తన జన్మస్థలం అయిన కోయంబత్తూరులో ఆస్పత్రి కట్టించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సాయి పల్లవి నటనకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారా? వైద్య సేవలు అందిస్తూనే నటనను కొనసొగిస్తారా? అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ విషయంపై సాయి పల్లవినే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment