Nikki Haley
-
నిక్కీ హేలీ తండ్రి కన్నుమూత
సౌత్ కరోలినా(యూఎస్ఏ): సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీకి పితృ వియోగం కలిగింది. తన తండ్రి ప్రొఫెసర్ అజిత్ సింగ్ రణ్‌ధవా(64) ఫాదర్స్ డే నాడు 16న తుదిశ్వాస విడిచారని ఆమె ప్రకటించారు. ఎంతో దయార్ధ్ర హృదయం కలిగిన వ్యక్తిగా పేర్కొంటూ తన తండ్రిని హత్తుకున్నప్పటి ఫొటోను ‘ఎక్స్’లో షేర్ చేశారు. ‘నా తండ్రి లేరనే విషయం తెలిసి నా హృదయం బరువెక్కింది. నలుగురు పిల్లలకు శ్రమించే తత్వం, విశ్వాసం, దయాగుణాలను ఆయన నేర్పారు. ముత్తాత, తాత, తండ్రి, భర్తగా ఆయన ఎంతో ప్రియమైన వ్యక్తి. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. మేమంతా మిమ్మల్ని కోల్పోతున్నాం’అని పేర్కొన్నారు. కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతున్న అజిత్ సింగ్.. నిక్కీ జీవితంలో ప్రతి నిర్ణయం వెనుక ప్రేరణగా నిలిచారు. -
వాళ్లను చంపేయండి!
టెల్ అవీవ్: అమాయక పాలస్తీనియన్లపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ సైన్యానికి అమెరికా నేతలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపే ఫొటో ఒకటి బహిర్గతమైంది. శాంతికాముక ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా సేవలందించిన రిపబ్లికన్ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ హమాస్‌పై ఇజ్రాయెల్ దాడికి పూర్తి మద్దతు పలుకుతూ ఒక మిస్సైల్‌పై తన సందేశం రాశారు. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ లెబనాన్ సరిహద్దు వెంట ఇజ్రాయెల్ స్థావరాలకు వెళ్లారు. గాజా స్ట్రిప్‌పై గగనతల దాడికి సిద్ధంగా ఉంచిన ఒక క్షిపణిపై ‘ వాళ్లను చంపేయండి. అమెరికా ఎల్లప్పుడూ ఇజ్రాయెల్‌కు తోడుగా ఉంటుంది’ అని రాసి సంతకం చేశారు. అయితే దేశాన్ని శాంతియుతంగా పాలిస్తానంటూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యరి్థత్వం కోసం పోటీపడిన నాయకురాలు ఇలా యుద్ధజ్వాలలు మరింత రగిలించడమేంటి? అంటూ నెటిజన్లు నిక్కీ హేలీపై విమర్శలు గుప్పించారు. -
USA presidential election 2024: రేసు నుంచి నిక్కీ హేలీ ఔట్
వాషింగ్టన్: మంగళవారం ఒకేసారి 15 రాష్ట్రాల్లో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన నేపథ్యంలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం రేసు నుంచి తప్పుకుంటున్నట్లు భారతీయ మూలాలున్న నాయకురాలు నిక్కీ హేలీ బుధవారం ప్రకటించారు. వెర్మాంట్‌లో గెలుపు కాస్తంత ఊరటనిచి్చనా మిగతా అన్ని చోట్ల ఎదురైనా ప్రతికూల ఫలితాలను బేరేజు వేసుకుని ఆమె ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఫలితాల తర్వాత సౌత్ కరోలీనాలో ఆమె మాట్లాడారు. ‘‘నా ప్రచారానికి అర్ధంతరంగా ముగింపు పలకాల్సిన సమయం వచ్చేసింది. అమెరికన్ల గొంతుక గట్టిగా వినిపించాలని భావించా. నా శక్తిమేరకు నేను కృషి చేశా. అనుకున్న కార్యాన్ని పూర్తిచేయలేకపోయా. ఇందులో చింతించాల్సింది ఏమీ లేదు. రేసులో నేను ఉండకపోవచ్చుకానీ నేను నమ్మిన సిద్ధాంతాలను ఇకమీదటా బలంగా వినిపిస్తా’’ అని నిక్కీ హేలీ అన్నారు. -
అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న వరుస ప్రైమారీల్లో గెలుస్తూ దూసుకుపోతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బ్రేక్ పడింది. తాజాగా వాషింగ్టన్ డీసీ ప్రైమారీలో నిక్కీ హేలీ విజయం సాధించారు. రిపబ్లికన్ పార్టీ తరఫున అధక్ష్య అభ్యర్థిత్వం పోటీ పడుతున్న నిక్కీ హేలీకి ఇదే మొదటి ప్రైమరీ విజయం కావటం గమనార్హం. వాషింగ్టన్ డీసీలో ఉన్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీ 63 శాతం ఓట్లను దక్కించుకున్నారు. ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ 33.2 శాతం ఓట్లకే పరిమితమయ్యారు. వాషింగ్టన్ డీసీలో గత 2020 ఎన్నికల సమయంలో డొమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోబైడెన్ 92 శాతం ఓట్లు సాధించారు. అయితే ఇక్కడ రిపబ్లికన్ పార్టీకి ఎక్కువ శాతం మెజర్టీ రాదనే వాదనలు ఉన్నాయి. దానికి భిన్నంగా నిక్కీ హేలీ 62 శాతం ఓట్లు సాధించారు. ‘వాషింగ్టన్‌లోని రిపబ్లికన్లు డొనాల్డ్ ట్రంప్ .. అతని గందరగోళాన్ని తిరస్కరిచంటంలో ఆశ్చర్యం లేదు’ అని నిక్కీ హేలీ తెలిపారు. మరోవైపు.. ఇప్పటికే మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయోవా, న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాల ప్రైమరీల్లో నిక్కీ హేలీపై విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ మంగళవారం (మార్చి 5న) ముందు నిక్కీ హేలీ.. మొదటి ప్రైమరీలో విజయం సాధించటం కొంత ఊరటనిచ్చింది. సూపర్ మంగళవారం రోజు సుమారు 12 రాష్ట్రాల్లోని అధ్యక్ష పైమరీలు, కాకస్‌లో ప్రజలు ఓటు వేయనున్నారు. అదేవిధంగా యూఎస్ కాంగ్రెస్‌లోని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్‌కు ఓట్లు వేయనున్నారు. -
US presidential election 2024: సొంత రాష్ట్రంలో నిక్కీ హేలీ ఓటమి
చార్లెస్టన్: సొంత రాష్ట్రం సౌత్ కరోలినాలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీలో భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ ఓటమి పాలయ్యారు. ఆమెకు 39.4% ఓట్లు పడగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 59.9% ఓట్లతో నెగ్గారు. అయినా వెనక్కి తగ్గేది లేదని, సూపర్ ట్యూస్ డేలో గట్టిపోటీ ఇస్తానని హేలీ అన్నారు. వరుసగా నాలుగో విజయంతో రిపబ్లికన్ అభ్యర్థిత్వానికి ట్రంప్ విజయా వకాశాలు మెరుగయ్యాయి. అందుకు 1,215 మంది డెలిగేట్ల మద్దతు కావాలి. ఇప్పటిదాకా హేలీ 17, ట్రంప్ 92 డెలిగేట్ల మద్దతు గెలుచుకున్నారు. ఓవైపు వరుస కోర్టు కేసులు వేధిస్తున్నా అయోవా, న్యూ హ్యాంప్‌షైర్, నెవడా రిపబ్లికన్ ప్రైమరీల్లో ట్రంప్ ఇప్పటికే విజయం సాధించడం తెలిసిందే. -
South Carolina Primary: హాలేపై ట్రంప్ ఘన విజయం
కొలంబియా: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా జరిగిన కీలకమైన సౌత్ కరోలినా రిపబ్లికన్ ప్రైమరీలోనూ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోయారు. ప్రత్యర్థి నిక్కీ హాలేపై ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలో ట్రంప్‌నకు 63 శాతం ఓట్లు రాగా హాలేకు 36.8 ఓట్లు మాత్రమే వచ్చాయి. హాలేకు ఇది అవమానకరమైన ఓటమిగా అమెరికా మీడియా కథనాలు ప్రచురించింది. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవి నామినేషన్‌కు పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన హాలే గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా రెండుసార్లు పనిచేశారు. హాలేకు సౌత్ కరోలినా కంచుకోటగా విశ్లేషకులు చెప్తారు. ఇక్కడ కూడా ట్రంప్ ఘన విజయం సాధించడంతో రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష పదవి పోటీకి ట్రంప్ అభ్యర్థిత్వం ఖాయమైపోయినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. రిపబ్లికన్ పార్టీ ప్రస్తుతం చాలా ఐక్యంగా ఉందని సౌత్ కరోలినా ప్రైమరీ పోలింగ్ ముగిసిన తర్వాత సౌత్ కరోలినా రాజధాని కొలంబియాలో ట్రంప్ వ్యాఖ్యానించారు. సౌత్ కరోలినాలో ఓటమి తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ నుంచి నిక్కీ హాలే తప్పుకోవాలని ట్రంప్ వర్గం డిమాండ్ చేస్తోంది. అయితే తాను రేస్ నుంచి తప్పుకోనని హాలే ప్రకటించారు. మార్చి5 మంగళవారం(సూపర్ ట్యూస్డే)నాడు జరిగే పలు స్టేట్ ప్రైమరీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. కాగా, ట్రంప్ ఇప్పటివరకు 5 ప్రైమరీల్లో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి రేసులో ఎవరూ అందుకోలేనంత ముందంజలోకి వెళ్లారు. ప్రైమరీలు ముగిసిన తర్వాత ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికలు జరగనున్నాయి. అటు డెమొక్రాట్ల ప్రైమరీల్లో ప్రస్తుత దేశ అధ్యక్షకుడు జో బైడెన్ రేసులో ముందున్నారు. ఇదీ చదవండి.. న్యూయార్క్ అపార్ట్మెంట్లో మంటలు.. భారత యువకుడి మృతి -
నిక్కీ హేలీ భర్తపై ట్రంప్ వ్యాఖ్యలు.. త్యాగం తెలియదంటూ ఫైర్
అమెరికా అధ్యక్ష అభ్యర్థి రేసులో పోటీపడుతున్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రైమరీ ఎన్నికల్లో దూసుకుపోతున్నారు. అయితే నెవడా రాష్ట్రంలో ట్రంప్‌కు గట్టిపోటి ఇస్తున్న మరో నేత నిక్కీ హేలీ పోటీకి దూరంగా ఉండటంతో ట్రంప్ గెలుపొందారు. తాజాగా ట్రంప్ చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు. ఆదివారం ప్రచారంలో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్.. ప్రచారంలో నిక్కీ హేలీ భర్త కనించడం లేదు? ఆయన ఎక్కడ? ఆయనకు ఏమైంది? అని విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నిక్కీ హేలీ స్పందించారు. ఇలాంటీ ప్రశ్నలు ప్రత్యక్షంగా డిబేట్లో పాల్గొన్నప్పుడు అడగాలని.. కానీ ఇలా తన వెనకాల ప్రచారంలో విమర్శ ఏంటని ట్రంప్‌పై మండిపడ్డారు. మీకు ఏదైనా చెప్పాలనిపిస్తే.. సూటిగా చెప్పాలి. కానీ.. వెనకాల విమర్శలు చేయోద్దు. స్టేజ్ మీదకు వచ్చి డిబేట్లో నా ముందు మాట్లాడాలి’ నిక్కీ హేలీ దుయ్యబట్టారు. ‘నా భర్త మైఖేల్ దేశానికి సేవలు అందించారు. దాని గురించి నీకు ఏం తెలియదు(డొనాల్డ్). మైకేల్ సేవలకు నేను గర్విస్తున్నా. ప్రతి మిలిటరీ కుటుంబానికి తెలుసు మిలిటరీలో పనిచేసినవారి త్యాగం గురించి. మిలిటరీ బలగాల త్యాగం తెలియని వాళ్లు అమెరికా కమాండర్-ఇన్-చీఫ్‌గా వ్యవహరించే అర్హత ట్రంప్‌కు లేదు. మిలిటరీ బలగాల త్యాగాలను కించపరిచే వ్యక్తి (డొనాల్డ్ ట్రంప్) మిలిటరీ డ్రైవర్ లైసెన్స్ పొందడానికి కూడా అర్హుడు కాదు’ అని భారత సంతతి మహిళా నిక్కీ హేలీ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై నిక్కీహేలీ భర్త మైఖేల్ హేలీ‘ఎక్స్’ వేదికగా మండిపడ్డారు. ‘ఇదే మనుషులు, జంతువుల మధ్య తేడా?జంతువులు ఎప్పుడూ మూగ జంతువుకు సారథ్యం వహించడానికి అనుమతి ఇవ్వవు’ అని ఎద్దేవా చేశారు. చదవండి: మా ఇద్దరిలో ఒకరికి అధ్యక్షపీఠం: నిక్కీ హేలీ! -
మా ఇద్దరిలో ఒకరికి అధ్యక్షపీఠం: నిక్కీ హేలీ!
వాషింగ్టన్: 2024లో అమెరికా అధ్యక్ష పీఠాన్ని మొట్టమొదటిసారిగా మహిళ అధిరోహించనున్నారని ఐరాస మాజీ రాయబారి నిక్కీ హేలీ జోస్యం చెప్పారు. ఆ అవకాశం ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు లేదా తమ ఇద్దరిలో ఎవరో ఒకరికి దక్కనుందని ఆమె చెప్పారు. తాజాగా ఫాక్స్ న్యూస్‌తో నిక్కీ హేలీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు ట్రంప్ వరుసగా విజయాలు సాధిస్తున్నప్పటికీ ఎన్నికల బరిలో కొనసాగుతానన్నారు. 24న జరిగే సౌత్ కరోలినా ప్రైమరీపైనే తన దృష్టంతా ఉందని నిక్కీ హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్‌తోపాటు అధ్యక్ష బరిలో నిలిచిన ఆ పార్టీకి చెందిన ఏకైక అభ్యర్థి నిక్కీ హేలీ కావడం గమనార్హం. -
US presidential election 2024: ప్రైమరీలో ట్రంప్‌కు మరో గెలుపు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ప్రైమరీల్లో డొనాల్డ్ ట్రంప్ మరో కీలక ముందడుగు వేశారు. ఇప్పటికే అయోవా ప్రైమరీలో గెల్చిన ఆయన బుధవారం న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీలోనూ నెగ్గారు. అయితే భారతీయ అమెరికన్ నాయకురాలు నిక్కీ హేలీ ఆయనకు గట్టిపోటీ ఇచ్చారు. ట్రంప్‌కు 55 శాతానికి పైగా ఓట్లు రాగా ఆమె 44 శాతం సాధించారు. న్యూ హ్యాంప్‌షైర్ ప్రైమరీని మూడుసార్లు గెలిచిన తొలి రిపబ్లికన్ ప్రైమరీ అభ్యర్థిగా ట్రంప్ చరిత్ర సృష్టించారు. ట్రంప్కిస్తే గెలుపు బైడెన్‌దే: హేలీ తాజా ఫలితాలపై నిక్కీ హేలీ మాట్లాడారు. ‘హ్యాంప్‌షైర్‌లో గెల్చిన ట్రంప్‌కు శుభాకాంక్షలు. అయినా ఇంకా డజన్ల కొద్దీ రాష్ట్రాల ప్రైమరీ ఎన్నికలు జరగాల్సే ఉంది. పార్టీ ఓటర్ల అంతిమ తీర్పు వెలువడటానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. ఈ పోటీలో నేను చిట్టచివరిదాకా పోరా డతా. రేస్‌లో కొనసాగుతా. ఈ పోరు మొదలైనప్పుడు రేసులో మొత్తం 14 మంది ఉండేవాళ్లం. నాకు రెండు శాతం ఓట్లు వచ్చేవి. ఇప్పుడు ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తున్నది నేను మాత్రమే’ అని హేలీ ప్రసంగించారు. ‘‘ట్రంప్‌కు రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థిత్వం దక్కాలని డెమొక్రాట్లు కోరుకుంటున్నారు. ట్రంప్‌ను అయి తే తేలిగ్గా ఓడించవచ్చని వారి ఆశ. నిజంగా ట్రంప్‌కు అభ్యర్థిత్వం దక్కి తే బైడెన్, కమలా హ్యారిస్‌ల విజయం తథ్యం’’ అని హేలీ అన్నారు. మరోవైపు, ‘‘ఈ రోజు హేలీకి కాళరాత్రి. అయినా తానే గెల్చినట్లు ప్రసంగాలు దంచేస్తోంది’’ అని ట్రంప్ ఎద్దేవా చేశారు. సౌత్ కరోలినాలో డెమొక్రటిక్ పార్టీ ప్రైమరీలో అధ్యక్షుడు బైడెన్ నెగ్గారు. -
‘నన్ను పెళ్లి చేసుకుంటావా’? అంటే.. ఓటేస్తావా అని అడిగింది. ఆ తరువాత...?
నిక్కీ హేలీ.. ఈ పేరు అందరికీ సుపరిచితమే.. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పోరులో బరిలో నిలిచింది. ఆఖరు వరకు పోరాడిన ఆమె చివరికి న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూసింది. అయితే తాజాగా నిక్కీకి ఓ వింత అనుభవం ఎదురైంది. సోమవారం న్యూ హాంప్‌షైర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. సాలేంలోని ఆర్టిసాన్ హోటల్లో ఆమె తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగిస్తుండగా ట్రంప్ మద్దతుదారు ఆమెకు ప్రపోజ్ చేశాడు.. వారి మధ్య సాగిన సంభాషణ ఈ విధంగా ఉంది. ట్రంప్ మద్దతుదారు: నన్ను పెళ్లి చేసుకుంటారా?( గుంపులోంచి గట్టిగా అరవడంతో అందరూ ఒక్కసారిగా ఘోల్లుమన్నారు). నిక్కీ హేలీ: నాకు మద్దతుగా ఓటు వేస్తావా? (నవ్వుతూ) ట్రంప్ మద్దతుదారు: నేను ట్రంప్‌నకు ఓటు వేయబోతున్నాను. ( హేళనగా సమాధానమిచ్చాడు) నిక్కీ హేలీ:. అయితే వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో. ఊహించని ఘటనతో హాల్లో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది. ఈ సంఘటన అనంతరం నిక్కీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక భారతీయ సంతతికి చెందిన దంపతులకు 1972లో జన్మించిన నిక్కీ ..1996లో మైఖేల్ హేలీని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు రెనా, నలిన్. గతంలో ఆమె సౌత్ కరోలినా రాష్ట్ర గవర్నర్‌గా పనిచేశారు. ట్రంప్ అధ్యక్షడిగా ఉన్న సమయంలో ఐరాసలో అమెరికా రాయబారిగానూ వ్యవహరించారు. అమెరికా అధ్యక్ష పోరు నుంచి భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ తప్పుకున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసెడెంట్ ఎన్నికల్లో అభ్యర్ధిగా నిలబడిన నిక్కీ...న్యూ హాంప్‌షైర్ రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు ట్రంప్ చేతిలో ఓటమిని చవిచూశారు. ట్రంప్‌నకు మద్దతుగా 52 శాతం ఓట్లు రాగా, నిక్కీ హేలీకి 34శాతం ఓట్లు లభించాయి. దీంతో రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష రేసులో నిలిచే వ్యక్తిగా ట్రంప్ పేరు దాదాపు ఖరారైపోయింది. కాగా ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్! -
USA: అధ్యక్ష రేసులో ట్రంప్ లైన్ క్లియర్!
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష బరిలో నిలిచేందుకు మాజీ అధ్యక్షుడు, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. న్యూ హాంప్‌షైర్‌లో రిపబ్లికన్ ప్రైమరీ ఎన్నికల్లో కూడా ట్రంప్ ఘన విజయం సాధించారు. ట్రంప్ ప్రత్యర్థి నిక్కీ హేలీ ఓటమి చెందారు. దీంతో, ట్రంప్ అధ్యక్ష రేసులో ముందంజలో ఉన్నారు. అయితే, ట్రంప్ విజయం అనంతరం నిక్కీ హేలీ స్పందించారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్‌కు అధినందనలు తెలిపారు. ఈ క్రమంలో అధ్యక్ష పదవికి నామినేషన్ కోసం పోటీపడిన అభ్యర్థుల్లో ముగ్గురు ఇప్పటికే తప్పుకోవడంతో రిపబ్లికన్ పార్టీలో పోటీ అంతా ట్రంప్, భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ మధ్యనే కేంద్రీకృతమైంది. భారత సంతతికే చెందిన మరో అభ్యర్థి వివేక్ రామస్వామి, న్యూ జెర్సీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్లు బరినుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. వీరిలో రామస్వామి, డిశాంటిస్లు ట్రంప్‌నకు మద్దతు ప్రకటించారు. ఇక హ్యాంప్ షైర్ గవర్నర్ సునును మద్దతు ఉన్న హేలీ ఆ రాష్ట్ర ప్రైమరీలో ట్రంప్‌నకు గట్టి పోటీ ఇస్తారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా ట్రంప్‌కు మద్దతు ఇవ్వడంతో ఆయన ముందంజలో నిలిచారు. డొనాల్డ్ ట్రంప్‌కు 55.5 శాత ఓట్లు పోల్ అయ్యాయి. మొత్తంగా 41,423 ఓట్లు పడ్డాయి. 46.1 శాతంతో 36,083 ఓట్లను సాధించారు నిక్కీ హేలీ. కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఇద్దరి ఓట్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. BREAKING: Essential projects Donald Trump will win the #NewHampshirePrimary pic.twitter.com/yitff269Fg — Essential Filmworks 🇺🇸 (@Real_EF_News) January 24, 2024 ఇదిలా ఉండగా, అంతకుముందు.. అయోవా స్టేట్‌లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్టోరల్ ఎన్నికలో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8 శాతం మేర ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలిచిన రాన్ డీశాంటీస్- 21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి- 7.2 శాతం ఓట్లు పడ్డాయి. El expresidente de #EEUU🇺🇲 Donald Trump gana las primarias republicanas en #NewHampshire pic.twitter.com/4spzM0jPmQ — Allan Berfield 🌎 (@allanberfield) January 24, 2024 అయితే, ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్లో అధ్యక్ష ఎన్నికలకు పోలింగ్ నిర్వహించే అవకాశం ఉంది. దీంతో, ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ.. ఎన్నికల కోసం సన్నాహాలు చేపట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. 2019 నాటి ఎన్నికల్లో ఓడినా మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వానికే మొగ్గు చూపింది. -
US presidential election 2024: ట్రంప్ మానసిక స్థితిపై అనుమానాలు: నిక్కీ హేలీ
కొలంబియా: అమెరికా మాజీ అధ్యక్షుడు, మళ్లీ అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ మానసిక ఆరోగ్యంపై భారత సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అనుమానం వ్యక్తం చేశారు. అమెరికా హౌస్ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా తన పేరును ప్రస్తావించడంపై ఆమె ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆమె న్యూహ్యాంప్‌షైర్‌లోని కీనీలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడారు. 2021 జనవరి 6వ తేదీన క్యాపిటల్ హిల్ సెక్యూరిటీ ఇన్చార్జిగా అప్పటి అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ పేరుకు బదులుగా హేలీ పేరును ట్రంప్ పేర్కొనడంపై ఆమె స్పందించారు. మానసికంగా సరిగా లేని ట్రంప్ అధ్యక్ష పదవిలో ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా అనేది అనుమానమేని పేర్కొన్నారు. -
డొనాల్డ్ ట్రంప్ మానసికస్థితిపై నిక్కీ హేలీ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ మాజీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె శనివారం మాట్లాడుతూ ట్రంప్‌కు కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ మానసిక స్థితిపై నిక్కీ హేలీ మండిపడ్డారు. జనవరి 6,2021న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడిని ఆపటంలో తీవ్రంగా విఫలమయ్యారని విమర్శించారు. శుక్రవారం రాత్రి ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్నారని.. జనవరి 6, 2021న అమెరికా క్యాపిటల్ భవనంపైన జరిగిన దాడి విషయంలో తాను భద్రత కల్పించలేకపోయానని పార్టీ శ్రేణులు చేస్తున్న విమర్శలను పదే పదే ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. తాను ఎందుకు ఆ హింసాత్యక ఘటనకు తాను బాధ్యత వహిస్తావని ప్రశ్నించారు. కనీసం అప్పుడు తాను ఆఫీసులో కూడా లేనని పేర్కొన్నారు. ట్రంప్ అప్పటి అమెరికన్ హౌజ్( ప్రతినిధుల సభ) స్పీకర్ అయిన నాన్సీ పెలోసీని దృష్టిలో పెట్టుకొని పొరపాటుపడుతూ తనపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఆయన మానసికస్థితి ఏంటో తెలుస్తోందని మండిపడ్డారు. ట్రంప్ మానసిక ఆరోగ్యం దిగజారుతోందని తెలపడానికి ఇదే నిదర్శమని అన్నారు తాను ఎటువంటి అవమానకర వ్యాఖ్యలు చేయటం లేదన్నారు. కానీ, ఎంతో ఒత్తిడితో కూడుకున్న అగ్రరాజ్యం అధ్యక్ష పదవి చేపట్టడానికి ట్రంప్ మానసిక స్థితి సరిపోతుందా? అని సూటిగా ప్రశ్నించారు. ఇటువంటి సమయంలో ప్రజలు మరో వ్యక్తిని అమెరికా అధ్యక్షుడిగా కోరుకుంటారని నిక్కీ హేలీ తెలిపారు. చదవండి: US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్ -
US presidential election 2024: నిక్కీ హేలీ నా రన్నింగ్ మేట్ కాదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ నుంచి పోటీదారుగా ఉన్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష పదవి అభ్యర్థి) కాదని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఆమెకు అంత సామర్థ్యం లేదని, ఉపాధ్యక్ష పదవికి ఆమెను ఎంపిక చేసుకోనని వ్యాఖ్యానించారు. అధ్యక్ష పదవి రేసులో రిపబ్లికన్ పార్టీ తరఫున అగ్రభాగాన ఉన్న ట్రంప్ శుక్రవారం కాంకార్డ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడారు. న్యూహ్యాంప్‌షైర్‌లో ట్రంప్‌కు సమీప ప్రత్యర్థిగా ఉన్న నిక్కీ హేలీ..తాను ఉపాధ్యక్ష పదవి రేసులో లేనని ఇప్పటికే ప్రకటించగా ట్రంప్ పైవిధంగా స్పందించడం గమనార్హం. అదేవిధంగా, ట్రంప్ తన సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో నిక్కీ హేలీని జాతిపరంగా హేళన చేశారు. పంజాబ్‌కు చెందిన సిక్కు తల్లిదండ్రుల కుమార్తె అయిన నిక్కీ హేలీని ‘నింబ్రా’అంటూ పలుమార్లు పేర్కొన్నారు. నిక్కీ తల్లిదండ్రులు అమెరికన్లు కానందున అధ్యక్ష పదవికి ఆమె అర్హురాలు కాదని ఇటీవల పేర్కొన్న ట్రంప్..ఆమె పేరును ‘నిమ్రద’అంటూ తప్పుగా ఉచ్చరించారు. సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్‌గా పనిచేసిన నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రతా నిక్కీ హేలీ. వివాహానంతరం నిక్కీ హేలీగా మార్చుకున్నారు. -
నిక్కీపై ట్రంప్ అనుచిత పోస్టులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జాతి వివక్ష వ్యాఖ్యలకు తెర తీశారు.అయోవా ప్రైమరీ బ్యాలెట్లో విజయం సాధించి ట్రంప్ ఇప్పటికే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్ల తరపున అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇండియన్ అమెరికన్ నిక్కీ హాలేపై ట్రంప్ తాజాగా జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. నిక్కీపై ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫాంలో అనుచిత పోస్టులు పెట్టారు. నిక్కీ పుట్టినప్పుడు ఆమె తల్లిదండ్రులకు అమెరికన్ పౌరసత్వం లేదని, అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి ఆమె అనర్హురాలని వ్యాఖ్యానించారు. ఇంతటితో ఆగకుండా ఆమె పేరులోని అక్షరాలను కూడా తప్పుగా రాశారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు నిక్కీ ఎక్స్‌లో ధీటైన సమాధానమిచ్చారు. ‘ట్రంప్ గురించి నాకు బాగా తెలుసు అభద్రతాభావం,భయానికి గురైనపుడు ట్రంప్ వేరే వ్యక్తుల పేర్లు తీస్తారు. ఈ విషయంపై దృష్టి పెట్టి నా శక్తిని నేను వృథా చేసుకోను’అని హాలే పోస్టు చేశారు. గతంలో ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేసినపుడు కూడా ఆయన అమెరికన్ కాదని జాతి వివక్ష ప్రచారాన్ని ట్రంప్ విస్తృతంగా నిర్వహించారు. ఈ నెల 15న జరిగిన అయోవా రిపబ్లికన్ ప్రైమరీ బ్యాలెట్లో ట్రంప్‌కు 51 శాతం ఓట్లు రాగా రన్నరప్‌గా నిలిచిన డిశాంటిస్ ట్రంప్ దరిదాపుల్లో కూడా లేరు. నిక్కీ డిశాంటిస్ కన్నా వెనుకబడడం గమనార్హం. ఇదీచదవండి.. అణు డ్రోన్‌ను పరీక్షించిన ఉత్తర కొరియా -
America Elections: ట్రంప్ వర్సెస్ నిక్కీ.. దుమారం రేపుతున్న ట్వీట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రైమరీ బ్యాలెట్లు సమీపిస్తున్న కొద్దీ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న రిపబ్లికన్ క్యాండిడేట్ల మధ్య విమర్శల వేడి రాజుకుంటోంది. ఈ క్రమంలోనే అధ్యక్షపదవికి నామినేషన్ ఆశిస్తున్న నిక్కీ హాలేపై అమెరికా మాజీ అధ్యక్షుడు, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిత్వ రేసులో ముందున్న ట్రంప్ షేర్ చేసిన ఒక సోషల్ మీడియా పోస్టు దుమారం రేపుతోంది. ఇది కచ్చితంగా జాతి వివక్షత కిందకే వస్తుందని నిక్కీ దుయ్యబడుతున్నారు. నిక్కీ నిజమైన అమెరికన్ సిటిజన్ కాదని, అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆమెకు అర్హత లేదని ట్రంప్ షేర్ చేసిన పోస్టు సారాంశం. 1972లో నిక్కీ అమెరికాలో జన్మించే సరికి ఆమె తల్లిదండ్రులకు అమెరికా పౌరసత్వం రాలేదని ఆ పోస్టులో చెప్పుకొచ్చారు. అయితే ట్రంప్‌కు వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేస్తున్న రిపబ్లికన్లు నిక్కీపై ఆయన షేర్ చేసిన పోస్టును తీవ్రంగా తప్పుబడుతున్నారు. నిజానికి నిక్కీ అమెరికాలో పుట్టారన్న ఒకే ఒక్క అర్హతతో ఆమె అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయవచ్చని, ఆమె తల్లిదండ్రుల పౌరసత్వంతో సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. కాగా, సీఎన్ఎన్ సర్వే ప్రకారం త్వరలో ప్రైమరీ జరగనున్న న్యూ హాంప్‌షైర్‌లో ట్రంప్‌కు, నిక్కీకి మధ్య హోరాహోరీ పోరు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఇక్కడి రిపబ్లికన్ ఓటర్లలో నిక్కీకి మద్దతు ఒక్కసారిగా పెరిగింది. ట్రంప్‌కు ఇక్కడ 39 శాతం మంది ఓటర్లు మద్దతునిస్తుండగా నిక్కీకి 32 శాతం మంది మద్దతిస్తుండటం గమనార్హం. In @NikkiHaley ’s situation, reports indicate that her parents were not U.S. citizens at the time of her birth in 1972. Based on the Constitution as interpreted by @PaulIngrassia, this disqualifies Haley from presidential or vice-presidential candidacy under the 12th Amendment. pic.twitter.com/6zl2gFizNN — The Gateway Pundit (@gatewaypundit) January 3, 2024 A new racist conspiracy theory just dropped. Trump now claims Nikki Haley is ineligible to be president. pic.twitter.com/Rrgw6T8V7Q — Republicans against Trump (@RpsAgainstTrump) January 9, 2024 ఇదీచదవండి..రష్యాలో మిస్టరీ డెత్స్.. ఎక్కువ మరణాలు వారివే -
US Presidential Elections 2024: ఫాసిస్ట్, అవినీతి అనకొండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడడానికి భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి తీవ్రంగా శ్రమిస్తున్నారు. పారీ్టలో తన ప్రత్యర్థి అయిన భారతీయ–అమెరికన్ నిక్కీ హేలీపై పైచేయి సాధించాలని చూస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యరి్థత్వం కోసం వివేక్ రామస్వామి, నిక్కీ హేలీతోపాటు ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటీస్, న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ పోటీ పడుతున్నారు. నలుగురు ఆశావహుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం యూనివర్సిటీ ఆఫ్ అలబామాలో హాట్‌హాట్‌గా జరిగింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాలేదు. చర్చలో పాల్గొన్న నలుగురు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. వివేక్ రామస్వామి దాదాపు అరగంటపాటు మాట్లాడారు. ప్రధానంగా నిక్కీ హేలీపై విరుచుకుపడ్డారు. ఆమె ఫాస్టిప్, అవినీతి అనకొండ అని ధ్వజమెత్తారు. ఆరోపణలపై మీడియాకు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. కార్పొరేట్ సంస్థల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. రీడ్ హాఫ్మాన్ అనే ధనవంతుడి నుంచి నిక్కీ, ఆమె కుటుంబ సభ్యులు 2.5 లక్షల డాలర్లు దండుకున్నారని ఆరోపించారు. అయితే, వివేక్ రామస్వామి చేసిన ఆరోపణలపై నిక్కీ హేలీ పెద్దగా స్పందించలేదు. చర్చా కార్యక్రమంలో మౌనంగా ఉండిపోయారు. ఆమెకు క్రిస్ క్రిస్టీ మద్దతుగా నిలిచారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలను ఆయన ఖండించారు. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ నేత, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌పై ఎవరు పోటీకి దిగుతారన్నది ఆసక్తికరంగా మారింది. -
అమెరికా అధ్యక్షుడి రేసులో దూసుకెళ్తున్న భారతీయుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున రేసులో ఉన్న భారతీయ అభ్యర్థి వివేక్ రామస్వామి డోనాల్డ్ ట్రంప్ తర్వాత రెండో స్థానానికి చేరారు. మూడో స్థానంలో మరో భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ కొనసాగుతున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అభ్యర్థిత్వానికి ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రోన్ డిశాంటిస్‌ను భారత సంతతి అభ్యర్థులు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీలు వెనక్కి నెట్టారు. రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్న వారి మధ్య జరిగిన డిబేట్లలో సత్తా చాటిన వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ ఆ తర్వాత క్రమ క్రమంగా పాయింట్లను పెంచుకుంటూ వచ్చారు. ఇప్పటికీ డోనాల్డ్ ట్రంప్ 39 శాతం జీవోపీ ప్రాధమిక ఓట్లతో మొదటి స్థానంలోనే కొనసాగుతుండగా అప్పటి వరకు రేసులో రెండో స్థానంలో ఉన్న రోన్ డిశాంటిస్ ఒక్కసారిగా ఐదో స్థాననానికి పడిపోయారు. డోనాల్డ్ ట్రంప్‌కు రిపబ్లికన్ ప్రాధమిక పోలింగ్‌లో ఆధిక్యత లభించినప్పటికీ జాతీయ స్థాయిలో మాత్రం అతని పనితీరు కాస్త వెనకబడి ఉంది. ఇదిలా ఉండగా ఆగస్టులో జరిగిన డిబేట్ తర్వాత రోన్ డిశాంటిస్ ఒక్కో మెట్టు దిగజారుతూ వచ్చారు. మరోపక్క పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి మాజీ కాలిఫోర్నియా గవర్నర్ నిక్కీ హేలీ ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు మూడు స్థానాలకు చేరుకున్నారు. 13 శతం జీవోపీ మద్దతుదారులతో రెండో స్థానంలో వివేక్ రామస్వామి ఉండగా 12 శాతంతో నిక్కీ హేలీ మూడో స్థానంలో ఉన్నారు. ఇక రోన్ డిశాంటిస్ విషయానికి వస్తే జులైలో 26 శాతం మద్దతుతో ట్రంప్‌కు గట్టిపోటీ ఇచ్చిన ఆయన ఇప్పుడు 6 శాతానికి పడిపోయారు. In a just released CNN-University of New Hampshire poll, DeSantis has dropped 13 points since July's survey. He's now at 10% among likely GOP primary voters, while Vivek Ramaswamy is at 13%, Nikki Haley at 12% and Chris Christie is at 11%. Trump is the first choice at 39%. — Kaitlan Collins (@kaitlancollins) September 20, 2023 ఇది కూడా చదవండి: తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం -
ప్రైమరీలను వేడెక్కిస్తున్న భారతీయులు
నార్త్ కరొలైనా మాజీ గవర్నరు నిక్కీ హేలీ, 38 ఏళ్ల పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడటం! రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీకి నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమెరికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకిది ముందరి ఏడాది కావడంతో అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే ‘ప్రైమరీ’లు (ప్రాథమిక ఎన్నికలు) రాజకీయ వాతావర ణాన్ని వేడెక్కిస్తున్నాయి. యూఎస్‌లో 40 లక్షల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. యూఎస్ మొత్తం జనాభాలో ఇది దాదాపుగా 1.3 శాతం. యూఎస్ కాంగ్రెస్‌లో గత దశాబ్ద కాలంలో ఐదుగురు భారత సంతతి అమెరికన్లు ప్రతినిధులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నార్త్ కరొలైనా మాజీ గవర్నరు, ఐక్యరాజ్యసమితిలో యూఎస్ శాశ్వత ప్రతినిధి అయిన నిక్కీ రణ్‌ధవా హేలీ... రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం ప్రైమరీ ఎన్నికలకు పోటీ పడుతున్నారు. ఆమె పాలనా సామర్థ్యానికి ఇప్పటికే అనేక నిరూపణలు ఉన్నాయి. బయోటెక్స్ స్టార్టప్‌ను స్థాపించి, విజయవంతంగా నడిపిస్తున్న 38 ఏళ్ల భారతీయ సంతతి పారిశ్రామిక వేత్త వివేక్ రామస్వామి కూడా ప్రస్తుతం వెలుగులో ఉన్నారు. అతడు డబ్బు వరదలో కొట్టుకుని పోతున్నవాడు. అమెరికా గుండెకాయగా పేర్గాంచిన మిడ్వెస్ట్ ప్రాంతంలో పెరిగి పెద్దవాడైనవాడు. ఐవీ లీగ్ ప్రావీణ్యాలతో పరిపుష్ట మైనవాడు. ప్రఖ్యాత మీడియా సంస్థలు ఆయన గురించి రాశాయి. ఆయన కథనాల్లో అతిశయోక్తి కనిపించవచ్చు. కానీ ఓటర్లు ఏం కోరు కుంటున్నారన్న విషయమై ఆయనకు చక్కటి అంచనా ఉంది. అత్యధిక సంఖ్యలో డెమోక్రాట్ల వైపున ఉన్న యూఎస్‌లోని ప్రవాస భారతీయులకూ, ఇతర అల్పసంఖ్యాక వర్గాలకూ రామ స్వామి ఆలోచనలు గిట్టనివే కావచ్చు. పని ప్రదేశాలలో వైవిధ్యానికి వ్యతిరేకంగా ఆయన మాట్లాడతారు. అదే సమయంలో వైవిధ్యభరిత మైన ఆలోచనలను ఇష్టపడతానని చెబుతుంటారు. వైవిధ్య వ్యతిరేక తకు ‘తెలివి’ని జోడించడం ఇది. రామస్వామి ఒక రాజ్యాంగ సవర ణను కూడా ప్రతిపాదిస్తున్నారు. ఆ ప్రకారం 18–24 ఏళ్ల మధ్య వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే యూఎస్ ప్రభుత్వ స్వరూప స్వభావాలలోని ప్రాథమిక అంశాలపై వారెంత అవగాహ నను కలిగి ఉన్నారో నిర్ణయించే ‘సివిక్స్ టెస్ట్’ను ఉత్తీర్ణులై ఉండాలి. మళ్లీ ఇదొక పైకి మంచిగా కనిపించే కపటపూరితమైన ఆలోచన. ఈ వయఃపరిమితిలో ఉన్న జనాభాలో ఎక్కువమంది డెమోక్రాట్లకు మద్దతు ఇస్తుంటారు. రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చేవారిలో మధ్య వయస్కులు అత్యధికం. ‘సివిక్స్ టెస్ట్’ నిర్వహణ ద్వారా యువజనుల ఓటర్లలో తగ్గించగలిగినంత మందిని తగ్గిస్తే రిపబ్లికన్లకు ప్రయో జనం చేకూర్చవచ్చన్నది రామస్వామిలోని మరో ఆలోచనా వైవిధ్యం. అయితే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వ్యతిరేకంగా ఈ భారతీయ అమెరికన్లు పోటీగా నిలిచే అవకాశం లేకపోవచ్చు. అయినప్పటికీ వీరి ఆలోచనలు అమె రికా రాజకీయ నేపథ్య దృశ్యానికి భిన్నంగా ప్రాముఖ్యాన్ని కలిగి ఉన్నాయి. సాధారణంగా డెమోక్రాట్లకు ఓటు వేస్తుండే భారతీయ అమెరికన్లు ఎందుకని రిపబ్లికన్ పార్టీ ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు? అధిక సంఖ్యాకవాద రాజకీయాలకు, పర్యవసాన వివక్షాపూరిత విధానాలకు బాధితులైన మైనారిటీ సమూహాలను డెమొక్రాటిక్ పార్టీ తన ప్రగతిశీల సిద్ధాంతాలతో దరికి చేర్చుకుంటుందన్న వాస్తవానికి విరుద్ధంగా ఉంది – భారతీయ అమెరికన్లు ఇలా రిపబ్లికన్ పార్టీ తర ఫున పోటీ పడటం! ఈ సందర్భంలో ఎవరైనా యూఎస్‌కు భారతీ యుల వలస వెనుక ఉన్న ప్రత్యేక అంశాల మీద, వారు ఏ సామాజిక స్థాయుల నుంచి వలస వచ్చారనే దాని మీద దృష్టిపెట్టడం అవసరం. భారతీయుల వలసల్లోని మొదటి దశ ప్రధానంగా 20వ శతాబ్దపు ప్రారంభ సంవత్సరాలలో శాన్ఫ్రాన్సిస్కోలోని ఆధునిక టెక్ హబ్ ద్వారా మొదలైంది. ఆసియా సంతతి వారిపై ఉన్న చట్టపరమైన పరి మితుల కారణంగా నాటి వలసదారులు సంఖ్యాపరంగా స్వల్పంగా ఉన్నారు. రైలు–రోడ్లు పనులు, కలప డిపోలు, వ్యవసాయ పొలాల్లో ఉపాధిని వెతుక్కున్నారు. ఆఖరికి కాంగ్రెస్ సభ్యుడు దలీప్ సింగ్ సౌంద్ కూడా 1924లో బర్కిలీలోని క్యాలిఫోర్నియా విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ పొందినప్పటికీ, యూఎస్ ప్రభుత్వం పౌరసత్వాన్ని నిరాకరించిన కారణంగా 1949 వరకు రైతుగా పని చేయవలసి వచ్చింది. అమృత్‌సర్‌లో జన్మించిన దలీప్ 1956లో డెమోక్రాటిక్ పార్టీ టికెట్‌పై క్యాలిఫోర్నియా నుంచి యూఎస్ కాంగ్రెస్‌కు ఎన్నికయ్యారు. అలా ఎన్నికైన మొదటి ఆసియా – అమెరికన్, మొదటి భారతీయ– అమెరికన్, మొదటి సిక్కు మతస్థుడు దలీప్. 1965 అక్టోబర్ 3న అప్పటి అధ్యక్షుడు లిండన్ బి జాన్సన్ ఇమిగ్రేషన్ బిల్లుపై సంతకం చేయడంతో ఆసియా దేశాల నుండి వచ్చే వలసలపై ఉన్న నిబంధనలు తొలగిపోయాయి. ఆ తర్వాత వలస వచ్చి తమ విజయాలతో గుర్తింపు పొందిన అనేక ఆసియా సమూ హాల పిల్లల్లో భారతీయ అమెరికన్ల సమూహంలోని పిల్లలు అధికంగా ఉన్నారు. ఇది భారతీయులలోని ఉన్నత విద్యావంతులు యూఎస్‌లో చదువుకోడానికి, ఉద్యోగాలు చేయడానికి తోడ్పడింది. వారిలో చాలామంది స్కాలర్‌షిప్‌లపై అక్కడికి వెళ్లారు. వారిని జర్న లిస్ట్ అనితా రాఘవన్ తన పుస్తకం ‘ది బిలియనీర్స్ అప్రెంటిస్: ది రైజ్ ఆఫ్ ది ఇండియన్ – అమెరికన్ ఎలీట్ అండ్ ది ఫాల్ ఆఫ్ గాలియన్ హెజ్ ఫండ్’లో ‘రెండుసార్లు ఆశీర్వదించబడిన తరం’గా చేసిన అభివర్ణన ఎంతో ప్రసిద్ధి చెందినది. యూఎస్ వలస చట్టాల సడలింపు వల్లా, స్వాతంత్య్రానంతరం విద్యారంగంపై భారత్ అపారంగా పెట్టు బడులు పెట్టడం వల్లా రెండు రకాలుగా లబ్ధి పొందిన తరం అది. 1995 తర్వాతి కాలంలో సాంకేతిక నైపుణ్యం కలిగిన కార్మికులకు ఏర్పడిన డిమాండు, ఆ తర్వాత వై2కె మైగ్రేషన్ ప్రాజెక్టుతో... వలసలు అకస్మాత్తుగా విస్ఫోట స్థాయిలో పెరిగాయి. దాంతో పాటుగా భారత దేశంలో అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై యూఎస్‌లో ఆసక్తి ఏర్పడింది. ఇది చాలామంది ఆర్థిక నిపుణులకు ద్వారాలను తెరిచింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణిత అంశాలలో బలమైన నేపథ్యం, ఆంగ్ల భాషపై క్రియాత్మక అనర్గళత ఉండి హెచ్–1బి నాన్ ఇమిగ్రెంట్ వీసా ప్రోగ్రామ్ కింద దరఖాస్తు చేసుకుని అమెరికా వెళ్లినవారిలో దాదాపు 75 శాతం మంది భారతీయులే. వారిలో అనేకమంది దశాబ్ద కాల వ్యవధిలో అమెరికన్ పౌరులుగా మారారు. 2000 తర్వాత, లేదా గత 10 సంవత్సరాలలో వలసవెళ్లినవారు యూఎస్‌లో శాశ్వత నివా సులుగా ఉంటూ, ప్రస్తుతం పౌరసత్వం పొందే దారిలో ఉన్నారు. వలసల విశిష్టతల దృష్ట్యా భారతీయ అమెరికన్లు రెండు పార్టీల లోనూ ప్రాతినిధ్యం వహించే ధోరణి ఎంత ఎక్కువ మంది పౌరసత్వం పొందితే అంతగా పటిష్ఠం అవుతుంది. ఇతర మైనారిటీ సమూహాల పోరాటం చాలామంది యువ భారతీయ అమెరికన్ల జీవితాలలో ప్రతిబింబించదు. ఎందుకంటే వీరంతా ఉన్నత విద్యావంతులైన మొదటి తరం భారతీయ అమెరికన్ తల్లిదండ్రులకు జన్మించినవారు. నాణ్యమైన విద్య, సమయపాలన, అందుబాటులో ఉన్న పర్యావరణ వ్యవస్థల మద్దతుతో ఈ యువ బృందం ఆర్థికంగా లాభదాయకమైన అనేక వృత్తిపరమైన రంగాలలో విజయం సాధించింది. జెనరేషన్ జడ్, లేదా మిలీనియల్ జనరేషన్ నుంచి కొందరు తక్కువ ఆదాయ పన్ను, ప్రైవేట్ హెల్త్ కేర్ వంటి విధానాలకు మద్దతు ఇస్తున్నారు. ఇతర మైనారిటీ సమూహాలకు భిన్నంగా సంక్షేమ పథ కాల పట్ల వీరికి వ్యతిరేకత కూడా ఉండవచ్చు. భారతీయ అమెరికన్ల రాజకీయ పొత్తులు యూఎస్‌లోని ఇతర మైనారిటీ సమూహాల రాజ కీయాలపై మన అవగాహన నుండి ఉత్పన్నం అయినవైతే కాదు. లవ్ పురి వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
US Presidential Elections 2024: నువ్వా X నేనా?
నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ ఇద్దరే. భారత సంతతికి చెందిన వారే. రిపబ్లికన్ల అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చలో వారిద్దరే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఉక్రెయిన్ యుద్ధ్దంపై మాటల తూటాలు విసురుకున్నారు. చివరికి వివేక్ రామస్వామి పైచేయి సాధించారు. ట్రంప్‌కు గట్టి పోటీ ఇస్తారని అంచనాలున్న రాన్ డిసాంటిస్‌ను పక్కకు పెట్టి మరీ రామస్వామి ముందుకు దూసుకుపోతున్నారు. ► రిపబ్లికన్ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగిన తొలి చర్చ వాడీగా వేడిగా సాగింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ చర్చకు దూరంగా ఉండడంతో ఇద్దరే ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వారిద్దరూ భారత సంతతికి చెందిన అభ్యర్థులే. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ, మల్టీ మిలియనీర్ వివేక్ రామస్వామి మధ్య ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ మరో మలుపు తీసుకుంది. అమెరికా చరిత్రలో ఇద్దరు భారతీయులు ఒకే వేదికను పంచుకొని ఈ తరహాలో చర్చించుకోవడం ముందెన్నడూ జరగలేదు. ఇద్దరికి ఇద్దరు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఒకానొక దశలో వేలి చూపిస్తూ బెదిరించుకున్నారు. ఒకరిపై మరొకరు 30 సెకండ్లపాటు అరుచుకున్నారు. విదేశీ వ్యవహారాల్లో వివేక్ రామస్వామికి అవగాహన లేదని, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం అంశంలో ఆయన పుతిన్‌కు మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ నిక్కీ హేలీ గట్టి ఆరోపణలే చేశారు. అమెరికా శత్రువులకి కొమ్ముకాస్తూ, దేశ మిత్రులకు దూరంగా వెళుతున్నారని వివేక్‌ను దుయ్యబట్టారు. పుతిన్ ఒక హంతకుడని అతనికి మద్దతుగా మాట్లాడేవారు ఈ దేశానికి అధ్యక్షుడైతే భద్రత గాల్లో దీపంలా మారుతుందంటూ హేలీ మండిపడ్డారు. హేలీ మాట్లాడుతున్నంత సేపు వివేక్ రామస్వామి ఆమెని అడ్డుకుంటూనే ఉన్నారు. హేలీ చెబుతున్నవన్నీ అబద్ధాలని , తనపై నోటికొచి్చనట్టు మాట్లాడుతున్నారంటూ ఎదురు దాడికి దిగారు. అమెరికా భద్రతే ముఖ్యం.. ► ఉక్రెయిన్‌కు మరింత సాయానికి తాను వ్యతిరేకిస్తానని వివేక్ రామస్వామి ఈ చర్చలో కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అమెరికాకు ఉక్రెయిన్ ప్రధానం కాదని, వారికి చేసే మిలటరీ సాయాన్ని తమ దేశ సరిహద్దుల్లో మోహరిస్తే దేశ భద్రత మరింత పటిష్టమవుతుందని వివేక్ రామస్వామి పేర్కొన్నారు. రక్షణ రంగానికి చెందిన కాంట్రాక్టర్ల ఒత్తిడితోనే నిక్కీ ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉన్నారంటూ ధ్వజమెత్తారు. ఈ చర్చలో నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి పై చేయి సాధించారు. అమెరికాకు ఎప్పుడైనా తన దేశ భద్రతే ముఖ్యం తప్ప, ఉక్రెయిన్‌కు సాయం చేయడం కాదంటూ గట్టిగా వాదించారు. రాజకీయ అనుభవం లేకపోవడంతో మొదట్లో అంతగా గుర్తింపు లేని వివేక్ రామస్వామి తాను నమ్మిన సిద్ధాంతాలను ఆక ట్టుకునేలా చెప్పడం ద్వారా మద్దతు పెంచుకుంటున్నారు. అధ్యక్ష అభ్యర్థి రేసులో ముందున్న డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి పోటీగా ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ పేరు వినిపించేది. మొదటి చర్చలో రాన్ ఎంత మాత్రం ప్రభా వితం చూపించలేకపోయారు. ఇప్పుడు ఆయనను దాటుకొని మరీ వివేక్ రామస్వామి దూసుకుపోతున్నారు. తొలి చర్చలో వివేక్‌రామస్వామి విజేతగా నిలిచారంటూ వివిధ పోల్స్ వెల్లడిస్తున్నాయి. సెపె్టంబర్ 22న జరిగే రెండో చర్చలో వివేక్ రామస్వామి ఏంమాట్లాడతారన్న ఉత్కంఠ రేపుతోంది. ఎవరీ వివేక్ రామస్వామి ? కేరళ నుంచి అమెరికాకు వలస వెళ్లిన భారతీయ దంపతులకు ఒహియోలోని సిన్సినాటిలో 1985, ఆగస్టు9న వివేక్ రామస్వామి జని్మంచారు. సంప్రదాయ హిందూ కుటుంబంలో పుట్టి పెరిగారు. తండ్రి ఎలక్ట్రిక్ ఇంజనీరు. తల్లి మానసిక వైద్యురాలు. యేల్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో రామస్వామి చదువుకున్నారు. పాఠశాలలో విద్యనభ్యసించేటప్పుడు జూనియర్ టెన్నిస్ క్రీడాకారుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. యువకుడిగా ఉన్నప్పుడు తీరిక సమయాల్లో అల్జీమర్స్ రోగుల వద్ద పియానో వాయించేవారు. కాలేజీలో చదువుకున్నప్పుడు స్టూడెంట్ బిజినెసెస్.డాట్‌కామ్ సహవ్యవస్థాపకుడిగా ఉంటూ వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. 2007 నుంచి 2014 వరకు క్యూవీటీ ఫైనాన్సెస్ సంస్థలో పని చేశారు. 2014లో సొంతంగా బయోటెక్ కంపెనీ రాయివాంట్ సైన్సెస్‌ను ఏర్పాటు చేశారు. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మిని్రస్టేషన్ (ఊఈఅ) ఆమోదం పొందిన ఐదు ఔషధాలను అభివృద్ధి చేశారు. 10 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ సంస్థ 2017 నాటికి 110 కోట్ల డాలర్ల వ్యాపారం చేసే సంస్థగా ఎదిగింది. అమెరికాలో 40 ఏళ్లకు తక్కువ వయసున్న అత్యంత ధనికుడైన ఎంటర్ ప్రెన్యూర్‌గా ఫోర్బ్స్ జాబితాలోకెక్కారు. వివేక్ రామస్వామి ఆస్తుల విలువ 63 కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. తన క్లాస్మేట్ అయిన అపూర్వ తివారీని 2015లో పెళ్లాడిన వివేక్ రామస్వామికి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు అబ్బాయిలున్నారు. పుస్తక రచన, రాజకీయాలపై ఆసక్తితో రాయివాంట్ సంస్థ సీఈవో పదవి నుంచి 2021లో ఆయన తప్పుకున్నారు. ‘వోక్, ఇంక్: ఇన్సైడ్ కార్పొరేట్ అమెరికాస్ సోషల్ జస్టిస్ స్కామ్’అనే పుస్తకాన్ని రచించారు. ఎన్నో పత్రికల్లో వ్యాసాలు రాశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21న అధ్యక్ష అభ్యరి్థగా నామినేషన్ వేశారు. సాంస్కృతిక ఉద్యమంతో కొత్త అమెరికా కల సాకారమవుతుందని రామస్వామి నినదిస్తున్నారు. ఇప్పటికే ఎలన్‌మస్క్ వంటి పారిశ్రామికవేత్తలు రామస్వామికి బహిరంగంగా మద్దతు పలుకుతూ ఉండడం, ట్రంప్ చుట్టూ కేసుల ఉచ్చు బిగుస్తూ ఉండడంతో వివేక్ రామస్వామి వైపు రిపబ్లికన్లు తిరుగుతారా అన్న చర్చ మొదలు కావడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Nikki Haley: అమెరికా ఏమీ ప్రపంచ ఏటీఎం కాదు!
అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతున్నరిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలి ముందస్తుగా గట్టి ప్రచారం ప్రారంభించారు. ఇటీవలే అమెరికా విదేశాంగ విధానంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను అధికారంలోకి వస్తే అమెరికాను వ్యతిరేకించే దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని తేల్చిచెప్పారు. అలాగే పాక్‌లాంటి చెడ్డ దేశాలకు వందల మిలయన్ల డాలర్లు ఇవ్వనని కరాకండీగా చెప్పారు. ఈ మేరకు నిక్కీ మంగళవారం ఆ వ్యాఖ్యలనే పునరుద్ఘాటిస్తూ.. బలహీనమైన అమెరికానే చెడ్డ వ్యక్తులకు చెల్లిస్తుందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. గతేడాది పాక్, ఇరాక్, జింబాబ్వేలకు వందల మిలియన్ల డాలర్ల సాయం అమెరికా చేసిందన్నారు. బలమైన అమెరికా అలా చేయదని, అమెరికా ఏమి ప్రపంచ ఏటీఎం కాదని ట్విట్వర్ వేదికగా పేర్కొన్నారు నిక్కీ హేలీ. మరో ట్వీట్లో అమెరికా ప్రపంచ ఏటీఎం కాకుడదని, తాను అధికారంలోకి రాగానే విదేశాంగ విధానంలో తీవ్ర మార్పులు చేస్తామని, శత్రువులకు డబ్బులు పంపకుండా గట్టి ప్రణాళికలు పొందుపరుస్తామని చెప్పుకొచ్చారు. అంతేగాదు గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల కష్టార్జితాన్ని వృధా చేయదంటూ బైడెన్ పరిపాలనపై విచుకుపడ్డారు. అలాగే అమెకాను ద్వేషించే దేశాల సరసన నిలిబడే దేశాలకు నిధులందించ కూడదంటూ బైడెన్ ప్రభుత్వాన్ని తిట్టిపోశారు. ఇదిలా ఉండగా, అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన తదుపరే అమెరికా విదేశా విధానంపై తనదైన శైలి విమర్శలు గుప్పిస్తూ జోరుగా ప్రచారం చేస్తున్నారు నిక్కీ. దీంతో 2024 అమెరికా అధ్యక్ష రేస్‌కి సంబంధించిన తాజా ఓపెనియన్ పోల్‌లో అనుహ్యంగా బైడెన్ కంటే ముందంజలో ఉన్నట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఐతే ఫిబ్రవరి 16 మరియు 19 మధ్య నిర్వహించిన రాస్ముస్సేన్ సర్వే ఆధారంగా మాత్రం నిక్కీ హేలీ.. ట్రంప్ కంటే వెనుకబడి ఉందని తెలిపింది. కాగా, యూఎస్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5, 2024న జరగాల్సి ఉంది. (చదవండి: పాక్, చైనాలకు సాయం కట్ చేస్తా.. అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాలి) -
పాక్, చైనాలకు విదేశీ సాయం కట్ చేస్తా
రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి నిక్కీ హేలీ అమెరికా అధ్యక్ష బరిలోకి దిగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తాను అదికారంలోకి వస్తే ఏం చేయాలనుకుంటుందో చెబుతూ.. ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే నిక్కీ అమెరికా విదేశాంగ విధానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే పాక్, చైనాతో పాటు అమెరికాను ద్వేషించే శత్రు దేశాలకు విదేశీ సాయంలో కోత విధిస్తానని చెప్పారు. గర్వించదగ్గ అమెరికా ఎప్పుడూ ప్రజల సొమ్మును వృధా చేయదన్నారు. అమెరికా గతేడాది విదేశీ సహాయం కోసం 46 బిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. అది ఇతర దేశాల కన్నా ఎక్కువ అని కూడా చెప్పారు. అంతేగాదు ఆ డబ్బు ఎక్కడికి వెళుతుందో పన్ను చెల్లింపుదారులు తెలుసుకునే హక్కు ఉందన్నారు. వాస్తవానికి ఆ సొమ్ము అంతా అమెరికాను వ్యతిరేకించే దేశాలకు నిధులు సమీకరించడానికి వెళ్తుందని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. తాను అధికారంలో ఉంటే మాత్రం అమెరికా విరోధులకు అందించే సాయంలోని ప్రతి పైసాలో కోత విధిస్తానని కరాకండీగా చెప్పారు. బైడెన్ ప్రభుత్వం పాక్‌కి మళ్లీ సైనిక సాయాన్ని ప్రారంభించిందన్నారు. ఉగ్రవాదులకు నిలయమైన ఆ దేశ ప్రభుత్వం అమెరికాను వ్యతిరేకించే చైనాకు లోబడి ఉంది. అంతేగాదు పాలస్తీనా ప్రజల కోసం అని అమెరికా యూఎన్ అవినీతి ఏజెన్సీని అర బిలియన్ డాలర్లతో పునురుద్ధరించిందన్నారు. అలాగే ఇరాన్‌కి యూఎస్ సుమారు రెండు బిలయన్ డాలర్లు సాయం అందిస్తే..అది యూఎస్ దళాలపైనే దాడులకు దిగింది. అంతేగాదు యూఎన్‌లో అమెరికాకు అత్యంత వ్యతిరేకంగా ఓటింగ్ వేసే దేశాల్లో ఒకటైన జింబాబ్వేకు కూడా వందల బిలయన్ డాలర్లు అందించింది. అత్యంత హాస్యాస్పదమైన విషయమేమిటంటే. .చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో ముప్పు ఉన్నప్పటికీ పర్వావరణ కార్యక్రమాల పేరుతో చైనాకు డాలర్లు అందిస్తోంది. అంతేగాదు రష్యన్ నియంత వ్లాదిమర్ పుతిన్ అత్యంత సన్నిహితమైన బెలారస్‌కి కూడా సాయం అందించాం. అలాగే క్యూబాకి కూడా సాయం అందించాం. " అంటూ విరుచుకుపడ్డారు నిక్కీ హేలీ. ఈ నేపథ్యంలో అమెరికా విదేశాంగ విధానంలో మార్పులు రావాల్సిన అవసరం ఉందని ఆమె నొక్కి చెప్పారు. కేవలం అధ్యక్షుడు జో బైడెన మాత్రమే కాదు ఇరు పార్టీల అధ్యక్షులు దశాబ్దాలుగా విదేశీ సాయం విషయంలో ఇలాగే కొనసాగారు. వారంతా మా సహాయన్ని స్వీకరించే దేశాల ప్రవర్తనను పరిగణలోకి తీసుకోలేదన్నారు. తాను అధికారంలోకి వస్తే అమెరికా వ్యతిరేక దేశాలకు సాయం చేసి డాలర్లను వృధా చేయనని చెప్పారు. మన ప్రజలు కష్టపడి సంపాదించిన సొమ్మును అలాంటి దేశాలకు నిధులుగా అందించేదే లేదని తెగేసి చెప్పారు నిక్కీ హేలీ. (చదవండి: పాపం శ్రీలంక.. తిందామంటే జనాలకు తిండి లేదు.. ఇక ఎన్నికలు ఎలా?) -
అధ్యక్ష బరిలో వివేక్ రామస్వామి.. ‘అమెరికా ఈ పరిస్థితికి చరమగీతం పాడదాం’
వాషింగ్టన్: భారతీయ మూలాలున్న అమె రికన్ యువ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ఆ దేశ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నారు. నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం బరిలో నిలిచిన భారతీయ మూలాలున్న రెండో భారతీయుడు వివేక్ కావడం విశేషం. 37 ఏళ్ల వివేక్ తల్లిదండ్రులు గతంలో కేరళ నుంచి అమెరికాకు వలసవచ్చారు. డొనాల్డ్ ట్రంప్‌కు పోటీగా దక్షిణ కరోలినా మాజీ గవర్నర్, ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఇటీవలే పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీపడుతున్నట్లు ప్రకటించి ప్రచారం మొదలుపెట్టడం తెల్సిందే. ‘అమెరికాను మళ్లీ అగ్రస్థానంలో నిలబెట్టేందుకు కృషిచేస్తా. అంతకుముందు మనం అమెరికా గొప్పదనాన్ని మరోసారి పునశ్చరణ చేసుకుందాం. చైనా ఆధిపత్యం వంటి సవాళ్లను అమెరికా ఎదుర్కొంటోంది. అమెరికా సార్వభౌమత్వాన్ని చైనా ఉల్లంఘిస్తోంది. ఒక వేళ రష్యా నిఘా బెలూన్ వచ్చి ఉంటే కూల్చి వెంటనే ఆంక్షలు విధించేవాళ్లం. చైనా విషయంలో ఆంక్షలు ఎందుకు విధించలేకపోయాం?. ఎందుకంటే ఆధునిక ప్రపంచంలో ఉత్పత్తుల కోసం చైనాపై మనం అంతలా ఆధారపడ్డాం. ఆర్థికంగా ఇలా మరో దేశంపై ఆధారపడే పరిస్థితికి చరమగీతం పాడదాం’ అని ఫాక్స్‌న్యూస్ ప్రైమ్‌టైమ్ షో సందర్భంగా వివేక్ వ్యాఖ్యానించారు. వివేక్ 2014లో రోవంట్ సైన్సెస్‌ను స్థాపించారు. హెల్త్‌కేర్, టెక్నాలజీ సంస్థలను స్థాపించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. 2022లో స్ట్రైవ్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థనూ నెలకొల్పారు. అధ్యక్ష అభ్యర్థిగా బరిలో దిగాలంటే ముందుగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్‌లలో ఎవరో ఒకరు రిపబ్లిక్ పార్టీలో పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా ప్రైమరీ ఎన్నికల్లో నెగ్గాలి. వచ్చే ఏడాది జనవరిలో ఈ ప్రక్రియ మొదలుకానుంది. అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్ ఐదో తేదీన జరుగుతాయి. 2016లో బాబీ జిందాల్, 2020లో కమలాహ్యారిస్, ఈసారి నిక్కీ హేలీ తర్వాత అధ్యక్ష ఎన్నికలకు దిగిన నాలుగో ఇండో–అమెరికన్ వివేక్ రామస్వామికావడం విశేషం. -
75 ఏళ్లు దాటితే యోగ్యతా పరీక్షలు పెట్టాలి: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా పోటీ పడుతున్న వారిలో 75 ఏళ్ల వయసుకు పైబడి ఉంటే వారికి ఎంతవరకు ఆ పదవికి యోగ్యత ఉందో అమెరికన్లు తప్పనిసరిగా చూడాలని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ అభిప్రాయపడ్డారు. దేశ రాజకీయాల్లోకి కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరం ఉందన్నారు. ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ వాషింగ్టన్లో ఎందరో రాజకీయ నాయకులకు వయసు మీదపడిందన్నారు. కాంగ్రెస్‌కి ఎన్నికవాలంటే వయసు పరిమితి విధించాల్సిన ఆవశ్యకత ఉందని హేలీ అన్నారు. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైన 75 ఏళ్లకు పైబడిన వారికి యోగ్యతా పరీక్షలు నిర్వహించాలని కొత్త ప్రతిపాదన చేశారు. మరోవైపు హేలీ అభిప్రాయాలను వైట్ హౌస్ కొట్టిపారేసింది. ఇప్పటికే అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతూ ఉండడం, వారి వయసు 75 దాటిపోవడంతో హేలీ చేసిన ప్రతిపాదనపై విమర్శలు మొదలయ్యాయి. ఇలాంటి వ్యాఖ్యలు, విమర్శలు, దాడులు గతంలో కూడా చూశామని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్ పియరే అన్నారు. -
అమెరికా అధ్యక్ష రేసులో నిమ్రత నిక్కీ రాంధవా హేలీ
వాషింగ్టన్: అగ్రరాజ్యం అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన మహిళ నిలవబోతోంది. నిక్కీ హేలీ 2024లో జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే రిపబ్లికన్ తరపున నామినేషన్ కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో వీళ్ల అధ్యక్ష అభ్యర్థిత్వంపై పోటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సౌత్ కరోలినా మాజీ గవర్నర్, ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి అయిన హేలీ, 2024 రిపబ్లికన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇక్కడో విశేషం ఏంటంటే.. 2024 ఎన్నికల కోసం ట్రంప్‌కు తాను ఎట్టిపరిస్థితుల్లో పోటీదారురాలిని కాబోనని ఆమె రెండేళ్ల కిందట ప్రకటించారు. తాజాగా ఆమె తన నిర్ణయాన్ని మార్చుకుని బరిలో దిగేందుకు సిద్ధం అవుతుండడం గమనార్హం. నిక్కీ హేలీ, నేనే నిక్కీ హేలీ, నేనే అధ్యక్ష రేసులో ఉన్నాను తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారామె. ఇదిలా ఉంటే జో బైడెన్‌పై ఆమె కొంతకాలంగా విమర్శలు చేస్తూనే.. అధ్యక్ష పదవి పోటీ చేస్తారా? అనే ప్రశ్నకు మాత్రం దాటవేత ధోరణి ప్రదర్శిస్తూ వచ్చారు. ఇప్పుడు నాయకత్వం ద్వారా రిపబ్లికన్ పార్టీని మళ్లీ గద్దెనెక్కించడం తన అభిమతమని ప్రకటించారు. Get excited! Time for a new generation. Let’s do this! 👊 🇺🇸 pic.twitter.com/BD5k4WY1CP — Nikki Haley (@NikkiHaley) February 14, 2023 నిక్కీ హేలీ అలియాస్ నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. ఆమె పూర్వీకులది పంజాబ్. పుట్టినప్పుడు ఆమె పేరు నిమ్రత నిక్కీ రాంధవా హేలీ. అమె దక్షిణ కరోలినాలో భారతీయ పంజాబీ సిక్కు తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె తండ్రి అజిత్ సింగ్ రాంధవా, తల్లి రాజ్ కౌర్ రాంధవా. వాళ్లు అమృత్సర్ నుంచి అమెరికాకు వలస వచ్చారు. అమె తండ్రి గతంలో పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్, తల్లి ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయ పట్టా పొందారు. 51 ఏండ్ల నిక్కీ హేలీ తొలి నుంచి రిపబ్లికన్ పార్టీలోనే ఉన్నారు. 2004లో తొలిసారి ఎన్నికల్లో విజయం సాధించారు. 2008లో రెండోసారి గెలుపొందారు. 2010లో కాలిఫోర్నియా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. గతంలో సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా పని చేసిన నిక్కీ హేలీ.. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా సేవలందించారు. సౌత్ కాలిఫోర్నియా గవర్నర్‌గా నియమితురాలైన తొలి మహిళగా ఆమె రికార్డు సాధించారు. ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని ముందుగానే ప్రకటించినా.. అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో నిక్కీ హేలీ ఓ అడుగు ముందుకేశారు. ట్రంప్, నిక్కీ హేలీతోపాటు అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ నుంచి ఫ్లోరిడా గవర్నర్ రాన్ డెస్సెంటీస్, మాజీ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ తదితరులు పోటీ పడే అవకాశాలున్నాయి. నవంబర్ 5, 2024న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా: నిక్కీ హేలీ
వాషింగ్టన్: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలుస్తానని ప్రముఖ భారతీయ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీ(51) ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానన్నారు. ఈ వారంలోనే ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఆమె విడుదల చేసే అవకాశం ఉందని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇప్పటి వరకు రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష బరిలో ఉన్నట్లు ప్రకటించారు. ఎన్నికల ప్రచారాన్ని రెండు నెలల క్రితమే ప్రారంభించారు. తాజా పరిణామంతో తన మాజీ బాస్ ట్రంప్‌కు ఆమె ఏకైక ప్రత్యర్థిగా నిలువనున్నారు. నిక్కీ హేలీ సౌత్ కరోలినాకు రెండు పర్యాయాలు గవర్నర్ గాను, ఐరాసలో అమెరికాలో రాయబారిగాను పనిచేశారు. ట్రంప్ మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేసిన పక్షంలో బరిలో ఉండబోనంటూ గతంలో ప్రకటించిన హేలీ మనసు మార్చుకున్నారు. నిక్కీ హేలీ అసలు పేరు నిమ్రత నిక్కీ రన్‌ధావా హేలీ. ఈమె తల్లిదండ్రులు అజిత్ సింగ్ రన్‌ధావా, రాజ్ కౌర్ రన్‌ధావా. పంజాబ్ అగ్రికల్చర్ వర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసే అజిత్ సింగ్ కుటుంబంతో కలిసి 1960ల్లో కెనడాకు, అక్కడి నుంచి అమెరికాకు చేరారు. -
నిక్కీ హేలీ ఏం చేస్తున్నారు; మరేం పర్లేదు!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పీఠం కైవసం చేసుకునే దిశగా డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ దూసుకుపోతున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతగానో ఆశలు పెట్టుకున్న జార్జియా, నెవెడాలోనూ ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దీంతో మరోసారి అమెరికా పగ్గాలు చేపట్టాలనుకున్న ట్రంప్ ఆశలకు గండిపడినట్లే కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఓటమి భయంతో అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్న ఆయన, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ డెమొక్రాట్లపై ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, ట్రంప్ అనుకూల వర్గం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అక్కడ కూడా చేదు ఫలితమే ఎదురైంది. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభిమానులు, ట్రంప్ మద్దతుదారులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ట్రంప్ ఒంటరిగా పోరాడుతున్నారని, మిగిలిన రిపబ్లికన్లు ఎందుకు మాట్లాడటం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ట్వీట్ల మోత ఈ క్రమంలో ట్రంప్ తనయుడు ట్రంప్ జూనియర్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ. ‘‘ప్రతి ఒక్కరు గమనించాల్సిన అంశం ఇది! ఎవరు గట్టిగా పోరాడుతున్నారు.. ఎవరు పక్కన కూర్చుని చోద్యం చూస్తున్నారు? దశాబ్దాల కాలంగా రిపబ్లికన్లు వీక్‌గానే ఉన్నారు. వామపక్షం ఇలాంటి పనులు చేసేందుకు వారు అనుమతినిచ్చారు. ఇప్పటికైనా ఆ ట్రెండ్‌కు స్వస్తి పలకండి’’అంటూ విరుచుకుపడ్డారు. ఇందుకు స్పందనగా.. ‘‘గొప్పలు చెప్పుకొనే సోకాల్డ్ కురువృద్ధ పార్టీ(జీఓపీ- రిపబ్లికన్ పార్టీ) భవిత్యం ఏమిటి? నిక్కీ హేలీ ఏం చేస్తున్నారు’’అంటూ ఓ నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇందుకు బదులుగా.. ‘‘2024 జీఓపీ ఆశావహుల వైఫల్యం స్పష్టంగా కనబడుతోంది. పోరాటం చేయడానికి, తామేంటో నిరూపించుకోవడానికి వారికి సరైన వేదిక ఉంది. కానీ వాళ్లు మీడియా మూకదాడికి భయపడుతూ వెనక్కి తగ్గుతున్నారు. అయినా మరేం పర్లేదు... డొనాల్డ్ ఒంటరిగానే పోరాడతారు, ఎప్పటిలాగానే వాళ్లు ఊరికే చూస్తూ కూర్చుంటారు’’అంటూ ట్రంప్ జూనియర్, తన తండ్రి ట్రంప్ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్‌గా పనిచేసిన నిక్కీ హేలిని ఉద్దేశించి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. (చదవండి: పాపం ట్రంప్.. కోర్టులో కూడా ఓటమే) కాగా ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నిక్కీ హేలీ, 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థిత్వ బరిలో నిలవనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. ట్రంప్ పాలనా యంత్రాంగంలో కేబినెట్ ర్యాంక్ దక్కించుకున్న తొలి ఇండో- అమెరికన్‌గా గుర్తింపు దక్కించుకున్న ఆమె, ట్రంప్ తరఫున సుడిగాలి ప్రచారం నిర్వహించారు. ఇక కౌంటింగ్‌లో అక్రమాలపై ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో.. ‘‘ కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా సాగాలి. ఇందుకు ప్రెసిడెంట్ ట్రంప్, అమెరికా ప్రజలు అన్ని విధాల అర్హులు. చట్టాన్ని గౌరవించాలి. అంతిమంగా న్యాయమే గెలుస్తుందని మాకు పూర్తి విశ్వాసం ఉంది’’అంటూ ఆమె ట్వీట్ చేశారు. The total lack of action from virtually all of the “2024 GOP hopefuls” is pretty amazing. They have a perfect platform to show that they’re willing & able to fight but they will cower to the media mob instead. Don’t worry @realDonaldTrump will fight & they can watch as usual! — Donald Trump Jr. (@DonaldJTrumpJr) November 5, 2020 -
చైనాతోనే అమెరికాకు ముప్పు: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రచారంలో భాగంగా చైనాతోనే అగ్రరాజ్యం అమెరికాకు నంబర్ వన్ ముప్పని భారత్-అమెరికా రిపబ్లికన్ రాజకీయ నాయకురాలు నిక్కీహేలీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తరపున భారత్-అమెరికా మాజీ రాయబారి హేలీ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా యుద్ధ భూమియైన ఫిలడెల్పియాలో ఇండియన్ వాయిసెస్ ఫర్ ట్రంప్ పేరుతో శనివారం ఏర్పాటు చేసిన సభలో హేలీ మాట్లాడుతూ... బీజింగ్, అమెరికా మేధో శక్తిని దొంగలించకుండా ట్రంప్ చూశారన్నారు. ట్రంప్ చైనాను దృష్టిలో పెట్టుకోవడం వల్లే డ్రాగన్ ఉచ్చులో అమెరికా పడలేదన్నారు. ప్రస్తుతం చైనా నుంచి అమెరికాకు తీవ్ర స్థాయిలో జాతీయ భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. చైనాతో జరిగిన ఒప్పందంలో ట్రంప్ ఉత్తమైన వాణిజ్య ఒప్పందం పొందడమే కాకుండా, మేధో సంపత్తితో చైనాను దృష్టిలో పెట్టుకున్నారని హేలీ వ్యాఖ్యానించారు. (చదవండి: షాకింగ్: బైడెన్‌ని హత్యచేయాలనుకున్నాడు) ప్రస్తుతానికి చైనా మన మేధో శక్తిని దొంగలించకుండా చూసినా.. భవిష్యత్తులో మనమంతా చైనాకు జవాబుదారితనంగా ఉండొచ్చని ఆమె హెచ్చరించారు. అయితే కరోనా వైరస్ కారణంతో పాటు, ఇండో పసిఫిక్, హాంకాంగ్, వాణిజ్య ఒప్పందాల కారణంగా చైనా-అమెరికా సంబంధాలు క్షీణించాయి. అనంతరం హేలీ డెమొక్రాటిక్ ప్రెసిడెంట్ అభ్యర్థి జో బిడెన్‌పై ఆమె విరుచుకుపడ్డారు. అదే విధంగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరిపాలనపై కూడా ఈ సందర్బంగా విమర్శలు గుప్పించారు. ఒబామా పరిపాలన ఉగ్రవాదానికి పోషణగా ఉందని ఆమె ఆరోపించారు. ‘బిడెన్ ఆధ్వర్యంలోని గత పాలనలో మిలియన్ డాలర్లతో నిండిన విమానాలను ఒబామా ఉగ్రవాదాని పోషించేందుకు స్పాన్సర్ చేశారన్నారు. ఆ నగదుతో యెమెన్, లెబనాన్, సిరియా, ఇరాక్ అంతటా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 3న అమెరికాలో అధ్యక్షలు ఎన్నికలు జరగనున్నాయి. (చదవండి: సరిహద్దు సమస్యను గమనిస్తున్నాం!) -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆ ఇద్దరు..
వాషింగ్టన్ : ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎంతో ఉత్కంఠ రేపుతున్నాయి. నవంబర్ 3న జరిగే ఈ ఎన్నికల్లో ఓ వైపు అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్, మరోవైపు డెమోక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ పోటీపడుతున్నారు. అయితే ప్రధాన పోటీదారులు వీరిద్దరూ కాగా.. భారతీయ మూలాలున్న ఇద్దరు మహిళలు ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తున్నారు. ట్రంప్, బైడెన్ సంగతి అట్ల ఉంచితే అమెరికా ఎన్నికలు అనగానే వారిద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హ్యారిస్ కాగా మరోకరు ట్రంప్ టీంలో ముఖ్యులు నిక్కీ హేలీ. భారతీయ అమెరికన్లు అయిన వీరిద్దరూ అమెరికా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు ఈ మహిళలు ఇద్దరూ సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. (గుండె పగిలింది : కమలా హారిస్) కమలాను ఉపాధ్యక్ష పదవికి నామినేట్ చేస్తూ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు అందుతున్నాయి. అంతేకాక ట్రంప్‌పై ఆధిపత్యం చెలాయించేందుకు డెమోక్రాట్స్ ఎంచుకున్న వ్యూహంగా కమలాను విశ్లేషిస్తున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో భారతీయుల ఓటర్లను ఆకర్షించేందుకే జో బైడెన్ వ్యూహత్మక ఎత్తుగడ వేశారన్న వాదనా వినిపినిస్తోంది. మరోవైపు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం కమలా ఎన్నికను బలపరుస్తూ డెమోక్రాట్స్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ విభృంభణ కొనసాగుతున్నా.. ప్రచార హోరు మాత్రం ఏమాత్రం తగ్గడంలేదు. ట్రంప్‌నే లక్ష్యంగా చేసుకున్న కమలా.. తనదైన శైలిలో విమర్శనాస్త్రాలను సందిస్తున్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్న కమలా హ్యారీస్.. పోరు ట్రంప్‌కు, కమలాకా అనే రీతిలో విరుచుకుపడున్నారు. ఇక 78 ఏళ్ల బైడెన్‌కే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భావిస్తుండగా.. అనారోగ్యం కారణాల కారణంగా ఆయన మధ్యలోనే పదవి నుంచి తప్పుకుండా అమెరికా అధ్యక్ష పీఠం కమలా హ్యారీస్కే దక్కుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. ఇక రిపబ్లిక్ పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ. అమెరికా రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తురాలు. ఐక్యరాజ్య సమితిలోనూ అమెరికా రాయబారిగా కూడా నియమితులైయ్యారు. అంతకుముందు ఆమె దక్షిణ కరోలినా గవర్నర్‌గా కూడా విధులు నిర్వర్తించారు. ట్రంప్ బృందలో ముఖ్య పాత్ర పోషించే నిక్కీ అంతర్జాతీయ అంశాల్లో భారత్‌కు తన మద్దతను ఎప్పుడూ ప్రకటిస్తూనే ఉంటారు. ఇటీవల భారత్-చైనా మధ్య నెలకొన్న గల్వాన్ లోయ వివాదం నేపథ్యంలో చైనాకు చెందిన 59 యాప్స్‌ను నిషేధిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల నిక్కీ బహిరంగంగా హర్షం వ్యక్తం చేశారు. క్లిష్ట సమయంలోనూ భారత్‌కు మద్దతుగా నిలిచారు. ఇక ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించే ఆమెకు ట్రంప్ పెద్ద పీఠే వేస్తున్నారు. (నా తండ్రి టర్బన్ ధరించే వారు) రిపబ్లిక్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో నిక్కీ పేరును చేర్చారు. జాతీయ అంశాలపై గట్టిపట్టు పెంచుకున్న ఆమె.. మంచి వక్తగా గుర్తింపుపొందారు. అయితే డెమోక్రాట్స్ అనుహ్యంగా ఉపాధ్యక్ష పదవికి కమలాను నామినేట్ చేయడంతో.. ట్రంప్ వ్యూహత్మకంగా నిక్కీని తెరపైకి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒకవేళ రానున్న ఎన్నికల్లో మరోసారి ట్రంప్ గెలిస్తే ఉపాధ్య పదవిని నిక్కీకి కట్టబెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమెరికా రాజకీయాల్లో ఇద్దరు భారతీయు మూలాలున్న మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరికి ఉపాధ్యక్ష పదవి దక్కినా రానున్న రోజుల్లో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
అవన్నీ అబద్దాలే: నిక్కీ హేలీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న వేళ రిపబ్లికన్ పార్టీ నేత, ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ప్రతిపక్ష డెమొక్రాట్లపై విమర్శల వర్షం కురిపించారు. అమెరికాను జాత్యహంకార దేశంగా అభివర్ణించడం డెమొక్రాట్లకు ఓ ఫ్యాషన్‌గా మారిందంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వాళ్లు చెబుతున్నవన్నీ అబద్దాలేనని, వలసదారుల కుమార్తెనైన తనకు అమెరికా ప్రజలు గవర్నర్‌గా అవకాశమిచ్చారంటూ కృతజ్ఞతా భావం చాటుకున్నారు. ఐదేళ్ల క్రితం పరిస్థితులు వేరుగా ఉండేవని, తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నింటినీ చక్కదిద్దామని చెప్పుకొచ్చారు.(చదవండి: అంతకంటే పీడకల మరొకటి ఉండదు: ట్రంప్) కాగా నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి రిపబ్లికన్ల తరఫున బరిలో దిగనున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన గురువారం వెలువడనుంది. ఈ నేపథ్యంలో సోమవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో మాట్లాడిన ఇండో- అమెరికన్ నిక్కీ హేలీ.. అమెరికాలో తమ కుటుంబానికి ఆదరణ లభించిన తీరును ప్రస్తావిస్తూ ప్రతిపక్షంపై నిప్పులు చెరిగారు. ‘‘నా వ్యక్తిగత జీవితం గురించి చెబుతాను. వలసదారుల కుమార్తెను అని చెప్పుకోవడానికి గర్వపడతాను. నా తల్లిదండ్రులు అమెరికాకు వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. నా తండ్రి టర్బన్ ధరించేవారు. మా అమ్మ చీర కట్టుకునే వారు. ఈ నలుపు, తెలుపు ప్రపంచంలో నేను ఓ బ్రౌన్ గర్ల్‌ను. తొలుత నా కుటుంబం ఇక్కడ వివక్షను ఎదుర్కొంది. ఎక్కడైనా ఇలాంటివి ఉంటాయి.(చదవండి: మరో నాలుగేళ్లు ట్రంప్‌కు అవకాశమివ్వండి) కానీ వాళ్లెపుడూ దాని కారణంగా దేశంపై ద్వేషం పెంచుకోలేదు. మా అమ్మ వ్యాపారవేత్తగా రాణించింది. మా నాన్న 30 ఏళ్లుగా ఓ ప్రతిష్టాత్మక కాలేజీలో పనిచేశారు. ఇక దక్షిణ కరోలినా ప్రజలు నన్ను.. ఆ రాష్ట్రానికి మొదటి మహిళా, మైనార్టీ గవర్నర్‌గా ఎన్నుకున్నారు. ఇంతకుముందు కంటే అమెరికా మరింత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రతీ ఒక్కరికి మెరుగైన సదుపాయాలు కల్పిస్తోంది. ఇవన్నీ డెమొక్రటిక్ పార్టీకి కనిపించడం లేదు. కేవలం అల్లర్లు, గొడవల గురించే వాళ్లు మాట్లాడతారు. అమెరికాను రేసిస్ట్ కంట్రీ అంటారు. కానీ అది అబద్ధం. అబద్దాలు చెప్పడం వాళ్లకు అలవాటుగా మారిపోయింది. అమెరికా పర్ఫెక్ట్ కాకపోవచ్చు. కానీ అలా మార్చేందుకు మేం అనుసరిస్తున్న విధానాలు పర్ఫెక్ట్. నిజం చెప్పాలంటూ మన జీవితంలోని అత్యంత చెత్త రోజున కూడా ఇక్కడ మనం జీవించగలం. పోయిన ప్రతి ప్రాణానికి మేం చింతిస్తున్నాం. నల్లజాతీయులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అయితే రాబోయే తరాల బాగు కోసం ఇప్పుడు ఎదువతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, బలాన్ని పెంచుకుంటూ ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరోసారి ట్రంప్‌నకు అవకాశమివ్వండి’’ అని విజ్ఞప్తి చేశారు. కాగా డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బిడెన్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలవగా.. ఆసియా(భారత్)- ఆఫ్రికా(జమైకా) మూలాలున్న కమలా హ్యారిస్ ఉపాధ్యక్ష పదవికి పోటీపడుతున్న విషయం తెలిసిందే.(చదవండి: చీకటి నుంచి వెలుగులోకి తీసుకువస్తాం: జో బిడెన్) -
‘యాప్‌ల బ్యాన్ అభినందనీయం’
వాషింగ్టన్: గల్వాన్ వ్యాలీ ఘర్షణల నేపథ్యంలో భారత్ టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ చర్యను ఐక్యరాజ్యసమితి మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ప్రశంసించారు. చైనా దూకుడుకు భారత్ భయపడలేదని తెలిపారు. ఈ క్రమంలో నిక్కీహేలీ ‘టిక్‌టాక్‌తో సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించడం అభినందనీయం. చైనా దూకుడుకు భారత్ భయపడలేదు’ అంటూ ట్వీట్ చేశారు. దేశ సార్వభౌమాధికారానికి, ఐక్యతకు, భద్రతకు చైనా యాప్‌లతో ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం ఆ దేశ యాప్‌లను నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో కూడా సమర్థించారు. చైనా యాప్‌లను భారత్ నిషేధించడాన్ని తాము స్వాగతిస్తామని.. ఈ నిర్ణయం భారత సమగ్రత, జాతీయ భద్రతకు ఉపకరిస్తుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. (టిక్‌టాక్‌కు మరో ఎదురుదెబ్బ..) -
పాక్‌కు ఒక్క డాలర్ కూడా ఇవ్వకూడదు
వాషింగ్టన్ : ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చినంత కాలం పాకిస్తాన్‌కు అమెరికా ఎటువంటి సహాయం చేయకూడదని ఐరాసలో అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ‘ ఉగ్రవాదులకు ఎన్నో ఏళ్లుగా పాక్ ఆశ్రయమిస్తోంది.ఇలా చేసినంత కాలం ఇస్లామాబాద్‌కు అమెరికా నుంచి ఒక్క డాలర్ కూడా ఆర్థిక సహాయం అందదు. సహాయం చేసినందుకు, దయా గుణానికి ప్రతిఫలంగా అమెరికా కేవలం ఉగ్రవాదాన్ని రూపుమాపాలని మాత్రమే కోరుతోంది. కానీ అమెరికా, ఐరాస జోక్యాన్ని పాకిస్తాన్ వ్యతిరేకిస్తూనే ఉంది’ ఓ పత్రికా వ్యాసంలో నిక్కీ హేలీ రాసుకొచ్చారు. పాక్ మిలిటరీకి ఎక్కువ శాతం నిధులు.. అమెరికా రక్షణను బలోపేతం చేసేందుకు ‘స్టాండ్ ఫర్ అమెరికా నౌ’ అనే నూతన పాలసీ గ్రూపును నిక్కీ హేలీ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. ‘ 2017లో పాకిస్తాన్‌కు సుమారు 1 బిలియన్ డాలర్ల నిధులు అమెరికా సమకూర్చింది. ప్రపంచ దేశాల్లో అమెరికా సాయం పొందిన వాటిలో పాక్ ఆరో స్థానంలో ఉంది. అమెరికా అందించిన ఆర్థిక సహాయంలో ఎక్కువ శాతం నిధులు పాక్ తమ మిలిటరీకి వినియోగించింది. ప్రజల కోసం రోడ్లు, ఎనర్జీ ప్రాజెక్టులకు మిగిలిన మొత్తాన్ని ఉపయోగించింది. ఇంత చేసినా.. ఐరాసలో ప్రధాన అంశాలపై జరిగిన ఓటింగ్‌లో పాక్ అమెరికాను 76 శాతం వ్యతిరేకించింది. అంతేకాదు ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్.. ఆఫ్గనిస్తాన్‌లో మోహరించిన అమెరికా దళాలను హతమార్చేందుకు పరోక్షంగా సహాయం అందించింది. వారికి కృతఙ్ఞత లేదు’ అని పాక్ తీరును ఎండగట్టారు. పాకిస్తాన్‌ను కట్టడి చేసేందుకు అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై నిక్కీ ప్రశంసలు కురిపించారు. అయితే ఉగ్రవాదులను అంతమొందించేందుకు అమెరికా ఇంకాస్త కఠినంగా వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. కాగా పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న జైషే ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా భారత వాయుసేన మంగళవారం తెల్లవారుజామున మెరుపు దాడులు చేసిన సంగతి తెలిసిందే. 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్-2 విజయవంతంగా పూర్తి చేసి...పాక్‌కు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏవిధంగా మారతాయోనన్న అంశం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. -
నిక్కీ అడుగులు ఎటువైపు ?
ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి, భారతీయ అమెరికన్ నిక్కీ హేలీ ఆకస్మికంగా రాజీనామా చేయడం పలు ఊహాగానాలకు దారి తీస్తోంది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలకు నెలరోజుల ముందు ఆమె రాజీనామా చేయడం ట్రంప్ సర్కార్‌కి దెబ్బేనన్న భావన వ్యక్తమవుతోంది. రాజీనామా అనంతరం ప్రెస్ మీట్లో నిక్కీ హేలీ ట్రంప్‌ను పల్లెత్తు మాట అనలేదు. పైపెచ్చు 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఆయనకే తాను మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో నిక్కీ హేలీ పోటీపడతారన్న ఊహాగానాలకు ఆమె తెరదించుతూ తాను ట్రంప్ తరఫున ప్రచారం చేస్తానని మాత్రమే ఆమె వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమె పోటీ పడినా, లేకపోయినా ట్రంప్‌కు రాజకీయంగా ముప్పుగా మారుతారన్న విశ్లేషణలైతే వినిపిస్తున్నాయి. రాజకీయ అడుగులు ఎటు ? నిక్కీ హేలీ అమెరికా రాజకీయాల్లో తనకంటూ సొంతంగా ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. భారత వలసదారుల కుటుంబంలో పుట్టి, మైనార్టీగా ఉన్నప్పటికీ 2010లో దక్షిణ కేరొలినాకు తొలి మహిళా గవర్నర్‌గా ఎన్నికయ్యారు. అతి పిన్న వయసులోనే గవర్నర్ పదవిని చేపట్టిన మహిళగా రికార్డు సృష్టించారు. 2014లో తిరిగి గవర్నర్ పదవి చేపట్టారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరేవరకు గవర్నర్‌గానే ఉన్నారు. అమెరికా రాయబారిగా ఆమె అనుసరించిన విదేశీ విధానం విమర్శకుల ప్రశసంల్ని సైతం పొందింది . ట్రంప్ ప్రభుత్వంలో రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ వైట్‌హౌస్‌తో వ్యవహారాల్లో విచక్షణ చూపిస్తూ, అమెరికా విదేశాంగ విధానానికి ఒక గుర్తింపు తెచ్చిన మహిళగా పేరు సంపాదించారు.‘‘రిపబ్లికన్ పార్టీలో నిక్కీ హేలీ ఒక రైజింగ్ స్టార్. అలాంటివారు ఎప్పటికైనా ట్రంప్‌కి ముప్పుగానే మారతారు’’ అని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త మైక్ ముర్ఫీ అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్‌పార్టీ అభ్యర్థుల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన క్రిస్టిన్మాథ్యూస్ కూడా హేలీ తన సొంత ప్రయోజనాల కోసమే రాయబారి పదవికి రాజీనామా చేసినట్టు అంచనా వేశారు. ‘‘హేలీ అద్భుతమైన పనితీరుని కనబరిచారు. ఆమెకున్న పేరుప్రతిష్టలను పెంచుకున్నారు. ట్రంప్ పాలనాయంత్రాంగంలో హేలీలాంటి వ్యక్తి మరొకరు కనిపించరు. భవిష్యత్ రాజకీయ కోసమే ఆమె పదవి నుంచి తప్పుకున్నారు’’అని మాథ్యూస్ వ్యాఖ్యానించారు.. డెమొక్రాట్లు కూడా హేలీ పనితీరుని అభినందించిన సందర్భాలు ఉన్నాయి. రాజకీయంగా ఆమె అడుగులు ఎటు వైపు వేస్తారన్న చర్చ డెమొక్రాటిక్ పార్టీలోకూడా సాగుతోంది. ట్రంప్‌తో ఢీ కొనాలంటే 2020లో అధ్యక్ష బరిలోకి దిగాలని, 2024 వరకు వేచి చూస్తే ఇప్పుడున్న పేరుని హేలీ కాపాడుకోవడం కష్టమన్న అభిప్రాయమూ వినిపిస్తోంది. గత ఎన్నికల్లో ట్రంప్‌తో ఢీ అంటే ఢీ గత అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో నిక్కీ హేలీ ట్రంప్‌కు మద్దతు ఇవ్వలేదు. ఫ్లోరిడా సెనేటర్ మార్కో రూబియోకు మద్దతుగా నిలవడమే కాదు, ట్రంప్‌ను తరచూ విమర్శించే వారు. ఆయన మాటల్ని తిప్పికొడుతూ ఉండేవారు. అయినప్పటికీ హేలీ సొంత రాష్ట్రంలోని ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ గెలిచారు. ట్రంప్ అధ్యక్షుడయ్యాక లైంగిక ఆరోపణలు వచ్చిన సమయంలో కూడా ఆమె బాధితుల పక్షానే మాట్లాడారు. ట్రంప్ ప్రభుత్వంలో చేరిన తర్వాత కూడా హేలీ ట్రంప్‌కు వ్యతిరేకమనే ఆరోపణలు కూడా వచ్చాయి. ట్రంప్ వ్యవహారశైలిపై ఆరోపణలు గుప్పిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో పేరు లేకుండా ప్రచురితమైన∙వ్యాసం నిక్కీ హేలీ రాసినదేనన్న ప్రచారం కూడా జరిగింది. కానీ ఆమె దానిని ఖండిస్తూ అధ్యక్షుడిని సవాల్చేయాల్సి వస్తే నేరుగానే చేస్తానని చెప్పుకున్నారు. ఇలా మొదట్నుంచి ట్రంప్‌ను వ్యతిరేకిస్తూ వస్తున్న హేలీ భవిష్యత్‌లో కూడా రాజకీయంగా ఢీ కొడతారన్న అభిప్రాయమైతే వినిపిస్తోంది. అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా -
నిక్కీ హేలీ స్థానంలో ఇవాంకా ట్రంప్..?!
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా ప్రతినిధిగా ఉన్న నిక్కీ హేలీ రాజీనామా చేశారు. ఎలాంటి ముందస్తు ఊహాగానాలు లేకుండా ఆమె అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. అయితే నిక్కీ రాజీనామా తరువాత ఆమె స్థానంలో ఎవరూ వస్తారు అనే అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఇవాంకా ట్రంప్‌ని ఆ పదవిలో నియమిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగా ట్రంప్ కూడా సంకేతాలు వెలువరించారు. ‘నిక్కీ తర్వాత అలాంటి డైనమిక్ అంబాసిడర్ అయ్యే అర్హత ఇవాంకాకి ఉందనుకుంటున్నా. అయితే, నా కూతుర్ని ఎంపిక చేస్తే.. నాకు బంధుప్రీతి అని ఆరోపిస్తారేమో’ అంటూ ట్రంప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే ఈ వార్తల్ని ఇవాంకా కొట్టి పారేశారు. ‘ప్రస్తుతం నేను వైట్ హౌస్‌లో చాలా గొప్ప వారితో కలిసి పనిచేస్తున్నాను. నిక్కీ హేలీ చాలా గొప్ప వ్యక్తి. ఆమె స్థానంలో అధ్యక్షుడు మరో గొప్ప వ్యక్తిని నియమిస్తారని నమ్ముతున్నాను. అయితే ఆ వ్యక్తి నేను మాత్రం కాదం’టూ ఇవాంకా ట్రంప్ తెలిపారు. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ అయిన నిక్కీ హేలీ.. 2020 ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచేందుకే రాజీనామా చేసి ఉంటారనే ప్రచారం జోరందుకుంది. అయితే, ఆ వాదనను నిక్కీ హేలీ కొట్టిపారేశారు. ‘నా జీవితంలో ఇవి ఉన్నతమైన రోజులు. నా తర్వాత అంబాసిడర్‌గా వచ్చేవారికి అన్నీ అనుకూలంగా ఉండేలా చూడడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. 2020లో అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో లేను. ట్రంప్‌కే ప్రచారం చేస్తా’ అని నిక్కీ హేలీ ప్రకటించారు. కానీ, తాను ఎందుకు రాజీనామా చేశారో మాత్రం ఆమె చెప్పలేదు. -
అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా
వాషింగ్టన్ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి పదవికి నిక్కీ హేలీ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆమె రాజీనామాకు ఆమోదం కూడా తెలిపినట్టు సమాచారం. ఇండియన్ అమెరికన్ అయిన నిక్కీ హేలీని 2016 నవంబర్‌లో ఐరాసకు అమెరికా రాయబారిగా ట్రంప్ నియమించారు. ఈ పదోన్నతితో అమెరికా యంత్రాంగంలో కేబినెట్ స్థాయి పదవికి నియమితురాలైన తొలి ఇండో అమెరికన్‌గా నిక్కీ పేరు మారుమోగింది. హేలీ గతంలో సౌత్ కరోలినా గవర్నర్‌గా కూడా పనిచేశారు. కాగా, అమెరికా కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం ఓవల్‌లోని కార్యాలయంలో తన స్నేహితురాలు నిక్కీ హేలీతో కలిసి ఓ ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్టు ట్రంప్ ట్విట్ చేశారు. Big announcement with my friend Ambassador Nikki Haley in the Oval Office at 10:30am. — Donald J. Trump (@realDonaldTrump) October 9, 2018 -
అమెరికా వింత వైఖరి
ఏ దేశాధినేత అయినా, వారి దూత అయినా తాను అడుగుపెట్టిన దేశం గురించి, అక్కడి నేతల గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతారు. ఆ దేశాన్ని ప్రసన్నం చేసుకుని వాణిజ్యం పెంపొందించుకుంటే స్వదేశంలో ఆర్థికస్థితి మెరుగుపడటంతోపాటు ఉత్పత్తి ఊపందుకుని, అందరికీ ఉద్యోగకల్పన సాధ్యమవుతుందని భావిస్తారు. మన దేశంలో రెండురోజులు పర్యటించిన అమెరికా దూత, ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ ఇందుకు భిన్నం. మన దగ్గర పాకిస్తాన్‌ను తూర్పారబడితే, అది ఉగ్ర దేశంగా మారుతున్నదని ఆరోపిస్తే చాలు...భారత్‌కు అది వీనులవిందు అవుతుందని, ఆ తర్వాత తాము కోరుకున్న రీతిలో ఆ దేశం వ్యవహరిస్తుందని ఆమెకు దృఢ విశ్వాసం ఉన్నట్టుంది. అందుకే పాకిస్తాన్ ఉగ్ర స్వర్గధామంగా మారిందని, ‘ఇప్పటి కైనా’ అది తన వైఖరి మార్చుకుంటుందని ఆశిస్తున్నామని నిక్కీ హేలీ చెప్పారు. పాకిస్తాన్– ఉగ్రవాదం విషయంలో ‘ఇప్పటికైనా...’ అనే మాట బిల్ క్లింటన్ కాలం నుంచి అమెరికా వల్లె వేస్తూనే ఉంది. దశాబ్దాలుగా అది పాకిస్తాన్‌కు లక్ష్మణరేఖలు గీస్తూనే ఉంది. కానీ క్రియకొచ్చేసరికి ఆ దేశానికి ఎప్పుడూ ఆర్థిక సాయం ఆగదు...ఆయుధాల అమ్మకం ఆగదు. ఇప్పుడు నిక్కీ హేలీ మరోసారి పాకిస్తాన్ గురించి మాట్లాడటానికి కారణం లేకపోలేదు. ఇరాన్నుంచి మనం చమురు కొనరాదని ఆదేశించడమే ఆమె పర్యటన వెనకున్న ప్రధాన ఉద్దేశం. ఇరాన్‌తో సంబంధాలపై భారత్ పునరాలోచన చేసుకోవాలని కూడా ఆమె సలహా ఇచ్చారు. అన్ని దేశాలూ నవంబర్ 4 కల్లా ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లను పూర్తిగా నిలిపేయాలని అమెరికా ఆశిస్తోంది! ఒక దేశంతో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను వదులుకోవాలని లేదా ఆ దేశం నుంచి ఫలానా సరుకులు కొనవద్దని హుకుం జారీ చేయడం మొరటుతనానికి పరాకాష్ట. అది అమెరికాకు పుష్కలంగా ఉన్నదని ఈ ప్రకటన చెబుతోంది. తమ సరిహద్దుల్లో ఉన్న దేశంతో దానికి సమస్యలుంటే, అలాంటి దేశానికి మనం ఆయుధాలు అమ్ముతుంటే వద్దని కోరడంలో తప్పేం లేదు. కానీ ఇరాన్ అమెరికాకు సరిహద్దు దేశం కాదు. పశ్చిమాసియాలో ప్రాబల్యం కోసం ఇరాన్‌తో సౌదీ అరేబియా పోటీ పడుతోంది. ఇరాన్ తిరుగులేని శక్తిగా ఎదిగితే తనకు ముప్పు కలుగు తుందని ఇజ్రాయెల్ భావిస్తోంది. సౌదీ, ఇజ్రాయెల్ తనకు అత్యంత సన్నిహిత దేశాలు గనుక వాటి ప్రయోజనాలు కాపాడటం కోసం ఇరాన్‌పై అమెరికా కత్తిగట్టింది. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరాన్‌తో మరో అయిదు దేశాలను కలుపుకొని కుదుర్చుకున్న అణు ఒప్పందాన్ని విపక్షంలో ఉండగా రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకే అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డోనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకొస్తే ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తానని ప్రకటించారు. చెప్పినట్టు గానే ఆ ఒప్పందం నుంచి వైదొలిగారు. అప్పటినుంచీ ఇరాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని, అవసర మైతే దానితో యుద్ధానికి దిగాలని అమెరికా కత్తులు నూరుతోంది. అణు ఒప్పందంలో ఇతర భాగస్వామ్య దేశాలైన రష్యా, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యూరప్ యూనియన్లు అమెరికా తీరును గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ ఒప్పందాన్ని గౌరవించి ఇరాన్‌తో కలిసి నడుస్తామని ప్రకటించాయి. అయినా అమెరికా ధోరణి మారలేదు. ఇరాన్‌ను దారికితెచ్చేందుకు తాను ఆర్థిక ఆంక్షలు విధించ డంతోపాటు మిగిలిన దేశాలు కూడా తనను అనుసరించాలని భావిస్తోంది. కానీ మన అవసరాలు, ప్రయోజనాలు పూర్తిగా వేరు. మన ఇంధన అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ఇందులో ఇరాక్, సౌదీ అరేబియాల తర్వాత స్థానం ఇరాన్‌ది. మనం దిగుమతి చేసుకునే చమురులో పదిన్నర శాతం ఇరాన్ సరఫరా చేస్తుంది. దీన్ని 25 శాతానికి పెంచుతామని మొన్న ఫిబ్రవరిలో ఇరాన్ అధ్యక్షుడు రౌహానీ భారత్ పర్యటించినప్పుడు మన దేశం హామీ ఇచ్చింది. ఆ తర్వాత మే నెలలో ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ఇరాన్‌తో అమెరికా తనంత తాను గిల్లికజ్జాలు తెచ్చుకోవటమేగాక...అందరూ గుడ్డిగా తనను అనుసరించాలని కోరడం తెంపరితనం కాకపోతే మరేమిటి? మనకు సరసమైన ధరకు చమురు అందిస్తున్నప్పుడు, ఆ మొత్తాన్ని సులభ వాయిదాల్లో తీర్చేందుకు వెసులుబాటు కల్పించినప్పుడు మనం ఇరాన్‌తో వ్యాపారబంధాన్ని ఎందుకు తెగతెంపులు చేసుకోవాలి? అందుకు బదులుగా ఆ దేశం ఇస్తున్న వెసులుబాట్లనే మీరూ కల్పించాలని ఇతర దేశాలపై ఒత్తిళ్లు తీసుకురావాలి. అమెరికా ఈ విషయంలో చూపుతున్న ప్రత్యామ్నాయం వింతగా ఉంది. ఇరాన్ నుంచి కొనే చమురును ఇకపై తనవద్ద కొనవచ్చునని ప్రతిపాదిస్తోంది. ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలను మాత్రమే అమలు చేస్తాం తప్ప వేరే దేశాలు విధించే ఆంక్షలను అనుసరించబోమని గత నెలలో విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చెప్పారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు నిక్కీ హేలీ ప్రత్యేకించి మన దేశం వచ్చారు. ఇరాన్ విషయంలోనూ, ఇతర అంశాల్లోనూ అమెరికా అనుసరిస్తున్న వైఖరి వల్ల మన దేశం మాత్రమే కాదు... మొత్తంగా ప్రపంచమే సంక్షోభంలో పడే స్థితి ఏర్పడింది. అసలే చమురు ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వివిధ దేశాలకు ఇరాన్ రోజుకు 24 లక్షల బ్యారెళ్ల చమురును ఎగుమతి చేస్తోంది. అమెరికా ఆంక్షల పర్యవసానంగా ఇందులో సగం ఎగుమతులు నిలిచిపోయినా చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. అప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ తలకిందులవుతాయి. ఇది చాలదన్నట్టు ట్రంప్ విదేశీ సరుకులపై ఎడాపెడా సుంకాలు విధిస్తూ భారీ వాణిజ్య యుద్ధానికి తెరతీశారు. వీసాల జారీపై రకరకాల ఆంక్షలు అమల్లోకి తెస్తున్నారు. అక్కడ విదేశీయులకు ఉపాధి దొరక్కుండా చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన దేశం స్వతంత్రంగా ఆలోచించి, స్వీయ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి. అమెరికా అయినా, మరొకరైనా మనల్ని ప్రభావితం చేయలే రని స్పష్టం చేయాలి. ఇరాన్‌పై అమెరికా సాగించదల్చుకున్న అధర్మ పోరాటాన్ని వ్యతిరేకించాలి. -
పాక్ ఉగ్ర స్వర్గధామమే: నిక్కీ హేలీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదులకు పాకిస్తాన్ స్వర్గధామంగా మారడాన్ని అమెరికా ఎంతమాత్రం సహించబోదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని పాకిస్తాన్ అధినాయకత్వానికి అమెరికా ఇప్పటికే స్పష్టం చేసిందన్నారు. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ఢిల్లీలో గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో హేలీ మాట్లాడారు. ‘ఉగ్రవాదుల ఏరివేత విషయమై గతంతో పోల్చుకుంటే పాకిస్తాన్‌తో అమెరికా ప్రభుత్వ వైఖరి మారింది. ఇప్పటికైనా పాకిస్తాన్ తన వైఖరిని మార్చుకుంటుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికాలు ప్రపంచానికి నాయకత్వం వహించాలని హేలీ ఆకాంక్షించారు. -
మత స్వేచ్ఛ అత్యంత ముఖ్యమైనది : నిక్కీ హేలీ
సాక్షి, న్యూఢిల్లీ : ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమితులైన తర్వాత నిక్కీ హేలీ తొలిసారిగా భారతదేశ పర్యటనకు వచ్చారు. రెండు రోజుల పాటు కొనసాగనున్న పర్యటన సందర్భంగా పలువురు భారత సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో ఆమె సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం భారత్‌కు చేరుకున్న నిక్కీ.. భారత్‌లో అమెరికా రాయబారి కెన్నెత్ జస్టర్‌తో కలిసి మొఘల్ చక్రవర్తి హుమాయున్ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారత్‌కు వస్తే తన సొంత ఇంటికి తిరిగి వచ్చిన భావన కలుగుతుందన్నారు. ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సైనిక సహకారం తదితర అంశాల్లో భారత్- అమెరికాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేయడమే తన పర్యటన లక్ష్యమని నిక్కీ పేర్కొన్నారు. ఎన్నో విషయాల్లో భారత్, అమెరికాలకు సారూప్యం ఉందని.. అందుకే రెండు దేశాల మధ్య స్నేహబంధం రోజురోజుకీ బలపడుతోందని ఆమె వ్యాఖ్యానించారు. మత స్వేచ్చకే అధిక ప్రాధాన్యం.. సంస్కృతీ సంప్రదాయాలకు భారత్ ఎంత విలువ ఇస్తుందో తెలుసుకోవడానికి హుమాయున్ సమాధి ఒక నిదర్శనమని నిక్కీ అన్నారు. చారిత్రక సంపదను కాపాడటం ప్రతీ ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు మనం అందించగలిగే గొప్ప కానుక వారసత్వ సంపదేనని ఆమె వ్యాఖ్యానించారు. భిన్నత్వంలో ఏకత్వం భారత్‌కు ఉన్న గొప్ప లక్షణమని కొనియాడారు. అన్ని హక్కుల కన్నామత స్వాతంత్ర్యపు హక్కు ఎంతో ముఖ్యమైనదిగా తాము భావిస్తామని నిక్కీ తెలిపారు. మత స్వేచ్ఛ ప్రాముఖ్యతను చాటి చెప్పేందుకు గురువారం పర్యటనలో భాగంగా వివిధ మతాలకు చెందిన పవిత్ర స్థలాలను ఆమె సందర్శించనున్నారు. -
నిక్కీ హేలీకి డల్లాస్‌లో ఘన సన్మానం
డల్లాస్ : ఐరాసలో అమెరికా రాయబారిగా ఉన్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి మే 23న ఇర్వింగ్‌లోని ఫోర్ సీసన్స్ హోటల్లో ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ సన్మాన సభలో విప్రో సంస్థ సీఈఓ అభిదాలి నీమచ్ వాల, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అర్లింగ్టన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ విస్తాస్ప్ కర్భరి, టోమ్స్ ఆటో గ్రూప్ అధినేత బాబ్ టోమ్స్ లతో పాటూ స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ సంస్థ అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ తమ సంస్థ ఆహ్వానం పై నిక్కీ హేలీ డల్లాస్‌కి విచ్చేయడం ఇది ఆరవ సారని గతంలో సౌత్ కరోలినా రాష్ట్ర ప్రతినిధిగాను, గవర్నర్ అభ్యర్థి గాను, గవర్నర్ గాను, మహాత్మా గాంధీ మెమోరియల్ శంకుస్థాపనకు ముఖ్య అతిథిగాను, ప్రస్థుతం అమెరికా రాయబారిగాను విచ్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. నిక్కీ హేలీ రాష్ట్ర ప్రతినిధి గాను, గవర్నర్ గాను, సౌత్ కరోలినా రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసి, రాష్ట్ర చరిత్ర లో మునుపెన్నడూ లేని విధంగా వేలాది ఉద్యోగాలను సృష్టించారని కొనియాడారు. అమెరికాలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులలో పార్టీలకు అతీతంగా ఇరువర్గాలను కలుపుకుపోయే రాజకీయ నాయకులు అవసరమని, అందులోనూ ముఖ్యంగా నేర్పరితనంతో పాటు ధైర్యం, ఓర్పుతో ఉన్న దేశభక్తి, దయాగుణం ఉన్నా అవసరమైనప్పుడు అత్యంత కఠినంగా వ్యవహరించే నాయకులు కావాలని ఆ లక్షణాలన్నీ నిక్కీ హేలీ లో ఇమిడి ఉన్నాయని ప్రసాద్ తోటకూర ప్రశంసించారు. డా. ప్రసాద్ తోటకూర తన ఉపన్యాసాన్ని కొనసాగిస్తూ అమెరికా దేశాభివృద్ధి లో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో కీలకమైనదని పేర్కొన్నారు. భారత సంతతికి చెందిన టెక్నాలజీ కంపెనీ అధినేతలు అమెరికా దేశంలో నాలుగు లక్షలకు పైగా ఉద్యోగాలను కల్పించారన్నారు. 20 బిలియన్ డాలర్లను పన్ను రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించారని, అంతేకాకుండా వివిధ అమెరికా విశ్వవిద్యాలయాలలో సుమారు రెండు లక్షలకు పైగా ఉన్న భారతీయ విద్యార్థులు చెల్లించే ఫీజులు అమెరికా విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతోందని తెలిపారు. 2015-16 ఆర్ధిక సంవత్సరంలో ప్రవాస భారతీయులందరూ కలిపి అమెరికా ఆర్ధిక వ్యవస్థకు 2 ట్రిలియన్ డాలర్లకు పైగా సమకూర్చారని, ప్రస్తుతం భారత అమెరికా దేశాల మధ్య వాణిజ్యం 140 బిల్లియన్ డాలర్లకు చేరుకుందన్నారు. నిక్కీ హేలీ మాట్లాడుతూ తాను అమెరికా దేశంలో పుట్టినా, తన తల్లిదండ్రులు 50 సంవత్సరాల క్రితం పంజాబ్ రాష్ట్రం నుంచి వలస వచ్చి అమెరికా దేశంలో స్థిరపడ్డారన్నారు. భారత సంతతికి చెందిన వ్యక్తినని చెప్పుకోవడానికి తానూ ఎంతో గర్వపడతానన్నారు. అమెరికాలో ప్రవాస భారతీయుల పాత్ర ఎంతో ఘనమైనదని, విద్యాధికులుగా, సాంకేతిక పరిజ్ఞాన రంగ నిపుణులుగా అన్ని రంగాలలోను ప్రముఖ స్థానాల్లో ఉన్నారని ప్రశంసించారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే భారత్, అమెరికాల మధ్య ఆర్ధిక, వాణిజ్య, సాంకేతిక, రక్షణ విభాగాలలో అనేక కీలక ఒప్పందాలు ఇరుదేశాల బంధాన్ని మరింత దృఢతరం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇరుదేశాలు ఉగ్రవాద దాడులను చవిచూసినవే కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించడంలో తమ వంతు కృషిని కలసి కొనసాగిస్తాయని తెలియజేశారు. దక్షిణ ఆసియా దేశాలలో శాంతి, సుహృద్భావ వాతావరణానికై అమెరికా ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఉగ్రవాదులకు స్థావరం కల్పిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలను ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. నిక్కీ హేలీ ప్రసంగానంతరం ప్రేక్షకులు అడిగిన - "అమెరికా నార్త్ కొరియా అధ్యక్షుల సమావేశం జరుగుతుందా?", "అమెరికా దేశ అభివృద్ధిలో దక్షిణ ఆసియా వాసుల పాత్ర?", "ప్రస్తుత అమెరికా ఇరాన్ దేశ సంబంధాలు?", "హెచ్-4 వీసాల రద్దు, హెచ్-1 బి వీసాల పై నియంత్రణ?", "జెరూసలేం లో అమెరికా దౌత్య కార్యాలయం ప్రారంభించటంతో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు?" మొదలైన ప్రశ్నలకు అనర్గళంగా, చమత్కారంగా నిక్కి హేలీ సమాధానమిచ్చారు. చివరిగా మీరు త్వరలో అమెరికా అధ్యక్ష పదవి బరిలోకి దిగపోతున్నారా? అని డాక్టర్ ప్రసాద్ తోటకూర అడిగినప్పుడు ఇప్పుడు తన ధ్యాసంతా ప్రస్తుత ఉద్యోగ బాధ్యతల పైనే అని చిరునవ్వుతో సమాధానం చెప్పారు. ఎంతో తీరికలేని సమయంలో కూడా తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ సమావేశానికి విచ్చేసినందుకు నిక్కీ హేలీకి, అత్యధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేసిన అతిథులందరికీ డా. ప్రసాద్ తోటకూర ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ బోర్డు సభ్యులు రావు కల్వల, డా. సి.ఆర్. రావు, పీయూష్ పటేల్, మురళి వెన్నం, రాంకీ చేబ్రోలు, డా. సత్ గుప్త, తాయబ్ కుండావాలాలు నిక్కీ హేలీకి పుష్పగుచ్ఛం అందజేసి, దుశ్శాలువాతో ఘనంగా సత్కరించగా, డా. ప్రసాద్ తోటకూర ఆమెకు ప్రత్యేక మెమెంటోను బహుకరించారు. -
గాంధీ తత్వాలు అజరామరం : నిక్కి హేలీ
డల్లాస్ : ఉత్తర టెక్సాస్‌లో ఇర్వింగ్‌లోని మహాత్మాగాంధీ స్మారక స్థూపాన్ని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ సందర్శించారు. మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ (ఎమ్జీఎమ్ఎన్టీ) ఛైర్మన్ డాక్టర్ ప్రసాద్ తోట కూర నిక్కి హేలీని సాదరంగా ఆహ్వానించారు. మహాత్మా గాంధీ తత్వాలు, ఆయన ఆచరించిన నియమాలు అజరామరమని నిక్కి హేలీ కొనియాడారు. ఎమ్జీఎమ్ఎన్టీలో గాంధీ విగ్రహానికి పూలతో నివాళులు అర్పించారు. ఎమ్జీఎమ్ఎన్టీకి రావడం చాలా ఆనందంగా ఉందన్నారు. మే 2014 లో సౌత్ కరోలినా గవర్నర్‌గా ఉన్న సమయంలో ఎమ్జీఎమ్ఎన్టీ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. 2014, అక్టోబర్ 2న అమెరికాలోనే అత్యంత ఎత్తైన గాంధీ మెమోరియల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని గాంధీజీ మునిమనవడు సతీష్ దుపెలియా వచ్చారు. ఎమ్జీఎమ్ఎన్టీ ప్రాజెక్టు సాకారంలో ముఖ్యపాత్ర వహించిన డాక్టర్ ప్రసాద్ తోట కూర, ఎమ్జీఎమ్ఎన్టీ టీం, కమ్యునిటీ సభ్యులు, ఇర్వింగ్ నగర అధికారులను నిక్కి హేలీ అభినందించారు. ఎమ్జీఎమ్ఎన్టీ బోర్డ్ డైరెక్టర్స్ రావు కల్వల, కమల్ కౌషల్, జాన్ హమ్మాండ్, తయ్యబ్ కుందావాలా, పియూష్ పటేల్, నరసింహ భక్తుల, కుంతేష్ చాక్సి, శబ్నమ్ మాడ్గిల్, జాక్ గోద్వానీ, ఇర్వింగ్ నగర మేయర్ రిక్ స్టాఫర్, అలెన్ మీగర్, క్రిస్ హిల్మన్, పార్క్స్, జొసెఫ్ మోసెస్‌లు ఈ కార్యక్రమానికి హాజరయిన వారిలో ఉన్నారు. -
‘సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు’
న్యూయార్క్: సిరియా కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయడంలో ఐక్యరాజ్యసమితి, రష్యా విఫలమయ్యాయని అమెరికా విమర్శించింది. ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయమని ఐక్యరాజ్యసమతిలో అమెరికా రాయబారి నిక్కి హేలీ వ్యాఖ్యానించారు. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, రష్యా కలిసి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచారని ఆరోపించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడుతూ... సిరియాలో ఉన్నా రష్యా, ఇరాన్ సంకీర్ణ సేనలను వెనక్కు పిలిపించడంలో సమితి విఫలమైందన్నారు. డమాస్కస్ సమీపంలో తూర్పు ఘౌటా ప్రాంతంలో కాల్పుల విరమణకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి 30 రోజులు గడిచినా పరిస్ధితిలో ఎటువంటి మార్పులేదన్నారు. అసద్, రష్యా సంకీర్ణ బలగాలు ఈ ఒప్పందాన్ని అతిక్రమించాయని మండిపడ్డారు. ‘ఇది చాలా తప్పు. భద్రతామండలిలోని ప్రతి సభ్యుడికి ఇది అవమానకరమైన రోజు’ అని నిక్కీ హేలీ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. కాల్పులు విరమణ ఒప్పందానికి ఓటు వేసిన రష్యా కట్టుబాటు చాటలేదని, ఈ విషయంలో మాస్కో కంటే తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. -
‘ట్రంప్‌తో నాకు అఫైర్ లేదు’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో ఆ దేశ రాయబారి నిక్కీ హేలీ(46)తో అఫైర్ కొనసాగిస్తున్నారని వస్తున్న వదంతుల్ని హేలీ తీవ్రంగా ఖండించారు. విజయవంతమైన ఓ మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు రావడం అసహ్యకరమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో హేలీతో చాలాసేపు గడుపుతున్నారనీ మైకెల్ వుల్ఫ్ తన పుస్తకం ‘ఫైర్ అండ్ ఫ్యూరీ’లో రాయడంతో ఈ వివాదం రాజుకుంది. దీనిపై స్పందించిన హేలీ తానెప్పుడూ అధ్యక్షుడు ట్రంప్‌తో తన భవిష్యత్ గురించి చర్చించలేదనీ, ఆయనతో ఒంటరిగా గడపలేదని స్పష్టం చేశారు. -
పాక్ పద్ధతి మార్చుకోవాల్సిందే!
వాషింగ్టన్ : ఉగ్ర సంస్థలకు సహకారం, తద్వారా పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్థాన్.. తన పద్ధతిని మార్చుకోవాలని అమెరికా చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హలే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. పాక్ తన వైఖరిని మార్చుకునేంత వరకు జాతీయ భద్రతా మండలి ఒత్తిడి తేవాలని ఆమె కోరుతున్నారు. భద్రతా మండలి సభ్యులతో నిక్కీ హలే ఈ మధ్యే అఫ్ఘనిస్థాన్‌లో పర్యటించి వచ్చారు. గురువారం తన పర్యటన వివరాలను ఆమె భద్రతా మండలిలో తెలియజేశారు. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఆమె భద్రతా మండలిలో వినిపించారు. ‘‘పాకిస్థాన్ మూలంగా అఫ్ఘనిస్థాన్ సమస్యలను ఎదుర్కుంటోంది. తాలిబన్లకు పాక్ పరోక్షంగా సాయం చేస్తోంది. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. వివిధ దేశాలకు చెందిన 15 మందితో ఓ విభాగాన్ని ఏర్పాటు చెయ్యండి. తద్వారా పాక్‌పై ఒత్తిడి తీసుకురండి’’ అని అఫ్ఘాన్ ప్రతినిధులు హలేకు విజ్ఞప్తి చేశారు. చర్చల కోసం కాబూల్ ముందుకు వస్తుంటే.. ఇస్లామాబాద్ మాత్రం కవ్వింపు చర్యలతో వెనక్కి తీసుకెళ్తోందని ఆమె వివరించారు. పొరుగు దేశాలను(భారత్‌సహా) ఉగ్రవాదంతో ప్రభావితం చేస్తున్న పాక్ విషయంలో జాతీయ భద్రతా మండలి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంక్షలపై సడలింపు... ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు భద్రతా పరమైన సహకారాన్ని అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇప్పుడు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. మిలిటరీ శిక్షణ కోసం(అంతర్జాతీయ సైనిక శిక్షణ హామీ కింద) మాత్రం నిధులను మంజూరు చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని పాక్ విదేశాగంగ కార్యదర్శి తెహ్మినా జన్జువా దృవీకరించారు. -
ఉత్తర కొరియా వైఖరి మారుతోందా?
వాషింగ్టన్ : ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వైఖరిలో అనూహ్యంగా కాస్త మార్పు రావటంతో.. శాంతి చర్చలకు త్వరపడాలని అగ్రరాజ్యం అమెరికాకు పలు ప్రపంచ దేశాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే పొరుగు దేశం దక్షిణ కొరియాతో చర్చలకు కిమ్ సిద్ధమౌతున్న విషయం తెలిసిందే. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో కిమ్ శాంతి ప్రస్తావన తేవటం ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఉత్తర కొరియా ప్రజలు కోరుకునేది ఒక్కటే.. శాంతి. ఒంటరిగా ఓ దేశం అభివృద్ధి సాధించటం జరిగే పని కాదు. అందుకు పొరుగు దేశాల సహకారం చాలా అవసరం. దక్షిణ కొరియాతో దౌత్యానికి ఉత్తర కొరియా ఎల్లప్పుడూ సిద్ధం’’ అన్న కిమ్ సందేశాన్ని ప్యోంగ్యాంగ్, సియోల్ లోని అన్ని ప్రముఖ పత్రికలు ప్రచురించాయి. దౌత్యపరమైన సంబంధాల ద్వారానే అది సాధ్యమంటూ అందులో కిమ్ పేర్కొన్నట్లు ఆయా కథనాలు ఉటంకించాయి. ఇక చర్చల ప్రతిపాదనను సియోల్(దక్షిణ కొరియా) వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే అమెరికా మాత్రం ఆ విషయంలో షరా మాములుగా అనుమానాలనే వ్యక్తం చేస్తోంది. కిమ్‌ను నమ్మలేం : అమెరికా కిమ్ వైఖరిలో మార్పును అంత తేలికగా నమ్మటం మంచిది కాదన్న భావనలో అమెరికా ఉంది. ‘‘ఉత్తర కొరియా ప్రకటను తక్షణమే స్వాగతించలేం. అణ్వాయుధాల నిషేధం అమలు.. కవ్వింపు చర్యలను పూర్తిగా నిలిపివేశాకే చర్చల గురించి ఆలోచించటం ఉత్తమం. దక్షిణ కొరియాకు మేం సూచించేది కూడా అదే.’’ అని అమెరికా తరపున ఐక్యరాజ్యసమితి రాయబారి నిక్కీ హలే చెబుతున్నారు. మరి అమెరికా శాంతి చర్చలకు ముందుకు వస్తుందా? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె దాటవేత ధోరణిని ప్రదర్శించారు. తెరపైకి ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్’ అగ్రిమెంట్... ఉత్తర కొరియా వైపు నుంచి కవ్వింపు చర్యలు తగ్గినట్లు కనిపిస్తుండటంతో స్వచ్ఛందంగా దౌత్యానికి అమెరికానే ముందుకు రావటమే మంచిదని సీనియర్ రక్షణ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ముందు మాటల యుద్ధానికి తెరదించి ఆపై ఇరు దేశాలు తటస్థ వేదికగా చర్చలు జరపటం ఉత్తమమని.. ఈ మేరకు రష్యా, చైనాలు చొరవతో గతంలో ప్రతిపాదించిన ‘ఫ్రీజ్ ఫర్ ఫ్రీజ్ ఒప్పందం’ అమలు చేయటం పెద్ద కష్టమైన పనేం కాదని వారంటున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఉత్తర కొరియాపై ఉన్న ఆంక్షలన్నింటిని అమెరికా తక్షణమే ఎత్తివేయాల్సి ఉంటుంది. అదే సమయంలో దశల వారీగా అణు క్షిపణుల విషయంలో ఉత్తర కొరియా నియంత్రణ పాటిస్తూ నిషేధం దిశగా అడుగులు వేయాలి. తద్వారానే శాంతి చర్చలు దశల వారీగా ముందుకు కొనసాగుతుంటాయి. ఇది కూడా చదవండి... కిమ్.. నీ కంటే నాది పెద్దది : ట్రంప్ -
పాక్ గేమ్ ఇక చెల్లదు!
వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ ఏళ్లుగా డబుల్ గేమ్ ఆడుతోందని, పాక్ తన వైఖరి మార్చుకోకపోవడం వల్లే.. ఆ దేశానికి ఇవ్వాలని భావించిన 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని నిలిపివేశామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు. ‘పాకిస్థాన్‌కు 255 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారాన్ని అమెరికా నిలిపివేసింది. ఇందుకు కారణాలు సుస్పష్టం. పాకిస్థాన్ ఏళ్లుగా డబుల్ గేమ్ ఆడుతోంది’ అని ఆమె అన్నారు. ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ.. మద్దతుగా నిలుస్తుండటంతోనే పాకిస్థాన్‌కు పూర్తిస్థాయిలో నిధులు నిలిపేయాలన్న తీవ్ర నిర్ణయానికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చారని తెలిపారు. ‘కొన్ని సందర్భాల్లో పాకిస్థాన్ మాతో కలిసి పనిచేసింది. అదే సమయంలో ఆఫ్గనిస్థాన్‌లో మాపై దాడులు చేస్తున్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తోంది. పాక్ ఆడుతున్న ఈ గేమ్ మాకు ఆమోదయోగ్యం కాదు. ఉగ్రవాదంపై పోరులో పాక్ నుంచి ఎక్కువ సహకారాన్ని ఆశిస్తున్నాం’ అని ఆమె తెలిపారు. ఉగ్రవాదంపై పోరు విషయంలో ఆఫ్ఘన్లో తమకు ఏమాత్రం సహాయం చేయడం లేదని మండిపడుతూ.. తాజాగా అధ్యక్షుడు ట్రంప్ పాక్‌కు అందజేసే సహాయ నిధులను పూర్తిగా నిలిపేసిన సంగతి తెలిసిందే. -
ఐక్యరాజ్య సమితికి అమెరికా షాక్
న్యూ యార్క్ : జెరుసలేం విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి వేదికగా ప్రపంచ దేశాలు ఒక్కటవ్వడాన్ని అగ్రరాజ్యం సహించలేకపోతోంది. జెరూసలేం నిర్ణయంపై వ్యతిరేకంగా ఓటేసిన దేశాలకు విడుదల చేసే నిధులపై కోత పెడతామంటూ హెచ్చరికలు జారీ చేసిన అమెరికా.. మొదటి షాక్ ఐక్యరాజ్య సమితికే ఇచ్చింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ కీలక ప్రకటన ఒకటి చేశారు. ఐక్యరాజ్య సమితి కార్యకలాపాల కోసం 2018-19 మధ్యకాలంలో కేటాయించే నిధుల్లో 285 మిలియన్ డాలర్ల కోత పెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశంలో ప్రపంచదేశాలన్నీ అమెరికాను ఒంటరి చేశాయని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. అమెరికా తీసుకున్న తాజా నిర్ణయంతో ప్రపంచ దేశాలతో పాటు ఐక్యరాజ్య సమితి కూడా షాక్‌తింది. ఐక్యరాజ్య సమితి సమర్థత, ఆర్థిక అంశాలపై మాకు స్పష్టమైన అవగాహన వుంది.. మేం చేయాలనుకున్నది చేస్తామని నిక్కీ హేలీ స్పష్టం చేశారు. అమెరికన్ల ప్రేమ, ఔదార్యాన్ని మిగిలిన దేశాలు కూడా ఏంతోకాలం పొందలేవని ఆమె చెప్పారు. ఇదిలావుండగా.. సమితికి కేటాయించే మొత్తం బడ్జెట్ నిధులను నిలిపేస్తున్నారా? లేక సమితి నిర్వహణ కోసం అందించే ఉదార నిధులును అమెరికా రద్దు చేసిందా అన్న విషయంపై స్పష్టత రావాల్సివుంది. జెరూసలేం నగరాన్ని ఇజ్రాయెల్ రాజధానిగా అధికారికంగా గుర్తిస్తున్నామని, అమెరికన్ ఎంబసీని జెరూసలేంకు మార్చుతున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొద్దిరోజులు క్రితం ప్రకటించారు. ముస్లిం దేశాల్లో అల్లర్లు, ఆందోళనలు చెలరేగాయి. దీంతో అమెరికా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ పప్రపంచదేశాలన్నీ సమితిలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి 128 దేశాల మద్దతుల లభించింది. సర్వసభ్య సమావేశం తరువాత నిక్కీ హేలీ చాలా ఆగ్రహంగా మాట్లాడారు. ‘‘అమెరికా చరిత్రలో ఇది మరచిపోలేని రోజు.. అమెరికాకు వ్యతిరేకంగా నిలిచిన అన్నీ దేశాలను గుర్తుపెట్టుకుంటాం’’ అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన అనంతరం నిధుల కోతపై నిక్కీ హేలీ రోజుల వ్యవధిలోనే ప్రకటించడం గమనార్హం. -
‘వీటో’ను ప్రస్తావించకుంటే సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో అధికారాలున్నాయి. ఈ అధికారాన్ని ఆయా దేశాలు ఇతరులతో పంచుకునేందుకు కానీ, పూర్తిగా విడిచిపెట్టేందుకు కానీ సిద్ధంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కాబట్టి వీటో అధికారాల గురించి ప్రస్తావించకపోతే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలని అమెరికా కోరుకుంటోందనీ, అయితే రష్యా, చైనాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ అంశాలపై భారత్–అమెరికా సహకారం పెంపొందించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర’ అనే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సమావేశంలో నిక్కీ హేలీ ప్రసంగించారు. భద్రతా మండలి సంస్కరణల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ పాత్ర ఉండదనీ, మండలిలోని సభ్య దేశాలు తమ మాట వినే స్థితిలో లేవన్నారు. సభ్యత్వం పొందేందుకు భారత్ వీలైనన్ని ఎక్కువ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు. పాక్‌పై నిఘాకు భారత్ సాయపడగలదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచేందుకు భారత్ తమకు సహకరించగలదని నిక్కీ హేలీ అన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరుకు ట్రంప్ ఇటీవల కొత్త వ్యూహాన్ని ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ఆమె...ఆ వ్యూహంలో ఒక భాగం భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమేనని చెప్పారు. కాగా, భారత నౌకాదళం విమాన వాహకాలను తయారుచేసేందుకు అవసరమైన ఎమల్స్ (ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టం) టెక్నాలజీని భారత్‌కు అందించనున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్పింది. దీపావళి వేడుకల్లో ట్రంప్ శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాలనా బృందంలోని ఇండో–అమెరికన్లయిన ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ, మెడికేర్, మెడిక్ ఎయిడ్ సర్వీసెస్ పాలనాధికారి సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పలు రంగాల్లో ఇండో–అమెరికన్ల సేవలను ట్రంప్ కొనియాడారు. భారత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు. -
భారత్ ఆశలు గల్లంతు!
వాషింగ్టన్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ హోదా భారత్‌కు ఇప్పట్లో దక్కనట్లు స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితికి అమెరికా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వీటో అధికారం జోలికి ఎవరినీ రానివ్వకూడదనే శాశ్వత సభ్యత్వ దేశాల వైఖరే భారత్‌కు శాశ్వత హోదాకు కీలక అంశంగా మారిందని హేలి అన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన భారత్ అమెరికా ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 'భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలో వీటో అధికారం ప్రధానంగా మారింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్ అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఏ దేశం కూడా వీటో వేరే దేశం జోక్యాన్ని ఆహ్వానించడం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణను వ్యతిరేకిస్తున్నట్లు నేను గుర్తించాను. అందుకే భారత్ శాశ్వత హోదాకు ఇప్పుడు వీటో గురించే కీలకంగా మారింది' అని హేలి చెప్పారు. తాము భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ అమెరికా కాంగ్రెస్‌కు గానీ, సెనేట్‌కుగానీ భద్రతా మండలిని సంస్కరించే పూర్తి అధికారులు లేవని ఆమె చెప్పారు. 'ఇది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన విషయం. ఐక్యరాజ్యసమితికి చెంది భద్రతామండలిలోని సంస్కరణ అంశం. ఇందులో మార్పు తీసుకురావాలని భారత్ బలంగా కోరుకుంటే మరిన్ని దేశాల మద్దతు తీసుకొచ్చుకోవడం ద్వారా అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను' అని హేలి చెప్పారు. -
రాజుకుంటున్నకొరియా కొలిమి!
► మరో క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్న ఉత్తర కొరియా! ‘క్షిపణి, అణ్వాయుధ పరీక్షలతో కవ్వింపు చర్యలకు దిగొద్దని ఎంత చెప్పినా వినకుండా ‘ధూర్తదేశం’ యుద్ధానికి రమ్మంటూ అడుక్కుంటోంది’ అంటూ ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నికీ హేలీ ఉత్తర కొరియాకు చేసిన హెచ్చరిక పనిచేయడం లేదు. తాజాగా ఉత్తర కొరియా తన పశ్చిమ తీరానికి ఖండాంతర క్షిపణిలా కనిపిస్తున్న రాకెట్‌ను తరలించినట్టు దక్షిణ కొరియా తెలిపింది. దీనిని ఎప్పుడు పరీక్షిస్తారనే సమాచారం తమవద్ద లేదంది. ఉత్తర కొరియా ఆదివారం ఆరో అణు పరీక్ష జరపడం అమెరికా ఆగ్రహానికి కారణమైంది. ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో అణుయుద్ధానికి కిమ్ ఏ క్షణాన్నైనా తెరలేపవచ్చనే భయాందోళనలు ప్రపంచదేశాలను చుట్టుముడుతున్నాయి. కిమ్ బెదిరిస్తున్నట్టుగా అమెరికా భూభాగాన్నిగాని, మిత్రదేశాలనుగాని లక్ష్యంగా చేసుకుని ఉత్తరకొరియా క్షిపణులను ప్రయోగిస్తే భారీ సైనిక స్పందన తప్పదని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ హెచ్చరించారు. కిమ్ ఆగడాలకు అమెరికా ప్రతిచర్య క్రూరంగా ఉంటుందని ఆ దేశ ఆర్మీ రిటైర్డ్ జనరల్ అన్నారు. అగ్రరాజ్య నేతలు ఇలా తీవ్రపదజాలంతో కిమ్‌ను దారిలోకి తేవడానికి ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తున్నారు. దక్షిణ కొరియా పక్కలో బల్లెం కమ్యూనిస్ట్ కొరియా! ఉత్తర కొరియా ఎంతగా కవ్విస్తున్నా లిబియా, ఇరాక్, అఫ్గానిస్తాన్‌లో మాదిరిగా సాయుధ దాడికి అమెరికా దిగటం లేదు. ఇందుకు ప్రధాన కారణం మిత్రదేశం దక్షిణ కొరియాపై కిమ్ ప్రభుత్వం ఎక్కుపెట్టిన మారణాయుధాలే. దాయాది దేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌ను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా తన సరిహద్దుల్లో నిలిపిన భారీ ఫిరంగులు, రాకెట్లు ఇతర దూరశ్రేణి ఆయుధాలే అమెరికాకు అడ్డంకిగా మారాయి. అగ్రరాజ్యం దాడికి దిగిన వెంటనే కిమ్ ఈ ఆయుధాలను ప్రయోగిస్తే రెండు కోట్ల 50 లక్షల జనాభా ఉన్న సియోల్ వల్లకాడుగా మారుతుంది. పౌరులు అంచనావేయలేనంత భారీ సంఖ్యలో ప్రాణాలు కోల్పోతారు. కిమ్ దేశంపై ప్రతీకార దాడి చేయడానికి అమెరికా ఈ కారణంగానే వెనుకాడుతోందని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం సాధ్యమేనా? అమెరికా అండతో ఆర్థికశక్తిగా ఎదిగిన దక్షిణ కొరియాకు ఆయుధాల సరఫరా ఆపి, ఏటా చేస్తున్న సంయుక్త సైనిక విన్యాసాలకు స్వస్తి పలకాలనేది ఉత్తర కొరియా డిమాండ్. క్షిపణి, అణు పరీక్షల ద్వారా అమెరికాను తన డిమాండ్లకు ఒప్పుకునేలా చేయడమే కిమ్ వ్యూహం. ఒకవేళ అమెరికా నాయకత్వాన దక్షిణ కొరియా, జపాన్‌లు కిమ్ రాజ్యంపై యుద్ధం ప్రారంభిస్తే భారత్ సహా దక్షిణాసియా దేశాలకు ఆర్థికంగా నష్టం తప్పదు. అనేక శక్తిమంతమైన దేశాలతో ఉత్తర కొరియాకు వాణిజ్య సంబంధాలున్నాయి. కొరియా ద్వీపకల్పంలో యుద్ధానికి దిగి విజయం సాధించి, కిమ్ సర్కారును కూల్చే స్థితిలో అమెరికా లేదు. యుద్ధమే వస్తే దక్షిణ కొరియాలో ఉన్న సేనలు, ఆయుధాలు అమెరికా దాడి చేయడానికి సరిపోవు. అదనపు బలగాలు, ఆయుధాలు, యుద్ధ సామగ్రిని దక్షిణ కొరియాకు తరలించడానికి వారాలు, నెలలు పడుతుంది. అమెరికా చేసే తొలి దాడికి బీ2, బీ–52, ఎఫ్–22 స్టెల్త్ ఫైటర్ విమానాలు అవసరమౌతాయి. గ్వామ్‌లోని అమెరికా వైమానిక స్థావరం నుంచి ఈ తరహా విమానాలతో దాడులు చేయాల్సి ఉంటుంది. ‘‘వారం క్రితంతో పోల్చితే యుద్ధానికి ఇప్పుడు దగ్గరగా లేము. పదేళ్ల కిందటి పరిస్థితితో పోల్చితే మాత్రం ఉత్తర కొరియాతో పోరుకు సమీపంలో ఉన్నామని చెప్పగలం’’ అని అమెరికా సీఐఏ డైరెక్టర్ మైక్ పాంపియో, ట్రంప్ జాతీయ భద్రతా సలహాదారు, ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఆర్ మెకాస్టర్లు మీడియాకు చెప్పిన మాటలద్వారా తక్షణం యుద్ధప్రమాదం లేదని అనుకోవచ్చు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఐరాసలో అమెరికా-చైనా యుద్ధం
- ఉత్తరకొరియా అణుపరీక్షలపై దద్దరిల్లిన భద్రతా మండలి - కిమ్ జోలికొస్తే ఊరుకోం: చైనా, రష్యా - అతను యుద్ధాన్ని కోరుకుంటున్నాడు: అమెరికా - భయంలేనివాడిని భరతం పట్టాల్సిందేనన్న నిక్కీ హేలీ న్యూయార్క్: అణుబాంబులు, హైడ్రోజన్ బాంబుల పరీక్షలతో ప్రపంచం వెన్నులో వణుకు పుట్టిస్తోన్న ‘ఉత్తరకొరియా ప్రయోగాల’పై ఐక్యరాజ్యసమితిలో అమెరికా-చైనాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ మాటలతో వినే రకం కాదని, యుద్ధాన్నే కోరుకుంటున్నాడని ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. కాగా, అమెరికా వాదనను చైనా ప్రతినిధి లూజీ ఖండించారు. పరిస్థితి విషవలయంలా మారిందని, కిమ్ జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని వ్యాఖ్యానించారు. సోమవారం నాటి భేటీతో కలుపుకొని మొత్తం 10 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఉత్తరకొరియా అజెండాపై భేటీ అయింది. అమెరికా ఆంక్షలు ప్రతిపాదించిన అన్ని సందర్భాల్లోనూ ఆ తీర్మానాలను చైనా, రష్యాలు వీటో చేస్తూవస్తున్నాయి. ఇక మాకు ఓపిక లేదు: ఉత్తరకొరియా అణుపరీక్షలు, వాటికి దన్నుగా నిలుస్తోన్న చైనాపై అమెరికా రాయబారి నిక్కీ హేలీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కిమ్ జాంగ్ ఉన్ యుద్ధం కోసం యాచిస్తున్నారు(బెగ్గింగ్ ఫర్ వార్). ఐక్యరాజ్య సమితి ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తన కార్యక్రమాలను కొనసాగిస్తున్నే ఉన్నారు. ఇప్పటికే ఆరు సార్లు అణుపరీక్షలు చేశారు. ఇప్పటికైనా మనం ‘అతణ్ని దారికి తేవాలనే’ ఆలోచన వీడుదాం. తీవ్ర చర్యలు తీసుకునే దిశగా నిర్ణయం తీసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి.. అమెరికాపైకి, అమెరికన్లపైకి కొన్ని వందల బాంబులు గురిపెట్టి కూర్చుంది కొరియా. ఇలాంటి పరిస్థిలో మేం సహనంతో ఉండలేం. యుద్ధం మా వాంఛకాదు. కానీ మా భద్రత విషయంలో ఎంత దూరమైనా వెళతాం’’ అని నిక్కీ హేలీ అన్నారు. కొరియాపై యుద్ధాన్ని సహించం: అమెరికా వాదనను ఖండిస్తూ చైనా ప్రతినిధి లూజీ సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రస్తుత పరిస్థితి విషవలయంలా మారింది. కవ్వింపు చర్యలకు పాల్పడవద్దని, అణువ్యాప్తి తగ్గింపు విషయంలో అంతర్జాతీయ సమాజం ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా మేం ఉత్తరకొరియాను అభ్యర్థిస్తూనేఉన్నాం. అయితే, కొరియాను అణ్వాయుధాలు వదులుకోవాలని డిమాండ్ చేస్తోన్న అమెరికా తనకుతానుగా ఆ పని చేస్తోందా? అని ప్రశ్నించుకోవాలి. కొరియాపై ఆంక్షలను ఇంకా కఠినతరం చేయాలన్న ఆలోచననుగానీ, ఆ దేశంపై యుద్ధం చేయాలన్న ప్రణాళికలనుగానీ చైనా, రష్యాలు ముమ్మాటికీ సమర్థించబోవు. కొరియా ద్వీపంలో శాంతి నెలకొనాల్సిందే. అది జరగాలంటే ముందుగా అమెరికా, దాని అనుబంధ దేశం దక్షిణకొరియాలు వెనక్కితగ్గాలి. ఉత్తరకొరియాను చుట్టుముట్టి భయపెట్టిస్తున్న తీరును మార్చుకోవాలి. మీరు గట్టిపడేకొద్దీ వాళ్లూ గట్టిపడతారు’’ అని లూజీ అన్నారు. వేరే దారి లేదు: ఐరాసా ఆంక్షలకు విరుద్ధంగా ఉత్తరకొరియాతో వాణిజ్యాన్ని సాగిస్తోన్న చైనా.. పరోక్షంగా కిమ్ తయారుచేస్తోన్న మిస్సైళ్లకు నిధులు ఇస్తోందని అమెరికా ఆరోపించింది. కొరియా విషయంలో సాధ్యమైనన్ని శాంతియుత మార్గాలన్నీ విఫలమయ్యాయని, ఐరాస 10 సార్లు హెచ్చరించినా వారు వినిపించుకోవడం లేదని, కిమ్ లాంటి యుద్ధపిపాసిని అడ్డుకోవాలంటే తీవ్ర చర్యలకు ఉపక్రమించడం తప్ప వేరే దారి లేదని నిక్కీ హేలీ ముక్తాయింపునిచ్చారు. -
చైనా తీరుపై మండిపడ్డ ట్రంప్..
పట్టపగ్గాలు లేకుండా రెచ్చిపోతున్న ఉత్తర కొరియా అణుముప్పును కట్టడి చేయడంలో చైనా ఏమాత్రం సహకరించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఇందుకు ప్రతీకారంగా చైనాపై వాణిజ్యపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అధ్యక్షుడు ట్రంప్ బుధవారం యూరప్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. జర్మనీ హంబర్గ్‌లో జరగనున్న జీ-20 సదస్సులో భాగంగా ట్రంప్ చైనా అధ్యక్షుడు గ్జీ జిన్‌పింగ్‌తో భేటీ కానున్నారు. ఈ భేటీకి ముందే ఆయన చైనాపై విరుచుకుపడటం గమనార్హం. ఉత్తరకొరియా చేపడుతున్న అణ్వాయుధ, క్షిపణి పరీక్షలను ఆ దేశ మిత్రపక్షమైన చైనా కట్టడి చేయాలని, అందుకు ప్రతిఫలంగా చైనాతో అమెరికా మంచి వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటుందని ట్రంప్ ఊరించారు. ఉత్తర కొరియా ఇటీవల అమెరికా, పశ్చిమ దేశాలను ఢీకొట్టగలిగే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణీని పరీక్షించడం అమెరికాకు కలవరం రేపుతున్నది. ఈ క్షిపణి ప్రయోగంతో అమెరికాకు అణుముప్పు పెరిగిందని భావిస్తున్న అగ్రరాజ్యం.. దీనిని కట్టడి చేయడంలో విఫలమైన చైనాను టార్గెట్ చేసుకోవాలని భావిస్తోంది. ’ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా-ఉత్తర కొరియా మధ్య వాణిజ్యం 40శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో చైనా ఎందుకు కొరియాను కట్టడి చేయడం లేదు’ అంటూ గతంలో ట్రంప్ ట్విట్టర్లో ప్రశ్నించారు. అయినా, కొరియాను దారిలోకి తీసుకురాకపోవడంతో ఇక చైనాకు వాణిజ్యపరంగా చెక్ పెట్టాలని ట్రంప్ భావిస్తున్నారు. జీ-20 సదస్సులో భాగంగా ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా భేటీ కానున్నారు. చైనా, రష్యాపై అమెరికా ఫైర్ ఉత్తర కొరియా తాజాగా చేపట్టిన బాలిస్టిక్ క్షిపణుల పరీక్షల నేపథ్యంలో చైనా, రష్యా తీరుపై అమెరికా మండిపడింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్‌తో చైనా, రష్యా చేతిలో చేయి వేసి ముందుకు సాగుతున్నాయని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ మండిపడ్డారు. ఉత్తర కొరియా తీరును ఖండిస్తూ.. ఆ దేశంపై మరిన్ని తీవ్రమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తూ ఐరాస భద్రతా మండలి తీర్మానం చేయడానికి అడ్డుపడుతున్న చైనా, రష్యా తీరును ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. -
హేలీని ఈజీగా పీకేస్తానంటూ ట్రంప్ జోక్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన రాయబారులందరినీ తెగనవ్వించారు. తాను నిర్దేశించిన లక్ష్యాలను గురించి మాట్లాడుతూనే అందులో సున్నిత హాస్యం చేర్చి అందరికీ కొత్తగా దిశా నిర్దేశం చేశారు. అమెరికా తరుపున ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వంగల దేశాలకు విదేశీ రాయబారులుగా పనిచేస్తున్న వారితో ప్రత్యేక సమావేశం అయ్యారు. వైట్ హౌస్‌లో వారికి లంచ్ ఏర్పాటుచేసిన అనంతరం మాట్లాడారు. ముఖ్యంగా పలువురు రాయబారులు ఉన్నప్పటికీ.. నిక్కీ హేలీని ఆయన ప్రశంసల్లో ముంచెత్తారు. విదేశాంగ విధానం విషయంలో ఆమె చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని తెలిపారు. ‘ఆమె తన విధిని చాలా గొప్పగా నిర్వర్తిస్తున్నారు. ఎవరైనా నిక్కీలాగా ఇప్పుడు ఎవరైనా చేస్తారా? ఒక వేళ ఆమెలాగా ఎవరు చేయకపోయినా, ఆమెనే చేయకపోయినా తేలికగా ఆమెను భర్తీ చేయొచ్చు’ అంటూ తెగ నవ్వించారు. అయితే, అలా ఎప్పటికీ తాము చేయబోమని, ఆమె నిజానికి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని కొనియాడారు. -
‘అసలైన యుద్ధానికి’ రెడీగా ఉండు..!
ట్రంప్‌కు రష్యా, ఇరాన్ వార్నింగ్! సిరియాలో అధ్యక్షుడు అసద్ సేనలు లక్ష్యంగా అమెరికా వైమానిక దాడులు చేయడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. అసద్‌కు కొమ్ముకాస్తున్న రష్యా, ఇరాన్ తాజాగా అమెరికా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. సిరియా ప్రభుత్వ సేనలు లక్ష్యంగా అమెరికా మరిన్ని దాడులు చేస్తే.. తాము సైనిక దాడులతో బదులు ఇవ్వాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హెచ్చరించాయి. అసద్ సేనలపై క్షిపణీ దాడులు నిర్వహించడం ద్వారా ట్రంప్ లక్ష్మణ రేఖ (రెడ్‌లైన్)ను దాటారని పేర్కొన్నాయి. ‘ఇప్పటినుంచి భద్రతా పరమైన లక్ష్మణరేఖను ఉల్లంఘిస్తే మేం దీటుగా సమాధానమిస్తాం. మేం ఎలా బదులివ్వగలమో అమెరికాకు బాగా తెలుసు’ అని రష్యా, ఇరాన్ ఆర్మీ చీఫ్‌లు ఒక ఉమ్మడి ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు లండన్‌లో రష్యా రాయబార కార్యాలయం ట్విట్టర్లో తీవ్ర వ్యాఖ్యలు చేసింది. సిరియా విషయంలో రష్యాకు అల్టిమేటం ఇస్తే ఇక అసలైన యుద్ధం తప్పదని హెచ్చరించింది. ఇటీవల సిరియాలోని రెబెల్స్ అధీనంలో ఉన్న ప్రాంతంలో రసాయనిక దాడి జరగడం.. ఈ దాడి అసద్ ప్రభుత్వం పనేనని ఆరోపణలు రావడంతో సిరియా విషయంలో అమెరికా తన వైఖరి మార్చుకుంది. గత మంగళవారం సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. అంతేకాకుండా సిరియా అధ్యక్షుడిగా బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ తాజాగా స్పష్టం చేశారు. అయితే, అసద్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్న రష్యా, ఇరాన్.. ట్రంప్ సర్కారును బాహాటంగా సవాల్ చేస్తున్నాయి. -
అసద్‌పై ట్రంప్ యూటర్న్.. ఇక గద్దె దించుడే!
వాషింగ్టన్: సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్‌ను గద్దె దించడమే తమ ప్రధాన ప్రాధాన్యమని అమెరికా కుండబద్దలు కొట్టింది. సిరియాలో తాజాగా జరిగిన రసాయన దాడి నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు ఈ మేరకు యూటర్న్ తీసుకొంది. అసద్ పదవి నుంచి వైదొలగడం అనివార్యమని ఐరాస అమెరికా రాయబారి నిక్కీ హెలీ స్పష్టం చేశారు. సిరియాలో రెబెల్స్ అధీనంలో ఉన్న ఖాన్ షిఖౌన్ పట్టణంలో జరిగిన రసాయనిక దాడిలో 89 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అసద్ ప్రభుత్వమే ఈ దాడి చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో అమెరికా మంగళవారం ఏకంగా సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడులు నిర్వహించింది. రసాయని దాడికి గురైన ప్రజల దయనీయ ఫొటోలను చూసి ఖిన్నుడైన ట్రంప్.. రెబెల్స్‌పై దాడులకు కారణమైన పశ్చిమ సిరియాలోని షాయరత్ వైమానిక స్థావరాన్ని పేల్చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా సీఎన్ఎన్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన నిక్కీ హెలీ ’అసద్‌ను కూలదోయడం మా ప్రాధాన్యం. అంతేకాకుండా మరోవైపు ఐఎస్ఐఎస్ను ఓడించడానికీ ప్రయత్నిస్తున్నాం. అసద్ ఉన్నంతకాలం సిరియాను శాంతియుతంగా చూడలేం. ఇరాన్ ప్రభావాన్ని కూడా తొలగించాల్సిన అవసరముంది. చివరగా సిరియాలో రాజకీయ పరిష్కారాన్ని కనుగొంటాం’ అని చెప్పారు. ఒకవైపు ఐఎస్ఐఎస్పై పోరాడుతూనే.. మరోవైపు అసద్‌ను గద్దె దించాలని చూడటం మూర్ఖత్వమని ట్రంప్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్న సంగతి తెలిసింది. రసాయనిక దాడికి ముందు కూడా అసద్‌ను గద్దె దించడం తమ ప్రాధాన్యం కాదని ట్రంప్ సర్కారు పేర్కొంది. కానీ, రసాయనిక దాడి అనంతర పరిణామాల నేపథ్యంలో రష్యా మద్దతున్న అసద్‌ను గద్దె దించితీరుతామని స్పష్టం చేసింది. మరోవైపు గుడ్డిగా అసద్‌ను వెనకేసుకొస్తున్న రష్యా.. ఈ విషయంలో అమెరికాకు తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిస్తోంది. -
భారత్–పాక్ ఉద్రిక్తత నివారణకు కృషి చేస్తాం
న్యూయార్క్: భారత్, పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు యత్నిస్తామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పారు. ‘ఉద్రిక్తతలను తగ్గించే యత్నాల్లో మావంతు పాత్ర ఏమిటో కనుగొనేందుకు మా ప్రభుత్వం చర్చిస్తుంది.. ఏదో ఒకటి జరిగేవరకు వేచిచూడం’ అని అన్నారు. ఈ ప్రయత్నంలో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ భాగమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఐరాస భద్రతా మండలికి సంబంధించి ఏప్రిల్ నెలకుగాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన హేలీ మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల కోసం భారత్, పాక్‌లను అమెరికా ఒప్పిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హేలీ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రరహిత వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం తమ విధానమని, అయితే హింస ఇంకా కొనసాగుతూనే ఉందని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. -
'మా అమ్మను భారత్‌లో జడ్జి కానివ్వలేదు'
న్యూయార్క్: భారత్‌లో తన తల్లి న్యాయశాస్త్రాన్ని చదివి లాయర్ అయినా.. అప్పుడున్న పరిస్థితులు ఆమె న్యాయమూర్తి (జడ్జి)ని కానివ్వలేదని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హెలీ గుర్తుచేసుకున్నారు. భారత సంతతికి చెందిన ఆమె బుధవారం ఐరాసలో అంతర్జాతీయ సంబంధాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళల పాత్ర గురించి ప్రశ్నించగా.. ఆమె మాట్లాడుతూ.. 'నేను మహిళలకు పెద్ద అభిమానిని. వారు చేయలేనిదంటూ ఏమీ లేదు. మహిళల పురోగతికి కృషి చేసే ఏ ప్రజాస్వామ్యమైనా.. దానివల్ల అధికంగా లబ్ధి పొందుతుంది' అని పేర్కొన్నారు. భారత్‌లో తన తల్లి జీవితాన్ని ఆమె ఈ సందర్భంగా వివరించారు. 'భారత్‌లో పెద్దగా చదువుకొనే అవకాశం లేకపోయినప్పటికీ మా అమ్మ లా స్కూల్‌కు వెళ్లి విద్యాభ్యాసం చేసింది. భారత్‌లో తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమెకు అవకాశం లభించి ఉండేది. కానీ అప్పుడున్న పరిస్థితుల వల్ల ఆమె న్యాయమూర్తిగా ధర్మాసనంలో కూర్చోలేకపోయింది. కానీ తన కూతురే ఇప్పుడు సౌత్ కరోలినా గవర్న్‌ర్ కావడం, ఐరాసకు అమెరికా రాయబారి కావడం ఆమెకు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించుకోండి' అని నిక్కీ పేర్కొన్నారు. నిక్కీ హెలీ అజిత్ సింగ్ రాంధావ, రాజ్ కౌర్ రాంధావ దంపతులకు జన్మించారు. ఆమె మొదటి పేరు నిమ్రత రాంధావ. 1960లో ఆమె కుటుంబం మొదట కెనడాకు, ఆ తర్వాత అమెరికాకు వలస వెళ్లిపోయింది. నిజానికి, భారత తొలి మహిళ జడ్జిగా జస్టిస్ అన్నా చాందీ కీర్తి గడించారు. ఆమె తొలి మహిళ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా నియమితులయ్యారు. 1937లోనే ఆమె ట్రావెన్కోర్ మునసబు (న్యాయాధికారి)గా నియమితులయ్యారు. -
ఐరాసకు అమెరికా రాయబారిగా నిక్కీ హేలీ
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన రిపబ్లికన్ నేత నిక్కీ హేలీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ హోదా ఉన్న ఈ పదవిని చేపట్టిన తొలి భారతీయ అమెరికన్‌గా ఆమె రికార్డుకెక్కారు. 45 ఏళ్ల హేలీతో అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ప్రమాణం చేయించారు. దేశాధ్యక్షుడు ట్రంప్.. రాయబారిగా హేలీ నియాకాన్ని మంగళవారం ధ్రువీకరించగానే ఆమె దక్షిణ కరోలినా గవర్నర్ పదవికి రాజీనామా సమర్పించారు. ట్రంప్ కేబినెట్లో చేరిన తొలి మహిళగానూ హేలీ నిలిచారు. -
చరిత్ర సృష్టించిన నిక్కీ హెలీ!
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస)లో అమెరికా రాయబారిగా భారత సంతతికి చెందిన నిక్కీ హెలీ నియామకాన్ని అమెరికా సెనేట్ మంగళవారం ఖరారు చేసింది. ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న ఆమె త్వరలోనే తన పదవికి రాజీనామా చేసి.. అమెరికాలోనే అత్యున్నత దౌత్యపదవిని చేపట్టనున్నారు. రిపబ్లికన్ పార్టీ రైజింగ్ స్టార్‌గా పేరొందిన నిక్కీ హెలీకి దౌత్య అనుభవం లేకపోయినా.. ఈ పదవి చేపట్టేందుకు ఆమెకు సెనేట్‌లో బంపర్ మెజారిటీ లభించడం గమనార్హం. డెమొక్రాట్లు సైతం ఆమెకు మద్దతు పలుకడంతో 96-4 మార్జిన్‌తో సెనేట్ ఆమోదం లభించింది. దీంతో అమెరికా అధ్యక్ష యంత్రాంగంలో క్యాబినెట్ ర్యాంకు పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తిగా నిక్కీ హెలీ చరిత్ర సృష్టించారు. తన అభిప్రాయాలను నిర్భయంగా వెల్లడించే వ్యక్తిగా పేరొందిన నిక్కీ హెలీ సెన్సిబుల్ దౌత్యవేత్తగా అమెరికా ఖ్యాతిని ఐరాసలో నిలబెడతారని డెమొక్రాట్లు కూడా భావిస్తుండటంతోనే ఆమెకు ఈ స్థాయిలో మద్దతు లభించింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో ఐరాసపై కూడా ట్రంప్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ట్రంప్ అభిప్రాయాలతో నిక్కీ హెలీ నిర్ద్వంద్వంగా విభేదించారు. రాయబారి పదవీ ధ్రువీకరణ విషయంలో సెనేట్ కమిటీ ముందు హాజరైన నిక్కీ.. రష్యా తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. నాటో కొనసాగింపును స్వాగతించారు. అలాగే ముస్లింలపై నిషేధం విధించాలి, వారి జనాభా రిజిస్టర్‌ను కొనసాగించాలన్న వ్యాఖ్యలను సైతం వ్యతిరేకించారు. ఇవన్ని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయాలను విభేదించేవే. అయినా నిర్భయంగా నిక్కీ తన అభిప్రాయాలను వ్యక్తీకరించడంతో ప్రతిపక్ష డెమొక్రాట్ సభ్యుల మద్దతును కూడా ఆమె పొందగలిగారు. -
మరో ఇండియన్‌కు ట్రంప్ నుంచి గ్రీన్‌సిగ్నల్!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్‌లో ఇండియన్ అమెరికన్లకు తగిన ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తోంది. తాజాగా న్యూయార్క్ దక్షిణ జిల్లాకు చెందిన అమెరికా అటార్నీ ప్రీత్ బరారాను తన హయాంలోనూ కొనసాగించేందుకు ట్రంప్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. తద్వారా మూడో భారత సంతతి అమెరికన్‌ను ఆయన తన అధికార యంత్రాంగంలోకి తీసుకున్నట్టయింది. అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రీత్ బరారాను అమెరికా అటార్నీగా నియమించారు. ఇన్సైడర్ ట్రేడింగ్, సెక్యూరిటీస్ స్కాంలు వంటి కేసుల్లో కఠినంగా వ్యవహరించి పేరుప్రఖ్యాతాలు సాధించిన బరారా బుధవారం ట్రంప్‌ను కలిశారు. ఈ సందర్భంగా ట్రంప్ తనను పదవిలో కొనసాగమని కోరారని, అందుకు తాను సమ్మతి తెలిపానని బరారా విలేకరులకు తెలిపారు. ట్రంప్ న్యూయార్క్ వాసి, గత ఏడేళ్లుగా తమ కార్యాలయం అందిస్తున్న సేవలు ఆయనకు తెలుసునని, అమెరికా అటార్నీగా గత ఏడేళ్లలో నిర్భయంగా, స్వతంత్రంగా, ఎవరి పట్ల పక్షపాతం చూపకుండా తాము సేవలు అందించామని తెలిపారు. త్వరలో అమెరికా పగ్గాలు చేపట్టబోతున్న ట్రంప్ అధికార యంత్రాంగంలో చేరిన మూడో ఇండియన్ అమెరికన్ బరారా. ఇప్పటికే సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హెలీ, మెడికేర్ సర్వీసెస్‌కు చెందిన సీమా వర్మ ట్రంప్ యంత్రాంగంలోనూ కొనసాగేందుకు గ్రీన్ సిగ్నల్ లభించిన సంగతి తెలిసిందే. -
ఐక్యరాజ్య సమితికి ఎన్నారై మహిళ
భారత-అమెరికన్ మహిళ నిక్కీ హేలీకి బంపర్ చాన్స్ తగిలింది. దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్న ఆమె.. ఐక్యరాజ్య సమితికి అమెరికా రాయబారిగా వెళ్లనున్నారు. ఈ మేరకు అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆఫర్‌ను ఆమె అంగీకరించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. దీంతో కేబినెట్ స్థాయిలో ట్రంప్ నియమించిన మొట్టమొదటి మహిళగా ఆమె నిలిచారు. అయితే ట్రంప్ బృందం మాత్రం ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. నిక్కీ హేలీ (44) తల్లిదండ్రులు భారత దేశం నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఆమె రెండోసారి దక్షిణ కరొలినా గవర్నర్‌గా ఉన్నారు. గవర్నర్‌గా ఉన్న పాలనాకాలంలో వాణిజ్య, కార్మిక సమస్యల మీద ప్రధానంగా దృష్టి సారించారు. ఆమెకు దౌత్యపరమైన అనుభవం మాత్రం పెద్దగా లేదు. కానీ, అమెరికా సైన్యం, జాతీయ భద్రత లాంటి అంశాల్లో ఆమె విధానాలు ప్రధానస్రవంతిలోని ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలతో సరిపోతాయని వాషింగ్టన్ పోస్ట్ వ్యాఖ్యానించింది. ప్రధానమైన పదవుల్లో ఎవరెవరిని నియమించాలనే అంశంపై చర్చలలో భాగంగా గత వారం న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో నిక్కీ హేలీని డోనాల్డ్ ట్రంప్ కలిసి చర్చించారు. దాంతో.. మిట్ రోమ్నీతో పాటు ఆమెను కూడా విదేశాంగ మంత్రిని చేయబోతున్నారనే కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు మాత్రం హేలీని ఐక్యరాజ్య సమితికి పంపడం దాదాపు ఖాయమైనట్లే చెబుతున్నారు. -
అమెరికా విదేశాంగ మంత్రిగా ఎన్నారై మహిళ!
వాషింగ్టన్: భారత-అమెరికన్ మహిళ నిక్కీ హేలీకి డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలో కీలక పదవి దక్కే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. ఆమెకు ప్రాధాన్యమున్న మంత్రి పదవి(హై ప్రొఫైల్ పోస్ట్) కట్టబెట్టేందుకు ట్రంప్ సముఖంగా ఉన్నారని స్థానిక మీడియా పేర్కొంది. హేలీ ఈరోజు ట్రంప్ తో భేటీ అవుతారని అధ్యక్ష అధికార బదలాయింపు బృందం ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు. ఆమెతో పాటు మాజీ మంత్రి హెన్సీ కిస్సింగర్, రిటైర్డ్ జనరల్ జాన్ కీనే, అడ్మిరల్ మైక్ రోజర్స్, కెన్ బ్లాక్ వెల్ కూడా ట్రంప్ ను కలవనున్నారని వెల్లడించారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఆయనను ప్రతిరోజు ఎంతోమంది కలుస్తున్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు ట్రంప్ కు తమ విన్నపాలు విన్నవించుకుంటున్నారు. సూచనలు, సలహాలు ఇచ్చేందుకు కొంతమంది వస్తున్నారు. 44 ఏళ్ల నిక్కీ హేలీ రెండో పర్యాయం దక్షిణ కరోలినా రాష్ట్రానికి రెండో పర్యాయం గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు. ఆమెకు విదేశాంగ మంత్రి దక్కే అవకాశముందని ట్రంప్ సన్నిహితడొకరు వెల్లడించారు. మరో ఇండియన్-అమెరికన్ బాబీ జిందాల్ కూడా కేబినెట్ రేసులో ఉన్నారు. రెండో పర్యాయం లూసియానా గవర్నర్ గా పనిచేస్తున్న ఆయనను ఆరోగ్యశాఖ మంత్రిగా నియమించే అవకాశాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిక్కీ హేలీ, జిందాల్.. ట్రంప్ కేబినెట్లో స్థానం దక్కితే ఆ పదవి పొందిన తొలి భారతీయ అమెరికన్లు రికార్డులకెక్కుతారు. -
'అలాంటి అవకాశమే లేదు'
వాషింగ్టన్: అమెరికా ఉపాధ్యక్ష పదవి రేసులో తాను ఉన్నట్టు జరుగుతున్న ప్రచారాన్ని సౌత్ కరోలినా ఇండియన్-అమెరికన్ గవర్నర్ నిక్కీ హేలీ తోసిపుచ్చారు. రిపబ్లిక్ పార్టీ తరపున ఆమెకు ఉపాధ్యక్ష పదవి లభించే అవకాశముందని వార్తలు వచ్చాయి. అలాంటి అవకాశమే లేదని ఆమె కొట్టిపారేశారు. 'నా ప్లేటు ఫుల్ గా ఉంది. గవర్నర్ బాధ్యతలతో సంతృప్తిగా ఉన్నాను. నా కుమార్తె వచ్చే ఏడాది కాలేజీలో చేరబెతోంది. నా కుమారుడు స్కూల్ మధ్యలో ఉన్నాడు. నేను ఎంతో ఇష్టపడే రాష్ట్రం ఉంది. ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ'ని ఫాక్స్ న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అమెరికాకు గొప్ప వ్యక్తి అధ్యక్షుడు కాబోతున్నారని 44 ఏళ్ల హేలీ చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావిస్తున్న ఫ్లోరిడా సెనేటర్ మార్ కో రుబియోకు ఆమె మద్దతు ప్రకటించారు. -
ఆమెను అమెరికా నుంచి వెళ్లగొట్టాలి!
వాషింగ్టన్: భారత సంతతికి చెందిన అమెరికన్, రిపబ్లికన్ గవర్నర్ నిక్కీ హెలీపై అదే పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు విద్వేషాన్ని ఎగజిమ్ముతున్నారు. రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు వలసవచ్చే ప్రజల విషయంలో అనుసరిస్తున్న విపరీత ధోరణిని పరోక్షంగా తప్పుబడుతూ నిక్కీ హెలీ వ్యాఖ్యలు చేశారు. భారత్ నుంచి వలస వచ్చిన తమ కుటుంబం అమెరికాలో ఎలా స్థిరపడిందో చెప్తూ.. అలా సక్రమంగా అగ్రరాజ్యానికి వలసవచ్చే వారికి భరోసా కల్పించాలిగానీ, అమెరికా తమను గెంటివేస్తుందన్న భావన కలిగించరాదని ఆమె పేర్కొన్నారు. దేశాన్ని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన చివరి ప్రసంగంపై సౌత్ కరోలినా రాష్ట్రం గవర్నర్ అయిన నిక్కీ హెలీ 9 నిమిషాలపాటు తన ప్రతిస్పందన తెలియజేశారు. ఈ సందర్భంగా తన భారత్, అమెరికా మూలాలను ఆమె గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం అస్తవ్యస్తంగా ఉన్న అమెరికా ఇమ్మిగ్రేషన్ (వలస) విధానాన్ని సంస్కరించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. అంతేకానీ అమెరికాకు రాకుండా భయపెట్టేలా ఆగ్రహపూరితమైన ధ్వనులు వినిపించడం సరికాదని పరోక్షంగా ట్రంప్ వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. అలా జరిగితే అమెరికా చట్టాలకు కట్టుబడి ఇక్కడ చిత్తశుద్ధితో ఎవరూ పనిచేయబోరని, అమెరికా తమను స్వాగతించడం లేదన్న భావన వారిలో కలుగుతుందని అన్నారు. అక్రమ వలసను నిరోధిస్తూనే.. అన్ని పత్రాలతో చట్టబద్ధంగా అమెరికాకు వచ్చేవారిని మతం, జాతితో సంబంధం లేకుండా స్వాగతించేలా ఈ విధానం ఉండాలని ఆమె స్పష్టం చేశారు. పారిస్ దాడుల నేపథ్యంలో అమెరికాకు ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ట్రంప్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిక్కీ హెలీ వ్యాఖ్యలు ట్రంప్ మద్దతుదారులకు ఆగ్రహం కలిగించాయి. ట్రంప్ గట్టి సపోర్టర్, టీవీ కామెంటర్ ఆన్ కౌల్టర్ ఏకంగా 'నిక్కీ హెలీని అమెరికా నుంచి ట్రంప్ వెళ్లగొట్టాలి' అని ట్విట్టర్లో అన్నారు. అదేవిధంగా ట్రంప్ మద్దతుదారులు పలువురు సోషల్ మీడియాలో నిక్కీకి వ్యతిరేకంగా విద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. -
చండీగఢ్ కు విచ్చేసిన నిక్కీ హేలీ
చండీగఢ్: భారత సంతతికి చెందిన దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ గురువారం చండీగఢ్ కు వచ్చారు. పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ తో ఆమె భేటీ అయ్యారు. ఏరో స్పేస్, ఫార్మా, టూరిజం, అగ్రో ప్రాసెసింగ్ రంగాల్లో పంజాబ్ కు సాయపడతామని బాదల్ తో చెప్పారు. నైపుణ్యభివృద్ధి శిక్షణలో తమ రాష్ట్రం 93 శాతం సక్సెస్ సాధించిందని నిక్కీ హేలీ ఈ సందర్భంగా తెలిపారు. ఏరో స్పేస్, హాస్పిటాలిటీ రంగాల్లో ఉపాధి కల్పనలో తాము సాధించిన అభివృద్ధి గురించి ఈ సందర్భంగా వివరించారు. వివిధ రంగాల్లో కలిసి పనిచేయడం, ఉమ్మడిగా ప్రయోజనం పొందాలని దక్షిణ కరోలినా, పంజాబ్ భావిస్తున్నాయని బాదల్ తెలిపారు. కాగా, స్వర్ణ దేవాలయంలో నిక్కీ హేలీ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నాలుగు దశాబద్దాలు తర్వాత తమ పూర్వికుల రాష్టానికి వచ్చారామె. ఆమె తండ్రి అమృతసర్ లోని వెర్కా ప్రాంతంలో నివసించే వారు. 1960 దశకంలో ఆయన అమెరికా వలస వెళ్లారు. రెండేళ్ల వయసున్నప్పడు హేలీ పంజాబ్ వచ్చారు. -
మళ్ళీ గెలిచిన నిక్కీ, హారిస్
వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు కొందరు తమ తమ స్థానాల్లో విజయ బావుటా ఎగురవేశారు. దక్షిణ కరొలినా గవర్నర్ నిక్కీ హేలీ రిపబ్లికన్ పార్టీ తరఫున, కాలిఫోర్నియా అటార్నీ జనరల్ కమలా హారిస్ డెమోక్రటిక్ పార్టీ తరఫున వరుసగా రెండోసారి గెలిచారు. నిక్కీ హెలీ 57.8 శాతం ఓట్లతో తన సమీప ప్రత్యర్థి విన్సెంట్ షెహీన్పై గెలిచారు. ఈ ఎన్నికల్లో దాదాపు 30 మంది దాకా ఇండియన్ అమెరికన్లు పోటీ చేశారు. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా హవా తగ్గడంతో డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేసినవారిలో చాలామంది ఓడిపోయారు. వారిలో ఇప్పటివరకూ 8 మంది మాత్రమే గెలిచారు. 23 ఏళ్లకే కాంగ్రెస్‌కు ఎన్నిక అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున 23ఏళ్ల నీరజ్ అంటానీ ఒహాయో నుంచి ప్రతినిధుల సభకు ఎన్నికై సంచలం సృష్టించారు. గత ఏడాదే ఒహాయో స్టేట్ వర్సిటీనుంచి పొలిటికల్ సైన్స్‌లో పట్టా పుచ్చుకున్న నీరజ్.. అమెరికాలోనే అతి పిన్న వయస్కుడైన కాంగ్రెస్ సభ్యుడుగా రికార్డుల కెక్కారు. రిపబ్లికన్ పార్టీ తరఫునే కనెక్టికట్నుంచి రిటైర్డ్ డాక్టర్ ప్రసాద్ శ్రీనివాసన్, ‘16 డిస్ట్రిక్ట్’ నుంచి జనక్ జోషీ ఎన్నికయ్యారు. డెమెక్రటిక్ పార్టీ తరఫున మిచిగన్నుంచి శ్యామ్ సింగ్ గెలిచారు. మేరీల్యాండ్‌లో కుమార్ భార్వే, అరుణా మిల్లర్ తమ సీట్లు దక్కించుకున్నారు. వాషింగ్టన్ స్టేట్‌లో డెమెక్రాట్ ప్రమీలా జయపాల్ సెనేట్‌కు ఎన్నికయ్యారు. తులసీ గబ్బార్డ్ గెలుపు ఇక, అమెరికన్ కాంగ్రెస్‌లో ఏకైక హిందూ సభ్యురాలైన తులసీ గబ్బార్డ్.. హవాయ్ సీటునుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున మంచి ఆధిక్యంతో తిరిగి ఎన్నికయ్యారు. రిపబ్లికన్ అభ్యర్థి కవికా కౌలేపై తులసీ గెలిచారు. ఆమె తొలిసారి 2012లో ప్రతినిధుల సభకు ఎన్నిక య్యారు. -
నిక్కీ హేలీకి నిధులు సేకరిస్తా: జిందాల్
దక్షిణ కరోలినా గవర్నర్‌గా మరోసారి ఎన్నికయ్యేందుకు నిక్కీ హేలీకి సహకరించాలని ప్రముఖ కన్జర్వేటివ్ నాయకులను లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ కోరారు. తన స్నేహితురాలైన నిక్కీ హేలీ ద్వితీయ పర్యాయం దక్షిణ కరోలినా గవర్నర్ పీఠాన్ని అధిష్టించేందుకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన మద్దతుదారులకు బాబీ జిందాల్ ఈ-మెయిల్ సందేశం పంపారు. 41 ఏళ్ల నిక్కీ హేలీ ప్రస్తుతం దక్షిణ కరోలినా గవర్నర్‌గా కొనసాగుతున్నారు. చిన్న వయసులో అమెరికాలో గవర్నర్ పదవిని చేపట్టిన భారత సంతతి మహిళగా ఆమె ఖ్యాతికెక్కారు. కాగా, మరోసారి గవర్నర్ పదవిపై గురిపెట్టిన నిక్కీ హేలీ... బాబీ జిందాల్, టెక్సాస్, విస్కాన్సిన్ గవర్నర్లు సమక్షంలో సోమవారం ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిక్కీ హేలీ ప్రచారానికి నిధులు సేకరించేందుకు సిద్ధగా ఉన్నానని ఈ సందర్భంగా బాబీ జిందాల్ ప్రకటించారు. 20 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ నిధులిచ్చి సహకరించాలని రిపబ్లికన్లను ఆయన కోరారు.