హాట్‌ మోడల్‌తో రోమాన్స్‌ చేయనున్న అగ్రహీరో! | meera mithun to romance with suryaa | Sakshi
Sakshi News home page

హాట్‌ మోడల్‌తో రోమాన్స్‌ చేయనున్న అగ్రహీరో!

Published Wed, Nov 15 2017 8:07 PM | Last Updated on Wed, Nov 15 2017 8:10 PM

meera mithun to romance with suryaa - Sakshi

తమిళ సినిమా: తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న నటి మీరామిథున్‌ లక్కీ చాన్స్‌ కొట్టేసింది. మిస్‌ ఫెమీనా సౌత్‌ కిరీటాన్ని గెలుచుకున్న ఈ బ్యూటీ.. ఆ తర్వాత మోడలింగ్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. '8 తూట్టాకల్‌' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన మీరాకు తొలిచిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తరువాత అవకాశాలు లేవనుకుంటున్న సమయంలో ఏకంగా స్టార్‌ హీరో సూర్యతో జతకట్టే అవకాశం తలుపు తట్టింది. ఇంతకంటే లక్కీ చాన్స్‌ ఏముంటుంది.

సూర్య హీరోగా ప్రస్తుతం తెరకెక్కుతున్న 'తానాసేర్న్‌ద కూటం' చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది. ఈ చిత్రంలో కథానాయికగా కీర్తీసురేశ్‌ నటిస్తుండగా.. మరో హీరోయిన్‌గా మీరా మిథున్‌ నటిస్తోంది. సూర్య సరసన నటించే అవకాశం రావడానికి కారణం తన తొలి చిత్రమేనని, చాలారోజుల క్రితం ఈ చిత్ర యూనిట్‌ తనను అప్రోచ్‌ అయిందని మీరా మిథున్‌ తెలిపింది. ఈ సినిమాలో తన పాత్ర ఏమిటన్నది ప్రస్తుతానికి చెప్పనని, కానీ, తన పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుందని చెప్పింది.  ఈ చిత్రంలో సూర్యతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉందని తెలిపింది.

నటి నయనతార లవర్‌గా ప్రచారంలో ఉన్న విఘ్నేశ్‌ శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య చిత్ర నిర్మాణ సంస్థ 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ నిర్మిస్తోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు తుది దశకు చేరుకున్నాయి. సంక్రాంతి బరిలోకి ఈ సినిమా దింపడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement