
సాక్షి, హైదరాబాద్: ఫిలింనగర్ ప్రభుత్వ పాఠశాలలో మందు బాబులు వీరంగం సృష్టించారు. దర్జాగా ప్రభుత్వ పాఠశాలనే బార్‌గా మార్చేసి న్యూ ఇయర్ పార్టీ చేసుకున్నారు. సరస్వతి కొలువే ఉండే చోట తరగతి గదుల్లో మద్యం తాగి సీసాలు పగలు గొట్టారు. గురువారం ఉదయం పాఠశాలను రీ ఓపెన్ చేయడంతో తాగుబోతుల బాగోతం బయటపడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. సుమారు 1600 మంది విద్యార్థులు రోడ్డుపైనే ఉండిపోయారు. పాఠశాలలో తాగుబోతుల ఆగడాల పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.