న్యూయార్క్: గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయింది. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది.
యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లోని 15 సభ్య దేశాల్లో 11 తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తీర్మానానికి అల్జేరియా వ్యతిరేకంగా ఓటు వేయగా గుయానా ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆకలితో అలమటిస్తున్న గాజా యుద్ధ బాధితులు మానవతా సాయం పొంందేందుకు వీలుగా ఆరు వారాల పాటు కాల్పుల విరణమణ పాటించాలని అమెరికా తీర్మానం ప్రవేశపెట్టింది.
అయితే దీనికి ప్రత్యామ్నాయ తీర్మానంపై ఓటింగ్ కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి శనివారం మళ్లీ సమావేశం కానుంది. తీర్మానంలోని చైనా, రష్యాలకు అభ్యంతరమున్న పదాలను మార్చినట్లు తెలుస్తోంది. రంజాన్ సందర్భంగా గాజాలో తాత్కాలిక కాల్పుల విరమణ పాటించాలని తాజా తీర్మానంలో పొందుపరిచినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment