గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్‌ | UN Security Council Demands Immediate Gaza Ceasefire | Sakshi
Sakshi News home page

గాజా కాల్పుల విరమణకు ఐరాస భద్రతా మండలి డిమాండ్‌

Published Mon, Mar 25 2024 9:50 PM | Last Updated on Mon, Mar 25 2024 10:00 PM

UN Security Council Demands Immediate Gaza Ceasefire - Sakshi

ఇజ్రాయెల్, పాలస్తీనా సంబంధించిన హమాస్ మిలిటెంట్ల మధ్య తక్షణం కాల్పుల విరమణ అమలు చేయాలని ఐక్యరాజ్య సమితి భద్రతామండలి (యూఎన్ఎస్సీ) డిమాండ్ చేసింది. ఇలా భద్రతా మండలి డిమాండ్‌ చేయటం తొలిసారి. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ఇజ్రాయెల్‌కు చెందిన బంధీలందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని యూఎన్‌ఎస్సీ పేర్కొంది. ఈ సమావేశానికి శాశ్వత సభ్యదేశం అమెరికా హాజరుకాకపోవటం గమనార్హం. భద్రతా మండలిలో 14 మంది సభ్యులు హాజరు కాగా.. అందులో 10 మంది సభ్యులు ఈ తీర్మానాన్ని ప్రతిపాదించారు. 

‘గాజా ప్రజలు తీవ్రంగా బాధ పడుతున్నారు. ఈ దాడులు సుదీర్ఘంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏమాంత్ర ఆలస్యం కాకుండా ఈ దాడులకు ముగింపు పలుకడమే మన బాధ్యత’ అని భద్రతా మండలి సమావేశం తర్వాత ఐక్యరాజ్యసమితిలో అల్జీరియా రాయబారి అమర్ బెండ్ జామా తెలిపారు. మరోవైపు.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి తీర్మానంపై అమెరికా వీటో ప్రయోగించాలని ఇజ్రాయెల్‌ ఆర్మీ కోరింది. అయితే పవిత్ర రంజామ్‌ మాసంలో గాజాలో కాల్పుల విరమణ జరగటం కోసమే అమెరికా భద్రతా మండలి సమావేశానికి గైర్హాజరు అయినట్లు తెలుస్తోంది

హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేసిన దాడుల్లో ఇ‍ప్పటివరకు 32 వేల మంది మరణించారు. ఇక.. అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై చేసిన మెరుపు దాడిలో 1160 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందారు. మొత్తం 250 మంది ఇజ్రాయెల్‌ పౌరులను హమాస్ మిలిటెంట్లు బంధీలుగా తీసుకువెళ్లగా.. వారి చేతిలో ఇంకా 130 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఇ‍ప్పటి వరకు హమాస్‌ చేతిలో బంధీలుగా ఉన్న 33 మంది ఇజ్రాయెల్‌ పౌరులు మృతి చెందారు.  

ఇటీవల గాజాలో తక్షణ కాల్పుల విరమణ పాటించాలని, హమాస్‌ వద్ద బంధీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ఐక్యారజ్యసమితి(యూఎన్‌) భద్రతా మండలిలో అమెరికా ప్రవేశపెట్టిన తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే. చైనా, రష్యా వీటో చేయడంతో తీర్మానం వీగిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement