న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూసుకువెళ్తున్నారు. బుధవారం మిచిగాన్‌లోని రోమోలస్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అయితే ర్యాలీలో కొంత మంది గాజాపై జరుగుతున్న యుద్దానికి వ్యతిరేకంగా నిరననలు తెలుపతూ నినాదాలు చేశారు. ‘గాజాలో మారణహోమం’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
దీంతో విసిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. ‘మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అందుకు నేను ఇక్కడి వచ్చి మీ ముందు ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించము అవసరమే. కానీ ప్రస్తుతం నేను మాట్లాడుతున్నా కదా’అని అన్నారు. అయినా కూడా కొంతమంది గాజా యుద్ధం గురించి నినాదాలు చేయటం కొనసాగించారు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు. ‘ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మీరు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా. అలా అనుకుంటే నినాదాలు చేయండి. అలా కాకపోతే నేను మాట్లాడుతున్నాను వినండి’ అని అన్నారు.
దీంతో నిరసన కారుల నుంచి నినాదాలు ఆగిపోయాయి. మరోవైపు.. గాజా అంశంపై అధ్యక్షుడు వ్యవహారించిన తీరు తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం డెమోక్రట్లలో ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇక.. మిచిగాన్ మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉంది. 2020 ఎన్నికల్లో 15 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి పడ్డాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7న నుంచి గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకే ఇజ్రాయెల్ దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment