
నిండ్ర(చిత్తూరు): అత్తూరు పాఠశాలలో ఎమ్మెల్యే రోజా ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠం చెప్పారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి–మనం అనే పాఠ్యాంశంలో పర్యవరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు.
నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా సర్వహంగులతో రూపుదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. శనివారం మండలంలోని అత్తూరులో నాడు–నేడు కింద ఆధునికీకరించిన జెడ్పీ హై స్కూల్ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఎంపీడీఓ సతీష్, తహశీల్దార్ బాబు, ఎంఈఓ నారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నగరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, పార్టీ మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్‌లు గౌరీ శేఖర్, చంద్రబాబు, దేవదాసు, దీప, గోపి, నాయకులు మునికృష్ణారెడ్డి, మహేష్, అనిల్, సత్యరాజ్, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
ఇవీ చదవండి:
మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
Comments
Please login to add a commentAdd a comment