ఐక్యరాజ్యసమితి: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో ఈ ఏడాదే శాశ్వత సభ్యత్వం సాధించటం కోసం.. మండలికి సత్వరమే సంస్కరణలు తేవాలన్న భారత ప్రయత్నానికి ఎదురుదెబ్బ తగిలింది. భద్రతామండలి సంస్కరణలపై చర్చలను తర్వాతి సమావేశానికి వాయిదా వేయాలని సమితి సర్వసభ్య సభ తాజాగా నిర్ణయించింది. సంస్కరణలపై ప్రస్తుత సమావేశాల్లోనే చర్చించలేకపోవటం దురదృష్టకరమని భారత్ సహా జీ4 దేశాలు అసంతృప్తి వ్యక్తంచేశాయి.
బ్రెజిల్, జర్మనీ, భారత్, జపాన్‌లతో కూడిన జీ4 దేశాల బృందం తరఫున.. సమితిలో బ్రెజిల్ రాయబారి ఆంటోనియో డి అగ్వైర్ పాట్రియోటా మాట్లాడుతూ.. సంస్కరణలను ఎంత దూరం వాయిదా వేస్తే ఐరాసపై అవిశ్వాసం అంతగా పెరుగుతుందని వ్యాఖ్యానించారు. సమితి ప్రస్తుత 70వ సర్వసభ్య సభ సమావేశాలు ఈ ఏడాది సెప్టెంబర్‌లో ముగియనున్నాయి.
ఐరాస సంస్కరణలపై చర్చలు వాయిదా
Published Fri, Jul 29 2016 7:55 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM
Advertisement