న్యూయార్క్: భారత్, పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు యత్నిస్తామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పారు. ‘ఉద్రిక్తతలను తగ్గించే యత్నాల్లో మావంతు పాత్ర ఏమిటో కనుగొనేందుకు మా ప్రభుత్వం చర్చిస్తుంది.. ఏదో ఒకటి జరిగేవరకు వేచిచూడం’ అని అన్నారు. ఈ ప్రయత్నంలో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ భాగమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు.
ఐరాస భద్రతా మండలికి సంబంధించి ఏప్రిల్ నెలకుగాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన హేలీ మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల కోసం భారత్, పాక్‌లను అమెరికా ఒప్పిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హేలీ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రరహిత వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం తమ విధానమని, అయితే హింస ఇంకా కొనసాగుతూనే ఉందని విదేశాంగ ప్రతినిధి చెప్పారు.
భారత్–పాక్ ఉద్రిక్తత నివారణకు కృషి చేస్తాం
Published Wed, Apr 5 2017 2:45 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM
Advertisement