consensus
-
Maha Vikas Aghadi: 200 సీట్లపై ఏకాభిప్రాయం.. శరద్‌పవార్ వెల్లడి
పుణె: మహావికాస్ అఘాడిలోని మూడు భాగస్వామ్య పార్టీల మధ్య 200 స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌పవార్ గురువారం వెల్లడించారు. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలుండగా.. కాంగ్రెస్, ఎన్పీపీ (ఎస్పీ), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే) కలిసి పోటీచేయనున్న విషయం తెలిసిందే. తమ తరఫున ఎన్సీపీ (ఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ సీట్ల పంపకం చర్చల్లో పాల్గొంటున్నారని, ఆయనిచ్చిన సమాచారం మేరకు 200 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. ఎవరెన్ని స్థానాల్లో పోటీచేయాలి, ఏయే నియోజకవర్గాలు ఏ పార్టీకి కేటాయించాలనే విషయంలో మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) పార్టీలు చాలా రోజులుగా కసరత్తు చేస్తున్నాయి. నవంబరు 20న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేయడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. హరియాణా ఫలితం ప్రభావం (బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది) మహారాష్ట్ర ఎన్నికలపై ఉండదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ఎంవీఏ సీఎం అభ్యరి్థని ప్రకటించాలనే శివసేన (యూబీటీ) డిమాండ్‌ను ప్రస్తావించగా మూడు భాగస్వామ్యపక్షాల మధ్య ఈ అంశం పరిష్కారమైందని బదులిచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే పాల్గొన్న సంయుక్త విలేకరుల సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చామని, ఎన్నికల తర్వాత సీఎం అభ్యర్థి నిర్ణయమవుతారని తెలిపారు. నాందేడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా రవీంద్ర చవాన్ నాందేడ్ లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తమ అభ్యర్థిగా రవీంద్ర చవాన్‌ను ప్రకటించింది. దివంగత ఎంపీ వసంత్ రావు కుమారుడే రవీంద్ర. వసంత్ రావు మృతి చెందడంతో నాందేడ్ స్థానికి ఉపఎన్నిక వచి్చంది. వచ్చేనెల 20న పోలింగ్ జరగనుంది. -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
ఢిల్లీ డిక్లరేషన్ వెనక కఠోర శ్రమ వీరిదే..
ఢిల్లీ: ఢిల్లీ డిక్లరేషన్‌పై ప్రపంచ దేశాలు ఏకాభిప్రాయం సాధించడం వెనుక జీ20 షేర్పాల నిరంతరం కష్టం దాగి ఉంది. ఉక్రెయిన్ అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు, 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్ట్‌లు అవసరమయ్యాయి. నిరంతరాయంగా పనిచేసిన తన బృంద సభ్యులను జీ20 షేర్పా అమితాబ్ కాంత్ ప్రశంసించారు. 'ఢిల్లీ డిక్లరేషన్‌లో క్లిష్టమైన అంశం ఉక్రెయిన-రష్యా యుద్ధం. ఈ భౌగోళిక అంశంపై ఏకాభిప్రాయానికి రావడానికి 200 గంటలు 300 ద్వైపాక్షిక సమావేశాలు, 15 డ్రాఫ్టులు అవసరమయ్యాయి. ఈ పనంతా ఇద్దరు అధికారులు చేశారు' అని అమితాబ్ కాంత్ తన బృంద సభ్యులను మెచ్చుకున్నారు. The most complex part of the entire #G20 was to bring consensus on the geopolitical paras (Russia-Ukraine). This was done over 200 hours of non -stop negotiations, 300 bilateral meetings, 15 drafts. In this, I was greatly assisted by two brilliant officers - @NagNaidu08 & @eenamg pic.twitter.com/l8bOEFPP37 — Amitabh Kant (@amitabhk87) September 10, 2023 ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరంగా దేశాధినేతల మధ్య భిన్నాభిప్రాయాలు, ఉక్రెయిన్-రష్యా యుద్ధం అంశాలు వివాదాస్పదంగా ఉన్న సమయంలో జీ20ని నిర్వహించి, తీర్మాణాలపై ఏకాభిప్రాయం కుదర్చడం గొప్ప విజయంగా భావించవచ్చు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయంతో ఆమోదం పొందగానే ప్రధాని మోదీ ప్రశంసనీయంగా ప్రకటించారు. షేర్పాలు, సంబంధిత మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. 'భారత్ జీ20కి అధ్యక్షత వహించేప్పుడే డిక్లరేషన్ అందరినీ కలుపుకుని, నిర్ణయాత్మకంగా, ఆచరణాత్మక దిశలో ఉండాలని ప్రధాని మోదీ సూచించారు. డిక్లరేషన్‌లో మొత్తం 83 పేరాలు ఉన్నాయి. అందులో ఎనిమిది పేరాలు భౌగోళిక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరడం విశేషం' అని అమితాబ్ కాంత్ అన్నారు. ఢిల్లీ డిక్లరేషన్ ఏకాభిప్రాయం కుదరడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిధరూర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం కోసం నిరంతరం పనిచేసిన షేర్పాలను ఆయన ప్రశంసించారు. ఇదీ చదవండి: G20 Summit: ఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం.. ప్రధాన ఐదు అంశాలు ఇవే.. -
శాంతి, సౌభాగ్యం
న్యూఢిల్లీ: ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలతో కూడిన జీ20 కూటమికి ఈ ఏడాది సారథ్యం వహిస్తున్న భారత్‌కు ప్రశంసనీయమైన విజయం దక్కింది. శనివారం ఢిల్లీలో ప్రారంభమైన జీ20 శిఖరాగ్ర సదస్సులో, ప్రపంచ శాంతి, సౌభాగ్యమే ధ్యేయంగా వివిధ కీలక అంశాలతో కూడిన ‘న్యూఢిల్లీ జీ20 సమ్మిట్ లీడర్స్ డిక్లరేషన్’కు కూటమి సభ్యదేశాల ఆమోదం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. డిక్లరేషన్‌పై కూటమి దేశాల మధ్య ఏకాభిప్రాయం వ్యక్తమైందని, వెంటనే ఆమోదం పొందిందని వెల్లడించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం విషయంలో దేశాల మధ్యనున్న భేదాభిప్రాయాలను అధిగమించి మరీ డిక్లరేషన్‌పై ఆమోద ముద్ర పడడం గమనార్హం. డిక్లరేషన్ ఆమోదం పొందడానికి కృషి చేసిన జీ20 దేశాల మంత్రులు, అధికార ప్రతినిధులు(òÙర్పాలు), అధికారులకు నరేంద్ర మోదీ కృతజ్ఞ తలు తెలిపారు. వారంతా ప్రశంసలకు అర్హులని పేర్కొన్నారు. జీ20 శిఖరాగ్ర సదస్సులో శనివారం ఢిల్లీలో అట్టహాసంగా ఆరంభమైంది. భారత ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన ఈ సదస్సులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూకే ప్రధానమంత్రి రిషి సునాక్, సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా తదితరులు పాల్గొన్నారు. చైనా అధినేత షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరు కాలేదు. ఉక్రెయిన్‌లో సంఘర్షణ, ఉగ్రవాదం, అవినీతి, ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, ప్రపంచ ఆర్థిక ప్రగతి, విద్య, నైపుణ్యాల వృద్ధి, పునరుత్పాదక ఇంధనాల వినియోగం తదితర కీలక అంశాలు న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో చోటుచేసుకున్నాయి. ఉక్రెయిన్‌లో శాంతికి పాటుపడాలి ఉక్రెయిన్‌లో నెలకొన్న సంఘర్షణపై న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. నేటి యుగం యుద్ధాల యుగం కాదని తేలి్చచెప్పింది. ప్రాదేశిక సమగ్రత, సార్వ¿ౌమత్వంతో కూడిన అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు అన్ని దేశాలు కట్టుబడి ఉండాలని పేర్కొంది. సమస్యలకు యుద్ధం పరిష్కారం కాదని వెల్లడించింది. శాంతియుత చర్చలు, దౌత్యమార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది. శాంతి తీర్మానం ముఖ్యమని తెలిపింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, సాధారణ సభలో చేసి న తీర్మానాలకు కట్టుబడి ఉండాలని, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను అన్ని దేశాలు పాటించాలని వెల్లడించింది. ఇతర దేశాల భూభాగా లను ఆక్రమించుకోవడం, అందుకోసం బెదిరింపులకు దిగడం లేదా బలప్రయోగానికి పాల్పడ డం ఆమోదనీయం కాదని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను ప్రయోగిస్తామని బెదిరించడం లేదా ప్రయోగించడం ఆక్షేపణీయమని పేర్కొంది. ఉక్రెయిన్‌లో సుస్థిర శాంతి కోసం అన్ని దేశాలూ చొరవ తీసుకోవాలని పిలుపునిచి్చంది. ‘‘ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే ఖండించాల్సిందే. అంతర్జాతీయ శాంతికి, భద్రతకు ఉగ్రవాదం తీవ్రమైన ముప్పుగా మారింది. మతం, జాతి పేరిట ప్రజల మధ్య చిచ్చు రేపడం క్షమార్షం కాదు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉమ్మడిగా కృషి చేయాలి. ఆయుధాల అక్రమ రవాణా కూడా ఆందోళనకరంగా మారింది. ఈ అవాంఛనీయ ధోరణిని అరికట్టాల్సిందే. ఆయుధాల ఎగుమతులు, దిగుమతులపై అన్ని దేశాలు గట్టి నిఘా పెట్టాలి’’అని డిక్లరేషన్ సూచించింది. మానవ వనరుల అభివృద్ధికి ప్రాధాన్యం ప్రపంచంలో అందరికీ సమాన స్థాయిలో, నాణ్య మైన విద్య, నైపుణ్య శిక్షణను అందించాల్సిన ఆవశ్యకతను న్యూఢిల్లీ డిక్లరేషన్ నొక్కిచెప్పింది. మానవ వనరుల అభివృద్ధికి అత్యధిక ప్రాధా న్యం ఇవ్వాలని సూచించింది. ప్రజల మధ్య డిజి టల్ అంతరాలను తొలగించడానికి డిజిటిల్ సాంకేతికలను సమర్థంగా ఉపయోగించుకోవా లని జీ20 దేశాలు తమ డిక్లరేషన్‌లో తీర్మానించు కున్నాయి. కృత్రిమ మేధ సహా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనేలా విద్యాసంస్థలకు, టీచర్లకు సహకరించాలని నిర్ణయించుకున్నాయి. విద్యార్థులు, నిపుణులు, పరిశోధకులు, సైంటిస్టులు పరిశో« దనా సంస్థలతో, ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. దుర్బల పరిస్థితుల్లో ఉన్నవారికి సైతం సమగ్ర, సమాన, నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. ఉన్నత విద్య, ఉద్యోగాల సాధనకు ఫౌండేషనల్ లెరి్నంగ్ ప్రాముఖ్యతను తాము గుర్తించామని పేర్కొన్నారు. హై–క్వాలిటీ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్(టీవీఈటీ)ని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. స్వేచ్ఛాయుత, పారదర్శక వాణిజ్యం ప్రపంచమంతటా నిత్యావసరాల ధరలు, జీవన వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో వ్యవసాయం, ఆహారం, ఎరువుల రంగంలో స్వేచ్ఛాయుత, పారదర్శక, నిబంధనల ఆధారిత వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో పేర్కొ న్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నిబంధనలకు అనుగుణంగా ఎగుమతులపై నిషేధం విధించరాదని ఉద్ఘాటించారు. ఆహార భద్రత సవాళ్లను ఎదుర్కొనేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలు సాగిస్తున్న ప్రయత్నాలకు, వాటి సామర్థ్యాలకు మద్దతు ఇవ్వాలని తీర్మానించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం చౌకగా అందేలా కలిసి పని చేయాలని నిర్ణయించారు. చాలినంత ఆహారం అనేది అందరి హక్కు అని పేర్కొన్నారు. ప్రపంచ ఆహార భద్రతను మరింత పెంచడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అలాగే అగ్రికల్చరల్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ(ఏఎంఐఎస్)లోకి ఎరువులు, వెజిటబుల్ ఆయిల్స్‌ను కూడా తీసుకోవాలని నిర్ణయించారు. ఆహార ధరల్లో హెచ్చుతగ్గులను అరికట్టడానికి గ్రూప్ ఆన్ ఎర్త్ అబ్జర్వేషన్స్ గ్లోబల్ అగ్రికల్చరల్ మానిటరింగ్(జియోగ్లామ్) వ్యవస్థను తీసుకురానున్నారు. ఏఎంఐఎస్ పరిధిలో ప్రస్తుతం బియ్యం, గోధుమలు, మొక్కజొన్న, సోయా ఉన్నాయి. మహిళలు, చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహిళా ఆహార భద్రత, పౌష్టికాహారం ప్రాధాన్యతను డిక్లరేషన్ వివరించింది. నైపుణ్యాల అంతరాలను తొలగించాలి ప్రపంచవ్యాప్తంగా జనంలో నైపణ్యాల అంతరాలను తొలగించి, నిపుణులను తయారు చేయడానికి కార్యాచరణ చేపట్టాలని న్యూఢిల్లీ డిక్లరేషన్‌లో కూటమి నేతలు ప్రతిన బూనారు. సమీకృత సామాజిక రక్షణ విధానాలను అందరికీ వర్తింపజేయాలని తీర్మానించారు. సామాజిక భద్రత ప్రయోజనాలను ద్వైపాక్షిక, బహుముఖీన ఒప్పందాల ద్వారా అర్హులకు అందించేందుకు అంగీకరించారు. బాల కారి్మక వ్యవస్థను, వెట్టి చాకిరి వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని నిర్ణయించారు. సమగ్ర ఆర్థిక ప్రగతి కోసం గ్లోబల్ స్కిల్స్ పెంచడం చాలా ముఖ్యమంత్రి డిక్లరేషన్ తేలి్చచెప్పింది. డిజిటల్ అప్‌స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని సూచించింది. గిగ్, ప్లాట్‌ఫామ్ కారి్మకులకు సామాజిక పరిరక్షణ పథకాలు, మెరుగైన పని వసతులు కల్పించాలన్న ప్రతిపాదనను కూటమి నేతలు ఆమోదించారు. అవినీతిపై యుద్ధమే అవినీతి సహించడానికి ఎంతమాత్రం వీల్లేదని జీ20 నేతలు తీర్మానించారు. అవినీతికి యుద్ధం సాగించాలని డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. ఈ విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని, సమాచారాన్ని ఇచి్చపుచ్చుకోవాలని నిర్ణయానికొచ్చారు. అవినీతిని ఎదుర్కొనే దిశగా ఆస్తులను స్వా«దీనం చేసుకొనే యంత్రాంగాలను బలోపేతం చేయాలన్నారు. అవినీతిపై పోరాడే బాధ్యతలను నిర్వర్తించే ప్రభుత్వ సంస్థలు, అధికారులు మరింత ప్రభావవంతంగా పనిచేసేలా చర్యలు చేపట్టాలని తీర్మానంలో పేర్కొన్నారు. అవినీతిని అరికట్టడానికి అంతర్జాతీయ స్థాయిలో జరిగే ప్రయత్నాలకు మద్దతు ఇస్తామన్నారు. శిలాజ ఇంధనాల వాడకం తగ్గించుకుందాం పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వాడకాన్ని దశల వారీగా తగ్గించుకొనే ప్రయత్నాలను మరింత వేగవంతం చేయాలంటూ న్యూఢిల్లీ డిక్లరేషన్‌ను ఆమోదించారు. అలాగే 2009లో పిట్స్‌బర్గ్‌లో చేసిన ప్రతిజ్ఞ ప్రకారం శిలాజ ఇంధనాలపై సబ్సిడీలను హేతుబద్దీకరించాలని నిర్ణయించారు. అతితక్కువ ఉద్గారాలతో కూడిన ఇంధన వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడానికి టెక్నాలజీని వాడుకోవాలని పేర్కొన్నారు. కాలుష్య రహిత, పునరుత్పాదక ఇంధన వనరుల వైపు మళ్లేలా పేద దేశాలకు సహకరించాలని తీర్మానించారు. వాతావరణ మార్పుల నియంత్రణ లక్ష్యాల సాధనకు శుద్ధ ఇంధనాల వాడకాన్ని పెంచుకోవాలని, ఇందుకోసం ఉమ్మడి ప్రయత్నాలు కొనసాగించాలని జీ20 నాయకులు డిక్లరేషన్‌ను ఆమోదించారు. నవీన ఆవిష్కరణలకు ఊతం ఇచ్చేలా, టెక్నాలజీ ప్రయోజనాలను పరస్పరం పంచుకొనేలా సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోవాలని తీర్మానించారు. ఇంధన భద్రతను, మార్కెట్ స్థిరత్వాన్ని పెంచుకోవడానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ప్రజలకు సేవలు అందించడానికి, నూతన ఆవిష్కరణలకు భద్రమైన, నమ్మకమైన, పారదర్శకతతో కూడిన సమగ్ర డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాల(డీపీఐ) అవసరాన్ని జీ20 నేతలు గుర్తించారు. ‘ఇంటర్నేషనల్ గవర్నెన్స్ ఫర్ ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్’పై అంతర్జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానంలో పేర్కొన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాల కోసం జీ20 ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలన్న సూచనను డిక్లరేషన్ స్వాగతించింది. గౌరవప్రదమైన మానవ హక్కులు, వ్యక్తిగత డేటా, గోప్యత, మేధో సంపత్తి హక్కుల గురించి కూడా డిక్లరేషన్‌లో ప్రస్తావించారు. డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో విశ్వాసాన్ని, భద్రతను పెంపొందించాలని తెలిపారు. ‘మంచి కోసం, అందరి కోసం’అనే నినాదంతో కృత్రిమ మేధ(ఏఐ)ను వాడుకోవాలన్నారు. ఏఐతో లాభాలు అందరికీ సమానంగా దక్కాలని, రిస్‌్కను సైతం సమానంగా పంచుకోవాలని అభిప్రాయపడ్డారు. గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెస్పిరేటరీ(జీడీపీఐఆర్) ఏర్పాటు చేస్తామన్న భారత్ ప్రకటన పట్ల డిక్లరేషన్ సానుకూలంగా స్పందించింది. మలీ్టలేటరల్ డెవలప్మెట్ బ్యాంకులు అవసరమని తెలియజేసింది. సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ కావాలి ప్రపంచ ఆర్థిక రంగానికి ఎదురవుతున్న సవాళ్లు, నెలకొన్న సంక్షోభాలపై జీ20 డిక్లరేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆర్థిక వృద్ధిలో దేశాల మధ్య అసమానతలను తగ్గించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి ఆర్థిక సహకార విధానాలు, నిర్మాణాత్మక చర్యలు ప్రారంభించాలని పేర్కొంది. ధరల్లో స్థిరత్వం కోసం సెంట్రల్ బ్యాంకులు సహకరించాలని పేర్కొంది. దీర్ఘకాలిక వృద్ధికి ప్రోత్సాహం ఇవ్వాలంటే సూక్ష్మ ఆర్థిక వ్యవస్థ, నిర్మాణాత్మక ప్రభుత్వ విధానాలు అవసరమని ఉద్ఘాటించింది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు(ఎఫ్ఎస్బీ) తీసుకున్న చర్యలను డిక్లరేషన్ ప్రశంసించింది. పాలసీ క్రెడిబిలిటీని కొనసాగించాలంటే సెంట్రల్ బ్యాంకులకు స్వతంత్ర ప్రతిపత్తి చాలా అవసరమని అభిప్రాయపడింది. దేశాల అభివృద్ధిలో స్టార్టప్ కంపెనీలు, ఎంఎస్ఎంఈల పాత్ర చాలా కీలకమని స్పష్టం చేసింది. -
G20 summit: ఏకాభిప్రాయం సాధిస్తాం
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఢిల్లీ డిక్లరేషన్ దాదాపు సిద్ధమైందని భారత్ ప్రకటించింది. ‘ ఢిల్లీ డిక్లరేషన్‌పై ఏకాభిప్రాయం వస్తుందని ఆశిస్తున్నాం. ఈ దిశగా సంప్రదింపులు ముమ్మరంగా జరుగుతున్నాయి’ అని భారత్ ప్రకటించింది. సదస్సుకు సంబంధించిన వివరాలను విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా వెల్లడించారు. అయితే రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణ మార్పులు వంటి అంశాల్లో సమ్మతి సాధ్యమయ్యేనా అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఆయన చెప్పలేదు. ‘ ఆఫ్రికా యూనియన్‌కు జీ20 కూటమిలో సభ్యత్వం ఇవ్వాలా వద్దా అనే అంశంపై శనివారం జరిగే సదస్సులో నిర్ణయం తీసుకోవచ్చు’ అని క్వాత్రా తెలిపారు. ‘ప్రధాని మోదీకి గ్లోబల్ సౌత్ దేశాలపై ప్రగాఢ విశ్వాసముంది. అందుకే ఆఫ్రికా యూనియన్ను కలుపుకుందామని జీ20 సభ్యదేశాలకు రాతపూర్వకంగా మోదీ విన్నవించుకున్నారు. ఢిల్లీ డిక్లరేషన్ అనేది గ్లోబల్ సౌత్‌కు, అభివృద్ధి దేశాలకు గొంతుకగా ఉంటుంది. జీ20కి భారత సారథ్యం సమ్మిళితంగా, లక్ష్య సాధకంగా, క్రియాశీలకంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని మోదీ ధీమా వ్యక్తంచేశారు ’ అని జీ20 షెర్పా అయిన అమితాబ్ కాంత్ చెప్పారు. ‘ భారత వైవిధ్య, సమాఖ్య నిర్మాణానికి గుర్తుగా ఇప్పటికే దేశవ్యాప్తంగా 60 నగరాలు, పట్టణాల్లో 220కిపైగా జీ20 సంబంధ సమావేశాలు జరిగాయని అమితాబ్‌కాంత్ పేర్కొన్నారు. అగ్ర నేతలు పాల్గొనే సెషన్స్‌లు మూడు విడిగా జరుగుతాయి. వీటికి ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అని నామకరణం చేశారు. శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అగ్రనేతల గౌరవార్ధం విందు ఇవ్వనున్నారు. జీ20 నేతలంతా రాజ్‌ఘాట్‌కు చేరుకుని గాంధీజీకి ఘన నివాళులు అర్పించనున్నారు. ప్రపంచ రాజకీయ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి, సమ్మిళిత వృద్ధి, ఉక్రెయిన్ యుద్ధం, వాతావరణంలో పెను మార్పులు, గ్లోబల్ సౌత్ దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లు తదితర కీలక అంశాలు నేతల మధ్య భేటీలో చర్చకు రానున్నాయి. మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, జర్మనీ చాన్స్‌లర్ స్కోల్జ్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మేక్రాన్ సహా ఇతర దేశాల నేతలు, ఈయూ, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఓఈసీడీ, ఐరాస వంటి అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు హాజరుకానున్నారు. -
ఏకాభిప్రాయం సాధిద్దాం
న్యూఢిల్లీ: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు జి–20లో సహకారంపై ప్రభావం చూపనీయరాదని, ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయానికి రావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభంపై దేశాల మధ్య విభేదాలు పొడచూపిన నేపథ్యంలో గురువారం జి–20 దేశాల విదేశాంగ మంత్రులకు ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశం పంపారు. ‘మహాత్మాగాంధీ, గౌతమబుద్ధుడి నేలపై కలుసుకున్న మీరు, భారతదేశ నాగరికత, తాత్వికతల నుంచి ప్రేరణ పొందాలని, మనల్ని విభజించే వాటిపై కాకుండా, మనల్ని ఐక్యంగా ఉంచే అంశాలపై దృష్టి పెట్టాలి’అని సూచించారు. ‘అభివృద్ధి, ఆర్థిక స్థిరత్వం, అంతర్జాజాతీయ నేరాలు, అవినీతి, ఉగ్రవాదం, ఆహారం, ఇంధన భద్రత’వంటి అంశాల్లో పరిష్కారం కోసం ప్రపంచం జి–20 వైపు చూస్తోంది. ఈ విషయంలో ఏకాభిప్రాయం సాధించి, ఫలితాలను రాబట్టే సామర్థ్యం జి–20కి ఉంది’అని ఆయన చెప్పారు. అంతర్జాతీయ సమాజంలో తీవ్ర విభేదాలు తలెత్తిన సమయంలో మనం కలుసుకున్నాం. మన మధ్య జరిగే చర్చలు భౌగోళిక రాజకీయాల ప్రభావం ఉండటం సహజం. అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాల ప్రతినిధులుగా ఇక్కడ లేని వారి పట్ల కూడా మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’అని ప్రధాని పేర్కొన్నారు. వ్యవస్థలు విఫలం ‘గత కొద్ది సంవత్సరాల్లో ఆర్థిక సంక్షోభం, వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి, ఉగ్రవాదం, యుద్ధాలు..వంటి వాటిని ఎదుర్కొన్న విధానం చూస్తే అంతర్జాతీయ వ్యవస్థలు ఎలా దారుణంగా విఫలమయ్యాయో స్పష్టమవుతోంది. ఈ వైఫల్యం విషాదరకర పరిణామాలను అభివృద్ధి చెందుతున్న దేశాలే ఎక్కువగా ఎదుర్కొన్నాయనే విషయం మనం అంగీకరించాలి. ఏళ్లపాటు సాధించుకున్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు తిరోగమించే ప్రమాదం ఉంది’అని ప్రధాని హెచ్చరించారు. అభివృద్ధి చెందుతున్న చాలా దేశాలు తమ ప్రజానీకానికి ఇంధన, ఆహార భద్రతను అందించే క్రమంలో తీవ్రమైన రుణ భారంతో అవస్థలు పడుతున్నాయన్నారు. ధనిక దేశాల కారణంగా వచ్చిన గ్లోబల్ వార్మింగ్తోనూ ఆయా దేశాలు ప్రభావితమయ్యాయని చెప్పారు. తమ నిర్ణయాల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వారి మాట వినకుండా ఏ వర్గం కూడా తమదే ప్రపంచ నాయకత్వమంటూ చాటుకోలేదని మోదీ అన్నారు. విదేశాంగ మంత్రి జై శంకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అమెరికా, రష్యా, చైనా, యూకేల విదేశాంగ మంత్రులు వరుసగా ఆంటోనీ బ్లింకెన్, లావ్రోవ్, క్విన్, క్లెవెర్లీతోపాటు ఈయూ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇటలీ ప్రధానితో చర్చలు భారత్, ఇటలీలు రక్షణ సహకారంలో కొత్త అధ్యాయానికి తెరతీస్తూ తమ ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. గురువారం ఢిల్లీకి చేరుకున్న ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీతో వివిధ అంశాలపై ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. అనంతరం మెలోనీతో కలిసి మోదీ మీడియాతో మాట్లాడారు. సంయుక్త భాగస్వామ్యం, సంయుక్త అభివృద్ధి రంగాల్లో భారత్‌లో నూతన అవకాశాలకు దారులు తెరుచుకున్నాయన్నారు. ఈ బంధం ఉభయతారకమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం అంశాలపై రెండు దేశాలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. -
‘క్రిప్టో’పై ఏకాభిప్రాయానికి భారత్ కసరత్తు..
న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీల నియంత్రణ కోసం వివిధ దేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు భారత్ ప్రయత్నిస్తోంది. వీలైతే, జీ–20కి భారత్ అధ్యక్షత వహిస్తున్న ప్రస్తుత తరుణంలోనే ఇది కుదిరేలా చూసేందుకు ఆర్థిక స్థిరత్వ బోర్డు (ఎఫ్ఎస్బీ)తో కలిసి పని చేస్తోంది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) కార్యదర్శి అజయ్ సేథ్ ఈ వివరాలు తెలిపారు. క్రిప్టో అసెట్స్‌పై అంతర్జాతీయ ద్రవ్య నిధి రూపొందించిన నివేదికపై జనవరి 15, 16 తేదీల్లో ఢిల్లీలో జరిగిన సమావేశంలో వర్ధమాన దేశాలు చర్చించుకున్నాయని సేథ్ చెప్పారు. ఫిబ్రవరి 23న బెంగళూరులో జరగబోయే జీ–20 ఆర్థిక మంత్రులు, సెంట్రల బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్భంగా .. క్రిప్టో అసెట్స్ పాలసీపైనా ఏకాభిప్రాయ సాధనకు ఒక సెమినార్ జరగనున్నట్లు వివరించారు. దీని కోసం చర్చాపత్రం రూపకల్పన జరుగుతోందని పేర్కొన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులను కట్టడి చేసే దిశగా క్రిప్టో అసెట్స్‌పై అన్ని దేశాలూ కలిసి అంతర్జాతీయంగా నియంత్రించేలా చూసేందుకు జీ–20 అధ్యక్షత సందర్భంగా భారత్ కృషి చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇప్పటికే తెలిపారు. ఎటువంటి నియంత్రణలు లేని క్రిప్టో కరెన్సీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతూ ఇన్వెస్టర్లను నష్టాలపాలు చేస్తుండటం ప్రపంచ దేశాలను కలవరపెడుతోన్న సంగతి తెలిసిందే. 2021 నవంబర్‌లో 3 ట్రిలియన్ డాలర్లుగా ఉన్న క్రిప్టోల మార్కెట్ వేల్యుయేషన్ 2023 జనవరి నాటికి 1 ట్రిలియన్ డాలర్ దిగువకు పడిపోయింది. -
Presidential election: బీజేపీ ‘ఏకాభిప్రాయ’ మంత్రం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించాలని బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం మిత్రులతో పాటు వితిపక్ష యూపీఏ భాగస్వాములతోనూ, ప్రాంతీయ పార్టీలతోనూ సంప్రదింపులు జరపాలని నిర్ణయించింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నా«థ్సింగ్లకు ఈ బాధ్యత అప్పగించింది. అన్ని పార్టీ ల నేతలతో వారు చర్చలు జరుపుతారని ఆదివారం ప్రకటించింది. వారిద్దరూ త్వరలో రంగంలోకి దిగనున్నారు. రాజ్‌నాథ్‌కు పార్టీలకు అతీతంగా అందరు నేతలతోనూ సత్సంబంధాలున్నాయి. 2107 రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్‌నాథ్ కోవింద్‌ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాల్లో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించడం తెలిసిందే. ఈసారి వాటికా అవకాశం ఇవ్వరాదన్నదే బీజేపీ తాజా నిర్ణయం వెనక ఉద్దేశమని చెబుతున్నారు. విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించడంపై 15న చర్చించుకుందామంటూ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలతో పాటు పలు పార్టీలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ లేఖ రాయడం తెలిసిందే. ఆ మర్నాడే బీజేపీ ఏకాభిప్రాయ సాధనకు తెర తీయడం ఆసక్తిగా మారింది. 2017లోనూ రాష్ట్రపతి ఎన్నికపై చర్చలు, సంప్రదింపులు జరిపిన బీజేపీ కమిటీలో అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆ ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ బరిలో దిగడం తెలిసిందే. -
డబ్ల్యూహెచ్ఓ చీఫ్‌గా టెడ్రోస్ ఏకగ్రీవ ఎన్నిక
జెనీవా: ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. నామినేషన్లకు గడువు ముగిసిన తర్వాత టెడ్రోస్ పేరు మొదట్లో ఉండగా ఆయన అభ్యర్థిత్వానికి ఫ్రాన్స్, జర్మనీ మద్దతునిచ్చాయి. ఇథియోపియాకు చెందిన టెడ్రోస్ డబ్ల్యూహెచ్ఓకి సారథ్యం వహించిన మొట్టమొదటి ఆఫ్రికన్. -
‘వెపా’ ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఎన్నిక
న్యూఢిల్లీ: పెట్టుబడుల ప్రోత్సాహక ఏజెన్సీలకు సంబంధించిన వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ ఏజెన్సీస్ (వైపా) ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఏకగ్రీవంగా ఎన్నికైంది. భారత్‌పై అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనమని అధికార వర్గాలు తెలిపాయి. 2021–23 కాలానికి వైపా స్టీరింగ్ కమిటీలో ప్రెసిడెంట్‌గా ఇన్వెస్ట్ ఇండియా ఉండనుండగా, ఈజిప్ట్.. స్విట్జర్లాండ్ వైస్–ప్రెసిడెంట్లుగా వ్యవహరించనున్నాయి. బ్రెజిల్, దక్షిణ కొరియా మొదలైన తొమ్మిది దేశాలు ప్రాంతీయ డైరెక్టర్లుగా ఉంటాయి. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే వైపా మండలిలో ఐక్యారాజ్య సమితికి చెందిన వివిధ సంస్థలు, వరల్డ్ బ్యాంక్ మొదలైన వాటికి సభ్యత్వం ఉంది. భారత్‌లో పెట్టుబడుల అవకాశాలు పరిశీలిస్తున్న ఇన్వెస్టర్లకు తోడ్పడేందుకు జాతీయ పెట్టుబడి ప్రోత్సాహక, సమన్వయ ఏజెన్సీగా ఇన్వెస్ట్ ఇండియా ఏర్పాటైంది. వ్యాపారాలను స్వాగతించేందుకు పలు కీలకమైన ఆర్థిక సంస్కరణల అమలుకు భారత్ నిరంతరం చర్యలు తీసుకుంటోందని అధికారులు తెలిపారు. దీనితో దాదాపు 30 లక్షల ఉద్యోగాలు కలి్పంచేందుకు అవకాశమున్న 155 బిలియన్ డాలర్ల పైగా సూచనప్రాయ పెట్టుబడులకు ఇన్వెస్ట్ ఇండియా సమన్వయకర్తగా వ్యవహరిస్తోందని వివరించారు. -
లక్ష్యసిద్ధికి త్రికరణశుద్ధి
మనం ఏ కార్యాన్ని ఆచరించినా త్రికరణశుద్ధితో ఆచరించాలి. మనస్సుకు, మాటకు, చేతకు తేడా లేకుండా ఉండటమనే నిజాయితీనే త్రికరణశుద్ధిగా వ్యవహరించవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే, మనోవాక్కాయాల శుద్ధి. ఏదయినా పనిని మనసా, వాచా, కర్మణా అన్నిటా ఏకీభావ స్థితిలో మలచుకోవడమే త్రికరణశుద్ధి. మనసులో ఏ విధంగా కార్యాన్ని చేయాలని మనం సంకల్పిస్తామో, వచస్సులో, అంటే మన మాటల్లోనూ అదే ప్రతిఫలించాలి. కర్మణా అంటే కార్యాన్ని ఆచరించే విధానమూ మనం తలచిన విధంలో, చెప్పిన సంవిధానంలో పూర్తి చేయాలి. అప్పుడే ఆ కార్యం త్రికరణశుద్ధి కలిగినదై, లోకాన రాణింపునకు వస్తుంది. మనం ఎన్నో గొప్ప కార్యాలను మదిలో సంకల్పిస్తాం. తీరా, ఆ పనులను గురించి నలుగురిలో విడమరచి చెప్పాలంటే ఎందుకో బిడియం, ఎవరు ఏమనుకుంటారో..? అనే సందేహం. మనం సాధించగలమో లేదో అని అనుమానం. ఒకవేళ, మరీ సాహసం చేసి కొంతవరకు చెప్పగలిగినా, మళ్ళీ ఆచరించే సమయంలో మనకున్న సందేహాలతో ముందుకు సాగకుండా ఆగిపోతాం, దానికితోడు అనుకోకుండా ఎదురయ్యే అవాంతరాలు..!! ఈ విధంగా చేసే కార్యాలు నిరర్ధకమైన రీతిలోనే సాగుతాయి. మన మనసు అత్యంత పవిత్రమైనదనీ, సమస్త పుణ్యాలు అగణ్యమైన రీతిలో ఈ ధరిత్రిలో జరిగింది కేవలం మనసు వల్లనేనని పెద్దల ఉవాచ. అందుకని తలచిన పనులు సఫలం అవాలంటే, మనం భావించిన విషయాన్ని స్పష్టంగా వ్యక్తపరచగలగాలి. ఇది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఏ పనిలోనైనా కార్యసిద్ధి అనేది ఒక్కరి వల్ల జరగదు. అది సమిష్టిగా, నలుగురితో కలిసి కృషి చేయడం వల్ల జరుగుతుంది లేదా కొంతమంది వ్యక్తుల సమన్వయంతో జరుగుతుంది. అధికశాతం పనులు రకరకాల వ్యక్తుల సమన్వయంతోనే జరుగుతాయి. ఈ కార్యక్రమంలో కొంతమంది విద్యాధికులు, కొంతమంది ఎక్కువగా చదువుకోనివారు కూడా భాగం కావచ్చు. వీరందరి మధ్యా జరిగే సమన్వయమే త్రికరణాలతో కూడుకుని తలపెట్టిన పనిలో కార్యసిద్ధిని కలిగిస్తుంది. వ్యక్తిగతంగా తాము చేసే పనులు కూడా శుద్ధమైన మనసుతో ఆచరిస్తే, విజయాలు సాధించవచ్చు. మధ్యయుగం కాలంలోని ఒక చిన్న కథ ద్వారా ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఒక గురువు గారు నదికి అవతలి ఒడ్డున తన శిష్యులతో నిలిచి ఉన్నారు. నదిలో వారిని దాటించే పడవవాడు వెళ్ళిపోయాడు. కానీ గట్టుకు రెండోవేపు ఒక శిష్యుడు నిలిచిపోయాడు. గురువుగారు, వేగంగా రమ్మని ఆ శిష్యుని ఆజ్ఞాపించారు. వెంటనే, ఆ శిష్యుడు నీటిమీద వేగంగా నడుచుకుని అవతలి గట్టుకు వెళ్ళిపోయాడు. గురువుగారు, శిష్యునికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ‘‘నాయనా.. ఏ విద్యతో అంత వేగంగా నీటిమీద నడుచుకుంటూ రాగలిగావు’’ అంటూ ఆశ్చర్యాన్ని ప్రకటించగా, శిష్యుడు’’ భలేవారే.. గురువుగారు... మీకు తెలియని విద్యలేవి ఉన్నాయి నా దగ్గర..!! మీరు తొందరగా రమ్మని ఆజ్ఞాపించారు. నేను మదిలో నది ఒడ్డుకు రావాలన్న తలపును త్రికరణశుద్ధిగా ఆచరించాను. విజయవంతంగా మీ దగ్గరకు చేరుకున్నాను’’ అంటూ వినయంగా సెలవిచ్చాడు. ఇందులో శిష్యుడు చూపిన అగణితమైన ప్రతిభకన్నా, అతని అంకితభావం, నదిని విజయవంతంగా దాటే సమయాన మనసా, వాచా, కర్మణా ఒకే పద్ధతిలో ముందుకు సాగడం పెద్ద పెద్ద లక్ష్యాలను తలపోసే అందరికీ అనుసరణీయం. త్రికరణశుద్ధిగా చరించే మనిషి తనను తాను మూర్తిమంతంగా నడుపుకుంటూ, విజయాలను అవలీలగా సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎన్నో శాస్త్రాలను, విజ్ఞానాన్ని శిష్యులకు క్షుణ్ణంగా బోధించిన ఓ గురువుగారి జీవనప్రస్థానపు అంతిమఘడియల్లో అమృతతుల్యమైన ఈ సత్యం విశదం అయింది. మహా విజ్ఞాననిధియై జీవితాన్ని గడిపిన గురువుగారికి అంత్యకాలం చేరువ అయ్యింది. ఆయన శిష్యులందరిలో ఎడతెగని విచారం. ఆయన ఆశ్రమ ప్రాంతమంతా విషాద వీచికలు కమ్ముకుంటున్నాయి. ముఖ్యశిష్యునిగా వ్యవహరిస్తూ, ఆశ్రమ యోగక్షేమాలు చూసే అతనిలో మరీ విచారం..!! ఈ వాతావరణాన్ని పరికిస్తున్న గురువుగారికి జీవన విషమస్థితిలోనూ ఏ మాత్రం మింగుడుపడడం లేదు. గురువు తన ముఖ్యశిష్యుణ్ణి దగ్గరకు పిలిచి ‘‘ఎందుకు మీరంతా అంతగా బాధపడిపోతున్నారు’’ అని ప్రశ్నించగా, అతను గద్గద స్వరంతో ‘‘గురువుగారూ.. మీరు మా నుంచి వెళ్ళిపోతున్నారు. మీవల్ల ఈ ఆశ్రమానికి వచ్చిన గొప్ప గుర్తింపు, ఎనలేని కాంతి మీ తదనంతరం మాయమవుతుంది. మాలో ఈ కారణం చేతనే రోజురోజుకూ అశాంతి పెరుగుతోంది’’ అన్నాడు. దానికి గురువు నవ్వుతూ ‘‘పిచ్చివాడా.. ఎంత అవివేకంతో మాట్లాడుతున్నావు నాయనా..!! నువ్వు చెప్పిన విధంగా జరిగితే, నేను ఇన్ని రోజులూ మీ అందరికీ చేసిన విద్యాబోధన అంతా వృథానే సుమా.. నేను మీకు ఇచ్చే సలహా ఒక్కటే.. నేను నేర్పించిన విషయాలను అన్నిటా ఆచరణలో పెడుతూ, మిమ్మల్ని మీరే దివ్యమైన జ్యోతుల్లా వెలిగించుకోండి. అది కేవలం మీరు త్రికరణశుద్ధితో చేసే పనులవల్లనే సదా సాధ్యమవుతుంది’’ అన్నాడు. శిష్యునికి జ్ఞానోదయ మయింది. మిగిలిన వారికీ ఇదే సందేశాన్ని అందించి, గురువు బోధలను మనసా వాచా కర్మణా ఆచరించి విజేతగా నిలిచాడు. త్రికరణశుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరందభరితమైన జీవనం అమితంగా లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరి గా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడం ప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. ‘‘త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చును.. లోకము మెచ్చును’’ అన్న సంకీర్తనాచార్యుని వాక్కులు అక్షరసత్యం. త్రికరణశుద్ధితోనే జీవనానికి నిజమైన సత్వం, పస కలిగిన పటుత్వం కలుగుతాయి. బుద్ధిమంతుల ఆలోచనా సరళికి ఆధారమూలం జీవనగమనంలో వారు కలిగి ఉండే త్రికరణశుద్ధి..!! ఈ లక్షణం కలిగినవారికి తప్పక ఒనగూడుతుంది అన్నిటా కార్యసిద్ధి.. త్రికరణ శుద్ధిగా వుండడమే సిసలైన జీవనానికి ఆనందసూత్రం..!! త్రికరణశుద్ధి లేనివాడికి ఆనందం ఆమడదూరం. త్రికరణశుద్ధి ఉన్నవాళ్ళకే మకరంద భరితమైన జీవనం లభ్యమవుతుంది. అందుకని ప్రతివాడు పాటించవలసింది ఒక్కటే.. ‘‘ఆనందంగా, స్థితప్రజ్ఞునిగా ఉండాలంటే త్రికరణశుద్ధిని తప్పనిసరిగా కలిగి వుండాలి. తెలియనిది మాట్లాడకుండా, తనకు అవగాహన ఉన్న విషయాలనే మాట్లాడడం. మాట్లాడిందే ఆచరించడంప్రధానంగా పాటించవలసిన అంశాలు. ఇవి మొక్కుబడిగా కాకుండా, మక్కువతో పాటిస్తే, జగతిలో గొప్ప విజయాలు నిత్యమూ ఆవిష్కృతమవుతాయి. – వ్యాఖ్యాన విశారద వెంకట్ గరికపాటి -
గ్రామ కక్షలకు టీడీపీ కుట్ర..
సాక్షి, ప్రతినిధి కడప: గ్రామపంచాయతీ ఎన్నికలు వేదికగా గ్రామాల్లో చిచ్చు రేపేందుకు ప్రతిపక్ష టీడీపీ వ్యూహరచన చేస్తోంది. బలం సంగతి దేవుడెరుగు కేడర్ లేకున్నా నామినేషన్లు వేయించి వర్గ విబేధాలను మరింత పెంచి తద్వారా గ్రామాల్లో గొడవలు పెట్టేందుకు సిద్ధమైంది. పల్లెలు అభివృద్ధికి నోచుకోకూడదన్న లక్ష్యంతో ఆ పార్టీ వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 807 గ్రామపంచాయతీలు ఉన్నాయి. కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా 14 పంచాయతీల్లో ఎన్నికలు నిలిచి పోయాయి. చదవండి: నిమ్మగడ్డ లేఖ.. లక్ష్మణ రేఖ దాటిందా ప్రస్తుతం 793 గ్రామపంచాయతీల్లో 7,762 వార్డులకు నాలుగు విడతలుగా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మొదటి విడతలో బద్వేలు, మైదుకూరు,ప్రొద్దుటూరు నియోజక వర్గాల్లోని 206 పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నుంచే ఇక్కడ నామినేషన్లు ప్రక్రియ మొదలైంది. ఏకగ్రీవం చేసుకొనేందుకు ఆయా పంచాయతీల ప్రజలు సిద్ధమయ్యారు.ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహక నిధులు పొంది పంచాయతీలు అభివృద్ధి చేసుకోవాలని వారు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. తద్వారా గ్రామ కక్షలకు ఆస్కారం లేకుండా చేసుకోవాలన్నది లక్ష్యం. అయితే ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష టీడీపీ కుట్రలకు దిగింది. చదవండి: కోడ్ పేరిట పేదల పథకానికి బ్రేక్ కార్యకర్తలు లేకున్నా పోటీ అంటూ నామినేషన్లు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను అడ్డుకోవడమే లక్ష్యంగా టీడీపీ కుట్రలకు దిగింది. ఇందులో భాగంగా ప్రతి పంచాయతీలో పోటీ ఉండేలా చూడాలని ఆ పార్టీ అధినేత కింది స్థాయినేతలకు ఆల్టిమేట్టం జారీ చేశారు. దీంతో కార్యకర్తలు లేక పోయినా ఎవరో ఒకరిని బతిమలాడో, ప్రలోభపెట్టో పోటీ చేయించేందుకు ఆ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. కొని చోట్ల నామినేషన్ వేస్తే చాలు డబ్బులు ముట్ట జెపుతామంటూ బేరాలు పెడుతున్నారు.ఒకరిద్దరు కార్యకర్తలు ఉన్నచోట సైతం పోటీ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో పోటీలు పెట్టించకపోతే భవిష్యత్తులో మిమ్మల్ని గుర్తించేది లేదంటూ నియోజకవర్గ స్థాయి నేతలకు టీడీపీ అధినేత వారి్నంగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మండల స్థాయి నేతలు పంచాయతీ స్థాయి నేతల పై ఒత్తిడి పెంచారు.పైనుంచి కింద వరకూ ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్ల వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.ఎట్టి పరిస్థితిలో ఏకగ్రీవం కాకుండా ఎన్నికలు జరిగేలా చూడాలన్న దురుద్దేశంతో టీడీపీ పావులు కదుపుతోంది. తద్వారా పచ్చని పల్లెల్లో కక్షలు రాజేస్తోంది.çప్రోత్సాహకం రూపంలో నిధులు రాకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. తద్వారా పల్లెసీమల అభివృద్దికి అడ్డంకిగా మారుతున్నారు. ప్రతిపక్ష పార్టీ దిగజారుడు రాజకీయాలతో పల్లెల్లో గొడవలు జరిగే పరిస్థితులు ఉత్పన్న మౌతున్నాయని, అభివృద్దికి ఆటంకం ఏర్పడుతోందని ప్రజలు వాపోతున్నారు. కనిపించని ఉనికి.. జిల్లాలో నామమాత్రపు పంచాయతీల్లో కూడా ప్రస్తుతం టీడీపీకి కేడర్ లేకుండా పోయింది. గత అయిదేళ్ల పాలనలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా జిల్లా అభివృద్ధి గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. కరువు జిల్లాలో సాగు, తాగునీటి కష్టాలు తీర్చే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు. ఆ పార్టీ జిల్లా నేతలు సొంత ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అభివృద్ధికి మంగళం పాడారు. దీంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. పర్యవసానంగా గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో ఘోర పరాజయం పాలైంది. పది అసెంబ్లీ,రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒక్కటి కూడా ఆ పార్టీ దక్కించు కోలేక పోయింది. ఎన్నికల తరువాత టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు,ఇన్చార్జిలు పత్తా లేకుండా పోయారు. నియోజకవర్గాల వైపు తొంగిచూసిన పాపాన పోలేదు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు,నేతలు చాలామటుకు అధికారపార్టీలో చేరిపోయారు. నామమాత్రంగా మిగిలినవారు పార్టీ కార్యక్రమాలకు దూరమై మిన్నకుండి పోయారు. దీంతో జిల్లాలో చాలా పంచాయతీలలో ప్రతిపక్ష టీడీపీ పోటీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. -
పార్టీ మారితే మంత్రి పదవులా?
సాక్షి, న్యూఢిల్లీ: భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థల పరిరక్షణ నేతలపై కాకుండా రాజకీయ పార్టీలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులను ఇంకో పార్టీలో మంత్రులను చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. చట్టసభల పనితీరు పట్ల ప్రజల్లో నమ్మకం పునరుద్ధరించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో సమగ్రమైన ప్రవర్తనా నియమావళిని రూపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఏడాది కాలంలో తన అనుభవాలు, చేపట్టిన కార్యక్రమాలతో ‘మూవింగ్ ఆన్, మూవింగ్ ఫార్వర్డ్: ఎ ఇయర్ ఇన్ ఆఫీస్’ పేరుతో రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. పారదర్శకత, జవాబుదారీతనం కోసమే తన ఏడాది ప్రయాణానికి పుస్తక రూపం కల్పించినట్లు వెంకయ్య తెలిపారు. ‘ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీలో చేరేవారు ముందుగా రాజీనామా చేసి పార్టీ వీడాలి. లేదంటే అలాంటి వారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలి. నేను దీన్నే అనుసరించి ఇలాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా. ఒక పార్టీ నుంచి ప్రజాప్రతినిధిగా గెలుపొంది ఇంకో పార్టీలో మంత్రులవ్వడం ఏంటి? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. చట్టసభలపై ప్రజల్లో నమ్మకం కలిగేలా రాజకీయ పార్టీలు సమగ్ర నియమావళిని రూపొందించుకోవాలి’ అని వెంకయ్య పిలుపునిచ్చారు. వివక్షరహిత భారతమే లక్ష్యంగా.. లింగ, కుల, మత వివక్షను ఏ జాతీయవాదీ ఉపేక్షించబోరని, ప్రతి ఒక్కరూ ఇదే విధానాన్ని అవలంబించాలని వెంకయ్య సూచించారు. ‘మరింత సమగ్రమైన సమాజాన్ని నిర్మించే ప్రయత్నంలో అన్ని వర్గాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలి. మరీ ముఖ్యంగా ఇంతవరకు ప్రాతినిధ్యానికి దూరంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వాలి. రాజకీయాలను ప్రక్షాళన చేసుకుని.. వ్యవసాయ రంగం, యువ భారతం ఆకాంక్షలకు అనుగుణంగా పార్లమెంటరీ, పాలనా వ్యవస్థను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టిలో భారత్‌మాతాకీ జై అంటే జాతీయవాదమే. ఇది కుల, మతాలకు అతీతంగా 130 కోట్ల మందికి జై కొట్టినట్లే’ అని వెంకయ్య పేర్కొన్నారు. భారత ఆర్థిక రంగంలో వస్తున్న మార్పులు, అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలబడేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను చూసి సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. అయితే పార్లమెంటు నడుస్తున్న విధానంతోనే కాస్త అసంతృప్తి ఉంది’ అని వెంకయ్య చెప్పారు. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై.. రాష్ట్రాల్లో ఎగువసభల ఆవశ్యకతపై ఓ జాతీయ విధానం అవసరం ఉందని వెంకయ్య పేర్కొన్నారు. సభ లోపల, బయట సభ్యుల ప్రవర్తనా నియమావళిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలని సూచించారు. కులం, మతం ఆధారంగా ఎవరిపైనైనా వివక్ష చూపడాన్ని ఏ జాతీయవాదీ సహించబోరన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవెగౌడ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. క్రమశిక్షణ నిరంకుశత్వమా?: మోదీ న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం పెరిగిపోతోందంటూ విమర్శలు చేస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. క్రమశిక్షణతో ఉండమంటే నిరంకుశుడనే ముద్రవేస్తున్నారని పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతూ.. ‘వెంకయ్యనాయుడు క్రమశిక్షణతో నడుచుకునే వ్యక్తి. కానీ క్రమశిక్షణను అప్రజాస్వామికం అని విమర్శించేలా డిక్షనరీలో అర్థాలు వెతుకుతున్నారు. ఓ వ్యక్తి క్రమశిక్షణగా ఉండాలని పిలుపునిస్తే.. ఆయన్ను నిరంకుశుడిగా ముద్రవేస్తున్నారు. కానీ వెంకయ్యనాయుడు మాత్రం ఆయన చెప్పే క్రమశిక్షణను ఆచరించి చూపిస్తారు’ అని ప్రధాని పేర్కొన్నారు. వెంకయ్య బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో కలసి ఒక కార్యకర్తగా పనిచేశానని, లక్ష్య సాధనలతో స్పష్టమైన ప్రణాళికలతో పనిచేస్తారని ప్రశంసించారు. ‘వెంకయ్య నాయుడుతో కలిసి ప్రయాణం చేస్తుంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన వాచీ పెట్టుకోరు. జేబులో పెన్ను, డబ్బులు పెట్టుకోరు. కానీ సరైన సమయానికి కార్యక్రమాలకు హాజరవుతారు. ఆయన స్వభావంలోనే క్రమశిక్షణ ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘వెంకయ్యకు కీలకమైన శాఖను అప్పజెప్పేందుకు నాటి ప్రధాని వాజ్‌పేయి సిద్ధమైతే.. గ్రామీణాభివృద్ధి శాఖను వెంకయ్య ఎంచుకున్నారు. అదే ప్రజలపై ఆయనకున్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని గుర్తుచేశారు. ‘సభ సజావుగా జరుగుతున్నప్పుడు స్పీకర్ స్థానంలో ఎవరున్నారనే దానిపై పెద్దగా దృష్టిపెట్టం. కానీ వారు ఆ స్థానంలో ఉన్నందుకే సభ ప్రశాంతంగా సాగుతుందనే విషయాన్ని మరవొద్దు’ అని మోదీ అన్నారు. -
బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటుపై ఏకాభిప్రాయం
ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం న్యూఢిల్లీ: మొండిబకాయిల పరిష్కారానికి ప్రభుత్వం నేతృత్వంలోనే ఒక అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ (ఏఆర్సీ) లేదా బ్యాడ్ బ్యాంక్ ఏర్పాటు ప్రతిపాదనపై ఏకాభిప్రాయం బలపడుతున్నట్లు ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో చెప్పారు. అయితే తక్షణం ఇప్పటికిప్పుడు దీనిపై ఒక తుది నిర్ణయం ఏదీ ఉండబోదని స్పష్టం చేశారు. బ్యాంకింగ్‌కు పక్షం రోజుల్లో రూ.8,000 కోట్లు కేంద్రం మరో పక్షం రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.8,000 కోట్ల మూలధనాన్ని సమకూర్చనుందని అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) సంబంధించి కేటాయించిన మూలధనంతో ఇది చివరివిడతని సంబంధిత వర్గాలు వివరించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా కేంద్రం ప్రస్తుత ఆర్థిక సంవ్సవత్సరం రూ.25,000 కోట్లు కేటాయించింది. వీటిలో రూ.22,915 కోట్లను ఇప్పటికే 13 ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రకటించిన మొత్తంలో 75 శాతాన్ని ఇప్పటికే కేంద్రం బ్యాంకులకు అందజేసింది. రానున్న ఆర్థిక సంవత్సరం బ్యాంకింగ్‌కు రూ.10,000 కోట్ల తాజా మూలధనాన్ని అందించనున్నట్లు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. -
పన్ను పరిధిపై కుదరని ఏకాభిప్రాయం
ఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిరాశాజనకంగా ముగిసింది. పన్ను పరిధిపై సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇవాళ్టి సమావేశంలో సీజీఎస్టీ, ఐజీఎస్టీ ముసాయిదాలపై చర్చ జరిగినట్లు అరుణ్ జైట్లీ వెల్లడించారు. డిసెంబర్ 11, 12 తేదీల్లో మరోసారి జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. -
అందరి ఎజెండా ఒక్కటే!
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలపై ఏకాభిప్రాయం రెండు జిల్లాల ఏర్పాటు... తుది దశకు పునర్విభజన.. సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ‘పునర్విభజన’పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘంతో శుక్రవారం జిల్లాకు చెందిన అధికార పార్టీ ప్రజాప్రతిని«ధులు భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై తెలంగాణ వ్యాప్తంగా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో ఉపసంఘం భేటీ అవుతోంది. ఇందులో భాగంగా మొదటగా శుక్రవారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆడిటోరియంలో సమావేశం అయ్యారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రుల తుమ్మల నాగేశ్వర్రావు, ఈటల రాజేందర్ తదితరుల కమిటీ జిల్లాల పునర్విభజనపై పలు అంశాలపై చర్చించింది. నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ప్రజాప్రతినిధులతో వేర్వేరుగా నిర్వహించిన సమావేశంలో జిల్లా నుంచి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, నిజామాబాద్, జహీరాబాద్ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బీబీ పాటిల్, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్, జెడ్పీ చైర్మన్ దఫెదర్ రాజు, ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, పాతూరు సుధాకర్‌రెడ్డి, డాక్టర్ ఆర్.భూపతిరెడ్డి, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, బాజిరెడ్డి గోవర్దన్, బిగాల గణేష్‌గుప్త పాల్గొన్నారు. ఇప్పటికే పలు కమిటీలు.. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు కొత్త జిల్లాల ఏర్పాటుపై రెండు నెలలుగా కసరత్తు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ జిల్లాల ఏర్పాటు కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులతో అధ్యయన కమిటీలు కూడా వేశారు. జిల్లాకు సంబంధించి మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్దన్‌లను అధ్యయన కమిటీ సభ్యులుగా సీఎం కేసీఆర్ నియమించారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా వేర్వేరుగా జరిగే కొత్త జిల్లాల ఏర్పాటు అధ్యయనం జూన్ 2లోగా ముగించారు. జిల్లాలో జనాభా, భౌగోళిక పరిస్థితులు, నియోజకవర్గాలు, రెవెన్యూ డివిజన్లను పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లాల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు. వీటిపైనా మరో రెండు మార్లు సీసీఎల్ఏ, చీఫ్ సెక్రటరీలు కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. అంతకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ఎల్పీ సమావేశం కూడా నిర్వహించి ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని కోరారు. కొత్త జిల్లాలపై సీఎం నిర్ణయం, ప్రతిపాదనలకే సభ్యులు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు, సరిహద్దులు, గ్రామ, మండల జిల్లా స్థాయిల్లో పునర్విభజనకు సంబంధించి స్వరూపాలు, మార్పులు, ప్రాంతాల వారీగా ప్రజల మనోభావాలు తెలుసుకున్నారు. ఆ తర్వాతే నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల ఏర్పాటుకు సీఎం ఆమోద ముద్ర కూడ వేశారు. అయితే ఈ నెల 22న కొత్త జిల్లాల ఏర్పాటుపై ముసాయిదా ప్రకటించనుండగా.. ఏవైనా మార్పులు చేర్పులుంటే మాట్లాడేందుకు ఆయా జిల్లాల ప్రజాప్రతినిధులతో సబ్‌కమిటీ సమావేశాలు నిర్వహిస్తుంది. తుదిదశకు చేరిన ‘పునర్విభజన’ జిల్లాల పునర్విభజనపై అందరి ఎజెండా ఒక్కటే. సుపరిపాలన, ప్రజలకు అందుబాటులో పాలన లక్ష్యంగా పునర్విభజన చేస్తున్నట్లు ఇదివరకే ప్రభుత్వం ప్రకటించింది. వీటికి కట్టుబడే అందరి ఎజెండా ‘సుపరిపాలన’గా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. సబ్‌కమిటీతో శుక్రవారం హైదరాబాద్‌లో భేటీ అయిన మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కల్వకుంట్ల కవిత, ఇతర ప్రజాప్రతినిధులు ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్లు తెలిసింది. నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, ఆర్మూరు, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లాగా... కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాలు కలిపి కామారెడ్డి జిల్లాగా ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ రెండు జిల్లాల్లో కొత్తగా ఏర్పడే 10 మండలాలు ఏర్పడనుండగా... ఏయే మండలాలు ఏ జిల్లాలో ఉండాలన్న విషయమై ఉపసంఘంలో చర్చించినట్లు తెలిసింది. బాన్సువాడ నియోజకవర్గం కామారెడ్డి జిల్లాలో ఉన్న కోటగిరి, వర్ని మండలాలను నిజామాబాద్ జిల్లాలోనే కొనసాగించాలని మంత్రి సూచించినట్లు సమాచారం. బంగారు తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, ఇందులో భాగంగానే జిల్లాల పునర్విభజన, కొత్త మండలాల ఏర్పాటు చేస్తుందని, అయితే ఇవన్నీ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఎంపీ కవిత సూచన చేసినట్లు తెలిసింది. సుపరిపాలన దిశగా ప్రభుత్వం ముందుగా సాగుతుందని, ఇందులో భాగంగానే పునర్విభజన జరుగుతుందని, తెలంగాణను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని భేటీ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పేర్కొన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా జిల్లాల పునర్విభజనపై ఉపసంఘం పలు సూచనలు చేసినట్లు సమాచారం. -
ఏకాభిప్రాయం కోసం కృషి
జీఎస్టీపై కాంగ్రెస్, ఎస్పీ, సీపీఎం సహా పలు పార్టీల నేతలతో జైట్లీ చర్చలు న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లుపై ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఈ బిల్లును వచ్చే వారం రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉండటంతో.. ప్రతిపక్షాలతో మాట్లాడి ఒప్పించటానికి కేంద్రం కృషి చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా.. ప్రభుత్వ కృషి నిర్మాణాత్మకమైనది, సానుకూలమైనది అని కితాబునిచ్చింది. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యం గురువారం కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, జేడీయూ, సీపీఎం సహా పలు విపక్ష పార్టీల నేతలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ నుంచి పి.చిదంబరం, ఆనంద్‌శర్మ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు జైట్లీతో రెండు విడతలుగా జరిగిన చర్చల్లో పాల్గొన్నారు. ఎస్పీ నేత రాంగోపాల్‌యాదవ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలతో కూడా జైట్లీ చర్చలు జరిపారు. ఈ బిల్లు విషయమై ప్రభుత్వం అన్నాడీఎంకే అధినేత్రి జయలలితతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాల ఆర్థికావసరాలకు ఢోకా లేకుండా కేంద్రం చూసుకుంటుందని జీఎస్టీ బిల్లును తెచ్చే ముందుగా ఆయా రాష్ట్రాలకు భరోసా ఇవ్వాలని సీపీఎం, సీపీఐ, తృణమూల్, ఎస్పీ, బీజేడీ పార్టీల నేతలు జైట్లీకి సూచించారు. ఈ చర్చలు నిర్ణయాత్మక దశకు చేరాయని.. సానుకూలమైన ఫలితం వస్తుందని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సైతం ఆశిస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బిల్లు లోపభూయిష్టంగా ఉందని, దానిని సవరించాల్సిన అవసరముందని చిదంబరం చెప్పారు. అయితే.. జీఎస్టీ బిల్లు అంశం ప్రభుత్వం, కాంగ్రెస్‌ల మధ్య ఆటగా మారిందని.. దీనిపై తమతో చర్చించిందేమీ లేదని సీపీఎం నేత ఏచూరి పేర్కొన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ సైతం గురువారం రాజ్యసభలో ఎస్పీ నేతలు రాంగోపాల్‌యాదవ్, నీరజ్‌శేఖర్‌లతో మాట్లాడారు. -
భద్రతామండలిలో సంస్కరణలకు ఏకాభిప్రాయం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయి. ఫిబ్రవరి 22న జరిగిన సమావేశంలో.. భద్రతామండలిలో తాత్కాలిక సభ్యదేశాలను సంఖ్యను 15 నుంచి 20కి పెంచాలన్న డిమాండుకు అమెరికా, రష్యా మినహా ఇతర దేశాలన్నీ సంసిద్ధత తెలిపాయి. కాగా భద్రతామండలిలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య పెంచటంపై ఈ సమావేశంలో చర్చ జరగనప్పటికీ.. పాకిస్తాన్‌తో సహాపలుదేశాలు మాత్రం దీనికి ఒప్పుకునేది లేదని తెలిపాయి. -
గాంధీ, నెహ్రూ, అంబేడ్కర్‌లది ఏకాభ్రిపాయం
న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్లకు వేర్వేరు సైద్దాంతిక భావాలున్నా... దేశ పురోగతిపై మాత్రం ఏకాభిప్రాయంతో ఉండేవారని సాహిత్య అకాడెమీ అధ్యక్షుడు విశ్వనాథ్ తివారీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సెమినార్లో ప్రసంగిస్తూ... భావజాలాలపై చర్చించుకునేవారని, దేశాభివృద్ధి విషయంలో ఉమ్మడి లక్ష్యంతో సాగేవారని ఆయన గుర్తు చేశారు. -
ఎస్వీయూ వీసీ పదవిపై కుదరని ఏకాభిప్రాయం
యూనవర్సిటీక్యాంపస్ : ఎస్వీ యూనివర్సిటీ వైస్‌చాన్సలర్ నియామకానికి సంబంధించి సెర్చ్ కమిటీ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఫలితంగా ఈ కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. వీసీ నియామక ప్రక్రియ కోసం ఏర్పాటైన సెర్చ్ కమిటీ శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో సమావేశమైంది. సభ్యులు గోవర్ధన్‌మెహతా, సీవీ రాఘవులు, సునీతదావ్రాలు రాత్రి 6.30 గంటల వరకు వీసీ పదవికి ఎవరిని సిఫారసు చేయాలన్న అంశంపై చర్చిం చారు. అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో సమావేశాన్ని వాయిదా వేసినట్టు తెలిసింది. ఈ కమిటీలో సభ్యులు ముంబైలోని ఓ పరిశోధనా సంస్థకు చెందిన ఓ ప్రొఫెసర్ ను ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. సత్యనారాయణకే అవకాశం ? మాజీ రిజిస్ట్రార్ ఈ.సత్యనారాయణకే ఎస్వీయూ వీసీ పదవి దక్కే అవకాశాలు ఉన్నాయి. డెప్యూటీ సీఎం కృష్ణమూర్తితో సన్నిహిత సంబంధాలు కలిగిన సత్యనారాయణ ఎస్వీయూలో సీడీసీ డీన్, రిజిస్ట్రార్‌గా పని చేశారు. దీంతో ఈయనను ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చినట్టు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈయన పేరును ఖరారు చేయాలన్న ప్రతిపాదన వచ్చినట్టు తెలుస్తోంది. అలాగే ఎస్వీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కిరణ్ క్రాంత్ చౌదరి, సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దయానంద్, ఎస్కేయూ వీసీ రాజగోపాల్, ఎస్వీయూ రిటైర్డ్ ప్రొఫెసర్లు దేవసేననాయుడు, జయసింహలు నాయుడు, పీ.గోవిందురాజులు పేర్లు కూడా పరిశీలనకు వ చ్చినట్లు విశ్వసనీయ సమాచారం. -
విరాళాల వెల్లడిపై పార్టీల మధ్య కుదరని అంగీకారం
న్యూఢిల్లీ: విరాళాల వివరాలను తప్పనిసరిగా వెల్లడించాలన్న న్యాయ కమిషన్ సిఫార్సులపై అంగీకారానికి రావడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. రూ.20వేల కంటే తక్కువ మొత్తంలో అందే విరాళాల మొత్తం రూ.20 కోట్లు దాటితే వాటి వివరాల పార్టీలు తప్పనిసరిగా వెల్లడించాలని న్యాయ కమిషన్ సిఫార్సు చేసింది. దీనిపై పార్టీలమధ్య ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. విరాళాల వివరాలను సమర్పించని పార్టీలకు జరిమానాలు విధించడంపైనా అంగీకారం కుదరలేదు. తప్పుడు సమాచారాన్ని ఇస్తే రూ.50 లక్షల జరిమానా విధించాలన్న ప్రతిపాదన పట్ల కూడా ఆయా పార్టీలు విముఖత వ్యక్తం చేసినట్టు ఎన్నికల కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకించి ఇది చిన్న పార్టీలకు మోయలేని భారమన్న అభిప్రాయం వ్యక్తమైనట్టు పేర్కొన్నాయి. న్యాయ కమిషన్ సిఫారసు ఆచరణీయం కాదని రాజకీయ పార్టీలు పేర్కొన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల సంస్కరణలకు సంబంధించి రూపొందించిన ముసాయి దా పత్రంలో తెలిపింది. -
'భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయం వస్తుంది'
భూసేకరణ బిల్లుపై విపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేంద్రం వివిధ పార్టీలకు నచ్చజెప్పే పనిలో పడింది. ఆయా పార్టీల సూచనలను బిల్లులో చేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున ఈ విషయంలో ఏకాభిప్రాయం లభిస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆశాభావం వ్యక్తంచేశారు. సీనియర్ మంత్రులందరూ రాజకీయ పార్టీలకు నచ్చజెప్పే పనిలో ఉన్నారని బుధవారంతెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఢిల్లీలో స్మారకం నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయంలో రాజకీయమేమీ లేదన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లభించగానే పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో చేపడతామని తెలిపారు. ఆయన బుధవారం స్వీడన్ మౌలిక సదుపాయాల శాఖ మంత్రి అన్నా జాన్సన్ బృందంతో భేటీ అయ్యారు. -
ఏకాభిప్రాయంతో గోవధపై నిషేధం: రాజ్‌నాథ్
ఇండోర్: ఏకాభిప్రాయం ద్వారా దేశంలో గోవధను నిషేధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఆదివారమిక్కడ జరిగిన జైనమత కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గోవధ అనేది బీజేపీ సిద్ధాంతాలకు ఎప్పుడూ వ్యతిరేకమేనని, అందుకే బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఇదివరకే గోవధను నిషేధించిన విషయాన్ని రాజ్‌నాథ్ గుర్తుచేశారు. జైనమతం అహింసను పాటిస్తుందని, అది దేశ సంస్కృతిపై ఎంతో ప్రభావం చూపిందన్నారు. అహింసా మార్గంలో నడిచినప్పుడే ఉగ్రవాదాన్ని ఓడించి, ప్రపంచ శాంతిని సాధించవచ్చన్నారు. -
ఉన్నతాధికారులపై ఉద్యమం ఒత్తిడి
సాక్షి, మచిలీపట్నం : సమైక్యాంధ్ర ఉద్యమం ప్రభుత్వ ఉన్నతాధికారులపై వత్తిడి పెంచుతోంది. నిన్నటి వరకు ఎస్ బాస్ అన్న దిగువశ్రేణి ఉద్యోగులే ఇప్పుడు సమైక్యాంధ్ర జేఏసీగా ఏర్పడి సమ్మెబాట పట్టాల్సిందిగా ఉన్నతాధికారులకు దిశానిర్ధేశం చేస్తున్నారు. ఇప్పటికే ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమైక్య ఉద్యమానికి నడుంకట్టిన సంగతి తెలిసిందే. జిల్లా ఉన్నతాధికారులు మాత్రం సమ్మె పేరుతో ఎటువంటి పనులు చక్కబెట్టకుండానే తమ కార్యాయాల్లో కాల క్షేపం చేస్తున్నారు. పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం సమైక్యాంధ్ర ఉద్యమానకి కలిసి రావాలని రెండు రోజుల క్రితం ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యం లో జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ సమావేశం జరిగే సమయంలో ఉద్యోగ సంఘాల జేఏసీ వెళ్లి సమ్మెకు రావాలని ఉన్నతాధికారులను కోరేందుకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలో ఉన్నతాధికారుల్లో ఉద్యమంపై ఏకాభిప్రాయం కుదరడంలేదని సమాచారం. ఉద్యమానికి మద్దతుగా సమ్మె బాట పట్టాలని కొందరంటే, సంఘీభావం ప్రకటిస్తే చాలని ఇంకొందరు, ఈ నెల 7న హైదరాబాద్‌లో జరిగే ఉద్యోగ సదస్సుకు మద్దతు పలకాలని ఇంకొందరు ఇలా ఎవరికి తోచినట్టు వారు నిర్ణయాలు తీసుకున్నారని తెలిసింది. పలు శాఖలకు జిల్లా అధిపతులుగా ఉన్నందున ఉద్యమబాట పడితే ఎలా అంటూ మరికొందరు అధికారులు అధికార పార్టీకి విశ్వాసపాత్రులుగా గుర్తింపుపొందే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కలెక్టరేట్ ప్రాంగణంలో జరగాల్సిన కీలక సమావేశం వాయిదా పడిందని విశ్వసనీయ సమాచారం. సమావేశం గురించి తెలుసుకున్న ఎస్సీ జె.ప్రభాకరరావు ఉద్యోగుల మధ్య గొడవలు జరగకుండా చూసేందుకు మహారాష్ట్రకు చెందిన స్పెషల్ (సీఆర్పీఎఫ్) పోలీసులను కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం మోహరిం చారు. సమ్మెకు వెళ్లేందుకు ససెమిరా అంటున్న ఉన్నతాధికారులు, సమైక్య ఉద్యమానికి బాసటగా ఉండాలని కోరుతున్న దిగువస్థాయి ఉద్యోగుల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలకు తావులేకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఇబ్బందులు తప్పవనుకున్న ఉన్నతాధికారులు మచిలీపట్నంలో కాకుండా విజయవాడలో తమ విధులు నిర్వర్తించేందుకు తరలివెళ్లినట్టు సమాచారం. ఉద్యోగుల వివాదాలకు అవకాశం ఉందని భావించిన ఉన్నతాధికారులు గురువారం కలెక్టరేట్లో నిర్వహించాల్సిన ఇందిరా క్రాంతి పథం(మెప్మా) డెరైక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌ను విజయవాడకు ఆఘమేఘాలపై మార్పు చేశారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని సమైక్యాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉపాధ్యాయులు బహిష్కరించారు. దీంతో సమైక్యాంధ్ర ఉద్యమంలో పాలుపంచుకున్న ఉపాధ్యాయులు ఆయా ఆందోళన కార్యక్రమల్లోన్లే ప్రత్యేకంగా ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి సత్కరిం చడం విశేషం. బందరులో సమైక్య వాదులు నిర్వహించిన గురుపూజోత్సవంలో మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్, మాదివాడ రాము తదితర వైఎస్సార్సీపీ నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
ఏకాభిప్రాయం ఉంటేనే ప్రత్యేక రాష్ట్రం:ఉండవల్లి