ఓ ప్రేమకథ | Anaganaga O Premakatha title song launch | Sakshi
Sakshi News home page

ఓ ప్రేమకథ

Published Fri, Oct 5 2018 12:18 AM | Last Updated on Fri, Oct 5 2018 12:18 AM

Anaganaga O Premakatha title song launch - Sakshi

విరాజ్, కె.ఎల్‌.ఎన్‌. రాజు, శేఖర్‌ కమ్ముల, ప్రతాప్‌

విరాజ్‌ జె.అశ్విన్‌ హీరోగా, రిద్ధి కుమార్, రాధా బంగారు హీరోయిన్లుగా టి.ప్రతాప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె. సతీష్‌ కుమార్‌ సమర్పణలో ప్రముఖ ఫైనాన్షియర్‌ కె.ఎల్‌.ఎన్‌.రాజు నిర్మించిన ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ను ప్రముఖ దర్శకుడు శేఖర్‌ కమ్ముల విడుదల చేశారు. అనంతరం శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా టైటిల్‌ సాంగ్‌ సాహిత్యం, సంగీతం చాలా బాగున్నాయి.

ఎడిటర్‌ మార్తాండ్‌ కె.వెంకటేష్‌గారితో నేను చాలా సినిమాలు చేశా. ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్న ఆయన మేనల్లుడు విరాజ్‌ అశ్విన్‌ మంచి కథానాయకుడు అవుతాడు. ఈ సినిమా మంచి హిట్‌ అవ్వాలి’’ అన్నారు. ‘‘ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలలోనే సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు కె.ఎల్‌.ఎన్‌.రాజు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement