న్యూయార్క్: అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఆరోగ్యంతో భేషుగ్గా ఉందని ఆమె డాక్టర్ యూఎస్ ఆర్మీ ఫిజిషియన్ జాషువా ఆర్. సిమన్స్ తెలిపారు. కమల ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్ ఇచ్చిన నివేదికను శనివారం వైట్ హౌస్ విడుదల చేసింది.
‘‘కమలా హారిస్‌కు కాలానుగుణంగా వచ్చే అలెర్జీలు, దద్దుర్లు ఉన్నాయి. ఆమె ఇమ్యునైజేషన్లు , నివారణ సంరక్షణ సిఫార్సులు సరిగా ఉన్నాయి. ఆమె ఎప్రిల్‌నెలలో చేసుకున్న ఫిజికల్ పరీక్ష, సాధారణ రక్త పరీక్షల్లో కూడా ఎటువంటి సమస్య లేదు. కళ్లకు కాంటాక్ట్ లెన్స్‌లు ధరిస్తారు. విటమిన్ D3 సప్లిమెంట్ తీసుకుంటారు. కొన్ని సమయాల్లో అల్లెగ్రా, నాసల్ స్ప్రే , ఐ డ్రాప్స్‌తో పాటు అలెర్జీకి మందులను ఉపయోగిస్తారు.
.. కమల తీసుకునే ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. హారిస్ పొగాకు ఉత్పత్తులు, అల్కాహాల్ తీసుకోరు. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే అదీకూడా చాలా మితంగా తీసుకుంటారు. అమెరికా అధ్యక్షురాలిగా పనిచేసేందుకు ఆమె చాలా ఫిట్‌గా ఉన్నారు. విధులు నిర్వహించేందుకు అవసరమైన శారీరక, మానసిక స్థితిని కమల కలిగి ఉన్నారు’’ అని డాక్టర్ సిమన్స్ నివేదికలో వివరించారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్ వైదొలిగి.. ఉపాధ్యక్షురాలు కమలను అధ్యక్ష అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆరోగ్య సమస్యల కారణంగానే అధ్యక్ష రేసు నుంచి జో బైడెన్ వైదొలిగినట్లు గతంలో ఆరోపణలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ తన ఆరోగ్యపరిస్థితి గురించి పూర్తి సమాచారాన్ని విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment