బీరుట్: ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్ దాడులు, నస్రల్లా మృతిపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్‌ను కోరింది. దీంతో, భదత్రా మండలిలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు.. హిజ్బులా చీఫ్ హనస్ నస్రల్లా హత్యపై తాజాగా అమెరికా స్పందించింది. నస్రల్లా మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మాట్లాడుతూ..‘గతేడాది మొదలైన యుద్ధ ప్రారంభంలోనే నస్రల్లా హత్యకు ఆపరేషన్ రెడీ అయ్యింది. హిజ్బుల్లా, హమాస్ వంటి ఇరానియన్ మద్దతు గల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు తప్పకుండా ఉంటుంది. నస్రల్లా కారణంగా హిజ్బుల్లాలో వేలాది మంది అమెరికన్లు మృతిచెందారు అని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో బీరుట్‌లో తలెత్తిన భద్రతా పరిస్థితుల కారణంగా దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ సూచించింది. అలాగే, బీరుట్ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది. దీంతో, బీరుట్‌లోని అమెరికన్లు కొందరు స్వదేశం బాటపట్టినట్టు సమాచారం.
మరోవైపు.. రాబోయే రోజుల్లో తమ శత్రువులపై దాడులు మరింత పెరుగుతాయని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడుల కారణంగా 33 మంది మరణించారు. అలాగే, 195 మంది పౌరులు గాయపడినట్టు లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇజ్రాయెల్ కారణంగా గత రెండు వారాల్లో దాదాపు 1000 మంది మరణించగా.. 6000 మంది గాయపడ్డారు.
ఇది కూడా చదవండి: హిజ్బుల్లాపై యుద్ధంలో మా టార్గెట్ అతడే: నెతన్యాహు
Comments
Please login to add a commentAdd a comment