teaching lessons
-
Teachers Day 2022: మాతృభాషలో బోధనతో ప్రతిభకు పదును
న్యూఢిల్లీ: పాఠశాల స్థాయిలో మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అభిలషించారు. మాతృభాషలో బోధిస్తే పిల్లల్లో సైన్స్, సాహిత్యం, సామాజిక శాస్త్రాలకు సంబంధించి నైపుణ్యం అభివృద్ధి చెందుతుందని అన్నారు. పాఠ్యాంశాలను వారు సులువుగా అర్థం చేసుకోగలుగుతారన్నారు. నూతన జాతీయ విద్యావిధానంలో పాఠశాల, ఉన్నత విద్యలో భారతీయ భాషలకు ప్రాధాన్యం లభించిందని చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన జాతీయ ఉపాధ్యాయుల పురస్కారాల ప్రదానోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె చిన్ననాటి అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్నారు. తమ గ్రామం నుంచి కాలేజీలో చదువుకునేందుకు వెళ్లిన మొదటి బాలికగా నిలవడం వెనుక ఉపాధ్యాయులు అందించిన ప్రోత్సాహమే కారణమని చెప్పారు. వారికి తానెంతో రుణపడి ఉంటానన్నారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము 46 మంది ఉపాధ్యాయులకు జాతీయ పురస్కారాలు అందజేశారు. వీరిలో హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణకు చెందిన ముగ్గురు చొప్పున ఉపాధ్యాయులున్నారు. -
పాఠం చెప్పమంటే పాట పాడుతున్న మాష్టారూ..!
యడ్లపాడు(గుంటూరు): ఆ మాష్టారూ ఎక్కడ ఉన్నా..విద్యార్థులు స్కూల్‌కు డుమ్మా కొట్టారు. ఎందుకంటే ఆ బడిలో పుస్తకాలు తెరిచి పాఠాలు చెప్పరు..కాని అక్కడి పిల్లలకు ఆ పుస్తకాల్లోని పాఠాలన్నీ కంఠోపాఠం అవుతాయి. ప్రాథమిక విద్యాబోధనను కొందరు పిల్లల వేలుపట్టి రాయించి నేర్పిస్తారు. మరికొందరు బట్టీ పట్టిస్తారు. ఇంకొందరు బొమ్మలతో బోధన చేస్తారు. ఆయన వీటన్నింటికీ భిన్నం. అదేమని ప్రశ్నిస్తే..పాఠం ఎలా బోధించామన్నది కాదు వాటిని ఎంత శ్రద్ధగా విని పిల్లలు గుర్తుంచుకున్నరన్నదే ప్రధానమంటారు. బడి అంటే భయం..పాఠం రాలేదనే టెన్షన్ లేకుండా చెప్పడమే తన లక్ష్యం అంటారు. పాఠం పాటయితే.. ఆయన తరగతి గదికి పాఠ్యపుస్తకం బదులుగా పాటల పుస్తకం తీసుకువస్తారు. అతని చేతిలో చాక్‌పీస్‌కు మారుగా స్మాల్‌మైక్ ఉంటుంది. పాఠాలు చెప్పాల్సిన గొంతునుంచి ట్రాక్‌మ్యూజిక్ సౌండ్‌తో కమ్మని పాటలు వినిపిస్తాయి. ఆయన గురించి వింటుంటే ఆశ్చర్యంగా ఉందికదూ.. ఆయన స్వరబోధనే అక్కడ సమ్‌థింగ్ స్పెషల్ అన్నమాట. ఈ వినూత్న బోధకుడు గుంటూరు జిల్లాకు చెందిన పరావస్తు హనుమాసూరి. ఆలోచన అలా అంకురించింది... ఆధ్యాత్మిక మార్గంలో నడిచే మాస్టారు క్రమం తప్పకుండా గుడికి వెళ్లడం అలవాటు. గుళ్లో ఓ సాయంత్రాన ఏర్పాటైన కార్యక్రమంలో భజన బృందం రాకపోవడంతో భక్తులు నిరాశ చెందారు. పరిస్థితిని అర్థం చేసుకుని జేబులోని సెల్‌ఫోన్ తీసి ట్రాక్‌మ్యూజిక్ ఆన్‌చేసి తనకు వచ్చిన భక్తిగీతాలను ఆలపించారు. ట్రాక్‌మ్యూజిక్‌తో పాడిన ఆయన పాటలకు అర్చకుడితో పాటు భక్తులంతా ఫిదా అయ్యారు. పెద్దవాళ్లనే ఆకర్షించిన ట్రాక్‌మ్యూజిక్ విధానం గుడితో పాటు బడిలోనూ అమలు చేస్తే బాగుంటుందనే ఆలోచన అంకురించింది. పాటలతో పాఠాలబోధన ప్రస్థానం ఇక్కడి నుంచే... సూరి మాష్టారు పాటల ద్వారా పాఠాలను బోధించే స్వర ప్రస్థానాన్ని యడ్లపాడు మండలం నుంచే ప్రారంభించారు. కొండవీడు హెచ్‌డబ్ల్యూ స్కూల్‌కు బదిలీపై వచ్చిన ఆయనకు అధికారులు హెచ్ఎంగా బాధ్యతలు ఇచ్చారు. కాలనీ వాసుల్లో అత్యధికశాతం నిరక్షరాస్యులు, రోజువారీ కూలీలు కావడంతో పట్టించుకునే వారులేక పిల్లలు బడికి రావడం కష్టమైంది. పరిస్థితిని అర్థం చేసుకుని పిల్లల్ని బడిబాట పట్టించాలనే ఆలోచన, అవ్వేషణలోనే గుడిపాట బడికి చేరింది. మైండ్‌ట్యూనింగ్ ఇదుగో ఇలా.. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలను వివిధ సినిమా పాటలుగా మార్చుచేసి గానం చేస్తారు. స్కూల్ ప్రారంభ దశలో పేరడీ పాటలు పాడి విద్యార్థులు పాఠశాలకు వచ్చేలా ఆకర్షిస్తారు. తర్వాత పాఠాలను వాడుక భాషలో బాగా అర్ధమయ్యేలా చిన్నచిన్న పదాలుగా తర్జుమా చేసి పాడేస్తారు. రోజు పాఠశాలకు వస్తూ తన సెల్ఫోన్లో ఏదోఒక సినిమా పాటకు సంబంధించిన మ్యూజిక్‌ట్రాన్‌ను ఎంచుకుని రావడం, ఆరోజు చెప్పాల్సిన పాఠాన్ని ఆ ట్రాక్‌లో పాడటం, పిల్లలచే పదేపదే పాడించడంతో విద్యార్థులకు కంఠోపాఠం అవుతాయి. దీంతో పాఠం శాశ్వతంగా గుర్తుండమే కాదు, తరచు అందరితో కలిసి పాడటంతో స్టేజీఫియర్ కూడా పోతుంది. అన్నింటికి మించి పిల్లల్లో ఉత్సుకత, ఉల్లాసం, ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిపాఠం పదమై, చిన్నగొంతులో స్వరమై వారి పెదాలపై లయబద్ధంగా నాట్యం చేస్తుంది. 500లకు పైగా పేరడీ పాటలు... మాట గుండెల్లో దూసుకెళ్లే తూటా అయితే.. ఆ గుండెగాయాన్ని మాయం చేసే పాట అమృతమే కదా. సూరి మాష్టారూ విద్యార్థులకు పాఠ్యాంశాలపై రూపొందించిన పాటలు బోర్ కొట్టకుండా ఉండేందుకు ప్రత్యేక పేరడీ పాటల్ని రాసి పాడించి నవ్విస్తారు. భక్తి, దేశభక్తి, అభ్యుదయం, మానవీయం కోణాల్లోనూ పాటల్ని నేర్పించి వారిని మంచి క్రమశిక్షణతో దేశభక్తిని పెంపొందించేలా కృషి చేస్తున్నారు. సినీ గీతాలను మార్పు చేసి తనకు అనుగుణంగాఇప్పటికీ 500పైగా పాటలు రచించారు. ప్రముఖ కవి పరావస్తు చిన్నయసూరి వంశీయుడే.. నీతి చంద్రిక, బాలవ్యాకరణం, మిత్రలాభం వంటి రచించిన ప్రముఖ కవి పరవస్తు చిన్నయసూరి వంశీయులు హనుమసూరి కావడం విశేషం. మద్రాసులోనిపెరంబుదుర్ స్వస్థలం కాగా వీరి తాతగారు జీయర్‌సూరి శతాబ్ధాకాలం కిందట బతుకుదెరువు కోసం ఆంధ్రరాష్ట్రానికి కుటుంబంతో సహా వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. వెంకటేశ్వర్లు, సత్యవతి దంపతుకు నలుగురి సంతానంలో సూరి చివరిసంతానం. పెద్దవారు ముగ్గురు కుమార్తెలే. మొదట రెంటచింతల మండలంలోని తుమ్మురుకోటలో ఉన్న వీరి కుటుంబం, ఉద్యోగ నిమిత్తం ప్రస్తుతం తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండల కేంద్రానికి మారారు. ఏంఏ బీఈడీ పూర్తిచేసిన సూరి ప్రస్తుతం ఇదే మండలంలోని డోకిపర్రు గ్రామంలోని ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలా సేవలు చేస్తున్నారు.. నాన్‌వెజ్‌తో వచ్చే ఇబ్బందులు–ఆకుకూరలతో చేకూరే ఆరోగ్యం, స్నేహం విలువ, భారతీయ సంప్రదాయాలు, తల్లిదండ్రులు, గురువులను పూజించడం, సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదిగేందుకు అవసరమైన క్రమశిక్షణ, మంచి వ్యక్తిత్వం వంటి అనేక కోణాల్లో సూరి పేరడీ రచనలు చేశారు. ఆయన రాసిన ప్రతిపాట సినీబాణీ అయినా..సమాజ హితాన్ని కోరే భావం అందులో దాగుంటుంది. తన పాటలు బడి,గుడిలోనే కాదు బంధుమిత్రుల శుభకార్యాలలోనూ పాడుతుంటారు. తన పేరడీ పాటలకు మెచ్చి వారిచ్చే కానుకలు, నగదును అనాధ, వృద్ధాశ్రమాలకు ఇవ్వడం సూరి సేవాగుణానికి నిదర్శనం. అదే తృప్తి..పరవస్తు హనుమాసూరి, ఎస్జీటీ చిన్ననాటి నుంచి సాహీత్యం అంటే ఇష్టం. బహుశ కవి వంశీయులు కావడమే కావొచ్చు. పేరడీ అంటే ఇష్టపడని వారుండరు. కాని అది రాయడం ఒకింత కష్టమే. సాహిత్యంలో విభిన్నం ఉండాలని, అవి భావితరాలకు, సమాజానికి ఉపయోగపడేలా ఉండలన్నదే ఆకాంక్ష. -
టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
-
మనబడి నాడు-నేడు: టీచర్‌గా మారిన ఎమ్మెల్యే రోజా
నిండ్ర(చిత్తూరు): అత్తూరు పాఠశాలలో ఎమ్మెల్యే రోజా ఉపాధ్యాయురాలిగా విద్యార్థులకు పాఠం చెప్పారు. తొమ్మిదో తరగతి విద్యార్థులకు సాంఘిక శాస్త్రంలో భూమి–మనం అనే పాఠ్యాంశంలో పర్యవరణ పరిరక్షణకు తీసుకోవలసిన చర్యలను వివరించారు. విద్యార్థులకు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. నాడు–నేడు పథకం కింద ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటుకు దీటుగా సర్వహంగులతో రూపుదిద్దుతున్నట్లు ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. శనివారం మండలంలోని అత్తూరులో నాడు–నేడు కింద ఆధునికీకరించిన జెడ్పీ హై స్కూల్ భవనాన్ని, కేఆర్‌పాళెంలో ప్రాథమిక పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీఓ సతీష్, తహశీల్దార్ బాబు, ఎంఈఓ నారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్యామ్‌లాల్, నగరి మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేరి, సింగిల్‌విండో అధ్యక్షుడు నాగభూషణంరాజు, పార్టీ మండల కన్వీనర్ వేణురాజు, సర్పంచ్‌లు గౌరీ శేఖర్, చంద్రబాబు, దేవదాసు, దీప, గోపి, నాయకులు మునికృష్ణారెడ్డి, మహేష్, అనిల్, సత్యరాజ్, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఇవీ చదవండి: మాజీ మంత్రి ‘కాలవ’ హైడ్రామా ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు -
సర్పంచ్ అంటే ఇలా‘గుండాల’
చేవెళ్ల : బదిలీల ఆర్భాటంలో ఉపాధ్యాయులు ఉండటంతో పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఇంటి దారి పడుతున్నారు. దీంతో గ్రామ సర్పంచే పాఠశాలలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ఇది చేవెళ్ల మండలంలోని గుండాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పరిస్థితి. వివరాలోకి వెళ్తే... మండలంలోని గుండాల గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఉంది. పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయురాలు మల్లమ్మ మాత్రమే ఉంది. గతేడాది ఒక ఉపాధ్యాయురాలు, విద్యావలంటీర్లతోనే పాఠశాలను కొనసాగించారు. ఈఏడాది ఇంకా విద్యావలంటీర్ల నియామకం జరగలేదు. దీంతో ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టడంతో ఉన్న ఆ ఒక్క ఉపాధ్యాయురాలు ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. దీంతో ఆమె కూడా రెండురోజులుగా పాఠశాలకు రావటం లేదు. అయితే ఇదే పాఠశాలలో గ్రామానికి చెందిన సర్పంచ్ పుష్పకుమారిగణేశ్ ఇద్దరు పిల్లలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో రోజూ ఉదయం సర్పంచే స్వయంగా తమ ఇద్దరి పిల్లలను పాఠశాలకు తీసుకొచ్చి వదిలి వెళ్తోంది. ఈ సమయంలో పాఠశాలలో ఉపాధ్యాయురాలు లేకపోవటంతో సర్పంచ్ పుష్పకుమారి విద్యార్థులకు టీచర్‌గా మారి పాఠాలు బోధిస్తున్నారు. ఈ పాఠశాల పరిస్థితిని పట్టించుకోరా అంటూ ఆమె ప్రశ్నించారు. మా పిల్లలు ఈ బడిలోనే ఉన్నారు కాబట్టి ఈ విషయం తెలిసింది. లేదంటే పాఠశాలకు సెలవు ప్రకటించాల్సి వచ్చేదని అధికారుల తీరుపై ఆమె మండిపడుతున్నారు. గుండాలకు కేటాయించిన ఉపాధ్యాయురాలు రాకపోవటంతో పాఠశాల ఎలా కొనసాగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే ప్రభుత్వ పాఠశాలలు ఎలా నడవాలని అంటున్నారు. రెండు మూడు రోజుల్లో సర్దుబాటు చేస్తాం గుండాల ప్రాథమిక పాఠశాలకు మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి. గతంలో ఉన్న ఉపాధ్యాయురాలు బదిలీ కావటంతో కొత్తగా ఒక ఉపాధ్యాయురాలిని కేటాయించారు. అయితే అమె గుండాల దూరం అవుతుందని రాకపోవటంతో ఎవరూ లేక ఖాళీ అయ్యింది. విద్యావలంటీర్లకు నేటి నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తున్నారు. వీవీలను కేటాయిస్తాం. అప్పటి వరకు హైస్కూల్ నుంచి ఒక టీచర్‌ను ప్రాథమిక పాఠశాలకు కేటాయించి కొనసాగిస్తాం. రెండు మూడు రోజుల్లో అయితే మండలానికి కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులతో ఎక్కువగా ఎక్కడైనా ఉంటే వారిని సర్దుబాటు చేయటానికి వీలవుతుంది. - ఎంఈఓ సుజాత -
పంతులమ్మగా జెడ్పీ చైర్పర్సన్
దుగ్గొండి: నిత్యం బిజీ జీవితం.. జిల్లా పాలనలో నిత్యం తలమునకలై ఉంటారు. వివిధ శాఖలను పర్యవేక్షిస్తుంటారు. బిజీ బిజీగా పాలన సాగించే జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ కాసేపు పంతులమ్మగా మారారు. 10 వతరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు. వారిని ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. మండలంలోని నాచినపల్లి, దుగ్గొండి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు రిజిష్టర్లను పరిశీలించారు. నాచినపల్లిలో తెలుగు ఉపాధ్యాయుడి గైర్హాజర్‌పై హెచ్ఎం దుర్గాప్రసాద్‌ను ప్రశ్నించింది. పాఠశాలకు సక్రమంగా విధులకు హాజరయ్యేలా చూడాలన్నారు. కంప్యూటర్లు వృథాగా ఉంటున్నాయని వివరించడంతో బోధకుడి ఏర్పాటు కోసం డీఈఓతో మాట్లాడుతామన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి పుష్టికరమైన భోజనం వండిపెట్టాలని ఏజెన్సీ మహిళలకు సూచించారు. పాఠశాల పూర్వవిద్యార్థులు సమకూర్చిన ఎకరంన్నర ఆటస్థలానికి ప్రహారీ మంజూరు చేయాలని పీఏసీఎస్ చైర్మన్ జనార్ధన్‌రెడ్డి, సర్పంచ్ గోవిందు అనిత కోరడంతో వెంటనే నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. దుగ్గొండి ఉన్నతపాఠశాల హెచ్ఎం, ఇన్చార్జి ఎంఈఓ కొంగర ప్రశాంత్ ఎలాంటి అనుమతి లేకుండా పాఠశాలకు గైర్హాజర్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ పనితీరు సరిగా లేదని ఎంపీపీ సుశీల, జెడ్పీటీసీ సభ్యురాలు రజిత, ఎంపీడీఓ వెంకటేశ్వర్రావులు చైర్మన్‌కు వివరించారు. విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచిన దుగ్గొండి ఉపాధ్యాయ బృందాన్ని ఆమె అభినందించారు. పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటిన పద్మ దుగ్గొండి, నాచినపల్లి ఉన్నత పాఠశాల ఆవరణలలో జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు నలుగురు విద్యార్థులకు బాధ్యత అప్పగించారు. ప్రతి విద్యార్థి పాఠశాల ఆవరణలో తన పేరున మొక్క నాటి సంరక్షించాలని సూచించారు.