permanent member
-
ఏపీలోని విద్యావిధానాలను మెచ్చుకున్నఐక్యరాజ్యసమితి మెంబర్
-
ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఐక్యరాజ్యసమితి శాస్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ కుమార్ బృందం పటమట హైస్కూల్‌ను సందర్శించింది. విద్యార్ధులతో మాట్లాడిన షాకిన్ యాక్సెంట్‌ను మెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ మెచ్చకున్నారని చెప్పారు. 'బలవంతంగా యాక్సెంట్ రుద్దుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటమే గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు జాతీయస్థాయి వేదికలపై అంతర్జాతీయ అంశాలు మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధుల్లోని టాలెంట్ వెలికి తీసేందుకు త్వరలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం గొప్ప విషయం.' అని షాకిన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు పరిష్కారం.. 411 మందికి గుడ్‌న్యూస్ -
భద్రతా మండలి: భారత్ ‘శాశ్వత సభ్యత్వం’పై బైడెన్ స్పందన
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశ సభ్యత్వానికి మద్దతు ప్రకటించారు. భారత్‌తో పాటు జర్మనీ, జపాన్‌లను కూడా సభ్యదేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు బైడెన్ సానుకూలంగా ఉన్నారంటూ వైట్‌హౌజ్ ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు బైడెన్ సైతం ఈ విషయంపై పరోక్షంగా ప్రకటన చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ నేపథ్యంలో.. జర్మనీ, జపాన్, భారత్‌లను శాశ్వత సభ్య దేశాలుగా చేర్చాలనే ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అంగీకారం తెలిపారని, అదే సమయంలో.. ఇందుకోసం చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుందని వైట్‌హౌజ్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భద్రతా మండలిలో ఈ మూడు దేశాలు శాశ్వత సభ్యులుగా ఉండాలనే ఆలోచనకు చారిత్రాత్మకంగా, మా మద్దతు ఉంటుంది అని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆ అధికారి స్పందించారు. ఇక బుధవారం UN జనరల్ వద్ద జో బైడెన్ ప్రసంగించారు. ‘‘నేటి ప్రపంచ అవసరాలకు మెరుగ్గా ప్రతిస్పందించేలా సంస్థ మరింత సమగ్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని ఈ సందర్భంగా బైడెన్ అన్నారు. యునైటెడ్ స్టేట్స్తో సహా UN భద్రతా మండలి సభ్యులు ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను నిలకడగా సమర్థించాలి. కౌన్సిల్ విశ్వసనీయంగా, ప్రభావవంతంగా ఉండేలా చూసేందుకు అరుదైన, అసాధారణమైన పరిస్థితులలో మినహా వీటోను ఉపయోగించకుండా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కౌన్సిల్ శాశ్వత మరియు శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచడానికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఇస్తుందని ఆయన వెల్లడించారు. మేము చాలా కాలంగా మద్దతు ఇస్తున్న దేశాలకు శాశ్వత స్థానాలు ఇందులో ఉన్నాయి అని బైడెన్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 15 దేశాలు సభ్యులుగా ఉండగా, శాశ్వత సభ్య దేశాలైన చైనా, ఫ్రాన్స్, రష్యా ఫెడరేషన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికాలు మాత్రమే శాశ్వత సభ్యదేశాలుగా ఉండి వీటో పవర్‌ను కలిగి ఉన్నాయి. ఇదీ చదవండి: ఉక్రెయిన్‌ని నివారించేలా రష్యా ఎత్తుగడ -
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
ప్రధాని మోదీ అమెరికా పర్యటన విజయవంతం
-
‘వీటో’ను ప్రస్తావించకుంటే సభ్యత్వం
వాషింగ్టన్: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం హోదాను భారత్ పొందాలంటే వీటో (ఏదేనీ శాసనాన్ని తిరస్కరించడానికి గల అధికారం) అంశాన్ని ప్రస్తావించకపోవడమే మార్గమని భారత సంతతి మహిళ, ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ అన్నారు. ప్రస్తుతం ఐరాసలో శాశ్వత సభ్యదేశాలైన అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనాలకు వీటో అధికారాలున్నాయి. ఈ అధికారాన్ని ఆయా దేశాలు ఇతరులతో పంచుకునేందుకు కానీ, పూర్తిగా విడిచిపెట్టేందుకు కానీ సిద్ధంగా లేవని నిక్కీ హేలీ అన్నారు. కాబట్టి వీటో అధికారాల గురించి ప్రస్తావించకపోతే భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం హోదా లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. భద్రతా మండలిలో సంస్కరణలు రావాలని అమెరికా కోరుకుంటోందనీ, అయితే రష్యా, చైనాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని నిక్కీ హేలీ పేర్కొన్నారు. ‘అంతర్జాతీయ అంశాలపై భారత్–అమెరికా సహకారం పెంపొందించుకోవడంలో కాంగ్రెస్ పాత్ర’ అనే విషయంపై ఓ సంస్థ నిర్వహించిన సమావేశంలో నిక్కీ హేలీ ప్రసంగించారు. భద్రతా మండలి సంస్కరణల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ పాత్ర ఉండదనీ, మండలిలోని సభ్య దేశాలు తమ మాట వినే స్థితిలో లేవన్నారు. సభ్యత్వం పొందేందుకు భారత్ వీలైనన్ని ఎక్కువ దేశాల మద్దతు కూడగట్టుకోవాలని సూచించారు. పాక్‌పై నిఘాకు భారత్ సాయపడగలదు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్‌పై కఠిన వైఖరిని అవలంబించాలని అధ్యక్షుడు ట్రంప్ భావిస్తున్న నేపథ్యంలో ఆ దేశంపై ఓ కన్నేసి ఉంచేందుకు భారత్ తమకు సహకరించగలదని నిక్కీ హేలీ అన్నారు. అఫ్గానిస్తాన్, దక్షిణాసియా ప్రాంతంలో ఉగ్రవాదంపై పోరుకు ట్రంప్ ఇటీవల కొత్త వ్యూహాన్ని ప్రకటించిన అంశాన్ని ప్రస్తావించిన ఆమె...ఆ వ్యూహంలో ఒక భాగం భారత్‌తో తమ భాగస్వామ్యాన్ని పెంచుకోవడమేనని చెప్పారు. కాగా, భారత నౌకాదళం విమాన వాహకాలను తయారుచేసేందుకు అవసరమైన ఎమల్స్ (ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఎయిర్‌క్రాఫ్ట్ లాంచ్ సిస్టం) టెక్నాలజీని భారత్‌కు అందించనున్నట్లు ట్రంప్ యంత్రాంగం చెప్పింది. దీపావళి వేడుకల్లో ట్రంప్ శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కూతురు ఇవాంకా ట్రంప్ పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడైన తరువాత తొలిసారి జరిగిన ఈ వేడుకల్లో ఆయన పాలనా బృందంలోని ఇండో–అమెరికన్లయిన ఐరాసలో యూఎస్ రాయబారి నిక్కీ హేలీ, మెడికేర్, మెడిక్ ఎయిడ్ సర్వీసెస్ పాలనాధికారి సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ చైర్మన్ అజిత్ పాయ్ తదితరులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో పలు రంగాల్లో ఇండో–అమెరికన్ల సేవలను ట్రంప్ కొనియాడారు. భారత ప్రధాని మోదీతో తనకున్న అనుబంధానికి ఎంతో విలువ ఇస్తానని చెప్పారు. -
'మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తాం'
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు భారత్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని సుష్మ స్పష్టం చేశారు. ఇందుకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ తమ మద్దతును ఇప్పటికే తెలిపాయని చెప్పారు. ఈ విషయంలో చైనా నుంచి ఎటువంటి వ్యతిరేకత ఎదురుకాలేదని తెలిపారు. ఈ సారి కాకపోయినా వచ్చేసారి భారత్ కచ్చితంగా మండలిలో శాశ్వత సభ్యత్వం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.