
మయన్మార్‌లో మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 5.1 తీవ్రత నమోదైంది. దీంతో ఇళ్ల నుంచి ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు.
యునైటెడ్ జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) ప్రకారం.. ఆదివాయం మధ్యాహ్నం 12గంటల నుంచి 1గంట మధ్యలో మయన్మార్‌ను మరోసారి భూకంపం వణికించింది. మయన్మార్‌లోని మాండలే ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.1గా నమోదైనట్లు తేలింది.
మరణాల సంఖ్య పెరుగుతోంది
మార్చి 28న మయన్మార్‌ను భారీగా కుదిపేసిన 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య సుమారు 1600కు పైకి చేరింది. 3,400 మందికి పైగా అదృశ్యమయ్యారు. యూఎస్‌జీఎస్ ప్రాథమిక సమాచారం మేరకు మయన్మార్‌లో ఈ భూకంపం వల్ల మరణాల సంఖ్య 10,000 దాటే అవకాశముందని పేర్కొంది.