presidencial polls
-
కమలా హారిస్ హెల్త్‌పై డాక్టర్ రిపోర్టు ఇదే..
న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.‘‘కమలా హారిస్‌కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్‌తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు. .. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.చదవండి: అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎలా జరుగుతాయి? -
కమలా హరీస్ ప్రచారంలో నిరసన.. ఆమె ఏమన్నారంటే?
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డొమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ దూసుకువెళ్తున్నారు. బుధవారం మిచిగాన్‌లోని రోమోలస్లో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అయితే ర్యాలీలో కొంత మంది గాజాపై జరుగుతున్న యుద్దానికి వ్యతిరేకంగా నిరననలు తెలుపతూ నినాదాలు చేశారు. ‘గాజాలో మారణహోమం’అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో విసిగిపోయిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ.. ‘మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముతాం. అందుకు నేను ఇక్కడి వచ్చి మీ ముందు ఉన్నాను. ప్రతి ఒక్కరూ తమ గళం వినిపించము అవసరమే. కానీ ప్రస్తుతం నేను మాట్లాడుతున్నా కదా’అని అన్నారు. అయినా కూడా కొంతమంది గాజా యుద్ధం గురించి నినాదాలు చేయటం కొనసాగించారు. దీంతో ఆమె ఒకింత అసహనానికి గురయ్యారు. ‘ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల్లో మీరు డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించాలని కోరుకుంటున్నారా. అలా అనుకుంటే నినాదాలు చేయండి. అలా కాకపోతే నేను మాట్లాడుతున్నాను వినండి’ అని అన్నారు. దీంతో నిరసన కారుల నుంచి నినాదాలు ఆగిపోయాయి. మరోవైపు.. గాజా అంశంపై అధ్యక్షుడు వ్యవహారించిన తీరు తమకు ఎన్నికల్లో ప్రయోజనం చేకూరుస్తుందని అభిప్రాయం డెమోక్రట్లలో ఉందని స్థానిక మీడియా పేర్కొంటోంది. ఇక.. మిచిగాన్ మొత్తం 15 ఎలక్టోరల్ ఓట్లను కలిగి ఉంది. 2020 ఎన్నికల్లో 15 ఎలక్టోరల్ ఓట్లు డెమోక్రటిక్ పార్టీకి పడ్డాయి. ఇక.. గతేడాది అక్టోబర్ 7న నుంచి గాజాపై ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకే ఇజ్రాయెల్ దాడుల్లో 40 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
అందుకే కమలా హారిస్‌కు ఒబామా మద్దతు ఇవ్వటం లేదు!
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. జో బైడెన్ స్వయంగా కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ.. మద్దతు ప్రకటించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థి స్థానంలో ఇండో-అమెరికన్ కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది. ఇక.. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్‌కు మద్దతుగా ప్రకటన లేదు. దీనిపై పార్టీలో సైతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ‘అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ పడేందుకు కమలా హారిస్ శక్తివంతురాలు కాదని ఒబామా భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశ సరిహద్దులకు వెళ్లని కమలా వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారు. ..ఇలాంటి సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పని అని అనుకుంటున్నారు. ప్రెసిడెంట్ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే హారిస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదు’ అని ఒబామా కుటుంబ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. -
‘పోటీ చేయాలని ఒక్కరోజు ముందు చెప్పారు’
పట్నా: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయాలని తనకు కేవలం నామినేషన్ వేయడానికి 18 గంటల ముందు చెప్పారని పార్టీ సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం చెప్పారు. బహుశా గాంధీ కుటుంబం నుంచి ఎవరూ అధ్యక్ష పగ్గాలు చేపట్టొద్దని రాహుల్ భావించడం వల్లే తనను పోటీ చేయమన్నారని అభిప్రాయపడ్డారు. ‘కానీ రాహుల్ సారథ్యం పార్టీకి చాలా అవసరమన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కానీ ఆయన సెంటిమెంట్లను గౌరవిస్తా’ అని చెప్పుకొచ్చారు మల్లికార్జున ఖర్గే. తాను అధ్యక్షుడినైతే పార్టీ ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలే తొలి ప్రాథమ్యంగా ఉంటుందన్నారు. ఈ ఎన్నికను పార్టీ అంతర్గత వ్యవహారంగా అభివర్ణించారు. ఎంపీ శశిథరూర్ కూడా అధ్యక్ష ఎన్నిక బరిలో దిగడం తెలిసిందే. ఇదీ చదవండి: Bharat Jodo Yatra: రోడ్డుపైనే రాహుల్ పుషప్స్ -
'ఐదుగురు మహిళలతో సంబంధాలు లేవు'
అగ్రరాజ్యం అమెరికాలోనూ రాజకీయాలు రోజురోజుకు దిగజారుతున్నట్లు కనిపిస్తున్నాయి. భార్యలపై కామెంట్లు చేసుకోవడం, అభ్యర్థులు తమ ప్రత్యర్థుల భార్యల న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియలో షేర్ చేయడం లాంటివి చేస్తూ చవకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులు డోనాల్డ్ ట్రంప్, ట్రెడ్ క్రూజ్ ల మధ్య ఉన్న పోటీ వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దారితీస్తుంది. ట్రెడ్ క్రూజ్ కు ఐదుగురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పార్టీకే చెందిన ఓ ప్రముఖ ప్రత్యర్థి ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ వార్త ఆ నాటా ఈ నోటా పాకి మీడియాకు చేరింది. వార్త పత్రికల్లో ఈ విషయాలు ప్రచురితమవ్వడంతో ట్రెడ్ క్రూజ్ ఈ పుకార్లపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. తనకు ఐదుగురు మహిళలతో సంబంధాలున్నాయిని వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేవని, అవన్నీ పుకార్లేనని కొట్టిపారేశారు. ఆ వార్తలు నిజమని నిరూపించాలంటూ ట్రంప్ కు సవాలు విసిరారు. రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. ట్రంప్ మాత్రం ఆ ఆరోపణలతో తనకు లింకు లేదని అంటున్నారు.