నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత | Former South Carolina Governor Nikki Haley father passes away on Fathers Day | Sakshi

నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత

Jun 18 2024 5:35 AM | Updated on Jun 18 2024 7:13 AM

Former South Carolina Governor Nikki Haley father passes away on Fathers Day

ఫాదర్స్‌ డే రోజు ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌ మృతి 

సౌత్‌ కరోలినా(యూఎస్‌ఏ): సౌత్‌ కరోలినా మాజీ గవర్నర్‌ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్‌ అజిత్‌ సింగ్‌ రణ్‌ధవా(64) ఫాదర్స్‌ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు. 

‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్‌ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్‌ సింగ్‌.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement