
కమ్ముల శేషయ్య
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంట్లో విషాదం నెలకొంది. శేఖర్ కమ్ముల తండ్రి కమ్ముల శేషయ్య (89) శనివారం ఉదయం తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా ఏర్పడ్డ అనారోగ్యంతో కొంత కాలంగా ఆయన చికిత్స పొందుతున్నారు. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన కన్నుమూశారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో డీఐజీగా పని చేసిన శేషయ్య పదవీ విరమణ అనంతరం న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. శేషయ్యకు నలుగురు సంతానం. వారిలో సినీదర్శకుడు శేఖర్ కమ్ముల చివరివాడు. శేషయ్య అంత్యక్రియలు హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో శనివారం సాయంత్రం జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment