Shekar Kammula
-
నాని - సాయిపల్లవి కాంబినేషన్ రిపీట్.. డైరెక్టర్ ఎవరు అంటే?
-
విజయ్ దొవరకొండపై శేఖర్ కమ్ముల సంచలన కామెంట్స్
-
వివాదంలో శేఖర్ కమ్ముల కుబేర..
-
మూడు భాషలను టార్గెట్ చేసిన ధనుష్
బహుభాషా నటుడు ధనుష్ వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ఈ హీరో కథానాయకుడిగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని 2024 సంక్రాంతి బరిలోకి దిగనుంది. పిరియడ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం ఈయన తన 50వ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఇది ఈయన దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం గమనార్హం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం ఇది. ఈ చిత్రంతో పాటు ధనుష్ తన 51వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి టాలీవుడ్ సక్సెస్ఫుల్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో రష్మిక మందన్న నాయకిగా నటించనున్నారు. ఈమె ధనుష్ సరసన నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం గమనార్హం. కాగా ఈ చిత్రం మొదట తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్నట్టు వార్త ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు హిందీలోనూ ఏకకాలంలో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కోలీవుడ్‌లో స్టార్ నటుడైన ధనుష్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. ఇక బాలీవుడ్‌లోనూ ఇప్పటికే రెండు చిత్రాలు చేశారు. దీంతో ఈయన 51వ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించాలని నిర్మాతలు ముందుగానే భావించినట్లు సమాచారం. ఇది రాజకీయ మాఫియా నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఈ చిత్ర షూటింగ్ జనవరిలో ముంబైలో ప్రారంభం కానున్నట్లు తాజా సమాచారం. -
సాయి పల్లవిని హీరోయిన్ గా వద్దు అనుకున్న..కానీ..!
-
వేరే వాళ్ళ లాగా దేశాలు తిరిగి కథలు రాయను
-
నాగ చైతన్య గొప్పతనం గురించి చెప్పిన శేఖర్ కమ్ముల
-
ఈ సినిమా చూసి ఆవిడ కాల్ చేసి థాంక్స్ చెప్పింది
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్‌కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్‌కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
'మహావీరుడు'ని తెలుగువారు ఇష్టపడతారు: అడివి శేష్
'మహావీరుడు’ సినిమా ట్రైలర్, విజువల్స్ గొప్పగా ఉన్నాయి. ఈ మూవీలో గ్రేట్ వైబ్ కనిపిస్తోంది. సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అని డైరెక్టర్ శేఖర్ కమ్ముల అన్నారు. శివ కార్తికేయన్ హీరోగా ‘మండేలా’ ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం ‘మహావీరన్’. అదితీ శంకర్ హీరోయిన్. శాంతి టాకీస్ పతాకంపై అరుణ్ విశ్వ నిర్మించారు. ఈ సినిమాని ఏషియన్ సినిమాస్ ఈ నెల 14న తెలుగులో విడుదల చేస్తోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకకి హీరో అడివి శేష్, శేఖర్ కమ్ముల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ–'నా గురువు శేఖర్ కమ్ముల ముందు మాట్లాడటం గౌరవంగా ఉంది. శివ కార్తికేయన్‌తో పని చేయాలని ఉంది' అన్నారు. 'రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్’ సినిమాల్లా ‘మహావీరుడు’ ని తెలుగువారు ఇష్టపడతారు' అన్నారు శివ కార్తికేయన్. ‘‘మహావీరుడు’ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు మడోన్ అశ్విన్. ‘‘మా అమ్మగారి పేరుతో ఈ సంస్థ మొదలుపెట్టి, శివ కార్తికేయన్‌తో తొలి మూవీ చేయడం హ్యాపీ’’ అన్నారు అరుణ్ విశ్వ. -
శేఖర్ కమ్ములతో సినిమా ఎప్పుడు?
-
ఆనంద్ మూవీ చైల్డ్ అర్టిస్ట్ గుర్తుందా? ఇప్పుడు ఎలా ఉంది, ఏం చేస్తుందో తెలుసా?
డైరెక్టర్ శేఖర్ కమ్ముల గురించి ప్రత్యేకం చెప్పన్కర్లేదు. సినిమాలను తెరకెక్కించడంలో ఆయన శైలి ప్రత్యేకమైనది. ఆయన సినిమాలంటే ఎలాంటి యాక్షన్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. రియలస్టిక్కు దగ్గర ఉండే ఫీల్ గుడ్ లవ్‌స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంటారు. పాత్రలతో ప్రయోగాలు చేస్తారు. సెన్సిబుల్ పాయింట్‌తో ధైర్యం చేస్తారు. అలా ఆయన దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రాల్లో ఆనంద్ ఒకటి. మంచి కాఫీ లాంటి సినిమా అనేది ఉప శీర్షిక. ఈ మూవీ వచ్చి 18 ఏళ్లు గుడుస్తున్న ఇందులోని పాత్రలు, పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. చదవండి: బాలయ్య ఫ్యాన్స్ చంపేస్తారేమోనని భయపడ్డా!: వరలక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు వెండితెరపై రియల్ లైఫ్ పాత్రలను చూస్తున్నంత అనుభూతిని ఇచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కుటుంబ నేపథ్యంలో ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల చేత నిజంగానే ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనిపించుకుంది. ఇక ఇందులో ప్రతి పాత్రకు ఆయా నటులు జీవం పోశారని చెప్పవచ్చు. అందులో ఎప్పటికీ గుర్తుండిపోయే నటుల్లో ఆనంద్ ఆనంద్ అంటూ ముద్దు ముద్దుగా పిలుస్తూ హీరో రాజా చూట్టు తిరిగే చిన్నారి రోల్ కూడా ఒకటి. హీరో లిటిల్ ఫ్రెండ్‌గా సమత రోల్ పోషించింది ఆ చిన్నారి. చెప్పాలంటే ఇందులో ప్రధాన పాత్రల్లో ఆ చిన్నారి రోల్ కూడా ఉంటుందనడంలో సందేహం లేదు. అయితే ఆనంద్ తర్వాత ఆ చిన్నారి తెరపై ఎక్కడా కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమెకు సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో ఈ చిన్నారి 18 ఏళ్ల తర్వాత తెరపైకి వచ్చింది. ఆమె అసలు పేరు భకిత. ఇప్పుడు ఆమె వయసు 26 ఏళ్లు. ఒక్క సినిమాతోనే ఎంతో గుర్తింపు తెచ్చుకున్న భకిత మిగతా చైల్డ్ ఆర్టిస్టుల మాదిరిగా తిరిగి సినిమాల్లోకి రాలేదు. తన రూటే సపరేటు అంటూ భవిష్యత్తును కాస్తా భిన్నంగా ప్లాన్ చేసుకుంది. చదువుకుంటూనే సమాజ సేవలో పాల్గొంటుంది. చదవండి: విజయ్ దూకుడు.. క్రీడారంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ‘రౌడీ’ హీరో తన 17 ఏళ్ల వయసు నుంచి మహిళల హక్కుల కోసం, ఆడవాళ్ల హక్కులు గురించి పోరాడుతుంది. అంతేకాదు పిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యచారాలు, అఘాత్యాయిలను ఖండిస్తూ వాటికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతూ ఉద్యమం చేస్తుందట. మహిళలపై, చిన్నారులపై అత్యాచారాలు జరగకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలని భకిత పోరాటం చేస్తోంది. 18 ఏళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్ట్‌గా ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకున్న భకిత ఇప్పుడు సమాజ క్షేమం కోసం ఆమె ఉద్యమాలు చేస్తూ ఎంతో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. -
డీఏవీ స్కూల్ చిన్నారిపై వేధింపుల ఘటన.. ఆవేదన వ్యక్తం చేసిన శేఖర్ కమ్ముల
హైదరాబాద్‌లోని డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేళ్ల చిన్నారిపై స్కూలు ప్రిన్సిపల్ కారు డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. సదరు స్కూలు గుర్తింపును రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ ఘటనపై ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదన్నారు. చదవండి: మొదట ఆందోళన పడ్డా.. ఆ తర్వాత హ్యాపీ: అల్లు అరవింద్ ‘డీఏవీ పాఠశాలలో చదువుతున్న నాలుగేళ్ల బాలికపై ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడటం ఘోరమైన సంఘటన. నిస్సహాయతతో ఏం చేయాలో కూడా అర్థం కావడం లేదు. ఆ చిన్నారి పడే వేదనను ఊహించలేకపోతున్నా. ఎంతో ధైర్యంతో న్యాయం కోసం పోరాటం చేస్తున్న బాలిక తల్లిదండ్రులకు జోహర్లు. పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు రాజీ పడకూడదు. ఇలాంటి ఘటనలు మరొకసారి జరగకూడదు. మన పిల్లల భద్రత విషయంలో రాజీ పడితే భయంకరమైన సమాజాన్ని మనమే రూపొందించినవారమవుతాం’ అన్నారు. #DAVPublicSchool pic.twitter.com/JLpFVpRLLp — Sekhar Kammula (@sekharkammula) October 21, 2022 -
రాష్ట్ర ప్రభుత్వానికి డైరెక్టర్ శేఖర్ కమ్ముల ధన్యవాదాలు
ప్రముఖ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 75 ఏళ్ల భారత స్వతంత్ర్య వేడుకల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) ఉదయం ఆటను శేఖర్ కమ్ముల విద్యార్థులతో కలిసి దేవి థియేటర్లో చూశారు. అనంతరం ఆయన ట్వీట్ చేస్తూ.. వందల మంది విద్యార్థులతో కలిసి గాంధీ సినిమా చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందన్నారు. చదవండి: మంచు లక్ష్మికి అరుదైన గౌరవం, 100 మంది మహిళల్లో ఒకరిగా.. ‘ఈ రోజు ఉదయం దేశి థియేటర్లో గాంధీ సినిమాను వందల మంది విద్యార్థులతో కలిసి చూశాను. ఇదోక మర్చిపోలేని అనుభవం. గాంధీజీ చేపట్టిన సత్యాగ్రాహంలో భాగంగా ఈ చిత్రంలో వచ్చే సన్నివేశాలకు దేశభక్తితో పిల్లలు స్పందిస్తుంటే గర్వంగా అనిపించింది. లాంటి కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరూ గాంధీ సినిమాను చూడండి’ అని పిలుపునిచ్చారు. అలాగే భారత స్వతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: Anasuya Bharadwaj: ఇక్కడ గిల్లితే గిల్లించుకోవాలి: అనసూయ సంచలన వ్యాఖ్యలు -
ప్రముఖ నిర్మాత ఇంట పెళ్లి బాజాలు, సినీ తారల సందడి
ప్రముఖ తెలుగు నిర్మాత సునీల్ నారంగ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కూమార్తె జాన్వి వివాహ వేడుక గురువారం రాత్రి హైదబాద్‌లో ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు, బంధమిత్రుల సమక్షంలో ఆదిత్యతో జాన్వి ఏడడుగులు వేసింది. ఈ వివాహ మహోత్సవంలో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, స్టార్ హీరోలు సందడి చేశారు. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కల్యాణ్‌లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీరితో పాటు టాలీవుడ్ మన్మథుడు నాగార్జున, దర్శకుడు శేఖర్ కమ్ముల, బోయపాటి శ్రీను, హరీశ్ శంకర్, ప్రశాంత్ వర్మ, అనుదీప్, తమిళ హీరో శివకార్తికేయన్‌తో పాటు నిర్మాతలు సురేశ్ బాబు, సి. కల్యాణ్, నాగవంశీ, మిర్యాల రవీందర్‌రెడ్డి తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. చదవండి: 10వ తరగతిలో సత్తాచాటిన సూర్య కూతురు, మార్కుల జాబితా వైరల్ అలాగే సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ సైతం ఈ వేడుకకు హజరయ్యారు. ఇందుకు సంబంధించి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కాగా సునీల్ నారంగ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కాయి. ఇటీవల ఈ బ్యానర్లో వచ్చిన లవ్‌స్టోరీ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర బ్యానర్లో పలు ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో ఒకటి శేఖర్ కమ్ముల-ధనుశ్ కాంబినేషన్లోని ఓ చిత్రం కాగా.. అనుదీప్-శివ కార్తికేయ కాంబోలో రూపొందుతున్న ప్రిన్స్ మూవీ. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. -
గొప్ప మనసు చాటుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ఇల్లు కాలిపోయి కుటుంబంతో సహా రోడ్డున పడ్డ ఓ రైతుకు అండగ నిలిచి ఆర్థిక సాయం అందించారు. తెలంగాణ సూర్యాపేట జిల్లా నేలమర్రి గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతు ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో అతడు నివాసం ఉంటున్న గుడిసే పూర్తిగా దగ్ధం అవ్వగా.. భూమి అమ్మగా వచ్చిన డబ్బు సైతం కాలిపోయింది. దీంతో దిక్కుతోచన స్థితిలో ఉన్న ఆ రైతుకు శేఖర్ కమ్ముల లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. చదవండి: ముంబైలో పూరీని చూసి ఎమోషనల్ అయిన ఫ్యాన్.. వీడియో వైరల్ లక్ష్మయ్య బ్యాంక్ అకౌంట్‌కే ఆ డబ్బును నేరుగా ట్రాన్స్ఫర్ చేసినట్లు సమాచారం. సూర్యాపేటకు చెందిన కప్పల లక్ష్మయ్య తన సోదరులతో కలిసి ఇటీవల తమకు ఉన్న వ్యవసాయ భూమిని అమ్మారు. అందులో లక్ష్యయ్య వాటాగా రూ.10 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం అతడు గుడిసెలో ఉంటున్నాడు. ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకుందామని భావించాడు. 10 లక్షల రూపాయల్లో రూ. 6 లక్షలను ఇంట్లోని బీరువాలో పెట్టాడు. ఈ నేపథ్యంలో ఇటివల తన ఇంట్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో అతడి గుడిసెతో పాటు డబ్బులు కూడా కాలిపోవడంతో లక్ష్మయ్య రోడ్డున పడ్డాడు. చదవండి: Megastar Chiranjeevi: చిరు వాయిస్‌తో కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ -
శేఖర్ కమ్ముల చేతుల మీదుగా ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’ ఫస్ట్‌లుక్
‘కౌసల్య కృష్ణమూర్తి, పడేసావే, ఆపరేషన్గోల్డ్ ఫిష్’ చిత్రాలతో కథానాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్‌రాజు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘వస్తున్నా.. వచ్చేస్తున్నా’. మిస్తి చక్రవర్తి హీరోయిన్గా సందడి చేయనుంది. తేజస్వీ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై సందీప్ గోపిశెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదలైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘కార్తీక్‌రాజు నటించిన ఈ చిత్రం ఫస్ట్‌లుక్ ఇంప్రెసివ్‌గా ఉంది అన్నారు. చిత్రం కూడా ప్రేక్షకులు అలరించేలా ఉంటుందని అనుకుంటున్నా. ఈ మూవీ విజయం సాధించి అందరికి మంచిపేరును తీసుకురావాలని ఆశిస్తున్నా’ అన్నారు శేఖర్ కమ్ముల. అలాగే దర్శక నిర్మాత సందీప్ గోపిశె ట్టి మాట్లాడుతూ ‘ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో మా చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఇది మా విజయానికి శ్రీకారంలా భావిస్తున్నాం. పూర్తి కమర్షియల్ అంశాలతో రూపొందిన ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్ ఇది. ఆడియన్స్ సర్ఫ్రైజ్గా ఫీలయ్యే ఎన్నోఅంశాలు ఈ చిత్రంలో ఉన్నాయి. పూర్తి కొత్తదనంతో, నిజాయితీగా తెరకెక్కించిన ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్‌ను విడుదల చేస్తాం’ అన్నారు. ప్రశాంత్, భీమనేని శ్రీనివాస్, దేవి ప్రసాద్, పోసాని కృష్ణమురళి, ఆమని, గణపతి, అన్వి, డా. శేషసాయి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. -
‘లవ్‌స్టోరీ’ చిత్రం చూసి భర్తపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన యాంకర్ సుమ
Anchor Suma Comments Husband Rajeev Kanakala Over Love Story Movie: ప్రముఖ యాంకర్ సుమ కనకాల ‘లవ్‌స్టోరీ’ మూవీ చూసి ఎమోషనల్ అయ్యింది. ఈ మూవీ చూసిన అనంతరం ఆమె ట్వీట్ చేస్తూ తన భర్త రాజీవ్ కనకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతేగాక ‘లవ్‌స్టోరీ’ మూవీ టీంపై ప్రశంసల వర్షం కురిపించింది. ఈ మేరకు సుమ ట్వీట్ చేస్తూ.. ‘కొందరూ నటులు పాత్రలో లీనమై నటిస్తారు. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందా! అన్నట్లు నటిస్తారు. అలాంటి వాళ్లు చాలా అరుదుగా ఉంటారు. నా భర్త రాజీవ్ కూడా అలాంటి అద్భుతమైన నటులలో ఒకరు. అలాంటి ఒక అద్భుతమైన పాత్రలో నటించిన రాజీవ్‌కు శుభాకాంక్షలు. ఈ రోల్ చేయడానికి నువ్వు ఎంత ఇబ్బంది పడ్డావో నాకు తెలుసు. కానీ ఈ పాత్ర ద్వారా నువ్వు ఎంతో మంది జీవితాలను ఇంపాక్ట్ చేశావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే సినిమాలివే అలాగే ‘లవ్‌స్టోరీ చిత్రంలో ఇలాంటి సెన్సిబుల్ లైన్ తీసుకుని సెన్సీటీవ్గా చూపించిన శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. అలాగే నాగ చైతన్య, సాయి పల్లవిలు చాలా అద్భుతంగా నటించారు. ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ చూస్తూ నా కళ్లు తిప్పుకోలేక పోయాను, రెప్పలు కొట్టకుండా అలానే చూస్తుండిపోయాను. దీంతో నా కళ్లు అలసిపోయాయి’ అంటూ తనదైన శైలిలో చమత్కరించింది. అలాగే మూవీ టీం మొత్తానికి సుమ శుభాకాంక్షలు తెలిపింది. చదవండి: ‘గాడ్ ఫాదర్’లో తన రోల్ చెప్పెసిన గంగవ్వ, ఏకంగా చిరుకు.. కాగా ఈ చిత్రంలో రాజీవ్ కనకాల తన సొంత అన్న కూతురిని చిన్నప్పుడు లైంగికంగా వేధించిన పాత్రలో నటించాడు. సాధారణంగా ఇలాంటి పాత్ర చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ డైరెక్టర్ శేఖర్ కమ్ములను నమ్మి ఆయన ఈ పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లో రాజీవ్ క్యారెక్టర్‌పై శేఖర్ కమ్ముల మాట్లాడుతూ.. ‘ఇలాంటి పాత్ర చేయడానికి రాజీవ్ ఒప్పుకున్నాడంటే ముందు ఆయన భార్య సుమ కనకాలకు హ్యాట్సాఫ్ చెప్పాలి. మా మూవీకి ఇంతటి ఆదరణ లభించిందంటే దానికి ముఖ్య కారణం రాజీవ్’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. There are a very few actors who can make us so deeply involved with their performance and my dearest hubby Rajeev Kanakala @RajeevCo is one among them. Congratulations to you for such a wonderful role, I know you felt bad doing the character but you have impacted many lives (1/3) pic.twitter.com/ucL5mI3t90 — Suma Kanakala (@ItsSumaKanakala) September 30, 2021 -
శేఖర్ కమ్ములతో గరం సత్తి ముచ్చట్లు
-
ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించారు: నాగ చైతన్య
Naga Chaitanya Love Story Movie: అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ‘లవ్‌స్టోరీ’ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. సెప్టెంబర్ 24న(శుక్రవారం) విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. భారత్‌లోనే కాకుండా అమెరికా థియేటర్లలో కూడా ‘లవ్‌స్టోరీ’ సత్తా చాటుతోంది. ఈ క్రమంలో మూవీ టీం లవ్‌స్టోరీ సక్సెస్ మీట్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో నాగ చైతన్య ఆనందం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. హీరోయిన్ సాయి పల్లవి, డైరెక్టర్ శేఖర్ కమ్ములతో పాటు మిగతా సినిమా క్రూడ్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘జీవితాంతం గుర్తుండిపోయే ఎన్నో మధుర జ్ఞాపకాలను అందించిన ‘లవ్‌స్టోరీ’ టీంకు కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. చదవండి: ‘లవ్‌స్టోరీ’: ముద్దు సీన్‌పై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు కాగా ఈ సినిమాలో నాగ చైతన్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన దళిత యువకుడి పాత్రలో కనిపించాడు. తన స్వయం శక్తితో ఎదిగి జుంబా మాస్టర్‌గా చై నటన ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక అగ్ర వర్గానికి చెందిన యువతిగా సాయి పల్లవి నటించింది. ఇందులో ఆమె ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్న అమ్మాయిగా కనిపించింది. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి డ్యాన్స్ ఏ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో ఆమె డ్యాన్స్‌కు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేశ్ బాబులు సైతం ఫిదా అయి సాయి పల్లవిని ప్రశంసించారు. చదవండి: బూతులు తిడుతూ పెద్దపెద్ద రాళ్లతో దాడి చేశారు: పోసాని వాచ్మెన్ భార్య Team #lovestory !! Thank you so much .. you guys have given me memories for a lifetime .. pic.twitter.com/oMbfgwJk0M — chaitanya akkineni (@chay_akkineni) September 30, 2021 -
కన్నీళ్లు వచ్చాయి, చైతూతో కొత్త జర్నీ స్టార్ట్ చేయించాడు: నాగార్జున
నాగ చైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న థియేటర్లలో విడుదలై పాజటివ్ టాక్‌తో దూసుకెళ్తుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోందీ. దీంతో మూవీ యూనిట్ మంగళవారం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా వచ్చిన అక్కినేని నాగార్జున విచ్చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ‘ లవ్ స్టోరీ అనే సినిమా తెలుగు సినిమాకే కాదు ఆల్ ఓవర్ సినిమా ఇండస్ట్రీకి ఓ ముందడుగు లాంటిది. ఒక మంచి సినిమా ఇవ్వండి.. మేము థియేటర్‌కి వస్తాము అని అంతా వచ్చారు. తెలుగు ప్రజలకు కోటి నమస్కారాలు. మా అందరికీ ఓ దైర్యం వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా సక్సెస్‌తో ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ ఆనంద పడ్డారు. శేఖర్ ఓ సెన్సిటివ్ డైరెక్టర్. సెన్సిటివ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ కలిపి ఎంతో చక్కగా ఈ సినిమా రూపొందించారు. ఫుల్ లవ్ స్టోరీ చూపించడానికి పెద్ద పెద్ద సెట్స్ అవసరం లేదు. ఒక టెర్రస్ చాలు అని నిరూపించావు శేఖర్. ఫన్ లవ్ స్టోరీ నుంచి సీరియస్ టాపిక్‌కి తీసుకెళ్ళావు. ఇలాంటి సబ్జెక్టు నాకు ఇష్టం ఉండదు.. కానీ నేను నువ్వు చూపించిన విధానానికి కనెక్ట్ అయ్యా. ఆ సన్నివేశాలు చూస్తుంటే నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. మూడు,నాలుగు రోజులవరకు నేను అదే ఫీల్‌లో ఉన్నా. ఈ చెత్త మన చుట్టూ జరుగుతుందా ఛీ అని ఫీలయ్యా. కొన్ని వేలమంది కళ్లు తెరిపించాడు శేఖర్. పవన్ ఎంతో చక్కని మ్యూజిక్ అందించారు. అశోక్ తేజ మీరు మాకు ఇంకా మరిన్ని పాటలు రాయాలి. మా జనరేషన్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ సాహిత్యం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. సాయి పల్లవి డాన్స్ చేస్తుంటే ఆమె చుట్టూ వంద సాయి పల్లవులు డాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇదో క్లాసిక్ మూవీ. చైతన్యను చూస్తుంటేనే నాకు జనరల్‌గానే కడుపు నిండి పోతుంది. ఈ సినిమా చూశాక మొత్తం కడుపు నిండిపోయింది. చైతన్యను ఓ స్టార్ యాక్టర్‌గా రెడీ చేసి కొత్త జర్నీ మొదలు పెట్టించావు. థాంక్యూ శేఖర్. చైతూ చాలా బాగా నటించాడు. ప్రేమ్ నగర్ విడుదలైన 50 ఏళ్ల తర్వాత అదే తేదికి లవ్ స్టోరీ విడుదలైంది. తుఫాన్, సైక్లోన్, కోవిడ్‌తో పోరాడి లవ్‌స్టోర్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది’ అని నాగ్ అన్నారు. అలాగే కరోనాపై రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలో ఎంతో చక్కగా పోరాడాయని కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేసీఆర్‌లు సరైన సమయంలో కరోనాపై సరైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. 208 రోజుల తర్వాత తెలంగాణలో ఒక్క కరోనా మరణం లేదని, దీనికి మనమంతా సంబురాలు జరుపుకోవాలన్నారు. సినీ పరిశ్రమను తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎల్లప్పుడూ చల్లగానే చూశాయని, ఇకపై కూడా మమల్ని చల్లగా ఆశీర్వదించాలని కోరారు. నారాయణ్‌దాస్ నారంగ్ మాట్లాడుతూ... ‘‘ఈ సినిమా కోసం మూడేళ్లుగా నాతో పాటు ప్రయాణం చేసిన యూనిట్‌కి థ్యాంక్స్. ఇండస్ట్రీకి చిరంజీవిగారు ఎలా పెద్దగా నిలబడ్డారో మా సినిమాకి కూడా అలాగే నిలబడ్డారు.. ఆయన రాకతో మా సినిమాకి మాంచి కిక్ వచ్చింది’’ అన్నారు. శేఖర్ కమ్ముల, నాగచైతన్య మాట్లాడుతూ –‘‘ఆడియన్స్ వస్తారా? రారా? అనే టైమ్‌లో వారు థియేటర్స్‌కు వచ్చి మా సినిమాను ఆదరించారు. శేఖర్గారి కంటెంట్ పవర్ ఏంటో సెప్టెంబరు 24న తెలిసింది. సినిమా స్టార్ట్ చేశాక శేఖర్‌గారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోని వారి నిజాయతీ చూసి ఈ సినిమా కోసం ఎంతైనా కష్టపడొచ్చని ఫిక్సైపోయాను’’ అన్నారు. సాయిపల్లవి మాట్లాడుతూ –‘‘మా తాతగారు ‘అన్నమయ్య’ చూస్తున్నప్పుడు.. ఆత్మ దేవునితో ఐక్యమయ్యే సీన్‌ని ఏడుస్తూ.. దండం పెడుతూ చూసేవారు. ఆయన యాక్ట్ చేస్తున్నారు తాతయ్యా అనేదాన్ని. నేను ఇండస్ట్రీ వచ్చాక అర్థం అయ్యింది.. ఒక పాత్రను మనం చేస్తే అది నిలిచిపోయేలా చేయాలని నాకు నేర్పిన మీకు (నాగార్జున) «థ్యాంక్స్. ‘లవ్‌స్టోరీ’కి ప్రేక్షకుల స్పందన ఎలా ఉందో అని థియేటర్స్‌కి వెళ్లా. వారి రియాక్షన్ చూసి కన్నీళ్లొచ్చాయి’’ అన్నారు. సురేశ్ బాబు, సుద్దాల అశోక్‌తేజ, భాస్కర భట్ల, పవన్ సీహెచ్, మంగ్లీ, రోల్ రైడా, ఈశ్వరీ రావు తదితరులు పాల్గొన్నారు. -
మహేశ్ కామెంట్స్‌పై స్పందించిన సాయి పల్లవి
Sai Pallavi Respond On Mahesh Babu Tweet: నాగ చైతన్య, సాయి పల్లవి ‘లవ్‌స్టోరీ’ మూవీ రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. శుక్రవారం(సెప్టెంబర్ 24) విడుదలైన ఈ మూవీ ఇండియాలోనే కాదు అమెరిక బాక్సాఫీసు వద్ద కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇందులో సాయి పల్లవి డ్యాన్స్, నాగ చైతన్య నటనకు విశేష స్పందన వస్తోంది. దీంతో టాలీవుడ్లో ఎక్కడ చూసినా లవ్‌స్టోరీ మూవీ గురించే చర్చించుకుంటారు. అంతేగాక లవ్‌స్టోరీపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తు డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరోహీరోయిన్లతో పాటు మూవీ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు సైతం ఈ మూవీపై తన రివ్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: యూఎస్ బాక్సాఫీసు వద్ద ‘లవ్‌స్టోరీ’ రికార్డు కలెక్షన్స్ ఈ సందర్భంగా ఆయన సాయి పల్లవిపై ప్రశంసలు కురిపించారు. తన ట్వీట్లో సాయి పల్లవి గురించి బెబుతూ.. ‘ఎప్పటి లాగే సాయి పల్లవి సన్సేషన్ క్రియేట్ చేసింది. అసలు ఆమెకు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం ఇంతవరకు చూడలేదు’ అంటూ రాసుకొచ్చాడు. అది చూసిన సాయి పల్లవి, మహేశ్ కామెంట్స్‌పై స్పందించింది. మహేశ్ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ.. ‘మీ మాటలు నాకు మరింత ఎనర్జీని ఇస్తున్నాయి. మీ ప్రశంసలకు విధేయురాలిని సార్. నాలో ఉన్న మీ అభిమాని మీరు చేసిన ట్వీట్‌ను ఇప్పటికీ మిలియన్ టైమ్స్ చదివించింది సార్’ అంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరు కూడా ఆమెపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. చదవండి: A R Rahman: 'అవును మహేశ్.. మేమందరం గర్వపడుతున్నాం' Woah🙈 It’s going to take me a while to come back to my senses!!! I’m humbled by your generous words ☺️ Thank you so much Sir 🙈 P.S. The fan girl in me has already read your tweet a million times 🙈 — Sai Pallavi (@Sai_Pallavi92) September 26, 2021 లవ్‌స్టోరీ సినిమా చూసిన మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘శేఖర్ కమ్ముల చాలా బాగా తెరక్కెకించారు. నాగ చైతన్య నటుడిగా చాలా ఎదిగాడు. అతని పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ సినిమా అతనికి గేమ్ చేంజర్ అవుతుంది. ఇక సాయిపల్లవి ఎప్పటిలాగే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈమెకు అసలు బోన్స్(ఎముకలు) ఉన్నాయా? స్క్రీన్‌పై స్క్రీన్ పై ఎవరూ ఇలా డ్యాన్స్ చేయడం చూడలేదు. ఇక వన్ సీహెచ్ మ్యూజిక్ స్కోర్ సంచలనమే చెప్పాలి. రెహమాన్ సార్ శిష్యుడు అని విన్నాను. రెహమాన్ సర్ గర్వపడే సమయం' ఇది అంటూ లవ్‌స్టోరీ టీంపై ప్రశంసలు కురిపించాడు. ఆయన ట్వీట్‌కు ఎఆర్ రెహమాన్ కూడా స్పందిస్తూ ధన్యవాదలు తెలిపిన సంగతి తెలిసిందే. చదవండి: 'లవ్‌స్టోరీ' సినిమాపై మహేశ్‌బాబు రివ్యూ -
‘లవ్ స్టోరీ’ మూవీ ట్విటర్ రివ్యూ
టాలీవుడ్లో ఎక్కడ చూసినా ఇప్పుడు లవ్ స్టోరీ మూవీ టాపిక్కే వినిపిస్తోంది. ప్రేక్షకుల్లో అదో రకమైన ఆసక్తి. సెన్సిబుల్ కథలతో డిఫరెంట్ సినిమాలను తెరకెక్కించడం శేఖర్ కమ్ముల స్టైల్. అప్పట్లో వరుణ్ తేజ్‌తో ‘ఫిదా’ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఇపుడు నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ సినిమా చేశాడు. కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా నేడు(సెప్టెంబర్ 24)ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. (చదవండి: Love story Review: చైతూ, సాయిపల్లవిల ‘లవ్‌స్టోరీ’ హిట్టా? ఫట్టా?) ఇలా భారీ అంచనాలు నెలకొనడంతో చాలా రోజుల తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్‌తో హైదరాబాద్‌లోని థియేటర్స్ హౌస్‌ఫుల్ అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 900పైగా థియేటర్లలలో ఈ మూవీ విడుదలైంది. ఇక ఇప్పటికే అమెరికా లాంటీ దేశాల్లో ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలను ఈ మూవీలో బాగా చూపించారని టాక్ వినిపిస్తోంది. ఫస్టాఫ్ అంతా ఎంటర్టైన్మెంట్ పంచి, సెకండాఫ్ వచ్చేసరికి సరికి కథపై గ్రిప్పింగ్ తీసుకొచ్చి బాగా ప్రెజెంట్ చేశారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవిల నటన అయితే అదిరిపోయిందట. సాయి పల్లవి డాన్స్, మ్యూజిక్ స్పెషల్ అసెట్ టాక్ వినిపిస్తోంది. అయితే రొటీన్ ఫ్యామిలీ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తెచ్చారని, సినిమాలో చెప్పుకోదగిన కొత్త సన్నివేశాలు ఎక్కడా కనిపించలేదని మరికొందరు అభిప్రాయపడుతున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #LoveStory movie getting avg reviews..saying that ending is abrupt.They all have watched movie with high expectations.Lets reduce the expectations and prepare our mind for abrupt climax..Then surely will enjoy it😍😍 — Sreeram (@sreeram0106) September 24, 2021 #LoveStory seriou emotional Lead pair @chay_akkineni and @Sai_Pallavi92 are the soul.Chaitu’s acting 👌bgm and songs 😍 sensitive topics raise chesaru but abruptly ended. One time watch! — akhil_maheshfan2 🔔 (@Maheshfan_1) September 24, 2021 #LoveStory Overall an Average Emotional Love Story! NC and Sai Pallavi were great on the screen together! The life of the film is the Music and BGM. Movie had some good moments that were vintage SK but some repetitive scenes that were boring as well. Rating: 2.75/5 — Venky Reviews (@venkyreviews) September 23, 2021 Review & Ratting : #LoveStory Music., LEAD pairs ., 👍 LoveStory is predictable drama .., offers nothing new expect few sequences & fresh music keeps us HOOK !! Have to wait & see how family audience receives . (2.5/5) https://t.co/rxPYriHs7k — Inside talkZ (@Inside_talkZ) September 24, 2021 Too many emotions . . Lead pair done their best . Kammula sir inkoncham gattiga work cheyalsindi. . — Super⭐️ Fan 🦁 (@Ravianenenu) September 24, 2021 Burning issue in the society is being dealt sensibly by Kammula. — TrackTollywood (@TrackTwood) September 23, 2021 #LoveStory Blockbuster 💥💥 Super 1St half ❤ Excellent Second Half 🔥🔥 Class Movie Tho #NagaChaitanya Mass Chupisthadu pakka 💥💥💥💥 Families Tho theatre's Housefulls avuthayi pakka 👍💥 — Balaji (@BaluPKfan) September 24, 2021 #LoveStoryreview : Amazing script. Fantastic acting from Chay and Sai Pallavi. Entire love track was very fresh as you’d expect from Sekhar Kammula. A little dragged second half but a solid message. 3/5 #LoveStory Worth watching in theatres. 👍🏼👍🏼 — Chaitanya Somavajhala (@ChaitanSrk) September 24, 2021 #LoveStory Review... Slow Start But Great End 👏 👉 @chay_akkineni & @Sai_Pallavi92 Nailed The Show 😍 & Dance Moves Are Top Notch💥 👉 @sekharkammula Dealed With sensitive In his way 👌 👉 Music & Bgm Are Soul Of The Movie 🕶#LoveStoryreview #NagaChaitanya #SaiPallavi pic.twitter.com/iFqGphRlpP — NEW UPDATES (@OTTGURUJINITHIN) September 24, 2021 Movie BoxOffice ResultDepends On How Audience Accepts Last 30Mins👍#LoveStory #LoveStoryReview #NagaChaitanya #SaiPallavi #SekharKammula #Cinee_WorlddReview #Cinee_Worldd pic.twitter.com/PFoVjcCE6o — cinee worldd (@Cinee_Worldd) September 24, 2021 BLOCKBUSTER 💥💥💥#loveStory #LoveStoryReview — Akhileeyyy (@iamkrzzy__45) September 24, 2021 #LoveStoryReview 1st Half Report: #LoveStory 1st Half as a whole did not seem to be in the range that the fans were expecting. Some high moments, BGM and songs are entertaining here and there. https://t.co/qrMfDrwxYw#LoveStoryOnSep24th #NagaChaitanya #saipallavi https://t.co/AdikWVGlf5 — Daily Culture (@DailyCultureYT) September 23, 2021 #LoveStory Decent 1st Half 👌 B G M 👍@chay_akkineni & @Sai_Pallavi92 👍 https://t.co/s4B7M9dX3N — koti ! 🎬🎥 (@koti7711) September 24, 2021 Just finished watching #LoveStory @chay_akkineni @Sai_Pallavi92 Wow 🤩! Just brilliant. #Sekhar Kammula Best at storytelling! @chay_akkineni well done 👍🏻 broh! — HK (@khs3737) September 24, 2021 -
Love Story:‘‘ఫిదా’కు వద్దన్నారు..‘లవ్‌స్టోరీ’ పిలిచి మరీ ఇచ్చారు’
‘‘ఫిదా’ సినిమా కోసం శేఖర్ కమ్ములగారికి నేను పంపిన పాటలు నచ్చాయి. అయితే ‘ఫిదా’ నాకు చాలా ముఖ్యం.. ఈ సమయంలో కొత్తవాళ్లతో రిస్క్ చేయలేనని చెప్పి వద్దన్నారాయన. ‘లవ్‌స్టోరీ’ సినిమాకు మాత్రం పిలిచి అవకాశం ఇచ్చారు’’ అని సంగీత దర్శకుడు పవన్ సీహెచ్ అన్నారు. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్ దాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘లవ్‌స్టోరీ’. ఈ నెల 24న ఈ చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు పవన్ సీహెచ్ మాట్లాడుతూ– ‘‘మా తాతగారు, నాన్నగారు విజయ్ సినిమాటోగ్రాఫర్స్‌గా చేశారు. నాకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఇష్టం. చదువు పూర్తయ్యాక సంగీతం నేర్చుకున్నాను. ఒక సంగీత విభావరిలో ఏఆర్ రెహమాన్‌గారికి నా కంపోజిషన్ నచ్చి, సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆయనతో ‘శివాజీ, రోబో, సర్కార్’ వంటి చిత్రాలు చేశాను. ‘లవ్‌స్టోరీ’ విషయానికొస్తే... ‘పాటలు సందర్భాన్ని ప్రతిబింబించాలి.. అంతకంటే ఇంకేం వద్దు’ అన్నారు శేఖర్‌గారు. కంపోజిషన్‌లో ఆయన ఇచ్చిన సలహాలు అద్భుతం. ఆయనకు ఫోక్ సాంగ్స్ అంటే ఇష్టం. ‘సారంగ దరియా..’ను బాగా చేయాలని చెప్పి చేయించారు. ‘లవ్‌స్టోరీ’ పాటలు మిలియన్ వ్యూస్ తెచ్చుకోవడం కొత్త సంగీత దర్శకుడిగా తృప్తిగా ఉంది. ఈ చిత్రంలోని పాటలు రెహమాన్‌గారికి పంపాలంటే భయమేసింది. కానీ నా మిత్రులు కొందరు నా పాటలు బాగున్నాయని ఆయనతో చెప్పారట. మంచి చిత్రాలు చేసి, సంగీత దర్శకుడిగా నాకంటూ ప్రత్యేకత తెచ్చుకోవాలనేది నా లక్ష్యం’’ అన్నారు. -
Love Story: రేవంత్, మౌనికల ప్రేమకథకు ముహూర్తం ఫిక్స్
రేవంత్, మౌనికల ప్రేమకథ ప్రేక్షకుల ముందుకు రావడానికి తేదీ కుదిరింది. నిజానికి వీరి ప్రేమకథ ఎప్పుడో తెరకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. రేవంత్ పాత్రలో నాగచైతన్య, మౌనిక పాత్రలో సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కె. నారాయణ్‌దాస్ నారంగ్, పి. రామ్మోహన్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా శేఖర్ కమ్ముల మాట్లాడుతూ– ‘‘తప్పనిసరి పరిస్థితుల వల్ల ఇన్నాళ్లూ మా ‘లవ్ స్టోరీ’ని వాయిదా వేస్తూ వచ్చాం. సినిమాని చూపించడానికి మంచి సమయం కోసం ఎదురు చూశాం. ఆ టైమ్ వచ్చింది’’ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: భాస్కర్ కటకంశెట్టి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఐర్ల నాగేశ్వరరావు.