న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సుష్మ స్పష్టం చేశారు.
ఇందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తమ మద్దతును ఇప్పటికే తెలిపాయని చెప్పారు. ఈ విషయంలో చైనా నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాలేదని తెలిపారు. ఈ సారి కాకపోయినా వచ్చేసారి భారత్ కచ్చితంగా మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
'మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తాం'
Published Fri, Apr 7 2017 8:00 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
Advertisement