UN Security Council
-
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం: భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్ కోరారు. ‘‘మేం(భారత్) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.#IndiaAtUN PR @AmbHarishP delivered 🇮🇳’s statement at the Plenary Meeting of the General Assembly on ‘Question of equitable representation on and increase in the membership of the Security Council and other matters related to the Security Council’ today. pic.twitter.com/1SDKiTSVtr— India at UN, NY (@IndiaUNNewYork) November 11, 2024..1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం. ..అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారు ఏళ్ల నుంచి ప్రకటనలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చలు జరపటానికి మాత్రమే పరిమితం అయింది. నిర్దిష్టమైన ముగింపు లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అనే అంశం..ఎటువంటి మార్పలు కోరుకోని యథాతథ స్థితికి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముందుకు తెచ్చిన వాదన. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. -
‘భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం భారత్ హక్కు’
ఢిల్లీ: రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని తగ్గించటంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుందని బ్రిటన్ మాజీ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరాన్ అన్నారు. ‘దీ ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్’లో పాల్గొన్న డేవిడ్ కామెరాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వ్యవహరించే సత్తా భారతదేశానికి ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు గడుస్తోంది. కాల్పుల విరమణ చర్చల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. భారతదేశం మధ్యవర్తిత్వం వహించే స్థితిలో ఉంది. కానీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బలవంతంగా భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అనుమతి ఉండదనే విషయాన్ని తెలుసుకోవాలి’’అని అన్నారు.అదేవిధంగా ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్ల విషయంలో ప్రస్తుతం భారత్ దృక్పథం చాలా అవసరమని అన్నారు. ‘‘ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత దేశానికి శాశ్వత సభ్యత్వం లభించాలి. ప్రపంచానికి బలమైన ఆర్థిక వృద్ధి, ప్రజాస్వామ్యం, వాతావరణ మార్పులను ఎదుర్కోవటానికి భారత్ దృక్పథం అవసరం. ఈ అంశాలను సమర్థవంతంగా ఎదుర్కొవటంలో భారతదేశం ఒక ప్రపంచ దేశాలకు ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ శతాబ్దంలో ఏదో ఒక దశలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే భారతదేశపు ఎదుగుదలను కనబరుస్తోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత స్థానం ఉండాలని 2015 ప్రకటన చేశాను. యూఎన్‌ఏలో సభ్యత్వం పొందటం.. భారతదేశం హక్కు’ అని అన్నారు. -
నస్రల్లా మృతిపై బైడెన్ సంచలన కామెంట్స్
బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులు, నస్రల్లా మృతిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్‌ను కోరింది. దీంతో, భదత్రా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.మరోవైపు.. హిజ్బులా చీఫ్ హనస్ నస్రల్లా హత్యపై తాజాగా అమెరికా స్పందించింది. నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..‘గతేడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ రెడీ అయ్యింది. హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుంది. నస్రల్లా కారణంగా హిజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతిచెందారు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో బీరుట్లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే, బీరుట్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. దీంతో, బీరుట్‌లోని అమెరికన్లు కొందరు స్వదేశం బాటపట్టినట్టు సమాచారం.మరోవైపు.. రాబోయే రోజుల్లో తమ శత్రువులపై దాడులు మరింత పెరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా 33 మంది మరణించారు. అలాగే, 195 మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ కారణంగా గత రెండు వారాల్లో దాదాపు 1000 మంది మరణించగా.. 6000 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు -
Israel-Hamas War: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ
ఐక్యరాజ్యసమితి: ఇజ్రాయెల్–హమాస్ మధ్య వివాదం మొదలైన అయిదు నెలల తర్వాత సోమవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుత రంజాన్ మాసంలో గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని సంబంధిత వర్గాలను కోరుతూ ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని ఆమోదించింది. 15 సభ్యదేశాలతో కూడిన మండలిలోని 10 తాత్కాలిక సభ్యదేశాలు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. రష్యా, చైనా సహా 14 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. ఎవరూ వ్యతిరేకించనప్పటికీ శాశ్వత సభ్యదేశం అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. ‘గాజా విషయంలో ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బేషరతుగా బందీలందరినీ విడుదల చేయాలని కోరింది’అని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ‘ఎక్స్’లో తెలిపారు. అలాగే, గాజాలో చిక్కుకున్న పాలస్తీనియన్ల వైద్య, ఇతర మానవతా అవసరాలను పరిష్కరించాలని, నిర్బంధించిన వారందరికీ అంతర్జాతీయ చట్టాల ప్రకారం కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత సంబంధిత వర్గాలపై ఉందని తీర్మానం పేర్కొంది. ‘ఈ తీర్మానాన్ని కచి్చతంగా అమలు చేయాల్సిందే. వైఫల్యం క్షమించరానిది’ అంటూ అని గుటెరస్ వ్యాఖ్యానించారు. మండలి తీర్మానంపై ఇజ్రాయెల్ తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉందని ఐరాస హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ ల్యూయిస్ పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజల ఆకలిచావులను ఆపేందుకు మానవతా సాయం అందించేందుకు వీలు కల్పించాలని, చట్ట విరుద్ధ దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌ను కోరారు. అమెరికా పర్యటనను రద్దు చేసుకున్న నెతన్యాహు ఐరాస తీర్మానానికి నిరసనగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఉన్నత స్థాయి బృందంతో తన అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. పాలస్తీనా శరణార్థుల ఏజెన్సీకి సహకారం నిలిపివేయాలని కూడా ఇజ్రాయెల్ నిర్ణయించింది. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడులు చేయడం, ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి యుద్ధంతో విరుచుకుపడుతుంటం తెలిసిందే. -
గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్
ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. ‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు హమాస్ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్ పౌరులు మృతి చెందారు. ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. -
గాజాలో కాల్పుల విరమణ.. ‘యూఎన్’లో వీగిన అమెరికా తీర్మానం
న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం. ఇదీ చదవండి.. మాస్కోలో ఐసిస్ మారణహోమం -
కాల్పుల విరమణపై తీర్మానం..అమెరికా వీటో!
న్యూయార్క్: గాజాలో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి రావాలంటూ శుక్రవారం ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా మోకాలడ్డింది యుద్ధంతో అతలాకుతలమవుతున్న గాజాలో తక్షణమే కాల్పుల విరమణ జరగాలని, బందీలను హమాస్ మిలిటెంట్లు బేషరతుగా వెంటనే విడిచిపెట్టాలంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేసిన ప్రతిపాదనకు ఐరాసలోని 90 సభ్యదేశాలు మద్దతు పలికాయి. ఆ దేశం మండలిలో ప్రవేశపెట్టిన ఆ తీర్మానానికి మొత్తం 15 దేశాలకు గాను 13 దేశాల ప్రతినిధులు అనుకూలంగా ఓటేశారు. మరో శాశ్వత సభ్యదేశం బ్రిటన్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. గాజాలో మానవతా సంక్షోభ నివారణ నిమిత్తం ఇటీవల ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ అసాధారణ అధికారాన్ని ఉపయోగించారు. తక్షణమే మానవతా కోణంలో కాల్పుల విరమణ జరగాలని, పౌరుల రక్షణ కోసం, అత్యవసర సాయం అందజేయడానికి అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకోవాలని మండలి దేశాలకు గుటెరస్ పిలుపునిచ్చారు. యూఎన్ ఛార్టర్‌లోని ఆర్టికల్ 99 కింద ప్రత్యేక అధికారంతో అంతర్జాతీయంగా ఆందోళనలను కలిగించే పరిస్థితుల్లో భద్రతా మండలిని సమావేశ పరచవచ్చు. దీనిలో భాగంగా సమావేశమైన మండలిలో యూఏఈ తీర్మానంపై ఓటింగ్ జరిగింది. మండలిలో శాశ్వత సభ్య దేశమైన అమెరికా తన వీటో అధికారంతో ఆ తీర్మానాన్ని అడ్డుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు కాల్పుల విరమణను గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. అది హమాస్ పుంజుకునేందుకు ఉపయోగపడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆ దేశ ప్రతినిధి రాబర్ట్ వుడ్ మండలిలో మాట్లాడుతూ.. ‘ఈ తీర్మానం వల్ల క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం ఉండదు. ఇజ్రాయెల్, పాలస్తీనా ప్రజలు శాంతి, భద్రతల మధ్య జీవించాలని అమెరికా బలంగా కోరుకుంటోంది. అయితే, అస్థిరమైన కాల్పుల విరమణకు అంగీకరిస్తే హమాస్ మరో యుద్ధానికి ప్రణాళిక రచిస్తుంది’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ముసాయిదాలో సవరణలు చేయాలని అమెరికా అంటోంది. మండలిలో తీర్మానాన్ని అమెరికా అడ్డుకోవడంపై యూఏఈ రాయబారి మహ్మద్ అబుషాహబ్ విచారం వ్యక్తం చేశారు. -
గాజాలో ఆగని వేట
గాజా స్ట్రిప్/జెరూసలేం: ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మంగళవారం నెల రోజులకు చేరుకుంది. సోమవారం రాత్రి నుంచి ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై వైమానిక దాడులు నిర్వహించింది. ఖాన్ యూనిస్, రఫా, డెయిర్ అల్–బలా నగరాల్లో పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర గాజాలోని గాజీ సిటీలోకి ఇజ్రాయెల్ సేనలు అడుగుపెట్టినట్లు తెలిసింది. యుద్ధంలో ఇప్పటిదాకా గాజాలో 4,100 మంది చిన్నారులు సహా 10,328 మంది, ఇజ్రాయెల్‌లో 1,400 మందికిపైగా జనం మరణించారు. గాజాలో హమాస్‌ను అధికారం నుంచి కూలదోయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రభుత్వం వ్యూహాలకు పదును పెడుతోంది. మిలిటెంట్ల కోసం ఇజ్రాయెల్ సైన్యం వేట కొనసాగిస్తోంది. ఉత్తర గాజాపై దృష్టి పెట్టింది. గాజా జనాభా 23 లక్షలు కాగా, యుద్ధం మొదలైన తర్వాత 70 శాతం మంది నిరాశ్రయులయ్యారు. ఆహారం, నీరు, ఔషధాలు, నిత్యావసరాలు లేక క్షణమొక యుగంగా కాలం గడుపుతున్నారు. మరో ఐదుగురు బందీల విడుదల ఇప్పటికే నలుగురు బందీలను విడుదల చేసిన హమాస్ మిలిటెంట్లు మరో ఐదుగురికి విముక్తి కలిగించారు. అక్టోబర్ 7న ఇజ్రాయెల్ దాడిచేసిన మిలిటెంట్లు దాదాపు 240 మందిని బందీలుగా గాజాకు తరలించడం తెల్సిందే. గాజా రక్షణ బాధ్యత మాదే: నెతన్యాహూ హమాస్ మిలిటెంట్లపై యుద్ధం ముగిసిన తర్వాత గాజా స్ట్రిప్ రక్షణ బాధ్యతను నిరవధికంగా ఇజ్రాయెల్ తీసుకుంటుందని ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. తద్వారా గాజా స్ట్రిప్ మొత్తం ఇజ్రాయెల్ నియంత్రణ కిందికి వస్తుందని సంకేతాలిచ్చారు. గాజాను తమఅదీనంలోకి తీసుకొచ్చేందుకు ఇజ్రాయెల్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ వార్తా సంస్థ ఇంటర్వ్యూలో నెతన్యాహూ మాట్లాడారు. గాజాలోకి మానవతా సాయాన్ని చేరవేయడానికి లేదా హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడిపించడానికి వీలుగా మిలిటెంట్లపై యుద్ధానికి స్వల్పంగా విరామం ఇచ్చేందుకు అంగీకరించారు. అయితే, బందీలను హమాస్ విడిచిపెట్టేదాకా గాజాలో కాల్పుల విరమణ పాటించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిల్ నిల్వలు ఖాళీ! గాజాలోకి పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఇజ్రాయెల్ అనుమతి ఇవ్వడం లేదు. గాజాలో ఇంధనం నిల్వలు పూర్తిగా నిండుకున్నట్లు సమాచారం. ఇంధనం లేక పరిస్థితి మరింత దిగజారుతోందని స్థానిక అధికారులు ఆందోళన చెందుతున్నారు. గాజాలో 35 ఆసుపత్రులు ఉండగా, వీటిలో 15 ఆసుపత్రుల్లో వైద్య సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇజ్రాయెల్ దాడులతోపాటు ఇంధనం లేకపోవడమే ఇందుకు కారణం. మిగిలిన ఆసుపత్రులు పాక్షికంగానే పని చేస్తున్నాయి. సమస్య పరిష్కారంలో భద్రతా మండలి విఫలం నెల రోజులుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి పరిష్కారం సాధించడంలో ఐక్యరాజ్యసమితి భదత్రా మండలి మరోసారి విఫలమైంది. తాజాగా మండలిలో రెండు గంటలకుపైగా చర్చ జరిగింది. సభ్యదేశాలు భిన్న వాదనలు వినిపించాయి. ఏకాభిప్రాయానికి రాకపోవడంతో తీర్మానం ఆమోదం పొందలేదు. మానవతా సాయాన్ని గాజాకు చేరవేయడానికి అవకాశం కల్పించాలని ఇజ్రాయెల్‌కు అమెరికా సూచించింది. రఫా పట్టణంలో ఇజ్రాయెల్ దాడి తర్వాత స్థానికుల ఆక్రందన -
తుర్కియే వక్రబుద్ధి.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ అంశం
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి 78వ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా తుర్కియే దేశాధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డొగాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. భారత్ పాకిస్తాన్ వ్యవహారాల్లో తలదూర్చవద్దని భారత్ పలుమార్లు హెచ్చరించినా కూడా పట్టించుకోని ఆయన తాజా సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి దక్షిణాసియాలో శాంతి స్థాపన జరగాలంటే భారత్ పాక్ మధ్య సంధి కుదర్చాలని అన్నారు. సహకరిస్తాం..? న్యుయార్క్ వేదికగా జరుగుతున్న ఐక్యరాజ్యసమితి 78వ అసెంబ్లీ సమావేశాల్లో తుర్కియే అధ్యక్షుడు కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దక్షిణాసియా ప్రాంతంలో ప్రాంతీయ శాంతి, సుస్థిరత, శ్రేయస్సు స్థాపించబడాలంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చర్చలు జరగాలని ఇరుదేశాల పరస్పర సహకారం ద్వారా కశ్మీర్లో సుస్థిరమైన శాంతని నెలకొల్పాలని అన్నారు. ఈ చర్చలకు తుర్కియే సహకారం ఉంటుందని చెప్పుకొచ్చారు. భారత్ పాకిస్తాన్ దేశాలు స్వాతంత్య్రం, సార్వభౌమాధికారం సాధించి 75 ఏళ్లు పూర్తయినా రెండు దేశాల మధ్య శాంతి సంఘీభావం స్థాపించబడాలపోవడం దురదృష్టకరమని అన్నారు. కశ్మీర్లో శాశ్వత శాంతితో పాటు శ్రేయస్సు కూడా స్థాపించబడలని కోరుకుంటూ ప్రార్ధిస్తున్నానన్నారు. చెప్పినా వినకుండా.. ఐక్యరాజ్యసమితిలో కశ్మీర్ ప్రస్తావన తీసుకురావద్దని భారత్ గతంలో కూడా అనేక మార్లు తుర్కియేను హెచ్చరించింది. ఒకవేళ వారు ఆ పని చేస్తే తాము సైప్రస్ అంశాన్ని లేవనెత్తుతామని కూడా తెలిపింది. ఇటీవల జరిగిన జీ20 సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ తుర్కియే అధ్యక్షుడు ఎర్డొగాన్‌తో వాణిజ్యం, మౌలిక సదుపాయాల సంబంధాలను బలోపేతం చేయడానికి చర్చలు కూడా జరిపారు. అయినా కూడా ఎర్డొగాన్ ఐక్యరాజ్య సమితిలో తమ మిత్రదేశమైన పాకిస్తాన్‌కు వత్తాసు పలికారు ఆ దేశ అధ్యక్షుడు. ప్రపంచం వారికంటే పెద్దది.. సమావేశాల్లో ఎర్డొగాన్ మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ పాత్ర పోషించడం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఐదు శాశ్వత సభ్యులతో పాటు తాత్కాలిక సభ్యులుగా ఉన్న 15 దేశాలను కూడా శాశ్వత సభ్యులుగా చేయాలని డిమాండ్ చేశారు. ఈ 20 సభ్యదేశాలను రొటేషన్ పధ్ధతిలో శాశ్వత సభ్యదేశాలుగా కొనసాగించాలని అమెరికా, బ్రిటన్, చైనా, రష్యా, ఫ్రాన్స్ కన్నా ప్రపంచం చాలా పెద్దదని ఆయన అన్నారు. President of Turkey's @RTErdogan, powerful speech at the United Nations, advocating for the rights and peace in Kashmir, exemplifies how true leaders take action. "Beyond @ImranKhanPTI, Have any other Pakistani leaders raised their voices on the Kashmir issue at the UN? And the… pic.twitter.com/S79NZsdJiX — Sanaullah khan (@Saimk5663) September 20, 2023 ఇది కూడా చదవండి: ట్రూడో ఆరోపణలు తీవ్రమైనవే: అమెరికా -
ఆ హోదాను తొలగించాలని ఉక్రెయిన్ పిలుపు: షాక్‌లో రష్యా
ఐక్యారాజ్యసమితి నుంచి మొత్తంగా రష్యాను తొలగించాలని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ సోమవారం పిలుపునిచ్చింది. దురాక్రమణ యుద్ధాలకు దిగుతున్న రష్యా యూఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యుడిగా ఏ విధంగా తీర్మానాన్ని వీటో చేయగలదని ప్రశ్నించింది. అంతేగాదు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రష్యా ఫెడరేషన్‌కు శాశ్వత సభ్యుడిగా ఉన్న హోదాను తొలగించడమే కాకుండా మొత్తంగా ఐక్యరాజ్యసమితి నుంచే తీసేయాలని యూఎన్‌లోని సభ్యదేశాలకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. 1991లో సోవియట్ యూనియన్‌తో బ్రేక్అప్ అయిన తర్వాత నుంచే యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో యూఎస్ఎస్ఆర్ స్థానాన్ని చట్టవిరుద్ధంగా ఆక్రమించిందని పేర్కొంది. మాస్కో ఇతర దేశాల భూభాగాలను స్వాధీనం చేసుకుంటూ ఐక్యరాజ్యసమితిలో గత మూడు దశాబ్దాలుగా తన అక్రమ ఉనికిని చాటుకుంటుందంటూ ఉక్రెయిన్ ఆరోపణలు గుప్పించింది. వాస్తవానికి యూఎస్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సీట్లతో కూడిన ఐదుగురు శాశ్వత సభ్యులకు యూఎన్ తీర్మానాలపై వీటో అధికారం కలిగి ఉన్నారు. (చదవండి: తైవాన్‌కి చుక్కలు చూపించేలా.. జల, వాయు మార్గాల్లో చైనా సైనిక విన్యాసాలు) -
రష్యా ఆరోపణ.. డర్టీ బాంబ్ పంచాయితీ భద్రతా మండలికి!
ఉక్రెయిన్ దురాక్రమణ నేపథ్యంలో.. రష్యా సంచలన ఆరోపణలకు దిగింది. రష్యా ఆక్రమిత ‘ఖేర్సన్’లో ఉక్రెయిన్ సైన్యం డర్టీ బాంబు ప్రయోగించబోతోందని ఆరోపించింది. ఈ మేరకు ఇప్పటికే ఖేర్సన్ను ఖాళీ చేయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది కూడా. అయితే పాశ్చాత్య దేశాలు రష్యా ఆరోపణలను ఖండించగా.. కౌంటర్‌కు మాస్కో సిద్ధమైంది. ఈ పంచాయితీని ఏకంగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తేల్చుకుంటామని తేల్చేసింది. ఈ మేరకు.. ఐరాసలో రష్యా రాయబారి వస్సెయిలీ నెబెంజియా.. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్‌కు ఓ లేఖ రాశారు. కీవ్(ఉక్రెయిన్ రాజధాని) బలగాలు డర్టీ బాంబు ప్రయోగానికి సిద్ధమయ్యాయని, డర్టీ బాంబు ప్రయోగం అనేది అణు ఉగ్రవాదం కిందకు వస్తుందని, బలప్రయోగాన్ని నిలువరించాల్సిన బాధ్యత ఐరాస మీద ఉందని పేర్కొంటూ లేఖలో నెబెంజియా ఆరోపించారు. సోమవారం రాత్రి ఈ లేఖ సెక్రటరీ జనరల్‌కు అందినట్లు తెలుస్తంఓది. ఇక మంగళవారం ఈ వ్యవహారంపై భద్రతా మండలిలో తేల్చుకుంటామని రష్యా అంటోంది. ఇక ఉక్రెయిన్ దళాలు.. రష్యా ఆక్రమిత ఖేర్సన్ వైపు వేగంగా కదులుతున్నాయి. దీంతో ఆ ప్రాంతాన్ని రష్యా ఖాళీ చేయిస్తోంది. ఆదివారం ఖేర్సన్కు 35 కిలోమీటర్ల దూరంలోని మైకోలాయివ్(ఉక్రెయిన్ పరిధిలోనే ఇంకా ఉంది)పై రష్యా మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ దాడిలో ఓ అపార్ట్‌మెంట్‌ను సర్వనాశనం అయ్యింది. అదే సమయంలో ఖేర్సన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితులు ఏమాత్రం బాగోలేవని, స్థానికులపై దోపిడీలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ సైన్యం ఆరోపిస్తోంది. ఒకవైపు ఉక్రెయిన్ దళాలు వేగంగా రష్యా ఆక్రమిత ప్రాంతాల వైపు దూసుకొస్తుంటే.. మరోవైపు సుమారు ఆరు లక్షల మందిని సైన్యం కోసం రష్యా సిద్ధం చేస్తోంది. ఈ పరిణామాలతో యుద్ధ వాతావరణం మరోసారి వేడెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. 67 ఏళ్ల తర్వాత స్నానం చేశాడు.. ప్రాణం పోయింది!!! -
వాళ్ల అండ చూసే కిమ్ రెచ్చిపోతున్నాడు
న్యూయార్క్: అణు ఆయుధాలు.. వరుసగా బాలిస్టిక్ క్షిపణి పరీక్షలతో ఉత్తర కొరియా ఏమాత్రం తగ్గడం లేదు. మంగళవారం జపాన్ వైపుగా మధ్యంతర శ్రేణి క్షిపణిని పరీక్షించి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రెండు రోజులు తిరగకముందే.. మరో పరీక్షను చేపట్టింది. గురువారం తూర్పు జలాల వైపుగా మరో బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించింది ఉత్తర కొరియా. ఈ విషయాన్ని దక్షిణ కొరియా మిలిటరీ అధికారిక వార్తా సంస్థ యోన్హప్ ధృవీకరించింది. ప్యోంగ్యాంగ్ కాలమానం ప్రకారం.. గురువారం ఉదయం ఆరు-ఆరున్నర గంటల మధ్యలో ఈ క్షిపణి ప్రయోగం జరిగింది. ఇక ఉత్తర కొరియా ఇలా గ్యాప్ లేకుండా క్షిపణి పరీక్షలతో చెలరేగిపోవడంపై అగ్రరాజ్యం ఆగ్రహం వెల్లగక్కింది. చైనా, రష్యాల అండ చూసుకునే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడంటూ ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఐక్యరాజ్య సమితిలో అమెరికా శాశ్వత రాయబారి లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్, భద్రతా మండలిలో ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. చైనా, రష్యాల పేర్లను ప్రస్తావించకుండానే.. పరోక్షంగా ఆమె ఈ ఆరోపణలు గుప్పించారు. ‘‘ఐరాస భద్రతా మండలిలోని శాశ్వత సభ్యత్వం ఉన్న రెండు దేశాలు.. ఉత్తర కొరియాకు రక్షక కవచంలా పని చేస్తున్నాయి. అణు ఆయుధాలు, క్షిపణి పరీక్షలను ఖండిస్తూ ఉత్తర కొరియాపై ఆంక్షలు విధిస్తూ కట్టడి ద్వారా ఐరాస ప్రయత్నిస్తుంటే.. ఆ రెండు దేశాలు మాత్రం ఉత్తర కొరియాను ఆంక్షల నుంచి రక్షించే యత్నం చేస్తున్నాయి. ఆ రెండు దేశాల సంరక్షణలోనే ఉత్తర కొరియా ఉంది. వాళ్లను చూసే కిమ్ జోంగ్ ఉన్ రెచ్చిపోతున్నాడు అంటూ ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. దాదాపు ఐదేళ్ల తర్వాత జపాన్ మీదుగా క్షిపణి ప్రయోగం చేపట్టి.. తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది ఉత్తర కొరియా. ఈ నేపథ్యంలో.. ముందస్తు జాగ్రత్తగా అక్కడి స్థానికులు ఖాళీ చేయించారు జపాన్ అధికారులు. అవసరమైతే త్రైపాక్షిక సంబంధాల ద్వారా అమెరికా-జపాన్-దక్షిణ కొరియాలు.. ఈ కవ్వింపు చర్యలను తిప్పి కొడతాయని వైట్ హౌజ్ ఓ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు ఉత్తర కొరియా కవ్వింపు చర్యలకు ప్రతిగా అమెరికా, దక్షిణ కొరియాలు నాలుగు మిస్సైల్స్‌ను తూర్పు తీర ప్రాంతం వైపు బుధవారం ఉదయం ప్రయోగించాయి. గత వారం.. అమెరికా-దక్షిణ కొరియాలు సంయుక్తంగా చేపట్టిన నావల్ డ్రిల్స్‌కు ప్రతిగా ఉత్తర కొరియా వరుసగా మిస్సైల్ పరీక్షలను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ఏకంగా రికార్డు స్థాయిలో క్షిపణి ప్రయోగాలను చేపడుతున్నాడు కిమ్ జోంగ్ ఉన్. ఇదీ చదవండి: నోబెల్ శాంతి బహుమతి రేసులో భారతీయులు!? -
Russia-Ukraine War: ‘రష్యా రిఫరెండం’పై ఓటింగ్‌కు భారత్ దూరం
ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌లోని 4 కీలక ప్రాంతాలను వీలినం చేసుకోవడమే లక్ష్యంగా రష్యా నిర్వహించి ‘చట్టవిరుద్ధ రిఫరెండం’పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఓటింగ్ జరిగింది. భారత్ ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా దూరంగా ఉండిపోయింది. రష్యా మాత్రం వీటో చేసింది. రష్యా రిఫరెండాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, ఆల్బేనియా దేశాలు భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనిపై శుక్రవారం ఓటింగ్ నిర్వహించారు. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపొరిజాజియాలను రష్యాలో విలీనం చేస్తూ ఒప్పంద పత్రాలపై పుతిన్ సంతకాలు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఓటింగ్ జరగడం గమనార్హం. అయితే, భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశమైన రష్యా వీటో చేయడంతో అమెరికా, ఆల్బేనియా తీర్మానం ఆమోదం పొందలేదు. భద్రతా మండలిలో మొత్తం 15 సభ్యదేశాలు ఉండగా, 10 దేశాలు ఈ తీర్మానానికి మద్దతు పలికాయి. భారత్, చైనా, గబాన్, బ్రెజిల్ మాత్రం ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన అనంతరం ఐరాసలో భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ మాట్లాడారు. ఉక్రెయిన్ పరిణామాలు భారత్‌కు అందోళన కలిగిస్తున్నాయని చెప్పారు. ప్రజల ప్రాణాలను బలిపెట్టి శాంతిని సాధించలేరని తెలిపారు. హింసకు స్వస్తి పలికితేనే ఉక్రెయిన్–రష్యా సమస్యకు పరిష్కార మార్గం లభిస్తుందని సూచించారు. ఉక్రెయిన్‌లో రష్యా చేపట్టిన రిఫరెండం చెల్లదని ఐరాసలోని అమెరికా ప్రతినిధి లిండా థామస్–గ్రీన్‌ఫీల్డ్ తేల్చిచెప్పారు. -
దావూద్ ఇబ్రహీంపై ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా?
ఢిల్లీ: గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంపై భారీ రివార్డు ప్రకటించింది భారత ఉగ్రవాద వ్యతిరేక సంస్థ ఎన్ఐఏ. దావూద్ గురించి సమాచారం అందించిన వాళ్లకు పాతిక లక్షల రూపాయలు అందిస్తామని ప్రకటించింది. దావూద్‌తో పాటు అతని అనుచరుడు చోటా షకీల్ మీద కూడా రూ.20 లక్షలు ప్రకటించింది జాతీయ విచారణ సంస్థ. భారత ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో టాప్ అయిన ఎన్ఐఏ.. తాజాగా దావూద్‌కు సంబంధించి ఫొటోను సైతం విడుదల చేసింది. దావూద్, చోటా షకీల్‌తో పాటు ఉగ్రవాదులైన అనీస్ ఇబ్రహీం, జావెద్ చిక్నా, టైగర్ మెమోన్‌ల మీద రూ.15 లక్షల బౌంటీ ప్రకటించింది ఎన్ఐఏ. దావూద్‌తో పాటు ఇతరులంతా కలిసి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన లష్కరే తాయిబా, జైషే మొహమ్మద్, అల్ కాయిదాలతో కలిసి పని చేస్తున్నారని, బడా వ్యాపారవేత్తలను, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకున్నారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో పేర్కొంది. వీళ్ల గురించి సమాచారం అందించిన వాళ్లకు రివార్డు అందిస్తామని పేర్కొంది. ► 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన దావూద్ ఇబ్రహీం.. పన్నెండు చోట్ల పేలుళ్లతో 257 మంది అమాయకుల మరణానికి, 700 మంది గాయపడడానికి కారణం అయ్యాడు. ► గ్లోబల్ టెర్రరిస్ట్‌గా ఐరాస భద్రతా మండలి దావూద్‌ను గుర్తించగా.. అరెస్ట్‌ను తప్పించుకోవడానికి దావూద్ పాక్‌లో తలదాచుకున్నాడు. ఈ విషయాన్ని 2018లో భారత్ సైతం ధృవీకరించింది. తాజాగా భద్రతా మండలి రిలీజ్ చేసిన ఉగ్రవాద జాబితాలో దావూద్ ఉండగా.. కరాచీ పేరిట అతని చిరునామా సైతం ఉండడం గమనార్హం. ► అక్రమ ఆయుధాలు, మాదకద్రవ్యాలు, నకిలీ భారతీయ కరెన్సీ నోట్లను అక్రమంగా తరలించడానికి పాకిస్తాన్ ఏజెన్సీలు, ఉగ్రవాద సంస్థల సహాయంతో ఉగ్రవాద దాడులను నిర్వహించడానికి డీ-కంపెనీ భారతదేశంలో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేసిందని దర్యాప్తులో తేలింది. ► మే నెలలో ఎన్ఐఏ 29 ప్రాంతాల్లో దాడులు చేసింది. అందులో హాజీ అలీ దర్గా, మహిమ్ దర్గా ట్రస్టీ అయిన సమీర్ హింగోరా(1993 ముంబై పేలుళ్లలో దోషి), సలీం ఖురేషీ(ఛోటా షకీల్ బావమరిది), ఇతరులకు చెందిన ప్రాంతాలు ఉన్నాయి. ► 2003లో, దావూద్ ఇబ్రహీంను భారతదేశం, అమెరికాలు గ్లోబల్ టెర్రరిస్ట్‌గా గుర్తించాయి. అంతేకాదు 1993 ముంబై పేలుళ్ల సూత్రధారిపై 25 మిలియన్ల డాలర్ల రివార్డును సైతం ప్రకటించాయి. ► ముంబై బాంబు పేలుళ్ల కేసు, పలు ఉగ్ర సంబంధిత కార్యకలాపాలతో పాటు దోపిడీలు, హత్యలు, స్మగ్లింగ్ కేసుల్లో నిందితుడిగా దావూద్‌పై కేసులు నమోదు అయ్యాయి. ► 2008లో ముంబైలో జరిగిన ఉగ్రదాడుల్లో, దావూద్ తాజ్ మహల్ హోటల్‌తో సహా నగరంలో పేలుళ్లకు ఉగ్రవాదులను తరలించాడు. ► 2013 ఐపీఎల్ సమయంలో తన సోదరుడు అనీస్ సాయంతో బెట్టింగ్ రాకెట్‌ను దావూద్ నడిపించాడని కొన్ని జాతీయ మీడియా హౌజ్‌లు కథనాలు వెలువరించాయి. ► డీ కంపెనీ.. ప్రస్తుతం ఆఫ్రికా దేశాలను పట్టి పీడిస్తోందని, నైజీరియాకు చెందిన బోకో హరామ్ ఉగ్ర సంస్థలో పెట్టుబడులు పెట్టిందని సమాచారం. ఇదీ చదవండి: శాఖ మార్చిన కాసేపటికే మంత్రి రాజీనామా -
రష్యాకు వ్యతిరేకంగా ఓటు.. భారత్ వివరణ
మునుపెన్నడూ లేనివిధంగా ఐక్యరాజ్య సమితిలో భారత దేశం వ్యవహరించింది. తొలిసారిగా భద్రతా మండలిలో మిత్రపక్షం రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి.. రష్యాను విమర్శించకుండా, కీలక ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. అగ్రరాజ్యం అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఈ విషయంలో భారత్ తీరును తప్పుబడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం జరిగిన ప్రొసీజరల్ ఓటింగ్‌లో భారత్, రష్యాకు వ్యతిరేకంగా ఓటేసింది. పదిహేను దేశాల సభ్యత్వం ఉన్న భద్రతా మండలిని ఉద్దేశించి ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వీడియో టెలి కాన్ఫరెన్స్ ద్వారా తొలుత ప్రసంగించాడు. ప్రసంగం కోసమే.. ఉక్రెయిన్ 31వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా.. జెలెన్స్కీని ప్రసంగించేందుకు భద్రతా మండలి ఆహ్వానించింది. అయితే భద్రతా మండలిలో ప్రసంగం ఎప్పుడూ నేరుగా ఉండాలే తప్ప.. ఇలా టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జరగకూడదు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన రష్యా ప్రతినిధి వసెల్లీ నెబెంజియా.. కావాలంటే జెలెన్స్కీని న్యూయార్క్‌ను పిలవండని లేదంటే ఉక్రెయిన్ ప్రతినిధిని ప్రసంగించేందుకు అనుమతించాలని కోరారు. అయినప్పటికీ జెలెన్స్కీ ప్రసంగానికే అమెరికా ప్రతినిధి పట్టుబట్టారు. దీంతో ప్రోసీజరల్ ఓటింగ్ నిర్వహించాలని రష్యా కోరింది. దీనికి భద్రతా మండలి అంగీకరించింది. అనంతరం జరిగిన ఓటింగ్‌లో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసింది. రష్యా వ్యతిరేక ఓటు వేయగా.. చైనా తెలివిగా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది. భారత్ తరపున.. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రసంగానికి మద్దతుగా ఓటేశారు. దీంతో రష్యాకు వ్యతిరేకంగా భారత్ ఓటేసిందన్న విమర్శ తెరపైకి వచ్చింది. ఇక ఈ టెలీ వీడియో కాన్ఫరెన్స్‌లో ఊహించినట్లుగానే రష్యాను చీల్చి చెండాడాడు జెలెన్స్కీ. అది రష్యాకు వ్యతిరేకం కాదు వ్యతిరేక విమర్శల నేపథ్యంలో భారత్ స్పందించింది. జెలెన్స్కీ ప్రసంగానికి మద్దతుగా ఓటేసినంత మాత్రానా.. భారత్ స్టాండ్ మారినట్లు కాదని విదేశాంగ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు. స్వేచ్ఛ కోణంలోనే భారత్ ఆలోచించిందని, అంతేకానీ.. ఎవరికో వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదని ఆయన అన్నారు. గతంలోనూ రెండుసార్లు జెలెన్స్కీ యూన్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మూడోసారి. అందుకు మద్దతుగా భారత్ ఓటేసింది. అంతేతప్ప ఇది రష్యాకు వ్యతిరేకంగా ఓటేసినట్లు కాదు.. అసలు అలాంటి ప్రశ్నే లేదు అని ఆయన తెలిపారు. అలాగే అధికారులు సైతం.. భారత్ తీరు మారలేదని.. మారబోదని.. కేవలం జెలెన్స్కీ ప్రసంగ సమయంలో భారత్ ఓటు కీలకంగా మారినందునా అలాంటి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఆయిల్ కాదు.. అది మా రక్తం ఇక ఉక్రెయిన్‌కు ఔషధాల పంపిణీ విషయంలో ఇప్పటికే భారత్, ఉక్రెయిన్ విదేశాంగ శాఖతో మాట్లాడింది. నైతికంగా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చింది. అయితే ఉక్రెయిన్ మాత్రం భారత్ వ్యవహారంపై అసంతృప్తితోనే ఉంది. కారణం.. రష్యా నుంచి ముడి చమురు దిగుమతిని సైతం పెంచుకుంటూ పోవడం. ఈ నిర్ణయంపై ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కుబేలా తీవ్రంగా స్పందించారు. అది ముడి చమురు కాదని.. తమ రక్తం చెల్లిస్తున్న డిస్కౌంట్ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే భారత్ మాత్రం దేశం కోసం.. ప్రజల కోసం.. రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోక తప్పడం లేదని సమర్థించుకుంది. డిసెంబర్‌తో ముగింపు ఇదిలా ఉంటే.. ఐరాస భద్రతా మండలిలో ఓటింగ్ సందర్భంగా.. రుచిరా కాంబోజీ ప్రసంగిస్తూ.. దౌత్యం, చర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారం అవుతుందని భారత్ భావిస్తోందని, అలాగే.. మానవ దృక్ఫథంతో అందించాల్సిన సాయం భారత్ ఈ సంక్షోభం వల్ల ప్రభావితం అవుతున్న దేశాలకు అందిస్తుందని తెలిపారు. భారత్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం కాదు. రెండేళ్ల కాలపరిమితితో సభ్యురాలిగా కొనసాగుతోంది. ఈ డిసెంబర్లో ఆ కాలపరిమితి ముగుస్తుంది. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లా పోరాడడం మా వల్ల కాదు! -
నరరూప రాక్షసులు: కిడ్నాప్ చేసి మానభంగం, ఆపై..
న్యూయార్క్: మానవ హక్కుల ఉల్లంఘనలో హేయనీయమైన ఘటనలు వెలుగులోకి రావడం కొత్తేం కాదు. కానీ, ప్రపంచమంతా ఉలిక్కిపడేలా దారుణాతిదారుణాలు ఆఫ్రికన్ దేశం కాంగోలో చోటుచేసుకుంటున్నాయి. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బుధవారం ఓ మహిళ కథ.. అక్కడి రెబల్ గ్రూప్‌ల అరాచకాలను బయటపెట్టడంతో పాటు సభ్య దేశ్యాలను నివ్వెరపోయేలా చేసింది. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పరిస్థితులపై భద్రతా మండలిలో సాధారణ సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా.. సోఫెపడి హక్కుల సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది జూలియెన్నె లుసెంగె.. తూర్పు కాంగోలో తనకు తారసపడ్డ ఓ మహిళ కథను మండలికి వినిపించగా.. ఆమె ప్రసంగిస్తున్నంత సేపు అక్కడ నిశబ్ద వాతావరణం నెలకొంది. కాంగోలో ప్రభుత్వం, రెబెల్ గ్రూప్స్ మధ్య అంతర్యుద్ధం.. ఈ మే నెలలో తారాస్థాయికి చేరింది. ఆ పరిస్థితులు కాస్త తీవ్ర హింసకు దారి తీశాయి. ఈ తరుణంలో.. కోడ్‌కో అనే మిలిటెంట్ గ్రూప్ ఓ కుటుంబం నుంచి ఓ మహిళను ఎత్తుకెళ్లింది. పలుమార్లు ఆమెపై మానభంగానికి పాల్పడ్డారు ఆ గ్రూప్ సభ్యులు. ఆపై ఓ వ్యక్తిని ఆమె కళ్లెదుటే గొంతు కోసి హత్య చేశారు. ఆ శవం నుంచి పేగులు బయటకు లాగేసి.. వాటిని వండాలంటూ ఆమెకు ఆదేశించారు. రెండు కంటెయినర్ల నీళ్లు తెచ్చి.. భోజనం సిద్ధం చేయమన్నారు. ఆపై ఆమెతో మనిషి పచ్చి మాంసం బలవంతంగా తినిపించారు’ అంటూ భావోద్వేగంగా జూలియెన్నె ఆ ఘటనలను వినిపించారు. కొన్నిరోజుల తర్వాత ఆమెను విడిచిపెట్టింది ఆ గ్రూప్. కానీ, ఇంటికి వెళ్తున్న దారిలో ఆమెను మరొక మిలిటెంట్ ఎత్తుకెళ్లింది. పలుమార్లు మానభంగం చేశారు ఆ గ్రూప్‌సభ్యులు. అక్కడ ఆమెకు అలాంటి రాక్షస అనుభవమే ఎదురైంది. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకునేందుకు ఆమె తన ప్రాణాలనే పణంగా పెట్టుకుంది.. అని జూలియెన్నెకు భద్రతా మండలికి వినిపించారు. ఈ ఘటనను మండలి సంయుక్తంగా ఖండించింది. ఇలాంటి ఘటనలను నిలువరించాల్సిన అవసరం ఉందని, మానవ హక్కుల్ని పరిరక్షించాల్సిన అవసరం ఉందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. ఈ ఆరోపణలపై కోడ్‌కో మిలిటెంట్ గ్రూప్‌గానీ, ఇతర సంస్థలుగానీ స్పందించలేదు. అంతర్యుద్ధంతో కాంగో నెత్తుటి నేలను తలపిస్తున్న వేళ.. గత 20 ఏళ్లుగా ఐరాస ప్రతినిధులు కాంగోలో శాంతి స్థాపనకు ప్రయత్నిస్తున్నా అది వీలుపడడం లేదు. Disclaimer: ఇందులోని కంటెంట్ ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదు.. కేవలం పరిణామాలను తెలియజేయడానికే!. -
Russia-Ukraine War: చేతులు కలపండి.. యుద్ధాన్ని ఆపండి
వాషింగ్టన్/ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్, రష్యా దేశాల సంక్షేమంతోపాటు మొత్తం ప్రపంచ శాంతి కోసం యుద్ధానికి ముగింపు పలకాలని పుతిన్‌ను ఐరాస సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ కోరారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మతిలేని యుద్ధం వల్ల ప్రపంచానికి హాని తప్ప ఒరిగేదేమీ ఉండదన్నారు. ప్రపంచానికి ఆహార, ఎరువుల కొరత తప్పాలంటే ఉక్రెయిన్, రష్యా, బెలారస్‌ల్లో ఉత్పత్తి యథాతథంగా కొనసాగాల్సిందేనన్నారు. ఏం చేయాలో మాకు తెలుసు: భారత్ ఉక్రెయిన్–రష్యా వ్యవహారంలో ఐరాసలో ఓటింగ్‌లకు భారత్ దూరంగా ఉంటుండడాన్ని తప్పుబడుతూ ఇంగ్లండ్‌లో నెదర్లాండ్స్ రాయబారి కరెల్ వాన్ ఊస్టెరోమ్ ట్వీట్ చేశారు. దీనికి ఐరాసలో భారత శాశ్వత రాయబారి టి.ఎస్.తిరుమూర్తి గట్టిగా బదులిచ్చారు. ‘‘మీ సలహాలు, సాయం అక్కర్లేదు, ఏం చేయాలో భారత్‌కు తెలుసు’’ అంటూ అన్నారు. ఈ యుద్ధంలో విజేతలంటూ ఎవరూ ఉండరనిఐరాస భద్రతా మండలి భేటీలో మాట్లాడుతూ ఆయన అన్నారు. భారత్ ఎప్పటికీ శాంతిపక్షమేనన్నారు. రష్యాపై ‘యుద్ధ నేరాలు’: ఆమ్నెస్టీ ఉక్రెయిన్‌లో రష్యా సైనికులు యుద్ధ నేరాలకు పాల్పడ్డారని ఆమ్నెస్టీ సెక్రెటరీ జనరల్ ఆగ్నస్ కలామార్డ్ ఆరోపించారు. వారి అరాచకాలను నమోదు చేశామన్నారు. ఈ యుద్ధ నేరాలకు విచారణను రష్యా ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేశారు. విపత్తు పరిస్థితులు: జెలెన్స్కీ రష్యా ఆక్రమిత ప్రాంతాల్లో విపత్తు తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా సైన్యం ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై 2,014 క్షిపణులు ప్రయోగించిందని చెప్పారు. 400 ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలను రష్యా సైన్యం ధ్వంసం చేసిందని తెలిపారు. 2,682 రష్యా యుద్ధ విమానాలు తమ గగనతలంపై ప్రయాణించాయని వెల్లడించారు. మరోవైపు మారియూపోల్ నుంచి రష్యా సేనలు చాలావరకు తూర్పు ప్రాంతానికి తరలివెళ్లాయని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. శరణార్థులతో జిల్ బైడెన్ భేటీ స్లొవేకియా సరిహద్దులో ఆశ్రయం పొందుతున్న ఉక్రెయిన్ శరణార్థులను అమెరికా ప్రథమ మహిళ జిల్ బైడెన్ కలిశారు. ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. శరణార్థుల ఆవేదన ఒక తల్లిగా తనకు తెలుసని అన్నారు. జిల్ నాలుగు రోజుల పాటు యూరప్‌లో పర్యటించనున్నారు. -
అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోంది!: ఉక్రెయిన్
Ukrainian human rights group accused Russian troops: ఉక్రెయిన్ పై రష్యా నెలరోజలకు పైగా నిరవధిక యుద్ధం కొనసాగిస్తోంది. ఉక్రెయిన్‌ని అధినంలోకి తెచ్చుకునే క్రమంలో రష్యా యుద్ధ నేరాలకు, అత్యాచారాలకు పాల్పడుతోంది. అంతేగాక యూఎన్ భద్రతా మండలిలో ఉక్రెయిన్ మానహక్కుల సంఘం ప్రస్తుతం రష్యా బలగాలు అత్యాచారాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించాయి. అదీగాక ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు లైంగిక దాడులు, అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారంటూ పెద్ద ఎత్తున్న ఆరోపణలు వస్తున్నాయని యూఎన్ అధికారి భద్రతా మండలికి తెలిపారు. ఉక్రెయిన్ మానవహక్కుల సంఘం నాయకురాలు కాటెరినా చెరెపాఖా రష్యా సైనికులు తొమ్మిది మందిపై అత్యాచారం కేసులు ఉన్నాయని, సుమారు 12 మంది మహిళలు, బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని భద్రతా మండలిలో పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు ఇప్పుడూ హింస, అత్యాచారాలను ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ ఆవేదనను వినాలని అభ్యర్థించారు. గతవారమే ఐక్యరాజ్యసమితి రష్యన్ దళాల లైంగిక హింస ఆరోపణలను ధృవీకరించడానికి యూఎన్ మానవ హక్కుల పర్యవేక్షకులు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఉక్రెయిన్ దళాల పై కూడా లైంగిక ఆరోపణలు వస్తున్నట్లు యూఎన్ పేర్కొంది. కానీ దానిపై ఉక్రెయిన్ మానవ హక్కుల సంఘం ఇంకా స్పందించలేదు. మరోవైపు రష్యా ఎప్పటికీ పౌరుల పై దాడి చేయదని కేవలం రష్యన్ సైనికులను శాడిస్టులుగా చూపించాలనే దురుద్దేశంతోనే ఈ ఆరోపణలు చేస్తున్నాయని రష్యా యూఎన్ రాయబారి డిమిత్రి పోలియన్స్కీ ఉద్ఘాటించారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి మహిళా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సిమా బహౌస్ మాట్లాడుతూ, న్యాయం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి అన్ని ఆరోపణలను స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి. మేము ఎక్కువగా అత్యాచారం, లైంగిక హింస గురించి వింటున్నాము" అని ఆమె కౌన్సిల్లో అన్నారు. ఉక్రెయిన్ యూఎన్ రాయబారి సెర్గీ కిస్లిత్సా రష్యన్ సైనికుల అత్యాచార కేసులకు సంబంధించిన డాక్యుమెంటేషన్‌కి ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం ప్రారంభించిందని భత్రతా మండలికి తెలిపారు. (చదవండి: రష్యా అరాచకం.. గుంతలు తవ్వి మృతదేహాల ఖననం..!) -
Ukraine: ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే!
ఉక్రెయిన్‌లో రష్యా బలగాలు సాధారణ పౌరులపై సాగించిన ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కేవలం బుచాలోనే 300 మందికిపైగా పౌరులు బలయ్యారంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ఆరోపిస్తున్నారు. అయితే బోరోడ్యాంకా, ఇతర పట్టణాల్లో ఆ సంఖ్యే లెక్కకు అందనంత ఉండొచ్చని అంచనా వేస్తోంది ఉక్రెయిన్. మానవతాధృక్పథంతో.. ఉక్రెయిన్‌లోని కొన్ని నగరాలు, పట్టణాల నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అప్పటికే అక్కడ దారుణాలకు తెగబడిన విషయం ఇప్పుడు వెలుగు చూస్తోంది. రోడ్ల వెంబడి చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉండగా.. రష్యా సైన్యం అకృత్యాలకు సైతం పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన పట్టణాల్లో ఇలా పౌరులను కిరాతకంగా బలిగొన్న ఉదంతాలు.. వీడియో ఆధారాలతో సహా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఉక్రెయిన్ తో పాటు పాశ్చాత్య దేశాల కూటమి ఈ దమనకాండను ఖండిస్తున్నాయి. రష్యాపై మరింత ఆంక్షలు విధించడంతో పాటు యుద్ధ నేరాలకు పాల్పడిన కారణంగా దర్యాప్తునకు ఆదేశించాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి సైతం ఈ మారణహోమంపై తీవ్రస్థాయిలో స్పందించింది. ఆధునిక కాలంలో ఇలాంటి ఘోరాలను చూడలేదని పేర్కొంటూ.. స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది కూడా. అయితే రష్యా మాత్రం తాము ఎలాంటి అఘాయిత్యాలకు, అకృత్యాలకు పాల్పడలేదని చెబుతోంది. ఇదిలా ఉండగా.. రష్యా మారణహోమంపై మంగళవారం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రసంగించనున్నాడు. సాధారణ పౌరులను బలిగొన్న ఘటనలకుగానూ రష్యాపై బహిరంగ దర్యాప్తును కోరుతూ ఆయన ప్రపంచ దేశాలపై ఒత్తిడి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నరమేధంపై దర్యాప్తు పారదర్శకంగా ఉండాలని ఇప్పటికే ఆయన విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. చదవండి: రష్యా అకృత్యాలు.. ఈ ఒక్క ఫొటో చాలు! -
‘తాలిబన్’ లేకుండానే అఫ్గన్ అనుకూల తీర్మానం
అఫ్గనిస్థాన్‌లో అధికారంలోకి వచ్చాక తీవ్ర సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తాలిబన్ ప్రభుత్వానికి శుభవార్త అందించింది ఐక్యరాజ్య సమితి. అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కేలా ఒక అడుగు ముందుకు వేసింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో గురువారం ఒక తీర్మానం చేయగా.. ఆమోదం లభించింది. అఫ్గనిస్థాన్ ప్రభుత్వంతో సంబంధాలు కొనసాగించేందుకు ప్రవేశపెట్టిన తీర్మానం అది. ఇక వోటింగ్‌కు రష్యా దూరం కాగా.. 14 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఈ తీర్మానం తర్వాతి దశకు వెళ్తుంది. ప్రపంచంలోని ఎక్కువ దేశాలు గనుక ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటేస్తే(తప్పనిసరేం కాదు!).. ఆపై తాలిబన్లు నడిపిస్తున్న అఫ్గనిస్థాన్ ప్రభుత్వానికి అంతర్జాతీయ సమాజంలో గుర్తింపు దక్కినట్లు అవుతుంది. తాలిబన్ లేకుండానే.. అయితే ఐరాసలో భద్రతా మండలి ప్రవేశపెట్టిన తీర్మానంలో చిన్నమెలిక ఉంది. ఎక్కడా తాలిబన్ అనే పదాన్ని పేర్కొనలేదు. కాకపోతే.. యూఎన్ పొలిటికల్ మిషన్ ఏడాది పాటు ఉంటుందని, అఫ్గనిస్థాన్‌లో శాంతి స్థాపనకు కృషి చేస్తుందని మాటిచ్చింది. అయితే తాలిబన్ అనే పదం లేకపోవడం సాంకేతికంగా అఫ్గన్ సాయానికి, గుర్తింపునకు ఎలాంటి ఆటంకంగా మారబోదు. కాకపోతే.. తాలిబన్ అనే పదం బదులు.. మరో పదం తీసుకురావాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి చేసే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఇక ఈ తీర్మానంలో.. పరస్సర సహకారం, మానవతా కోణంలో సాయం, రాజకీయ అంశాలపై హామీలు ఉన్నాయి. ఉనామా(UNAMA ..the UN mission to Afghanistan)కు ప్రపంచ దేశాలు అన్ని విధాల సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు తీర్మానం ప్రవేశపెట్టిన నార్వే ఐరాస రాయబారి మోనా జుల్ చెప్తున్నారు. -
రష్యా చర్యలపై ఐరాసా భద్రతా మండలిలో ఓటింగ్.. భారత్ దూరం..
ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమయింది. రష్యా చర్యలను ఖండిస్తూ భద్రతా మండలిలో భద్రతా మండలిలో (UNSC) ఓటింగ్ నిర్వహించింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తూ అమెరికా చేసిన ఈ ప్రతిపాదనపై మండలిలోని మొత్తం 15 సభ్యదేశాల్లో 11 దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశాయి.కాగా మొదటి నుంచి ఉక్రెయిన్-రష్యా వివాదంలో తటస్థంగా ఉన్న భారత్‌తో పాటు చైనా, యూఏఈలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. అయితే భద్రతా మండలిలో అయిదు శాశ్వత దేశాల్లో ఒకటైన రష్యా.. తన విటో అధికారాన్ని ఉపయోగించి తీర్మాణాన్ని వీగిపోయేలా చేసింది. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉన్న సందర్భంగా ఐరాసలో భారతరాయబారి టీఎస్ తిరుమూర్తి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో విభేదాలు, వివాదాలను పరిష్కరించడానికి అన్ని సభ్య దేశాలు చర్చలు జరపాలని భద్రతా మండలికి సూచించారు. ఉక్రెయిన్‌లో ఇటీవల జరుగుతున్న పరిణామాలతో భారత్ తీవ్ర ఆందోళనకు గురవుతోందని తెలిపారు. హింసను తక్షణమే నిలిపివేసేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతున్నామన్నారు. మానవాళి ప్రాణాలను పణంగాపెట్టడం వల్ల ఎలాంటి పరిష్కారం లభించదని తెలిపారు. చదవండి: కమెడియన్ నుంచి అధ్యక్షుడిగా.. జెలెన్స్కీ ప్రస్థానం #IndiainUNSC UNSC’s consideration of the draft resolution on Ukraine 📺Watch: India’s Explanation of Vote by Permanent Representative @AmbTSTirumurti ⤵️@MeaIndia pic.twitter.com/UB2L5JLuyS — India at UN, NY (@IndiaUNNewYork) February 25, 2022 -
ఐరాస వేదికగా పాక్‌పై విరుచుకుపడ్డ భారత్
న్యూయార్క్: ఉగ్రవాదులకు సహకరించడంలో దశాబ్దాల ఘన చరిత్ర కలిగిన పాకిస్తాన్... ముష్కర మూకలకు ఆశ్రయం కల్పించడంపై ఐక్యరాజ్యసమితిలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. 26/11 ముంబైపై ఉగ్రదాడులకు పాల్పడినవారికి పాకిస్తాన్ రాజభోగాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐరాసలో ఇస్లామాబాద్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన తర్వాత భారతదేశం పాకిస్తాన్‌ను గట్టిగా తిప్పికొట్టింది. ప్రపంచంలోని చాలా ఉగ్రవాద దాడులకు మూలం, లేదా ఏదో ఒక రూపంలో ఆ దేశానికి సంబంధం ఉంటుందని ఐరాస భద్రతా మండలిలో భారత శాశ్వత ప్రతినిధి ఆర్.మధుసూదన్ అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ‘సాయుధ ఘర్షణల నుంచి పౌరులను రక్షించాలి’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. అంతకుముందు ఐరాసలో భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ, దశాబ్దాలుగా సరిహద్దు ఉగ్రవాదం యొక్క శాపాన్ని చవిచూసిన భారతదేశం, ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలలో ఎల్లప్పుడూ ముందంజలో ఉందని తెలిపారు. సెక్రటరీ జనరల్ నివేదిక ప్రకారం, పట్టణ ప్రాంతాలలో 50 మిలియన్లకు పైగా ప్రజలు సంఘర్షణతో ప్రభావితమయ్యారని, అఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియా, యెమెన్‌లోని ప్రజలు అంతర్గత సంఘర్షణల వల్ల కలిగే వినాశనాన్ని చూశారని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద పోరు మళ్లీ పెరిగింది, ఇది కోవిడ్ మహమ్మారి కొనసాగుతుండటం వల్ల మరిం త క్లిష్టంగా మారిందని తిరుమూర్తి అన్నారు. సంఘర్షణానంతరం ఆయా ప్రాంతాల్లో సామాజికఆర్థిక పునరుద్ధరణ, శాంతిని పెంపొందించడం, పౌరులకు మౌలిక సదుపాయాల కల్పన, పునరావాసం కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. -
పీఓకేను ఖాళీ చేయండి: భారత్
ఐక్యరాజ్యసమితి: పాకిస్తాన్లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని చరిత్ర ఇప్పటికే నిరూపించిందని, ఉగ్రవాదులకు కొమ్ముకాయడం, వారికి శిక్షణ, ఆర్థిక సహకారం అందివ్వడం పాక్ విధానమని భారత్ దుయ్యబట్టింది. మంగళవారం జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో యూఎన్‌లో భారత శాశ్వత మిషన్ కౌన్సెలర్ కాజల్ భట్ మాట్లాడారు. పాకిస్తాన్ రాయబారి మునీర్ అక్రమ్ జమ్మూ కశ్మీర్‌పై చేసిన వాదనని కాజల్ తిప్పికొట్టారు. యూఎన్ వేదికల్ని ఉపయోగించుకొని కశ్మీర్‌పై అవాస్తవాలను ప్రచారం చేయడం పాక్‌కు కొత్త కాదన్నారు. కశ్మీర్, లద్దాఖ్ ప్రాంతాలన్నీ భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ కూడా భారత్ దేశానిదేనని, చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న ప్రాంతాలన్నీ పాక్ వెంటనే ఖాళీ చేయాలని ఆమె అల్టిమేటమ్ జారీ చేశారు. పాకిస్తాన్ సహా ఇరుగుపొరుగు దేశాలతో సామరస్యంగా ఉండాలనే భారత్ కోరుకుంటుందని అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపితేనే పాకిస్తాన్‌తో శాంతియుత వాతావరణంలో చర్చలు జరుగుతాయని భట్ అన్నారు. అప్పటివరకు భారత్ సీమాంతర ఉగ్రవాదంపై కఠినమైన విధానంతోనే ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి నిషేధిత ఉగ్రవాదుల్లో అత్యధికులు పాక్‌లోనే తలదాచుకోవడాన్ని ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని అన్నారు. -
‘మా జోలికి వస్తే సహించం’: ఉత్తర కొరియా హెచ్చరిక
సియోల్: బాలిస్టిక్ క్షిపణుల అంశంలో తమ జోలికి వస్తే సహించబోమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఉత్తర కొరియా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఉత్తర కొరియా అణు క్షిపణి పరీక్షలు వరుసగా నిర్వహించడంపై భద్రతా మండలి ఆందోళన వ్యక్తం చేసింది. యూఎన్ తీర్మానం ప్రకారం ఆ దేశంపై ఆంక్షలు విధిస్తున్నట్టుగా ప్రకటించింది. దీనిపై ఉత్తర కొరియా తీవ్రంగా స్పందించింది. చదవండి: (అదిగదిగో ప్లానెట్ 9.. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా) -
భద్రతామండలి అధ్యక్ష హోదాలో భారత్
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన భద్రతామండలి అధ్యక్ష హోదా భారత్ దక్కింది. నేటి నుంచి నెల రోజులపాటు పాటు ఈ హోదాలో కొనసాగనుంది. ఈ సమయంలో సముద్రప్రాంత రక్షణ, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన వంటి ప్రధాన అంశాలపై జరిగే కీలక చర్చలకు నేతృత్వం వహించనుందని ఐరాసలోని భారత శాశ్వత రాయబారి తిరుమూర్తి వెల్లడించారు. ఈ ఏడాది ఆగస్టుతోపాటు వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ అవకాశం భారత్‌కు దక్కుతుంది. ఈ ఆగస్టులో భారత్.. సముద్ర ప్రాంత భద్రత, శాంతిపరిరక్షణ, ఉగ్రవాద నిర్మూలన అంశాలపై మండలిలో జరిగే ఉన్నత స్థాయి సమావేశాలకు అధ్యక్ష వహించనుంది. ‘సముద్ర ప్రాంత రక్షణ భారత్‌కు అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. దీనిపై మండలి సమగ్రమైన విధానాన్ని తీసుకురావడం చాలా ముఖ్యం’ అని తిరుమూర్తి పేర్కొన్నారు. ‘అదేవిధంగా, శాంతిపరిరక్షణ దళాలను పంపడంలో ఆదినుంచి భారత్ ముందుంంది. వివిధ దేశాలకు పంపే శాంతిపరిరక్షక దళాల భద్రతకు మెరుగైన సాంకేతికతను వినియోగించడం, దళాలపై దాడులకు పాల్పడే వారిని చట్టం ముందు నిలబెట్టే విషయమై భారత్ దృష్టి సారిస్తుంది’ అని వివరించారు. -
మాలీలో సైనిక తిరుగుబాటు
బమకో: ఆఫ్రికా దేశం మాలిలో సైనిక తిరుగుబాటు జరిగింది. సైన్య నిర్బంధంతో ప్రస్తుత అధ్యక్షుడు ఇబ్రహీం బౌబకర్ కీటా తన పదవికి రాజీనామా చేశారు. దేశంలో చాలా నెలలుగా ఇబ్రహీం దిగిపోవాలని కోరుతూ అందోళనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా మంగళవారం సైన్యం తిరుగుబాటు చేసి ఇబ్రహీంను ఇంట్లో నిర్బందించింది. దీంతో ఆయనతోపాటు ప్రధాని బౌబు సిస్సే సైతం రాజీనామా చేశారు. ఈ పరిణామాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నవారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ప్రస్తుతం ఐరాస నేతృత్వంలో 15,600 మంది సైనికులు శాంతిపరిరక్షక విధులు నిర్వహిస్తున్నారు. మాలిలో పరిణామాలపై చర్చించేందుకు ఐరాస భద్రతామండలి సమావేశమైంది. మాలీలో నివాసముంటున్న భారతీయులు ప్రస్తుతానికి ఇళ్లకే పరిమితం కావాలని ఆక్కడి భారత రాయబార కార్యాలయం సూచించింది. అత్యవసర సాయం కావాల్సివస్తే ఎంబసీ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలని ట్విటర్లో ప్రకటించింది. -
చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం: భారత్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అంశంలో పదే పదే తలదూర్చాలని ప్రయత్నిస్తున్న చైనాకు భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. దేశ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికింది. ఇప్పటికే అనేకసార్లు ఇలాంటి ప్రయత్నాలు చేసి భంగపడిన విషయాన్ని గుర్తు చేసింది. ఈ మేరకు.. ‘‘భారత కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ గురించి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో చర్చను లేవనెత్తేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాల గురించి మా దృష్టికి వచ్చింది. పూర్తిగా భారత అంతర్గత విషయమైన కశ్మీర్ అంశంలో చైనా ఇలాంటి చర్చను కోరడం ఇదే తొలిసారి కాదు. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అంతర్జాతీయ సమాజం నుంచి అవే అనుభవాలు ఎదురవుతాయి. ఇలాంటి అనవసర ప్రయత్నాలు మానుకోవాలి. మా అంతర్గత విషయాల్లో చైనా జోక్యాన్ని ఖండిస్తున్నాం’’అని విదేశాంగ శాఖ గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.(చైనా దూకుడుకు కళ్లెం వేయాలంటే: అమెరికా) కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్.. భారత్‌పై అక్కసు వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ గతంలో లేఖ రాసింది. అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో పాక్ మిత్రదేశం చైనా కశ్మీర్ అంశంపై ఐరాసలో రహస్య సమావేశం నిర్వహించింది. అయితే కశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ ఇదివరకే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేయడంతో.. ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్లు భారత్‌ను సమర్థించగా.. కేవలం చైనా మాత్రమే పాక్‌కు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది. ఇక కేంద్రం తాజా ప్రకటన నేపథ్యంలో ఆర్టికల్ 370 రద్దుకు నిన్నటి(ఆగష్టు 5)తో ఏడాది పూర్తైన సందర్భంగా మరోసారి భారత్‌పై విషం కక్కిన పాకిస్తాన్.. చైనాతో కలిసి కుట్రలు పన్నుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
‘కశ్మీర్’పై మరోసారి రహస్య సమావేశం!
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) మరోసారి రహస్య సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ మిత్రదేశం చైనా ఒత్తిడి మేరకు కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బుధవారం నాటి సమావేశంలో చర్చించే అవకాశం ఉందని ఓ జాతీయ మీడియా పేర్కొంది. కాగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు చేసిన నాటి నుంచి దాయాది దేశం పాకిస్తాన్.. భారత్‌పై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి గతంలో లేఖ రాశారు. అదే విధంగా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా చైనాను కోరారు. ఈ నేపథ్యంలో గతేడాది ఆగష్టులో చైనా ఒత్తిడి మేరకు యూఎన్ఎస్సీ రహస్య సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఐరాసలో శాశ్వత సభ్యత్వం లేనందున పాక్‌కు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం లభించలేదు. దీంతో తాజాగా చైనా సహకారంతో కశ్మీర్ అంశాన్ని మరోసారి యూఎన్ఎస్సీలో చర్చించేలా పాక్ పావులు కదిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక కశ్మీర్ తమ అంతర్గత విషయమని భారత్ ఇదివరకే పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐరాసలో శాశ్వత సభ్య దేశాలైన ఫ్రాన్స్, రష్యా, అమెరికా, బ్రిటన్లు భారత్‌ను సమర్థించగా.. కేవలం చైనా మాత్రమే పాక్‌కు పరోక్షంగా మద్దతు తెలుపుతోంది. -
కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం: వెంకయ్య నాయుడు
రిగా : లాత్వియా దేశ అధ్యక్షుడు లేవిట్స్‌తో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమావేశమై రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, విద్య రంగంపై చర్చలు జరిపారు. లిథువేనియా, లాత్వియా, ఎస్టోనియాలో ఐదు రోజుల పర్యటనలో భాగంగా ఉపరాష్ట్రపతి మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఈ సందర్భంగా భారత- లాత్వియా దేశాల మధ్య పలు ద్వైపాక్షిక అంశాలు చర్చకు వచ్చి మైత్రి సంబంధాలు మరింత పటిష్టం కావాలని అభిలాషించారు. లాత్వియా స్వాతంత్ర సమరయోధుల స్థూపం వద్ద నివాళులర్పించిన వెంకయ్య నాయుడు అనంతరం ఆ దేశ చారిత్రక మ్యూజియంను సందర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. భారత్ శాంతికాముక దేశమని, జమ్మూ కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఆయన స్పష్టం చేశారు. భారత్ ఏ దేశాన్ని ఆక్రమించబోదనీ అయితే దేశ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం ఊరుకునేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కల్పించాలని లాత్వియా అభిప్రాయపడింది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిలో సంస్కరణలు జరగాలని పేర్కొంది. -
కశ్మీర్‌పై లండన్‌లో తీవ్ర నిరసనలు
లండన్ : వందలాది మంది కశ్మీరీ మద్దతుదారులు లండన్‌లోని భారత హైకమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. జమ్మూకశ్మీర్ అంశంపై ఈ రోజు ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో రహస్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వారు భారత కార్యాలయాన్ని చుట్టుముట్టి నిరసన కార్యక్రమం చేపట్టారు. పాక్ జెండాలు, కశ్మీరీ జెండాలు పట్టుకుని బ్యానర్లు ప్రదర్శిస్తూ కశ్మీరీకి స్వేచ్ఛనివ్వండంటూ నినాదాలు చేశారు. భారత్ కశ్మీర్‌ను నిర్భందించి ఎటువంటి సమాచారం బయటకు రాకుండా కట్టడి చేస్తోందని ఫిర్యాదు చేశారు. జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడానికి ఐరాస భారతదేశంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థించారు. నిరసనకారులకు నేతృత్వం వహిస్తోన్న సుమైయా షా అనే మహిళ మాట్లాడుతూ.. గత 12 రోజులుగా కశ్మీర్లో ఉంటున్న మా తల్లిదండ్రులతో మాట్లాడలేక పోతున్నానని చెప్పారు. భారతదేశం మొత్తం కశ్మీర్ జనాభాను నిర్భందించడమేగాక ఆ ప్రాంతాన్ని కర్ఫ్యూ నీడలో ఉంచిందని విమర్శించారు. ‘నా తల్లిదండ్రులకు సరైన ఆహారం, ఔషద మందులు లభిస్తున్నాయో.. లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 5న భారత ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి లండన్‌లో భారత వ్యతిరేక నిరసనలు ఎక్కువయ్యాయి. కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను భారత్ రద్దు చేయడంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అరుదైన సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశాన్ని శుక్రవారం గోప్యంగా జరుపుతున్నట్లు దౌత్యవేత్తలు తెలిపారు. చైనా విజ్ఞప్తి మేరకు ఈ విధంగా రహస్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. -
పాక్ లేఖ; కశ్మీర్ అంశంపై రహస్య సమావేశం!
న్యూయార్క్ : జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు విషయంలో భారత్ వ్యవహరించిన తీరుపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) రహస్య సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కశ్మీర్లో నెలకొన్న పరిస్థితులపై ప్రత్యేక బృందం నేతృత్వంలో శుక్రవారం సమావేశం నిర్వహించనున్నట్లు యూఎన్ఎస్సీ అధ్యక్షుడు జోనా రోనెకా తెలిపారు. కాగా కశ్మీర్ విషయంలో భారత్ అనుసరిస్తున్న విధానాలపై స్పందించాల్సిందిగా పాకిస్తాన్ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కశ్మీర్ అంశంలో ఐక్యరాజ్యసమితి జోక్యాన్ని కోరుతూ పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషి మంగళవారం లేఖ రాశారు. అదే విధంగా ఈ విషయంలో చొరవ చూపాల్సిందిగా చైనాను, పోలాండ్ రాయబారి జోనా రోనెకాను కోరారు. ‘ ప్రస్తుతం భారత్ అనుసరిస్తున్న విధానాలు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. భారత్ అక్రమ చర్యలకు పాల్పడుతోందని మేము భావిస్తున్నాం. ఈ విషయంపై ప్రత్యేక సమావేశం జరపాల్సిందిగా కోరుతున్నాం అని ఖురేషి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని చైనా యూఎన్ఎస్సీ అధ్యక్షుడితో చర్చించిన క్రమంలో శుక్రవారం భేటీ జరుగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పాకిస్తాన్ పాల్గొనబోదని యూఎన్ అధికారి పేర్కొనట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఇక కశ్మీర్ విషయంలో చైనా తమకు అండగా నిలుస్తుందని ఖురేషి పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా ఇటీవల చైనాలో పర్యటించిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్.. కశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. అయితే ఈ రహస్య సమావేశం ద్వారా పాక్‌కు ఏమాత్రం ప్రయోజనం కలిగే అవకాశం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. -
ఐరాస భద్రతా మండలికి ఎన్నిక
ఐక్యరాజ్యసమితి: భద్రతా మండలికి తాత్కాలిక సభ్యదేశాల కోటాలో బెల్జియం, డొమినికన్ రిపబ్లిక్, జర్మనీ, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా ఎన్నికయ్యాయి. ఇందుకోసం జరిగిన ఎన్నికలో జర్మనీ, డొమినికన్ రిపబ్లిక్లకు 184 చొప్పున, దక్షిణాఫ్రికాకు 183, బెల్జియం 181, ఇండోనేసియాకు 144 ఓట్లు పడ్డాయి. మొత్తం 193 సభ్య దేశాలకు గాను 3 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భద్రతా మండలిలో 15 మంది సభ్యులుంటారు. ఇందులో శాశ్వత సభ్య దేశాలు బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాతోపాటు తాత్కాలిక జాబితా నుంచి పది దేశాలకు చోటు ఉంటుంది. -
పాక్ పద్ధతి మార్చుకోవాల్సిందే!
వాషింగ్టన్ : ఉగ్ర సంస్థలకు సహకారం, తద్వారా పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్థాన్.. తన పద్ధతిని మార్చుకోవాలని అమెరికా చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హలే ఈమేరకు వ్యాఖ్యలు చేశారు. పాక్ తన వైఖరిని మార్చుకునేంత వరకు జాతీయ భద్రతా మండలి ఒత్తిడి తేవాలని ఆమె కోరుతున్నారు. భద్రతా మండలి సభ్యులతో నిక్కీ హలే ఈ మధ్యే అఫ్ఘనిస్థాన్‌లో పర్యటించి వచ్చారు. గురువారం తన పర్యటన వివరాలను ఆమె భద్రతా మండలిలో తెలియజేశారు. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ చేసిన విజ్ఞప్తిని ఆమె భద్రతా మండలిలో వినిపించారు. ‘‘పాకిస్థాన్ మూలంగా అఫ్ఘనిస్థాన్ సమస్యలను ఎదుర్కుంటోంది. తాలిబన్లకు పాక్ పరోక్షంగా సాయం చేస్తోంది. ఈ తరుణంలో అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలి. వివిధ దేశాలకు చెందిన 15 మందితో ఓ విభాగాన్ని ఏర్పాటు చెయ్యండి. తద్వారా పాక్‌పై ఒత్తిడి తీసుకురండి’’ అని అఫ్ఘాన్ ప్రతినిధులు హలేకు విజ్ఞప్తి చేశారు. చర్చల కోసం కాబూల్ ముందుకు వస్తుంటే.. ఇస్లామాబాద్ మాత్రం కవ్వింపు చర్యలతో వెనక్కి తీసుకెళ్తోందని ఆమె వివరించారు. పొరుగు దేశాలను(భారత్‌సహా) ఉగ్రవాదంతో ప్రభావితం చేస్తున్న పాక్ విషయంలో జాతీయ భద్రతా మండలి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆంక్షలపై సడలింపు... ఇదిలా ఉంటే పాకిస్థాన్‌కు భద్రతా పరమైన సహకారాన్ని అమెరికా నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయంలో ఇప్పుడు సడలింపు ఇస్తున్నట్లు ప్రకటించింది. మిలిటరీ శిక్షణ కోసం(అంతర్జాతీయ సైనిక శిక్షణ హామీ కింద) మాత్రం నిధులను మంజూరు చేస్తున్నట్లు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని పాక్ విదేశాగంగ కార్యదర్శి తెహ్మినా జన్జువా దృవీకరించారు. -
అణు పరీక్ష.. ఐరాస ఎమర్జెన్సీ మీటింగ్
సాక్షి, వాషింగ్టన్: ఉత్తర కొరియా అణు పరీక్ష నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి స్పందించింది. సోమవారం ఉదయం 10 గంటలకు భద్రతా మండలి అత్యవసరంగా భేటీ అయ్యింది. ఖండాత్గర క్షిపణి పేరిట కిమ్ జంగ్ నియంతృత్వ ప్రభుత్వం హైడ్రోజన్ బాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. వణికిన ఉత్తర కొరియా ఈ మేరకు ఐరాస రాయబారి నిక్కీ హలె తన ట్విట్టర్ లో భేటీ అంశాన్ని ధృవీకరించారు. అమెరికాతోపాటు జపాన్, ఫ్రాన్స్; యూకే, దక్షిణ కొరియాలు భేటీలో పాల్గొని ఉత్తర కొరియా అణు పరీక్ష పై చర్చించనున్నట్లు ఆమె తెలిపారు. తమతోపాటు మిత్రపక్షాల జోలికి వస్తే భారీ సైనికచర్యకు దిగాల్సి ఉంటుందని అమెరికా సైన్యాధికారి జేమ్స్ మట్టిస్ తీవ్రంగా హెచ్చరించారు కూడా. ఇంకోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉ.కొ. ఓ మూర్ఖపు దేశమంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆరోసారి అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియాపై ప్రపంచ దేశాలన్నీ మండిపడుతున్నాయి. భారత్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. అణ్వాయుధాల విషయంలో అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘించి ఉ.కొ. పెద్ద తప్పు చేసిందంటూ భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన వెలువరించింది కూడా. ప్రస్తుతం బ్రిక్స్ సమావేశంలో ఈ అంశం హాట్ హాట్‌గా మారింది. ఉత్తర కొరియాపై మరిన్ని ఆంక్షలు విధించాల్సిందేనని భద్రతా మండలికి బ్రిటీష్ ప్రధాని థెరెసా విజ్ఞప్తి చేస్తుండగా, అవి ఎలాంటి ప్రభావం చూపబోవంటూ రష్యా పరోక్షంగా ఉత్తర కొరియాకు మద్ధతునిస్తూ వస్తోంది. -
ఉత్తర కొరియా క్షిపణి పరీక్షను ఖండించిన ఐరాస
ఐక్యరాజ్య సమితి: ఉత్తర కొరియా తాజాగా జపాన్ మీదుగా నిర్వహించిన క్షిపణి పరీక్షను ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముక్తకంఠంతో ఖండించింది. ఇటువంటి చర్యలకు మళ్లీ దిగితే కఠిన చర్యలు తప్పవని సమితి హెచ్చరించింది. ఇటువంటి చర్యల వల్ల ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొంది. అంతేకాక ప్రపంచ ప్రజలు తీవ్రమైన అభద్రతాభావానికి లోనయ్యే అవకాశమేందని పేర్కొంది. సమస్యకు శాంతియుత, దౌత్యపర, రాజకీయ పరిష్కార మార్గాన్ని అన్వేషించాలని ఐక్యరాజ్య సమితి ఉత్తర కొరియాకు సూచించింది. తమ దేశంపై ఉత్తర కొరియా క్షపణి పరీక్షను నిర్వహించడంతో ఆగ్రహించిన జపాన్, దక్షిణ కొరియాలు సమితిని సంప్రదించాయి. తక్షణం భద్రతామండలిని సమావేశ పరచి ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని ఆ దేశాలు కోరాయి. ఉత్తర కొరియా తన వద్దనున్న న్యూక్లియర్ వెపన్స్‌ని తక్షణమే నిర్వీర్యం చేయాలని ఈ సందర్భంగా సెక్యూరిటీ కౌన్సెల్ డిమాండ్ చేసింది. అంతేకాక ప్రస్తుతం నిర్వహిస్తున్న అణు పరీక్షలను తక్షణం ఆపేయాలని సెక్యూరిటీ కౌన్సెల్ పేర్కొంది. -
'మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తాం'
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సుష్మ స్పష్టం చేశారు. ఇందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తమ మద్దతును ఇప్పటికే తెలిపాయని చెప్పారు. ఈ విషయంలో చైనా నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాలేదని తెలిపారు. ఈ సారి కాకపోయినా వచ్చేసారి భారత్ కచ్చితంగా మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. -
భారత్–పాక్ ఉద్రిక్తత నివారణకు కృషి చేస్తాం
న్యూయార్క్: భారత్, పాక్ వివాదాల్లో జోక్యం చేసుకోకూడదన్న అమెరికా విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రికత్తను తగ్గించేందుకు యత్నిస్తామని ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ చెప్పారు. ‘ఉద్రిక్తతలను తగ్గించే యత్నాల్లో మావంతు పాత్ర ఏమిటో కనుగొనేందుకు మా ప్రభుత్వం చర్చిస్తుంది.. ఏదో ఒకటి జరిగేవరకు వేచిచూడం’ అని అన్నారు. ఈ ప్రయత్నంలో తమ దేశాధ్యక్షుడు ట్రంప్ భాగమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. ఐరాస భద్రతా మండలికి సంబంధించి ఏప్రిల్ నెలకుగాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన హేలీ మీడియాతో మాట్లాడారు. శాంతి చర్చల కోసం భారత్, పాక్‌లను అమెరికా ఒప్పిస్తుందా అని అడిగిన ప్రశ్నకు ఆమె పైవిధంగా స్పందించారు. హేలీ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. ఉగ్రరహిత వాతావరణంలో వివాదాలను పరిష్కరించుకోవడం తమ విధానమని, అయితే హింస ఇంకా కొనసాగుతూనే ఉందని విదేశాంగ ప్రతినిధి చెప్పారు. -
‘కాబూల్ కసాయి’ హెక్మత్యార్కు ఊరట
ఐక్యరాజ్యసమితి: అఫ్గానిస్తాన్ మాజీ ప్రధాని, మిలటరీ కమాండర్ గుల్బుద్దీన్ హెక్మత్యార్కు ఐరాస భద్రతామండలి ఊరటనిచ్చింది. అతని పేరును ఉగ్రవాదుల జాబితా నుంచి తొలగించడమే కాకుండా.. సీజ్ చేసిన అతని ఆస్తులకు విముక్తి కలిగింది, ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసింది. భారత్‌కు వ్యతిరేకి అయిన హెక్మత్యార్కు ‘కాబూల్ కసాయి’ అనే పేరుంది. పాకిస్థాన్ గూడఛారి సంస్థ ఐఎస్ఐతో హెక్మత్యార్కు సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1997 నుంచి అతను పాకిస్థాన్ లోనే నివసిస్తున్నాడు. 1992–96 మధ్య పౌర యుద్ధంలో వేలాది మందిని చంపించాడు. గుల్బుద్దీన్ పై ఆంక్షలు ఎత్తివేయడాన్ని రష్యా వ్యతిరేకించింది. రెండు దశాబద్దాల ప్రవాసం తర్వాత అతడు కాబూల్ కు తిరిగి రానున్నాడు. -
ఐఎస్ ను కాపాడుతున్నది అమెరికానే!
మాస్కో: అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సిరియా ఆర్మీ లక్ష్యంగా దాడులు చేసి.. 62మంది సైనికులను పొట్టనబెట్టుకోవడంపై రష్యా భగ్గుమంది. అమెరికా విచక్షణారహితంగా సిరియాలో వైమానిక దాడులకు పాల్పడుతున్నదని, ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నదని మండిపడింది. ఈ వ్యవహారంపై వెంటనే ఐరాస భద్రతా మండలి సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేసింది. 'గతంలో అల్ నస్రా దళాన్ని (అల్ కాయిదా అనుబంధ ఉగ్రవాద దళం) అమెరికా రక్షిస్తున్నదేమో అన్న అనుమానం ఉండేది. కానీ ఈ రోజు జరిగిన వైమానిక దాడులతో ఆ అనుమానం పటాపంచలైంది. అమెరికా ఏకంగా ఐఎస్ ను కాపాడుతున్నది' అని రష్యా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మరియా జఖరోవా మీడియాతో చెప్పారు. తాజా వైమానిక దాడులపై భద్రతా మండలిలో అమెరికా సమగ్ర వివరణ ఇవ్వాల్సిందేనని తాము డిమాండ్ చేస్తున్నట్టు ఆమె స్పష్టం చేశారు. సిరియాలోని డీర్ అల్ జర్ లో అమెరికా సంకీర్ణ సేనలు జరిపిన వైమానిక దాడుల్లో 62మంది సిరియా సైనికులు మరణించారు. 100మందికిపైగా గాయాలయ్యాయి. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద మూకలను ఏరిపారేస్తున్న సిరియా సేనలు లక్ష్యంగా అమెరికా దాడులు జరుపుతున్నదని, తద్వారా పరోక్షంగా ఐఎస్ కు అమెరికా అండగా నిలబడుతున్నదని రష్యా మండిపడింది. -
భద్రతామండలిలో సంస్కరణలకు ఏకాభిప్రాయం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో.. భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను సంఖ్యను 15 నుంచి 20కి పెంచాలన్న డిమాండుకు అమెరికా, రష్యా మినహా ఇతర దేశాలన్నీ సంసిద్ధత తెలిపాయి. కాగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచటంపై ఈ సమావేశంలో చర్చ జరగనప్పటికీ.. పాకిస్తాన్‌తో సహాపలుదేశాలు మాత్రం దీనికి ఒప్పుకునేది లేదని తెలిపాయి. -
'మన శాశ్వత సభ్యత్వానికి గండికొడుతున్నారు'
లక్నో: కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే అసహనం అంశాన్ని ప్రచారాస్త్రంగా వాడుకుంటుందని, దీని వల్ల దేశ కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ లక్నోలో అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఈ తరుణంలో దేశంలో అసహనం పెరిగిపోతోందంటూ రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. అనేక దేశాలు భారత్‌కు శాశ్వత సభ్యత్వాన్ని ఇవ్వాలనే ప్రతిపాదనకు మద్దతిస్తున్నా, కాంగ్రెస్ రాజకీయ విధానాలు ఆ అవకాశాలకు గండి కొట్టేవిలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో కంటే ఇప్పుడు దేశంలో అసహనం ఎక్కువగా ఉందా అని షానవాజ్ ప్రశ్నించారు. అసహనం అంశాన్ని పార్లమెంట్లో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించిన అంశాన్ని ఆయన గుర్తు చేశారు. దేశంలో ఉన్న సామరస్యపూర్వక వాతావరణాన్ని అసహన ఆరోపణలతో భంగపరచలేరని షానవాజ్ స్పష్టం చేశారు. -
భారత్‌కు చోటు కల్పించాలి: మోదీ
న్యూయార్క్ : ఐక్యరాజ్యసమితిలోని కీలకమైన విభాగమైన భద్రతామండలిలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌కు చోటు కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. జీ4 దేశాల సదస్సు శనివారం న్యూయార్క్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోదీ ప్రసంగిస్తూ ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్దిష్ట కాలపరిమితిలో ఐరాస సంస్కరణలు అమల్లోకి తేవాలని ఆయన అన్నారు. తీవ్రవాదం, పర్యావరణ కాలుష్యం ప్రపంచానికి పెనుసవాళ్లు విసురుతున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికి జీ4 దేశాలు కట్టుబడి ఉన్నాయని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ దేశాలను కలుపుకోవాలని...పొంచి ఉన్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకుపోవాలని పిలుపునిచ్చారు. -
మరింత మానవత..!
పేదరికం, పర్యావరణంపై ప్రపంచానికి పోప్ ఫ్రాన్సిస్ పిలుపు * ఐరాస, ఆర్థిక సంస్థల్లో సంస్కరణలు చేపట్టాలి * ప్రకృతి వనరులను ధ్వంసం చేసే హక్కు మనిషికి లేదు * ఐరాస సర్వప్రతినిధి సమావేశంలోప్రసంగం న్యూయార్క్: పేదల ప్రయోజనాలను, పర్యావరణాన్ని గౌరవించే మరింత మానవీయమైన అంతర్జాతీయ వ్యవస్థ కావాలని పోప్ ఫ్రాన్సిస్ ప్రపంచానికి పిలుపునిచ్చారు. బలహీనులను అభివృద్ధి ఫలాలకు దూరం చేసే ఆర్థిక వ్యవస్థపై విమర్శలు సంధించారు. అమెరికాలో పర్యటిస్తున్న పోప్ శుక్రవారం ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ 70వ సమావేశంలో ప్రసంగించారు. సంస్కరణవాదిగా పేరొందిన ఆయన ఉన్నతమైన ప్రపంచ నిర్మాణానికి సంబంధించి పలు అంశాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. క్రైస్తవులపై వేధింపులు, ఇరాన్ అణు ఒప్పందం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, బాలికల విద్యా హక్కు వంటి కీలక వర్తమాన సమస్యలను స్పృశించారు. ఐరాస భద్రతా మండలి వంటి అంతర్జాతీయ సంస్థల్లో, రుణదాతల సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాలని పిలుపునిచ్చారు. అన్ని రకాల దుర్వినియోగాన్ని, అధిక వడ్డీరేట్లకు అడ్డుక ట్ట వేయడానికి ఇది తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. సంస్కరణవాద ఆలోచనలతో నాస్తికుల మెప్పు కూడా పొందుతున్న 78 ఏళ్ల పోప్ ఆయా అంశాలపై ఏమన్నారో ఆయన మాటల్లోనే.. సుస్థిర అభివృద్ధి కావాలి.. దేశాల సుస్థిర అభివృద్ధిని ప్రపంచ ఆర్థిక సంస్థలు కాపాడాలి. అణచివేత రుణ విధానాలకు, జనాన్ని మరింత పేదరికంలో ముంచే విధానాలకు దూరంగా ఉండాలి.(పోప్ స్వదేశం అర్జెంటీనా అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) ఆంక్షలతో ఆర్థిక సంక్షోభంలో పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు). ఇరాన్‌తో అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం శక్తిమంతమైన రాజకీయ సౌహార్దానికి, నిజాయితీకి, సహనానికి చిహ్నం. వాతావరణ మార్పులను అరికట్టాలి.. వాతావరణ మార్పుల నిరోధంపై డిసెంబర్లో ప్యారిస్‌లో జరిగే ఐరాస ఉన్నత సమావేశంలో మౌలికమైన, శక్తిమంతమైన ఒప్పందం కుదురుతుందని ఆశిస్తున్నాను. ఈ విశ్వం.. సృష్టికర్త ఇచ్చిన ప్రేమాస్పద ఫలం. దాన్ని దుర్వినియోగం, విధ్వంసం చేసే అధికారం మానవజాతికి లేదు. స్వార్థం, అధికారం కోసం, భౌతిక సంపదల కోసం అంతులేని దాహం సహజవనరుల విధ్వంసానికి దారి తీస్తోంది. బలహీనులను వాటికి దూరం చేస్తోంది. పర్యావరణ దుర్వినియోగంతో పేదలు దారుణ అన్యాయానికి గురవుతున్నారు. క్రైస్తవుల భద్రత తదితరాలపై.. ప్రపంచమంతా శాంతి పరిఢవిల్లాలి. సిరియా, ఇరాక్లలో తీవ్రవాదులు వేధిస్తున్న క్రైస్తవులకు, ఇతర మతాల వారికి భద్రత కావాలి. లక్షలాదిమందిని నిశ్శబ్దంగా చంపుతున్న మాదక ద్రవ్యాల స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేయాలి. బాలికలతోపాటు బాలలందరికీ విద్యాహక్కు కల్పించాలి. దీనికి ఐరాస గురుతర బాధ్యత తీసుకోవాలి. అసంబద్ధమైన పద్ధతులు, జీవన శైలులను బలవంతంగా రుద్దకూడదు. కాగా శుక్రవారం అమెరికన్లు న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చి పోప్‌కు ఘన స్వాగతం పలికారు. -
ఏంజెలినా జోలీకి కోపం వచ్చినవేళ!
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్య సమితి కాందిశీకుల హైకమిషనర్ ప్రత్యేక రాయబారి, హాలీవుడ్ నటి ఏంజెలినా జోలీ భద్రతా మండలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం భద్రతా మండలిని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సిరియా సంక్షోభాన్ని పరిష్కరించే శక్తిసామర్థ్యాలు భద్రతా మండలికి ఉన్నప్పటికీ, వాటిని వాడుకోవడం లేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. మండలికి ఐక్యత, రాజకీయ సంకల్పం కొరవడిందని ఆమె మండిపడ్డారు. అయిదు సంవత్సరాలుగా సిరియాలో జరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభం కారణంగా రెండు లక్షల 20వేల మంది చనిపోయారు. పది లక్షల మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. 76 లక్షల మంది వారు నివసించే ప్రదేశాల నుంచి వెళ్లిపోయారు. దాదాపు 40 లక్షల మంది పొరుగుదేశాలకు వెళితే అక్కడ తిరస్కరించబడ్డారు. ఈ సమస్యను రాజకీయంగా పరిష్కరించాలన్న సంకల్పం లేకపోవడంవల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితులలో సిరియా సంక్షోభం సమసిపోయే దిశగా భద్రతా మండలి పనిచేయాలని శరణార్ధుల తరపున ఆమె మండలికి విజ్ఞప్తి చేశారు. మండలి తన అధికారాలను వినియోగించి సిరియాలో సంఘర్షణలకు చరమగీతం పాడి సిరియన్లకు న్యాయం చేయాలని ఆమె కోరారు. మండలిలోని దేశాల విదేశాంగ మంత్రులు అందరూ కలసి ఈ సమస్యకు ఒక రాజకీయ పరిష్కారం కనుగొనాలని ఏంజెలినా జోలీ విజ్ఞప్తి చేశారు. -
శాశ్వత సభ్యత్వం మన హక్కు
న్యూఢిల్లీ: భారత్‌కు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం ఇవ్వాల్సిందేనని ప్రధాని నరేంద్రమోదీ మరోసారి పునరుద్ఘాటించారు. శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉండటం భారత్ హక్కు అని నొక్కి చెప్పారు. ఒకప్పుడు అడిగి తీసుకునేందుకు ప్రయత్నించేవాళ్లమని ఇప్పుడు ఆ రోజులు పోయాయని, నేడు అది తమ హక్కు అని చెప్పారు. ప్రపంచం మొత్తానికి శాంతి చిహ్నంగా భారత్ సేవలు అందిస్తున్నందున భద్రతా మండలిలో సభ్యత్వం ఇవ్వడం ద్వారా శాంతి పురుషులైన బుద్ధుడు, మహాత్మాగాంధీవంటి వారికి గొప్ప గౌరవం ఇచ్చినట్లవుతుందని సూచించారు. ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి కారౌజెల్ డూ లావ్రీ వద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారతీయులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. 'ఇటీవల నేను పర్యాటకుడిగా ఫ్రాన్స్‌కు వచ్చాను. కానీ.. నేడు మాత్రం భారత్‌కు పర్యాటకులను తీసుకెళ్లేందుకు వచ్చాను' అని అన్నారు. ఫ్రాన్స్‌తో తమకు మంచి సంబంధాలున్నాయని, భారత్‌లో ఎలాంటి అన్యాయాలు జరిగినా మొదట గొంతెత్తి మాట్లాడే దేశం ఫ్రాన్సేనని చెప్పారు. -
'సిరియా వ్యతిరేక చర్యలకు యుఎన్ఓ మద్దతు ఉండదు'
వాషింగ్టన్: సిరియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్నదాడులకు ఐక్యరాజ్య సమితి(యుఎన్ఓ) భద్రతామండలి మద్దతు ఇవ్వబోదని అమెరికా స్పష్టం చేసింది. సైనిక చర్యలకు రష్యా కూడా అనుమతించబోదని వైట్‌హౌస్ సీనియర్ అధికారులు తెలిపారు. కాగా సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసద్ సొంత ప్రజలపై రసాయనిక ఆయుధాలు ప్రయోగించినట్లు చెప్పారు. తిరుగుబాటు దారులు విష వాయువు ప్రయోగించారన్న మాస్కో వాదనను తోసిపుచ్చారు. తిరుబాటుదారుల దాడుల్లో 1400 మంది మరణించినట్లు అమెరికా ఇంటలిజెన్స్ నివేదిక పేర్కొంది.