ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం: భారత్‌ | India Stresses UN Security Council Reform Need For Representation | Sakshi
Sakshi News home page

ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం: భారత్‌

Published Tue, Nov 12 2024 8:52 AM | Last Updated on Tue, Nov 12 2024 8:52 AM

India Stresses UN Security Council Reform Need For Representation

న్యూయార్క్‌:  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్‌ కోరారు.  

‘‘మేం(భారత్‌) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్‌ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

..1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నా​యి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం. 

..అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారు ఏళ్ల నుంచి ప్రకటనలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చలు జరపటానికి మాత్రమే పరిమితం అయింది. నిర్దిష్టమైన ముగింపు లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అనే అంశం..ఎటువంటి మార్పలు కోరుకోని యథాతథ స్థితికి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముందుకు తెచ్చిన వాదన. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement