లాలాపేట, న్యూస్‌లైన్: అంతర్ జిల్లా టెన్నికాయిట్ టోర్నమెంట్‌లో సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ టైటిల్‌ను శిరీష (హైదరాబాద్) కైవసం చేసుకుంది. బాలుర సింగిల్స్ టైటిల్‌ను జగదీష్ (తూర్పు గోదావరి) గెలిచాడు. హైదరాబాద్ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడి లాలాపేటలోని ప్రభుత్వ పాఠశాల (ఘడి హైస్కూల్) మైదానంలో శనివారం జరిగిన సబ్ జూనియర్ బాలికల సింగిల్స్ ఫైనల్లో శిరీష 21-19, 21-15 స్కోరుతో ప్రీతి (హైదరాబాద్)పై విజయం సాధించింది.
సబ్ జూనియర్ బాలుర సింగిల్స్ ఫైనల్లో జగదీష్ 21-11, 21-17తో అనిల్ (హైదరాబాద్)పై గెలిచాడు. సీనియర్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నిరుటి విజేత ఎం.లక్ష్మణ్‌రావు (పశ్చిమ గోదావరి) నిలబెట్టుకున్నాడు. ఫైనల్లో లక్ష్మణ్‌రావు 22-21, 21-12తో ఎన్.రాకేష్ (హైదరాబాద్)పై గెలిచాడు. మహిళల సింగిల్స్ విభాగం ఫైనల్లో రమాదేవి (చిత్తూరు) 21-11, 21-15తో వై.రేవతి (ప్రకాశం)పై గెలిచింది. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి నగర మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి ముఖ్యతిథిగా విచ్చేసి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.
బాలికల సింగిల్స్ విజేత శిరీష
Published Sun, Oct 13 2013 12:12 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement