goverment school
-
మట్టిలో మాణిక్యం..! ఈ బుడ్డాడు మామూలోడు కాదు
-
క్లాస్ రూంలో స్విమ్మింగ్ పూల్: పిల్లల సంబరం, వైరల్ వీడియో
ఉదయం ఎనిమిది గంటలకే వేడి గాలులు వణుకు పుటిస్తున్నాయి. ఎండ వేడిమికి బయటకు రావాలంటేనే పెద్ద వాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితి. ఇక పిల్లల్ని బడికి పంపించాలంటే చాలా కష్టం. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ కనౌజ్‌లోని ఒక స్కూలు యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. దీంతో స్విమ్మింగ్ పూల్ పిల్లలు సంబరపడిపోతున్న వీడియో వైరల్ గా మారింది.Vaibhav Kumar, Principal says, " As the weather department informed about the heat wave, we were asking students to drink water and cool drinks...we also told them that people in cities bathe in swimming pools. Students asked us what swimming pools look like and when will they… pic.twitter.com/oyFqbpTI5V— ANI (@ANI) May 1, 2024 రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతల మధ్య పిల్లల్ని బడికి రప్పించేందుకు, వారి సౌకర్యార్థం ఒక ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలోనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం విశేషంగా నిలిచింది. ఎండలు, వడగాల్పుల వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ప్రిన్సిపాల్ వైభవ్ కుమార్.క్లాస్ రూంలో, స్మిమ్మింగ ప్రస్తుతం గోధమ పంటపనులు నడుస్తున్నాయి కనుక చాలా కుటుంబాలు విద్యార్థులను పాఠశాలకు పంపడం లేదు. వారిని తిరిగి పిలవడానికి వెళ్ళాము, కానీ సరైన స్పందన లభించలేదు అందుకే ఈ వినూత్న ఆలోచనతో చేశాం. దీంతో హాజరు శాతం పెరిగింది. .. విద్యార్థులు ఆనందంగా ఉన్నారని చెప్పారు.#WATCH | Uttar Pradesh: A govt school in Kannauj makes a swimming pool inside the classroom, amid rising temperature. pic.twitter.com/rsXkjDFa7a— ANI (@ANI) May 1, 2024 ఎండలనుంచి ఉపశమనం పొందేలా నీళ్లు, చల్లని పానీయాలకు తాగమని విద్యార్థులకు చెప్పాం. అయితే నగరాల్లో మాదిరిగా తమకు స్విమ్మింగ్ పూల్ కావాలని పిల్లలు అడిగారు. దీంతో తల్లిదండ్రుల అనుమతి తసీఉకొని క్లాస్రూమ్ లోపల ఈత కొలను ఏర్పాటు చేశమన్నారు అసిస్టెంట్ టీచర్ ఓం తివారీ. -
ఏపీ సర్కార్‌పై ఐరాస శాశ్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ బృందం ప్రశంసలు
సాక్షి, విజయవాడ: ఐక్యరాజ్యసమితి శాస్వత సభ్యుడు ఉన్నావా షాకిన్ కుమార్ బృందం పటమట హైస్కూల్‌ను సందర్శించింది. విద్యార్ధులతో మాట్లాడిన షాకిన్ యాక్సెంట్‌ను మెచ్చుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఈస్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం గొప్ప విషయమని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా విధానాన్ని స్విట్జర్లాండ్ దేశాధ్యక్షుడు ఇగ్నా జియో క్యాసిస్ మెచ్చకున్నారని చెప్పారు. 'బలవంతంగా యాక్సెంట్ రుద్దుతున్నారంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు ఈ స్థాయిలో ఇంగ్లీష్ మాట్లాడటమే గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులు జాతీయస్థాయి వేదికలపై అంతర్జాతీయ అంశాలు మాట్లాడాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్ధుల్లోని టాలెంట్ వెలికి తీసేందుకు త్వరలో కొన్ని పరీక్షలు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం, జగనన్న గోరుముద్ద, పుస్తకాలు, యూనిఫాంలు అందించడం గొప్ప విషయం.' అని షాకిన్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. చదవండి: ఎస్సీ హాస్టల్ ఉద్యోగుల వేతన సమస్యకు పరిష్కారం.. 411 మందికి గుడ్‌న్యూస్ -
విద్యాసంక్షేమం సఫలం.. దొరబిడ్డల్లా పేద పిల్లలు
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విద్యా సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ బడులను బలోపేతం చేయడంతో పాటు పేదలందరికీ ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టారు. విద్యా కానుక, ఇంగ్లిష్ మీడియం చదువులు, నాడు–నేడు, గోరుముద్ద, అమ్మఒడి తదితర పథకాలను ప్రణాళికాబద్ధంగా అమలుచేస్తున్నారు. 2021–22 విద్యాసంవత్సరంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో విద్యా సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలుచేశారు. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021–22లో సంక్షేమ కార్యక్రమాలను సంపూర్ణంగా అందించి ఈ ఏడాది అక్షర యజ్ఞాన్ని విజయవంతంగా ముగించారు. ప్రభుత్వ విద్యారంగంపై సీఎం జగన్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ, చిత్తశుద్ధిని చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను కాన్వెంట్లలో మాన్పించి ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నారు. దీంతో మూడేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ప్రవేశాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జిల్లా అధికారులు పథకాలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నందున అమ్మఒడి పథకాన్ని విద్యా సంవత్సరం ముగిసిన తర్వాత అమలుచేయనున్నారు. ఈ ఏడాది విద్యార్థుల హాజరు శాతానికి సంబంధించిన నివేదికలను ఉన్న తాధికారులకు పంపించారు. దొరబిడ్డల్లా పేద పిల్లలు ప్రభుత్వం విద్యాకానుక కింద యూనిఫాం, నోట్ పుస్తకాలు, బూట్లు, టై, బెల్టులు, డిక్షనరీలు, స్కూల్ బ్యాగులు అందిస్తోంది. 2021–22లో మొత్తంగా నోట్ పుస్తకాలు 1,840,218, బెల్టులు, 2,53,530, స్కూల్ బ్యాగులు 3,39,273, బూట్లు 3,36,424, యూనిఫాం 3,42,494, డిక్షనరీలను 3,42,494 విద్యార్థులను అందజేశారు. కార్పొరేట్ హంగులతో.. మనబడి నాడు–నేడు పథకంలో పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కార్పొరేట్‌కు దీటుగా అధునాతన వసతులతో ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నారు. దీంతో పాఠశాలల రూపురేఖలు మారిపోతున్నాయి. పక్కాగా ప్రహరీలతో పాఠశాలలకు రక్షణ ఏర్పాట్లు చేశారు. అందమైన బొమ్మలతో పాఠశాల ఆవరణ, తరగతి గదులను తీర్చిదిద్దారు. విద్యా సంస్కరణలతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సీఎం జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఏటా విద్యార్థుల నమో దు శాతం క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో అక్షర యజ్ఞం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో అక్షర యజ్ఞం కొనసాగుతోంది. రెండు విడతలు అమ్మఒడి పథకం అమలుచేయగా మూడో విడత ల్యాప్‌టాప్‌లు, నగదు ఇవ్వడానికి సిద్ధం చేస్తున్నారు. త్వరలో రెండో విడత నాడు–నేడు పనులు చేపట్టనున్నారు. సర్కారీ బడుల్లో ఉన్నత కుటుంబాల విద్యార్థులు కూడా చేరే రోజు వస్తుంది. – జీజేఏ స్టీవెన్, వైఎస్సార్ టీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణాళికాబద్ధంగా ముందుకు.. విద్యారంగ పథకాలను నిర్ణీత సమయంలో అమలు చేస్తున్నాం. వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి ప థకాల అమలుకు ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నాం. అర్హులందరికీ పథకాలు అందేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నాడు–నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేసిన అంశం చరిత్రలో నిలిచిపోతుంది. – పి.శ్యామ్‌సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ నాడు–నేడు పనులు తొలివిడతలో 1,176 పాఠశాలలను ఎంపిక చేసి రూ.242.70 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇప్పటివరకూ 1,076 పాఠశాలల్లో రూ.226.48 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయి. రెండో విడతలో 892 పాఠశాలలను ఎంపిక చేసి రూ.292.18 కోట్ల నిధులు కేటాయించారు. -
మధ్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడంపై సోమవారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా సీఎం కేసీఆర్ నుంచి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని, కేసీఆర్ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. -
బాలికల చదువులకు సర్కారు బడి ఆసరా
మన పాఠశాలల కోసం మనమేం చేయాలి?.. అని అనుకున్నప్పుడల్లా నా కళ్లముందొక నిరుపేద బాలిక కనిపిస్తుంది. ఆమె ఒక దళిత బాలిక.. గిరిజన బాలిక.. ముస్లిం బాలిక.. దివ్యాంగ బాలిక. ఆమెకి చదువుకోవాలని ఉంది. ప్రపంచంతో పోటీ పడాలని ఉంది. ఆమెకి మనందరి మద్దతు కావాలి. ఆ ఆలోచన రాగానే నాకు ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. ఆ పిల్లల కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. –అధికారం చేపట్టిన తర్వాత సమీక్షలో సీఎం చెప్పిన మాటను తు.చ తప్పకుండా పాటించే సీఎం జగన్ వాటికి కార్యరూపం ఇచ్చారు. సాక్షి, అమరావతి: విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కార్యక్రమాలు, విప్లవాత్మక నిర్ణయాలు బాలికా విద్యకు గట్టి ఊతమిస్తున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో కనీస సదుపాయాలు లేకపోవడం, దూర ప్రాంతాల్లోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల భారాన్ని భరించలేక ఆడపిల్లలను ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితం చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు వారిని చిరునవ్వుతో పాఠశాలలకు సాగనంపుతున్నారు. గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు బాలికలను చదువులకు చేరువ చేశాయి. నాడు – నేడు.. ఎంత మార్పు! ప్రభుత్వ పాఠశాలల్లో బాలురతో పాటు బాలికల చేరికల్లోనూ గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. 2014–15లో ప్రభుత్వ, ప్రైవేట్‌తో కలిపి అన్ని పాఠశాలల్లో 72 లక్షల మంది విద్యార్థులు చేరగా వారిలో బాలురు 37.11 లక్షల మంది, బాలికలు 34.98 లక్షల మంది ఉన్నారు. అదే 2018–19లో టీడీపీ అధికారం నుంచి వైదొలగేనాటికి 70.43 లక్షల మంది మాత్రమే విద్యార్థులు ఉండటం గమనార్హం. లక్షల మంది చదువులకు దూరమైనట్లు తెలుస్తోంది. ఇక 2020–21లో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో 73.05 లక్షల మంది చేరగా వీరిలో బాలురు 37.05 లక్షల మంది, బాలికలు 35.06 లక్షల మంది ఉన్నారు. 2021–22లో ఈ సంఖ్య మరింత పెరగనుంది. అయితే ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లలోనే అత్యధికంగా చేరికలు నమోదవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై గత సర్కారు నిర్లక్ష్యం విద్యారంగాన్ని విస్మరించిన గత సర్కారు ప్రభుత్వ పాఠశాలలపై తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కనీసం మరుగుదొడ్లు కూడా కరువవడంతో బాలికలు చదువులకు దూరమయ్యారు. నిరుపేద విద్యార్థినులు ఇంటినుంచి భోజనం తీసుకురాలేక, స్కూళ్లో నాసిరకం ఆహారాన్ని తినలేక అవస్థలు ఎదుర్కొన్నారు. వారికిచ్చే దుస్తులు, ఇతర వస్తువుల పంపిణీలోనూ గత సర్కారు పెద్దలు అక్రమాలకు తెరతీయడంతో నాణ్యతలేని, చాలీచాలని యూనిఫారాలే దిక్కయ్యాయి. ఇక ఇతర వస్తువులు ఏవీ పంపిణీ చేయలేదు. ఇలాంటి దుస్థితిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు దూరమై పెద్ద ఎత్తున డ్రాపౌట్లు నమోదయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం తెలుగు మాధ్యమమే ఉండడం కూడా విద్యార్థుల చేరికలు తగ్గిపోవటానికి మరో ప్రధాన కారణం. తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇంగ్లీషు మీడియంలో చదివించాలని తల్లిదండ్రులు ఆశపడ్డా ప్రభుత్వ పాఠశాలల్లో అందుకు అవకాశం లేకపోవడం పెద్ద లోపంగా మారింది. లేదంటే అప్పోసప్పో చేసి ప్రైవేట్ స్కూళ్లలో చదివించక తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు గణనీయంగా తగ్గిపోగా ప్రైవేట్ స్కూళ్లలో పెరుగుతూ వచ్చాయి. 2014–15లో ప్రభుత్వ పాఠశాలల్లో 44,38,744 మంది విద్యార్థులుండగా 2018–19 నాటికి 39,47,320కి పడిపోయింది. లక్షల సంఖ్యలో విద్యార్థులు స్కూళ్లకు దూరమయ్యారు. రెండేళ్లలో కళ్లెదుటే కనిపిస్తున్న మార్పులు గత రెండేళ్లలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ సమూలంగా మారిపోయింది. ముఖ్యమంత్రి జగన్ విద్యారంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో పాటు నాడు–నేడు కింద రూ.16 వేల కోట్లతో 45 వేల ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చేసేలా చర్యలు తీసుకున్నారు. మరుగుదొడ్లు, మంచినీరు, డ్యూయెల్ డెస్కులు, గ్రీన్‌చాక్ బోర్డులు, మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్లు, రంగులతో ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దారు. అమ్మ ఒడి కింద ఏటా రూ.15 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమ చేయడంతోపాటు జగనన్న విద్యాకానుక కింద 3 జతల దుస్తులు, షూ, సాక్సులు, బెల్టు, బ్యాగు, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్కులు, నోట్సులు పంపిణీ చేస్తున్నారు. గతంలో తినడానికి వీల్లేని విధంగా ఉండే మధ్యాహ్న భోజనాన్ని రోజుకో రకమైన మెనూతో రుచికరంగా జగనన్న గోరుముద్దను ప్రవేశపెట్టారు. ఇలా అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్చడానికి క్యూ కడుతున్నారు. చివరకు ప్రభుత్వ స్కూళ్లలో ఇక సీట్లు లేవనే బోర్డులు ఏర్పాటు చేసేలా అవి అభివృద్ధి చెందాయి. ప్రధానంగా బాలికల చదువులపై శ్రద్ధ వహించి తల్లిదండ్రులు స్కూళ్లకు పంపిస్తున్నారు. ఏకంగా 7.84 లక్షలు పెరిగిన చేరికలు రాష్ట్రంలో రెండేళ్లలో స్కూల్ డ్రాపౌట్ల శాతం భారీగా తగ్గింది. గరిష్ట చేరికల నిష్పత్తి (జీఈఆర్)లో స్పష్టమైన పెరుగుదల కనిపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన అనంతరం 2019–20లో విద్యార్థుల చేరికలు 72,43,269కు, 2020–21లో 73,05,533కి పెరిగాయి. గత సర్కారు హయాంతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఏకంగా 7.84 లక్షల చేరికలు పెరిగాయి. ఇప్పటివరకు ఉన్న గణాంకాల ప్రకారం 2021–22లో ప్రభుత్వ స్కూళ్లలో చేరిన వారిలో బాలికలు 23,82,860 మంది ఉండగా బాలురు 23,49,204 మంది ఉన్నారు. -
మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
నిండ్ర(చిత్తూరు): అత్తూరు పాఠశాలలో ఎమ్మెల్యే రోజా ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠం చెప్పారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి–మనం అనే పాఠ్యాంశంలో పర్యవరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా సర్వహంగులతో రూపుదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. శనివారం మండలంలోని అత్తూరులో నాడు–నేడు కింద ఆధునికీకరించిన జెడ్పీ హై స్కూల్ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ సతీష్, తహశీల్దార్ బాబు, ఎంఈఓ నారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నగరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, పార్టీ మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్‌లు గౌరీ శేఖర్, చంద్రబాబు, దేవదాసు, దీప, గోపి, నాయకులు మునికృష్ణారెడ్డి, మహేష్, అనిల్, సత్యరాజ్, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇవీ చదవండి: మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు -
ప్రభుత్వ పాఠశాలలో మందుబాబుల వీరంగం
-
పాఠశాలను బార్గా మార్చేసి..
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో మందు బాబులు వీరంగం సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలనే బార్గా మార్చేసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. సరస్వతి కొలువే ఉండే చోట తరగతి గదుల్లో మద్యం తాగి సీసాలు పగలు గొట్టారు. గురువారం ఉదయం పాఠశాలను రీ ఓపెన్ చేయడంతో తాగుబోతుల బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 1600 మంది విద్యార్థులు రోడ్డుపైనే ఉండిపోయారు. పాఠశాలలో తాగుబోతుల ఆగడాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘రికార్డు స్థాయిలో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు’
సాక్షి, అమరావతి: విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకే ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటీ ఎన్నికలు నిర్వహించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఒకేరోజు రికార్డు స్థాయిలో 96 శాతం పాఠశాలల్లో ఎన్నికలు జరిపామని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 46,612 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించామన్నారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిపామని మంత్రి చెప్పారు. 63 శాతం పాఠశాలల్లో ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. -
మునిగిపో..తున్న చదువుల తల్లి
సాక్షి,రంపచోడవరం/దేవీపట్నం(తూర్పు గోదావరి): అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకం అమలుకు చర్యలు తీసుకోవడంతో.. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్చేందుకు తల్లిదండ్రులు పరుగులు తీస్తున్నారు. జిల్లాలోని ప్రజలందరూ చదువుల వైపు దృష్టి సారిస్తున్నారు. మరో పక్క.. గత టీడీపీ ప్రభుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కాఫర్ డ్యామ్ వల్ల ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో పాఠశాలలు ఉంటాయో ఉండవో తెలియని పరిస్థితి ఏర్పడింది. నిర్వాసితులకు పునరావాసాన్ని కల్పించే కాలనీలే ఇప్పటికీ పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల ఏర్పాటు విషయాన్ని అప్పటి పాలకులు పట్టించుకోలేదు. దీంతో ముంపు ప్రాంతాల్లో విద్య కొండెక్కినట్టేనా? అన్న అనుమానాలు ముంపు ప్రాంతాల్లోని నిర్వాసితుల్లో వ్యక్తమవుతున్నాయి. వీటిని నివృత్తి చేసేందుకు అధికారులూ సిద్ధంగా లేరు. ఈ విషయంపై దేవీపట్నం గ్రామంలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద నిర్మిస్తున్న కాఫర్ డ్యామ్ ముంపు ప్రాంతాల్లోని విద్యార్థులను చదువులకు దూరం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 35 కాంటూర్ వరకు వరద వస్తే ముంపునకు గురయ్యే గ్రామాలను ఖాళీ చేసి నిర్వాసితులకు తాత్కాలికంగా టెంట్లు వేసి అక్కడకు తరలించేలా అధికారులు కార్యాచరణ రూపొందించారు. అయితే ముంపు గ్రామాల్లో ఉన్న పాఠశాలల గురించి విద్యార్థుల విషయంపై మాత్రం అధికారులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. వరద సమయంలో ఈ ముంపు గ్రామాల్లో పాఠశాలల పరిస్ధితి ఏమిటనేది అంతు చిక్కని ప్రశ్నగా ఉంది. ఈ ఏడాది వరద సమయంలో తమ పిల్లలు పాఠశాలలకు దూరం కావాల్సిందేనా? అంటూ తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా వరద వస్తే.. ఈసారి రెండు, మూడు రోజుల్లో నీటిమట్టం తగ్గి పరిస్థితి ఉండదు. సమీపంలోని పోశమ్మ గండి వద్ద గోదావరిపై కాఫర్ డ్యామ్ నిర్మాణమే ఇందుకు కారణం. చదువు ముందుకు సాగేనా? పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కారణంగా జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఐదు మండలాలు ముంపునకు గురవుతున్నాయి. ముంపు గ్రామాల్లో వచ్చే వరదలకు పాఠశాలలు నిర్వహించే పరిస్థితి లేదు. కాఫర్ డ్యామ్ వల్ల విలీన మండలాల్లోని పాఠశాలల్లో ఈ ఏడాది ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే దేవీపట్నం మండలంలోని సుమారు 37 ప్రాథమిక పాఠశాలలు, ఒక జెడ్పీ పాఠశాల, ఒక గిరిజన సంక్షేమ పాఠశాల, ఒక జూనియర్ కళాశాల నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది. తాత్కాలిక పునరావాసం అందరకీ ఒకే చోట కల్పించే అవకాశం కనిపించడం లేదు. పలువురు మండలాన్ని వదిలి బయటకు వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికారులు కాఫర్ డ్యామ్ నిర్మాణం కోసం కేవలం గ్రామాల్లో పునరావాసంపై దృష్టి సారించారు. అయితే నేటికీ ఆర్అండ్ఆర్ కాలనీల నిర్మాణం పూర్తి కాలేదు. అక్కడ పాఠశాలల భవన నిర్మాణాలు పూర్తి కాలేదు. అధికారులు తీరు ఎలా ఉందంటే.. ‘కాఫర్ డ్యామ్ నిర్మాణం చేస్తున్నారు. మీ చావు మీరు చావండి’ అన్న చందంగా ఉందని నిర్వాసితులు విమర్శిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం నిర్వాసితులు, ముంపు ప్రాంతాల్లోని విద్యార్థుల గురించి ఆలోచనే చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. సాధారణ వరదలు వస్తేనే పది రోజుల పాటు విద్యార్థులు చదువుకు దూరం అవుతుంటారు. కాఫర్ డ్యామ్ వల్ల వరద నీరు రోజుల తరబడి ఉండిపోతుంది. దీంతో 42 గ్రామాలు జలమయం అవుతాయి. దిగువకు నీరు వెళ్లే మార్గం లేదు పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ నిర్మాణం కోసం గోదావరి నీటిని మళ్లించేందుకు ఎగువన కాఫర్ డ్యామ్ నిర్మించారు. అయితే ఫీ డ్యామ్ వద్ద పైడిపాక వద్ద గొట్టాలతో ఏర్పాటు చేసిన మార్గం ద్వారానే నీరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. సాధారణంగా భద్రాచలం వద్ద 43 అడుగులుకు మొదటి ప్రమాద హెచ్చరిక, 48 అడుగులకు రెండో ప్రమాద హెచ్చరిక, 53 అడుగులకు నాలుగో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటారు. అయితే కాఫర్ డ్యామ్ 2,500 మీటర్ల ఎత్తులో నిర్మించాలి. ప్రస్తుతం 1,850 మీటర్ల మేర ఎత్తు చేసి పనులు కొనసాగిస్తున్నారు. 35 అడుగుల ఎత్తున ఈ డ్యామ్‌ను నిర్మించారు. దీంతో గోదావరి వరదల సమయంలో బ్యాక్ వాటర్ గ్రామాలను ముంచేత్తుతుంది. ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు కూడా పనిచేసే పరిస్థితి లేదు. -
పంతుళ్లకు పరీక్ష..!
సాక్షి, మహబూబాబాద్ : ఈ విద్యా సంవత్సరం గవర్నమెంట్ పంతుళ్లకు పరీక్ష కాలమని చెప్పొచ్చు. అదేమిటీ.. విద్యార్థులకు కదా పరీక్ష.. పంతుళ్లకెందుకు అనుకుంటున్నారా.. ఒక్కసారి వారి విధుల వివరాలు చెబితే నోరెళ్లబెట్టాల్సిందే. విద్యార్థులకు చదువు చెప్పడం అట్లుంచితే.. ఎన్నికల విధులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కేటాయించిన ఎన్నికల విధులు విద్యార్థులకు శాపంగా మారుతోంది. జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు మొదలు, వరుస ఎన్నికలతో నిత్యం విద్యాశాఖ సిబ్బందికి రెండు పడవలపై పయనం చేయాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. డిసెంబర్ చివరినాటికి అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తికావాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకున్నప్పటకీ, ఇప్పటికీ జిల్లాలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా సిలబస్ పూర్తి కాలేదు. అలాగే రానున్నది పరీక్షకాలం కావడంతో పదోతరగతిలో విద్యార్థుల ఉత్తమ ప్రదర్శన కోసం నిర్వహించే ప్రత్యేక తరగతులకు ఆటంకం కలుగనుంది. శాసనసభ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ టీచర్లు విధులు నిర్వహించడం వల్ల ఇప్పటికే విద్యార్థులకు నష్టం జరిగింది. ఇప్పుడు వరుసగా గ్రామపంచాయతీ, సహకార, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వల్ల విద్యార్థులకు మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలు జిల్లాలోని 461 గ్రామపంచాయతీల్లో మూడు దశల్లో 4,020 పోలింగ్ కేంద్రాల్లో ఈనెలాఖరు వరుకు ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో 3,025మంది ఉపాధ్యాయులు ఉండగా, జిల్లావ్యాప్తంగా 44,703 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు సుమారు 3,878మంది సిబ్బంది అవసరం ఉంది. దీంతో ఇన్చార్జి హెడ్మాస్టర్లతో పాటు, సీనియర్ అసిస్టెంట్, స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు కూడా ఎన్నికల విధులు కేటాయించనున్నారు. మహబూబాబాద్ జిల్లా ఏర్పాటైన రెండు సంవత్సరాలుగా పదోతరగతి ఫలితాల్లో చివరిస్థానంలో నిలుస్తోంది. దీంతో జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రభావం ఫలితాలపై మరోసారి పడనుందోననే భావన విద్యార్థుల తల్లిదండ్రుల్లో నెలకొంది. ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయులు.. గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసి ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తోంది. గ్రామపంచాయతీ ఎన్నికలకు ఆర్ఓలు, ఏఆర్ఓలుగా గెజిటెడ్ అధికారులను నియమించాలి. కానీ గెజిటెడ్ అధికారులు ఎక్కువగా లేకపోవడంతో స్కూల్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్ఓ, ఏఆర్ఓలతో పాటు, ఇతర పోలింగ్ సిబ్బందిగా ఏదో రకమైన విధులను ఉపాధ్యాయులు నిర్వహించాల్సి వస్తోంది. మూడు నాలుగు గ్రామపంచాయతీలకు కలిపి ఒక క్లస్టర్ చేసి ఆర్ఓ, ఏఆర్ఓలను నియమిస్తారు. వీళ్లు స్టేజ్–1లో గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నుంచి మొదలు నామినేషన్లు స్వీకరణ, పరిశీలన, విత్‌డ్రా, అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు పనులు చేయాలి. స్టేజీ–2లో ఆర్వోలు ఎన్నికల పోలింగ్, ఓట్లు లెక్కింపు, విజేతల ప్రకటన, ఉపసర్పంచ్ నియామకం వంటి పనులు చేయాలి. ఇతర సిబ్బంది పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులకు శిక్షణ, విధుల నిర్వహణ వంటి పనుల కోసం శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. ఇన్ని రోజులు బోధనా పనిదినాలు విద్యార్థులు నష్టపోతే, అది విద్యార్థుల సిలబస్ పూర్తిచేయడంపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. సిలబస్ పూర్తయ్యేనా..! మార్చి 16న పదోతరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి, దానికనుగుణంగా డిసెంబర్ 31 నాటికి సిలబస్ పూర్తి కావాలి. కానీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల విధుల్లో ప్రభుత్వ టీచర్లు పాల్గొన్నారు. నాలుగైదు రోజులు పనిదినాలు నష్టపోయాయి. ఇప్పుడేమో గ్రామపంచాయతీ ఎన్నికల కోసం వందలాది మంది ఇన్చార్జి హెడ్మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లను ఆర్ఓ, ఏఆర్ఓలుగా నియమించారు. అసలే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరత వెంటాడుతోంది. సిలబస్ సమస్య ఎలా అధిగమించాలా అని ఉపాధ్యాయులు మదనపడుతుంటే మళ్లీ ఈ సారి గ్రామపంచాయతీ ఎన్నికల రూపంలో మరోసారి ఉపాధ్యాయులపై భారం పడింది. ఈ సారి ఏకంగా స్కూల్ అసిస్టెంట్లకు సైతం బాధ్యతలు అప్పగిస్తుండడంతో ఏం చేయాలో తోచక ఉపాధ్యాయులు తికమక పడుతున్నారు. -
ఏడాదికో వర్ణం..ఇదేమి చిత్రం
రాయవరం (మండపేట): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో.. అందరూ సమానమనే భావన కలిగించేందుకు ప్రభుత్వం ఏటా యూనిఫామ్స్ పంపిణీ చేస్తోంది. విద్యా హక్కు చట్టంలో భాగంగా ఒకటో తరగతి నుంచి ఎని మిదో తరగతి విద్యార్థులకు ఉచితంగా అందజేస్తున్నారు. అయితే వీటి పంపిణీ ఏటా అపహాస్యంపాలవుతోంది. ఒక్కో ఏడాది ఒక్కో రంగులో వస్త్రాన్ని సరఫరా చేస్తుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది మాదిరిగా కాకుండా ఈ ఏడాదైనా విద్యార్థుల సైజులకు సరిపడా యూనిఫామ్ సరఫరా చేయాలని పలువురు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. గత విద్యా సంవత్సరంలో యూనిఫామ్ రంగు మార్చారు. విద్యార్థులు ధరించే యూనిఫామ్‌లో ప్యాంట్/స్కర్ట్ రంగులో మార్పు లేనప్పటికీ షర్ట్ రంగు, డిజైన్ మార్చారు. గతంలో గళ్లతో కూడిన స్కైబ్లూ రంగు షర్ట్ సరఫరా చేయగా ఈసారి ప్లెయిన్ నీలి రంగు షర్ట్‌ను సరఫరా చేశారు. అంతకు రెండు సంవత్సరాల ముందు పచ్చ రంగు ప్యాంట్, షర్ట్ పంపిణీ చేశారు. గత విద్యా సంవత్సరంలో పంపిణీ చేసిన యూనిఫామ్ నాణ్యత బాగా నాసిరకంగా ఉందని, షర్ట్ వివిధ రకాల షేడ్స్‌లో పంపిణీ చేశారు. దూరం దూరంగా కుట్లు వేయడంతోపాటు ఇచ్చిన కొద్ది రోజులకే దుస్తులు విడిపోతున్నాయని తల్లిదండ్రులు తెలిపారు. మూడు నెలలు ఆలస్యంగా.. జిల్లాలో ఉన్న 3,347 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 3.24 లక్షల మంది విద్యార్థులకు గత ఏడాది యూనిఫామ్ పంపిణీ చేశారు. వచ్చే విద్యా సంవత్సరంలోనూ అంతే సంఖ్యలో ఒక్కొక్కరికి రెండేసి జతల వంతున పంపిణీ చేయాల్సి ఉంది. పాఠశాలలుపునఃప్రారంభం నాటికి అందజేయాల్సి ఉండగా గత ఏడాది సెప్టెంబర్ నాటికి 2.43 లక్షల మంది విద్యార్థులకు మాత్రమే సరఫరా చేశారు. అనంతరం కొద్ది నెలల తేడాలో 81 వేల మంది విద్యార్థులకు అందజేశారు. ఒక్కో యూనిఫామ్‌కు క్లాత్ ఖర్చుల కింద రూ.160, కుట్టు ఖర్చుల కింద రూ.40ను ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఏటా ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి చదివే విద్యార్థులకు విద్యా హక్కు చట్టం కింద యూనిఫామ్ పంపిణీ చేస్తున్నారు. క్లాత్, కుట్టే బాధ్యతను ఆప్కో సంస్థ దక్కించుకుంది. సాధారణంగా ఏటా క్లాత్‌ను ఆప్కో సంస్థ సరఫరా చేస్తుండగా గత విద్యా సంవత్సరంలో దుస్తులు కుట్టే బాధ్యతను ఆప్కో చేజిక్కించుకుంది. నామమాత్రమవుతున్న ఎస్ఎంసీలు... యూనిఫామ్స్ క్లాత్‌ను ప్రభుత్వం సరఫరా చేస్తే పాఠశాల ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానికంగా ఉన్న మహిళా శక్తి సంఘాలకు కుట్టు బాధ్యతను అప్పగించాల్సి ఉంది. ఏటా యూనిఫామ్‌ను మహిళా శక్తి సంఘాల ద్వారా స్థానికంగా ఉన్న టైలర్లకు అప్పగించగా, గత ఏడాది మాత్రం ఆప్కో సంస్థ కుట్టు బాధ్యతలు తీసుకుంది. తరగతుల వారీగా కొలతలతో కుట్టి సరఫరా చేయడంతో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. క్షేత్రస్థాయిలో విద్యార్థుల శారీరక కొలతలకు, సరఫరా చేసిన యూనిఫామ్ కొలతలకు మధ్య తేడాలుండడంతో విద్యార్థులకు ఏ మాత్రం సరిపడకపోవడంతో వాటిని ధరించలేని పరిస్థితి తలెత్తింది. సరిపడని యూనిఫామ్‌ను ఆయా పాఠశాలల హెచ్ఎంలకు చాలా మంది విద్యార్థుల తల్లిదండ్రులు తిరిగి ఇచ్చేశారు. ఉపాధ్యాయులు సర్దుబాటు చేయలేక, సమాధానం చెప్పలేక తలలు పట్టుకున్నారు. యూనిఫాం మారుస్తామని అధికారులు చెప్పినా, కార్యరూపం దాల్చలేదు. ఈ ఏడాదైనా క్లాత్‌ను సరఫరా చేసి, కుట్టు బాధ్యతను ఎస్‌ఎంసీల పర్యవేక్షణలో స్థానిక టైలర్లకు అప్పగిస్తేనే ప్రయోజనం ఉంటుందని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టకపోతే ఎస్ఎంసీలు నామమాత్రంగా మిగిలే అవకాశం ఉంటుంది. పాఠశాలలు పునఃప్రారంభానికి.. పాఠశాలల పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు పూర్తి స్థాయిలో యూనిఫామ్స్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే రాష్ట్ర స్థాయి అధికారులు అడిగిన ఇండెంట్ పెట్టాం. వచ్చే విద్యా సంవత్సరానికి 3 లక్షల ఆరు వేల 303 మందికి యూనిఫాం సరఫరా చేయనున్నాం. యూనిఫాం క్లాత్ సరఫరా అవుతుందా? కుట్టిన యూనిఫామ్స్ సరఫరా అవుతుందా? అనే విషయం రాష్ట్రస్థాయిలో నిర్ణయమవుతుంది. – మేకా శేషగిరి, పీవో, ఎస్ఎస్ఏ, కాకినాడ -
నేస్తమా.. నువ్వెక్కడ?
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న బాలికల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం ‘నేస్తం’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. మూడేళ్ళుగా ఈ పథకం అమలు కాకపోవడంతో పేద విద్యార్థినులు అనారోగ్య సమస్యలతో సతమతమవుతూనే ఉన్నారు. దీంతోపాటు తీవ్ర ఒత్తిడికి గురవడంతో నిత్యం చదువుపై ఒకింత ఏకాగ్రత లోపిస్తోంది. ఎవరికి చెప్పుకోలేక లోలోన సతమతమవుతూ విద్యకు దూరమవుతున్నారు. సత్తెనపల్లి : పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థినుల సౌకర్యార్థం... వారిని అన్ని విధాల ఆదుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ‘నేస్తం’ పథకం ప్రవేశపెట్టింది. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న వారికి అండగా నిలవాలని దీన్ని చేపట్టింది. రుతుక్రమ సమయంలో 15 ఏళ్ళ లోపు బాలికలు పలు ఇబ్బందులకు గురవుతున్నారని... మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని గుర్తించిన అప్పటి విద్యా శాఖ ఉన్నతాధికారులు ఈ పథకాన్ని తెరపైకి తీసుకొచ్చారు. రుతు రుమాళ్ళ (న్యాప్కిన్స్)ను బాలికలకు ఉచితంగా అందజేశారు. వీటిని ఉపాధ్యాయినుల పర్యవేక్షణలో పంపిణీ చేశారు. అయితే, మూడేళ్లుగా ఈ పథకం అటకెక్కడంతో బాలికలకు రుమాళ్ళు అందడం లేదు. వీరు పేదవారు కావడం, రుతుక్రమంపై సరైన అవగాహన లేకపోవడం, నగదు చెల్లించి న్యాప్కిన్స్ కొనుగోలు చేయలేక ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కో బాలికకు అప్పట్లో 6 నుంచి 8 రుమాళ్ళు పంపిణీ చేశారు. మార్కెట్లో పదింటి ధర రూ.35 నుంచి రూ.50 పైనే ఉంటుంది. ఇతర రాష్ట్రాల్లో.. కర్ణాటక, కేరళ, బిహార్, తమిళనాడు రాష్ట్రాల్లో బాలికలకు రుమాళ్ళు అందజేస్తున్నారు. వీటిని అక్కడ ప్రభుత్వాలే కొనుగోలు చేసి ఆయా పాఠశాలలకు పంపిణీ చేస్తున్నాయి. వీటిని వినియోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలపై విస్తృతంగా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫలితంగా పాఠశాలలకు దూరమయ్యే బాలికల సంఖ్య తగ్గినట్లు విద్యారంగ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రత్యేక గదులు లేవు... ప్రభుత్వ పాఠశాలల్లో బాలికల వ్యక్తిగత అవసరాలకు ఏ పాఠశాలల్లోనూ ప్రత్యేకమైన గదులు కానరావడం లేదు. ఫలితంగా తరచూ విద్యార్థినులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చెప్పనలవి కావు. గదులు లేకపోవడం వలన బాలికలకు నేస్తం పథకాన్ని పునః ప్రారంభించడంతోపాటు వారి అవసరాలను తీర్చేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సమస్యలు ఇలా..... ♦ రుతుక్రమం సమయంలో పరిశుభ్రత లేకపోవడం ద్వారా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ♦ సరైన రక్షణ లేక బాలికలు తరగతి గదిలో భయం భయంగా కూర్చోవడంతో చదువు పై ఏకాగ్రత కోల్పోయే ప్రమాదం ఉంది. ♦ ఇవన్నీ వెరసి విద్యార్థినుల్లో తెలియని బాధ, విసుగు లాంటి లక్షణాలు ఎక్కువ గా ఉంటాయని వైద్యులు పేర్కొంటున్నారు. ♦ రుతుక్రమం సమయంలో నూనె పదార్థాలను అధికంగా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే, ఘాటైన మసాల, పుల్లని పదార్థాల జోలికి కూడా వెళ్ళకపోవడం ఉత్తమం. ♦ రుతు సమయంలో వ్యాయామం కూడదు. ♦ ప్రాసెస్ చేసిన ఆహారం, రోడ్డు పక్కన అమ్ముతున్న చిరు తిండ్లు, జంక్ ఫుడ్ తీసుకోకూడదు. ఈ ఆహారం ఉత్తమం..... ♦ నీటి శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలనే తీసుకోవాలి. ♦ కాకరకాయ, గుమ్మడి గింజలు, బంగాళ దుంపలు, బొప్పాయి అధికంగా తీసుకోవాలి. ♦ పాలకూర, బీట్రూట్, మాంసం, డ్రై ఫ్రూట్స్, యాపిల్, ఉసిరి తదితరాలను తీసుకోవచ్చు. ♦ విటమిన్ డీ కోసం సాయంత్రం కాసేపు ఎండలో నిలబడడం వలన శరీరంలో ఎర్ర రక్తకణాలు వృద్ధి చెందుతాయి. -
పాఠశాలల్లో సదుపాయాలపై‘సుప్రీం’ ఆరా
జిల్లాలో త్రిసభ్య కమిటీ పర్యటన స్కూళ్లలో తాగునీరు, మరుగుదొడ్లు తనిఖీ పాడేరులో అధికారులతో సమీక్ష చోడవరం టౌన్/తుమ్మపాల/పాడేరు: సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీ శుక్రవారం జిల్లాలో పర్యటించింది. అనకాపల్లి, చోడవరం, పాడేరు ప్రాంతాల్లోని పాఠశాలల్లో తాగునీరు. మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాల నిర్వహణను అశోక్‌కుమార్ గుప్తా, కె.వి. రత్నం, వెంకటేశ్వరరావులతో కూడిన కమిటీ పరిశీలించింది. చోడవరం మండలం గోవాడ ఉన్నతపాఠశాల, చోడవరం బాలికోన్నత పాఠశాల, గౌరీపట్నం ప్రాథమికోన్నత పాఠశాలల్లో మౌలిక సదుపాయాల పట్ల సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. కమిటీ పరిశీలిస్తున్నప్పుడు గోవాడ ఉన్నతపాఠశాల విద్యార్థులు కొందరు రోడ్డు పక్కన మూత్ర విసర్జన చేయడంపై పాఠశాల హెచ్ఎం రవీంద్రబాబును వివరణ కోరారు. బాలికలకు మాత్రమే మరుగుదొడ్లు ఉన్నాయని, బాలురకు లేవని హెచ్ఎం తెలిపారు. సిబ్బంది ఒక దానిని వినియోగించుకుని మిగిలిన వాటిని బాలురకు కేటాయించాలని సూచించారు. అనకాపల్లి మండలం రేబాకలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. మరుగుదొడ్లను పరిశీలించి రన్నింగ్ వాటర్ సదుపాయంపై ఆరా తీశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్లు ఉన్నదీ లేనిదీ ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ పాఠశాలలో తాగునీటి నిల్వకు ట్యాంకు ఏర్పాటు చేయాలని విద్యాశాఖాధికారులకు ఆదేశించారు. మరుగుదొడ్లకు రన్నింగ్‌వాటర్ సదుపాయం ఉన్నదీ లేనిదీ స్వయంగా పరిశీలించారు. అనంతరం అనకాపల్లి విజయరామరాజుపేట ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేశారు. పట్టణంలో కంటే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో మరుగుదొడ్లు మెరుగుగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. చీకటి పడ్డాక పాడేరు వచ్చిన కమిటీ సభ్యులు మండలంలోని వంతాడపల్లి, పాడేరు ప్రభుత్వ ఉన్నతపాఠశాల, గుడివాడ ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. మరుగుదొడ్లు, రన్నింగ్ వాటర్ సౌకర్యంపై వివరాలు సేకరించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. కమిటీ వెంట విద్యాశాఖ ఆర్జేడీ ప్రసన్నకుమార్, డీఈవో ఎం.వి. కృష్ణారెడ్డి, డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎస్ఎస్ఏ పీవో నగేష్ ఉన్నారు. -
బాలికల సింగిల్స్ విజేత శిరీష
లాలాపేట, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా టెన్నికాయిట్ టోర్నమెంట్లో సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను శిరీష (హైదరాబాద్) కైవసం చేసుకుంది. బాలుర సింగిల్స్ టైటిల్‌ను జగదీష్ (తూర్పు గోదావరి) గెలిచాడు. హైదరాబాద్ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి లాలాపేటలోని ప్రభుత్వ పాఠశాల (ఘడి హైస్కూల్) మైదానంలో శనివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో శిరీష 21-19, 21-15 స్కోరుతో ప్రీతి (హైదరాబాద్)పై విజయం సాధించింది. సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో జగదీష్ 21-11, 21-17తో అనిల్ (హైదరాబాద్)పై గెలిచాడు. సీనియర్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎం.లక్ష్మణ్‌రావు (పశ్చిమ గోదావరి) నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో లక్ష్మణ్‌రావు 22-21, 21-12తో ఎన్.రాకేష్ (హైదరాబాద్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో రమాదేవి (చిత్తూరు) 21-11, 21-15తో వై.రేవతి (ప్రకాశం)పై గెలిచింది. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ముఖ్యతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.