UN Security Council reforms
-
ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అవసరం: భారత్
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు అవసరమని ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ అన్నారు. ఈ విషయంపై దశాబ్దాలుగా చర్చలు జరుగుతున్నప్పటికీ 1965 నుంచి ఎటువంటి గణనీయమైన మార్పులు చోటుచేసుకోలేదని వ్యాఖ్యానించారు. న్యూయార్క్‌లో నిర్వహించిన జనరల్ అసెంబ్లీ ప్లీనరీలో ఈ విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని హరీష్ కోరారు. ‘‘మేం(భారత్) ఈ సంవత్సరం చర్చలను ప్రారంభించిన సమయంలో యూఎన్ భద్రతా మండలిలో సంస్కరణల విషయాన్ని మరోసారి గుర్తించాం. భవిష్యత్ శిఖరాగ్ర సమావేశంలో కీలకమైన, తక్షణ ప్రాధాన్యతగా భావిస్తున్నాం. అయితే.. అనేక దశాబ్దాలుగా ఈ విషయాన్ని సమిష్టిగా తెలియజేసినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.#IndiaAtUN PR @AmbHarishP delivered 🇮🇳’s statement at the Plenary Meeting of the General Assembly on ‘Question of equitable representation on and increase in the membership of the Security Council and other matters related to the Security Council’ today. pic.twitter.com/1SDKiTSVtr— India at UN, NY (@IndiaUNNewYork) November 11, 2024..1965లో కౌన్సిల్ చివరిసారిగా నాన్-పర్మనెంట్ విభాగంలో మాత్రమే విస్తరించబడింది. సంస్కరణల పురోగతికి ఆటంకం కలిగించే మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అసమర్థమైన అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ, కొన్ని దేశాలు ఏకాభిప్రాయం కోసం పట్టుబట్టడం, గ్లోబల్ సౌత్‌కు ప్రాతినిధ్యం లేకపోవడం. ..అంతర్-ప్రభుత్వ చర్చల ప్రక్రియ ప్రారంభమైన పదహారు ఏళ్ల నుంచి ప్రకటనలు ఇచ్చిపుచ్చుకోవటం, చర్చలు జరపటానికి మాత్రమే పరిమితం అయింది. నిర్దిష్టమైన ముగింపు లక్ష్యం లేదు. కొన్ని దేశాల ఏకాభిప్రాయం అనే అంశం..ఎటువంటి మార్పలు కోరుకోని యథాతథ స్థితికి అనుకూలంగా ఉన్న కొన్ని దేశాలు మాత్రమే ముందుకు తెచ్చిన వాదన. గ్లోబల్ సౌత్ సభ్యునిగా.. కేవలం కౌన్సిల్ మాత్రమే కాకుండా ఐక్యరాజ్యసమితి చట్టబద్ధత, ప్రభావం రెండింటికీ ప్రాతినిథ్యం అవసరమని మేం విశ్వసిస్తున్నాం’’ అని అన్నారు. -
భారత్ ఆశలు గల్లంతు!
వాషింగ్టన్ : ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి శాశ్వత సభ్యత్వ హోదా భారత్‌కు ఇప్పట్లో దక్కనట్లు స్పష్టమైంది. ఐక్యరాజ్యసమితికి అమెరికా తరుపున రాయబారిగా వ్యవహరిస్తున్న నిక్కీ హేలి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. వీటో అధికారం జోలికి ఎవరినీ రానివ్వకూడదనే శాశ్వత సభ్యత్వ దేశాల వైఖరే భారత్‌కు శాశ్వత హోదాకు కీలక అంశంగా మారిందని హేలి అన్నారు. వాషింగ్టన్లో నిర్వహించిన భారత్ అమెరికా ఫ్రెండ్షిప్ కౌన్సిల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. 'భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణలో వీటో అధికారం ప్రధానంగా మారింది. ఇప్పటికే శాశ్వత సభ్యత్వ దేశాలైన రష్యా, చైనా, బ్రిటన్ అమెరికా, ఫ్రాన్స్ దేశాల్లో ఏ దేశం కూడా వీటో వేరే దేశం జోక్యాన్ని ఆహ్వానించడం లేదు. ముఖ్యంగా రష్యా, చైనా దేశాలు భద్రతా మండలి నిర్మాణంలో సంస్కరణను వ్యతిరేకిస్తున్నట్లు నేను గుర్తించాను. అందుకే భారత్ శాశ్వత హోదాకు ఇప్పుడు వీటో గురించే కీలకంగా మారింది' అని హేలి చెప్పారు. తాము భారత్‌కు అనుకూలంగానే ఉన్నప్పటికీ అమెరికా కాంగ్రెస్‌కు గానీ, సెనేట్‌కుగానీ భద్రతా మండలిని సంస్కరించే పూర్తి అధికారులు లేవని ఆమె చెప్పారు. 'ఇది ఐక్యరాజ్యసమితికి సంబంధించిన విషయం. ఐక్యరాజ్యసమితికి చెంది భద్రతామండలిలోని సంస్కరణ అంశం. ఇందులో మార్పు తీసుకురావాలని భారత్ బలంగా కోరుకుంటే మరిన్ని దేశాల మద్దతు తీసుకొచ్చుకోవడం ద్వారా అది సాధ్యం అవుతుందని నేను అనుకుంటున్నాను' అని హేలి చెప్పారు. -
ఐరాస సంస్కరణలపై చర్చలు వాయిదా
ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ ఏడాదే శాశ్వత సభ్యత్వం సాధించటం కోసం.. మండలికి సత్వరమే సంస్కరణలు తేవాలన్న భారత ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతామండలి సంస్కరణలపై చర్చలను తర్వాతి సమావేశానికి వాయిదా వేయాలని సమితి సర్వసభ్య సభ తాజాగా నిర్ణయించింది. సంస్కరణలపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చించలేకపోవటం దురదృష్టకరమని భారత్ సహా జీ4 దేశాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి. బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్‌లతో కూడిన జీ4 దేశాల బృందం తరఫున.. సమితిలో బ్రెజిల్ రాయబారి ఆంటోనియో డి అగ్వైర్ పాట్రియోటా మాట్లాడుతూ.. సంస్కరణలను ఎంత దూరం వాయిదా వేస్తే ఐరాసపై అవిశ్వాసం అంతగా పెరుగుతుందని వ్యాఖ్యానించారు. సమితి ప్రస్తుత 70వ సర్వసభ్య సభ సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్నాయి.