సాక్షి, విజయవాడ: ఐక్యరాజ్యసమితి శాస్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ కుమార్ బృందం పటమట హైస్కూల్‌ను సందర్శించింది. విద్యార్ధులతో మాట్లాడిన షాకిన్ యాక్సెంట్‌ను మెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈస్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ మెచ్చకున్నారని చెప్పారు.
'బలవంతంగా యాక్సెంట్ రుద్దుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటమే గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు జాతీయస్థాయి వేదికలపై అంతర్జాతీయ అంశాలు మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధుల్లోని టాలెంట్ వెలికి తీసేందుకు త్వరలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం గొప్ప విషయం.' అని షాకిన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు.
చదవండి: ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు పరిష్కారం.. 411 మందికి గుడ్‌న్యూస్
Comments
Please login to add a commentAdd a comment