న్యూయార్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ వైదొలిగారు. జో బైడెన్ స్వయంగా కమలా హారిస్ పేరును అధ్యక్ష అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ.. మద్దతు ప్రకటించారు. దీంతో అధ్యక్ష అభ్యర్థి స్థానంలో ఇండో-అమెరికన్ కమలా హారిస్ పేరు దాదాపు ఖరారైనట్లేనని తెలుస్తోంది.
ఇక.. పార్టీలో మెజారిటీ ప్రతినిధులు, నేతలు ఆమెకు మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం కమలా హారిస్‌కు మద్దతుగా ప్రకటన లేదు. దీనిపై పార్టీలో సైతం తీవ్రంగా చర్చ జరుగుతోంది. అయితే కమలా హారిస్ అభ్యర్థిత్వంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌పై కమలా హారిస్ గెలిచే అవకాశాలు లేవని ఒబామా భావిస్తున్నట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ‘అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై పోటీ పడేందుకు కమలా హారిస్ శక్తివంతురాలు కాదని ఒబామా భావిస్తున్నారు. ఇప్పటివరకు దేశ సరిహద్దులకు వెళ్లని కమలా వలసదారులందరికీ ఆరోగ్య బీమా ఉండాలని మాట్లాడుతున్నారు.
..ఇలాంటి సవాళ్లను దాటి ముందుకెళ్లడం ఆమెకు కష్టమైన పని అని అనుకుంటున్నారు. ప్రెసిడెంట్ అభ్యర్థి విషయంలో పార్టీ నిర్ణయంపై ఒబామా అసంతృప్తిగా ఉన్నారు. అందుకే హారిస్‌కు మద్దతిచ్చేందుకు ముందుకు రావట్లేదు’ అని ఒబామా కుటుంబ వర్గాలు వెల్లడించినట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment