మధ్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయాలి  | Telangana: BJP Bandi Sanjay Said Release Launch Bills In Government Schools | Sakshi
Sakshi News home page

మధ్యాహ్న భోజన బిల్లులను విడుదల చేయాలి 

Published Tue, Dec 21 2021 2:31 AM | Last Updated on Tue, Dec 21 2021 2:31 AM

Telangana: BJP Bandi Sanjay Said Release Launch Bills In Government Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న మధ్యాహ్న భోజన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం  వెంటనే విడుదల చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోవడంపై సోమవారం ఆయన ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ పథకం కార్మికుల గౌరవ వేతనాన్ని పెంచాలని గత కొన్నేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నా సీఎం కేసీఆర్‌ నుంచి కనీస స్పందన లేకపోవడం సిగ్గుచేటని, కేసీఆర్‌ నిరంకుశ, నిర్లక్ష్య వైఖరివల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 20 లక్షల మంది విద్యార్థులు పస్తులుండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement