
ఐక్యరాజ్యసమితి: ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. లీచెన్‌స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు.
‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కలిసి భారత్ మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోíÙస్తున్నాం’అని హరీశ్ పేర్కొన్నారు.