ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి.
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో.. భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను సంఖ్యను 15 నుంచి 20కి పెంచాలన్న డిమాండుకు అమెరికా, రష్యా మినహా ఇతర దేశాలన్నీ సంసిద్ధత తెలిపాయి.
కాగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచటంపై ఈ సమావేశంలో చర్చ జరగనప్పటికీ.. పాకిస్తాన్‌తో సహాపలుదేశాలు మాత్రం దీనికి ఒప్పుకునేది లేదని తెలిపాయి.