world yoga day
-
ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ 21
ఐక్యరాజ్యసమితి: ఏటా డిసెంబర్ 21వ తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవంగా జరుపుకోవాలన్న భారత్ సహ ప్రతిపాదనను ఐక్యరాజ్యసమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. లీచెన్స్టయిన్, భారత్, శ్రీలంక, నేపాల్, మెక్సికో, అండొర్రాలతో కూడిన దేశాల బృందం 193 సభ్య దేశాలతో కూడిన జనరల్ అసెంబ్లీలో శుక్రవారం ఈ తీర్మానం ప్రవేశపెట్టాయని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ ‘ఎక్స్’లో వెల్లడించారు. ‘సర్వజనుల శ్రేయస్సు, అంతర్గత పరివర్తన కోసం ఒక రోజు! డిసెంబర్ 21ని ప్రపంచ ధ్యాన దినోత్సవంగా ఐరాస ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించేందుకు ఇతర దేశాలతో కలిసి భారత్ మార్గదర్శనం చేసిందని తెలిపేందుకు సంతోíÙస్తున్నాం’అని హరీశ్ పేర్కొన్నారు. -
యోగాను పాఠ్యాంశాల్లో భాగం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడానికి, అసంక్రమిత వ్యాధుల పెరుగుదలను ఎదుర్కొనేందుకు విద్యార్థులకు యోగాను పాఠ్యాంశంగా బోధించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశ్వవిద్యాలయ, ఆయుష్ మంత్రాలయం సంయుక్తంగా నిర్వహించిన వేడుకల్లో వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాచీన భారతీయ యోగాభ్యాసం శారీరక దృఢత్వం కోసమే కాదని, మానసిక సమతుల్యతను, క్రమశిక్షణను కూడా పెంపొందిస్తుందన్నారు. ఇన్ని ప్రయోజనాల నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాను పాఠ్యాంశాల్లో భాగం చేయాలని సూచించారు. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు యువత ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయన్నారు. శారీరక శ్రేయస్సు కోసం మాత్రమే కాక, మంచి జీవితాన్ని గడపడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మరోవైపు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఆర్కేపురం సెక్టార్–4లోని కమ్యూనిటీ సెంటర్లో జరిగిన యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు మండి హౌస్ గార్డెన్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. -
సానియా యోగాసనాలపై మంత్రి కామెంట్
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ప్రపంచ యోగా దినోత్సవం రోజున గర్భిణిలు చేసే ప్రత్యేక యోగా చేసి ఆకట్టుకున్నారు. యోగాకు తాను ఇచ్చే ప్రాముఖ్యతను వివరిస్తూ ట్విటర్లో చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా ఆ ట్వీట్లో కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకా గాంధీని ట్యాగ్ చేయగా.. ఇంప్రెస్ అయిన మంత్రి సానియాను పొగడ్తలతో ముంచెత్తారు. అసలు విషయమేమిటంటే.. గర్భధారణతో ఉన్న సానియా మీర్జా యోగా డేను పురస్కరించుకొని యోగా చేస్తూ దిగిన ఫోటోలు ట్విటర్లో షేర్ చేశారు. ‘యోగా డే లేక ఏ రోజైనా ఫర్వాలేదు. గర్భాధారణ సమయంలోనూ ఫిట్‌గా ఉండటానికి నేను ప్రయత్నిస్తా. అందుకోసం యోగానే నా మంత్రం. మరి మీరు?’ అంటూ మహిళా శిశు సంక్షేమశాఖ పోర్టల్, మేనకా గాంధీలను ట్యాగ్ చేస్తూ సానియా ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన మేనకా గాంధీ ‘అద్భుతం సానియా, గర్భిణి స్త్రీలు యోగా చేయడం ద్వారా వారికి, పుట్టబోయే పిల్లలకు ఎంతో ఆరోగ్యకరం’ అంటూ రీట్వీట్ చేశారు. త్వరలో గర్భిణీ స్త్రీలతో కలిసి యోగాలో పాల్గొంటానని కేంద్ర మంత్రి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఢిల్లీలో ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమంలో మేనకా గాంధీ పాల్గొన్నారు. International Day of yoga or any other day , #PreNatalYoga is my way of keeping fit during pregnancy .. what’s yours??? 😀 @MinistryWCD and @ManekaGandhiBJP pic.twitter.com/wOTG14GcfA — Sania Mirza (@MirzaSania) 21 June 2018 Wonderful, Sania!!#PreNatalYoga is indeed an exhilarating way to be fit during pregnancy. @MirzaSania https://t.co/Gsm6YOfKqS — Maneka Gandhi (@Manekagandhibjp) 21 June 2018 -
చైనా.. గోడపై అద్భుత యోగా
బీజింగ్: చైనాలో యోగా రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతోంది. యోగా డేలో భారత్ తర్వాత అత్యధిక ప్రజలు పాల్గొనేది చైనాలోనే అన్న విషయం అందరికీ తెలియదు. యోగా డే ఉండాలనే భారత్ ప్రతిపాదనను సమర్థించిన చైనా ప్రతియేటా అధికారికంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోంది. భారత రాయబార కార్యాలయం, యోగి యోగా సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’పై చైనీయులు పలువురు యోగా చేశారు. కొన్ని రకాల ఆసనాలను వేసి యోగా డేకు శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం చైనా రాజధాని బీజింగ్‌లో వెయ్యి మంది ఔత్సాహికులు యోగా డే కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని పలు నగరాల్లో యోగా డే ఘనంగా నిర్వహిస్తున్నారు. భారత రాయబార కార్యాలయం 20 మంది భారత యువతీయువకులను యోగా రాయబారులుగా చైనాకు ఆహ్వహించిన విషయం తెలిసిందే. వీరు హఠ యోగాలో క్లిష్టమైన ఆసనాలను అక్కడ ప్రదర్శించారు. చైనా యువతలో యోగాపై ఆసక్తిని పెంచడానికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నారు. -
వేలమంది గర్భిణీలు సాధించిన రికార్డ్
రాజ్ కోట్ : రెండవ ప్రపంచ యెగా దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వేలమంది గర్భిణులు తమ యోగా ఆసనాలతో ప్రపంచ రికార్డు నెలకొల్పారు. రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో సరికొత్త రికార్డు సృష్టించి... గిన్నిస్ బుక్ రికార్డును సొంతం చేసుకున్నారు. 940 గర్భిణీలతో ప్రస్తుతం చైనా పేరుతో ఉన్న ఈ రికార్డును మనవాళ్లు కొల్లగొట్టారు. యోగా నిపుణులు, గైనకాలజిస్ట్ ల పర్యవేక్షణలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారని రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాండే తెలిపారు. యోగ ఇంటర్నేషనల్ డే' మంగళవారం సుమారు 2,500 మంది గర్భిణీ స్త్రీలు రాజ్ కోట్ నగరంలో యోగా స్వామినారాయణ్ దేవాయలంలో యోగా ఆసనాలు వేశారు. లార్జెస్ట్ ప్రినాటల్ యోగ' లో కొత్త ప్రపంచ రికార్డుకు సాక్ష్యంగా నిలిచారు. -
యోగాతో నవయుగం
-
యోగాతో నవయుగం
* శాంతి సామరస్యాల్లో కొత్త శిఖరాలు అందుకునే మానసిక శిక్షణ ఇది: మోదీ * యోగాను అంగడి సరుకుగా మార్చొద్దు * అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో ప్రధాని మోదీ * రాజ్‌పథ్‌లో 36 వేల మందితో కలిసి యోగాసనాలు.. * ప్రపంచవ్యాప్తంగా ఘనంగా తొలి అంతర్జాతీయ యోగా డే ‘‘యోగా భారత్‌లో పుట్టినప్పటికీ.. అది మానవుల సామూహిక కానుక. లోకకల్యాణంలో, మానవులను భాగ్యవిధాతలుగా మార్చడంలో భరతభూమి భాగస్వామిగా ఉంటుంది’’ -ప్రధాని మోదీ సాక్షి, న్యూఢిల్లీ: ఓం ఉచ్ఛారణలతో, విశ్వశాంతికి మంత్రాలు చదువుతూ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. సియాచిన్ గ్లేసియర్ల నుంచి దక్షిణ చైనా సముద్ర జలాల వరకూ.. సిడ్నీలోని ప్రముఖ బోండీ బీచ్ నుంచి లండన్‌లోని థేమ్స్ నదీ పరివాహకం వరకూ.. పార్కుల నుంచి తీహార్ జైలులోని ఖైదీ గదుల వరకూ.. వివిధ ప్రాంతాల్లో యోగాసనాలు వేశారు. మౌన ధ్యానంలో మునిగిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంతో.. శాంతి, సామరస్యాల్లో కొత్త శిఖరాలను అందుకునేలా మానవ మనసుకు శిక్షణ ఇచ్చే కొత్త యుగం ఆరంభమయిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. యోగా అనేది ఒక సిద్ధాంతమని, ధ్యానం వల్ల ఆత్మ ఉన్నతంగా రూపాంతరం చెందుతుందని, ఆలోచనలో ఆచరణలో జ్ఞానంలో భక్తిలో వ్యక్తి ఉత్తముడిగా మారుతాడని చెప్పారు. యోగాను అంగట్లో అమ్మే వినియోగ వస్తువుగా మార్చరాదన్నారు. ప్రపంచ ప్రజలందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. యోగాను దైనందిన జీవితంలో అంతర్భాగంగా చేసుకునేలా ప్రతినబూనాలని ట్విటర్లో పిలుపునిచ్చారు. యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో చేపట్టిన భారీ బహిరంగ యోగా కార్యక్రమంలో ప్రధాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అక్కడ 36 వేల మందితో కలిసి మోదీ కూడా యోగాసనాలు వేశారు. అంతకుముందు కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ మాట్లాడారు. ఆ తర్వాత విజ్ఞాన్‌భవన్‌లో నిర్వహిస్తున్న 2ల యోగా సదస్సులోనూ ప్రారంభోపన్యాసం చేశారు. జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా డేగా ప్రకటించటానికి భారత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆమోదించేందుకు మద్దతిచ్చిన 193 దేశాలకు, ఐక్యరాజ్యసమితికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. యోగా డేతో శాంతి సామరస్యాలు విస్తరించేలా మనుషుల మనసులకు శిక్షణ ఇవ్వడంలో కొత్త యుగం ప్రారంభమయిందన్నారు. వ్యాయామం యోగా కాదని.. యోగా అనేది అంతకన్నా మించినదని.. మనిషిని ప్రకృతితో మమేకం చేస్తుందని చెప్పారు. యోగాతో అంతర్లీనంగా శక్తి పటిష్టమవుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ముక్తి లభిస్తుందని, శాంతి మార్గంవైపు పయనించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. యోగా ద్వారా లోకకళ్యాణం సిద్ధిస్తుందని, ప్రజలు శాంతి, సామరస్యాలతో జీవనం సాగిస్తారని ఆకాంక్షించారు. యోగాను వ్యాపార వస్తువుగా మారిస్తే.. దానికి మనవల్లే ఎక్కువ నష్టం జరుగుతుందన్నారు. యోగా అనేది వ్యాపారమో, వ్యవస్థో కాదని.. అదొక మానసిక స్థితి అని అన్నారు. యోగా అనేది ఒక ప్రభుత్వం లేదా ఐరాస ఆలోచన నుంచి పుట్టినది కాదని.. అది తరతరాలుగా అందిన కానుక అని అన్నారు. యోగా భారత్‌లో పుట్టినప్పటికీ.. అది మానవుల సామూహిక కానుక అన్నారు. లోకకల్యాణంలో, మానవులను భాగ్యవిధాతలుగా మార్చడంలో భరతభూమి భాగస్వామిగా ఉంటుందని పేర్కొన్నారు. మనదే నిజమైన యోగా అని, విదేశాల్లో చేసేది తప్పు అనే భావన రాకూడదన్నారు. యోగా అభివృద్ధిలో బయటి దేశాల కృషిని స్వీకరించాలన్నారు. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పోస్టల్ విభాగం రూపొందించిన రూ.5 స్టాంపును, ఆర్థికశాఖ రూపొందించిన రూ. 10, రూ. 100 బిళ్లలను మోదీ ఆవిష్కరించారు. రాజ్‌పథ్‌లో మోదీ యోగాసనాలు.. వద్దమ్మా.. ప్లీజ్... రాజ్‌పథ్‌లో జరిగిన యోగా ఉత్సవాల్లో ప్రధాని మోదీ కూడా పాల్గొని ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తొలుత ఈ కార్యక్రమంలో మోదీ యోగాసనాలు వేసే అంశం లేదు. అయితే.. వేదికపై ప్రసంగించిన తర్వాత.. 64 ఏళ్ల మోదీ నేరుగా కిందికి వెళ్లి చాపపై కూర్చుని మిగతా వారితో పాటు చివరి వరకు పాల్గొన్నారు. తెల్లని స్వెట్ షర్ట్, పైజామా, 3 రంగుల స్కార్ఫ్ ధరించిన మోదీ.. 21 సాధారణ ఆసనాలు వేశారు. వాటిలో పాద్-హస్తాసన, అర్థ-చక్రాసన, త్రికోణాసన, దండాసన, అర్ధ-ఉష్ట్రాసన, వజ్రాసన, శశాంకాసన వంటివి ఉన్నాయి. యోగాసనాల నుంచి సూర్యనమస్కారాన్ని ప్రభుత్వం తొలగించింది. ముస్లింలు ‘ఓం’కు బదులుగా ‘అల్లా’ నామాన్ని జపించవచ్చని పేర్కొంది. అనంతరం మోదీ కొద్దిసేపు విద్యార్థులతో ముచ్చటించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్, భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మలతో పాటు పెద్ద సంఖ్యలో దౌత్యవేత్తలు, కేంద్ర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరైన వారిలో ఉన్నారు. మోదీ సరసన యోగా గురువు రామ్‌దేవ్ వేదికపై ఉన్నారు. రాజ్‌పథ్‌లో రెండు కిలోమీటర్ల మేర అన్ని వయసుల్లోని జనం నీలి, ఎరుపు రంగుల చాపలపై కూర్చుని ఆసనాలు వేస్తుండగా.. భారీ డిజిటల్ తెరలపై ఇంగ్లిష్, హిందీ భాషల్లో సూచనలతో ఆసనాలు ఎలా వేయాలనేది చూపారు. పాఠశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్లు, సైనిక సిబ్బంది, అధికారులు సహా వేలాది మంది 35 నిమిషాలు సాగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో సైతం యోగా దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. పలువురు కేంద్రమంత్రులు ఆయా రాష్ట్రాల్లో జరిగిన యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. యోగాకు అద్భుత చికిత్స శక్తులు: ప్రణబ్ న్యూఢిల్లీ: మనిషి సౌఖ్యానికి, ఆధునిక జీవనశైలి సంబంధ వ్యాధులను అరికట్టేందుకు అవసరమైన అద్భుత చికిత్స, నియంత్రణ శక్తులు యోగాకు ఉన్నాయని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పేర్కొన్నారు. ఆయన రాష్ట్రపతి భవన్లో యోగా డేను ప్రారంభించి ప్రసంగించారు. ‘భారత్ యోగాకు పుట్టిల్లు. దేశంలో శతాబ్దాల తరబడి దాన్ని పాటిస్తున్నారు. పతంజలి యోగా గురువుల్లో అత్యంత ప్రముఖుడు. యోగా కళతోపాటు శాస్త్రం కూడా’ అని అన్నారు. రాష్ట్రపతి భవన్ సిబ్బంది, వారి కుటుంబసభ్యులు సహా వెయ్యిమంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ప్రపంచ ‘యోగ’o!
అక్కడక్కడ వినబడిన అసమ్మతి స్వరాలను బేఖాతరు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా 192 దేశాల్లో ఆదివారం తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా జరిగింది. దేశ రాజధానిలోని రాజపథ్ యోగా పథ్‌గా మారింది. ఎత్తయిన సరిహద్దు ప్రాంతం సియాచిన్ మంచుపర్వత శ్రేణి మొదలుకొని సముద్ర జలాల్లోని యుద్ధ నౌకల వరకూ అనేకం యోగాసనాల వేదికలయ్యాయి. జీవనశైలిలో పెరిగిన వేగం కారణంగా ఏర్పడుతున్న మానసిక ఒత్తిళ్లవల్ల పలు రుగ్మతల బారిన పడుతున్న వారికి ఉపశమనం కలిగించే...స్వస్థత చేకూర్చే ఈ ప్రక్రియను ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నదని మన దేశం చేసిన ప్రతిపాదనకు నిరుడు సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితిలోని మెజారిటీ సభ్యదేశాలు ఆమోదం తెలపడంతో ఇది సుసాధ్య మైంది. ఒక దేశం చేసిన ప్రతిపాదనలో 177 దేశాలు సహభాగస్తులు కావడం అదే తొలిసారి. అందులో అఫ్ఘాన్, టర్కీ, ఇరాన్, ఇండొనేసియా, ఖతార్, ఒమన్వంటి 47 ఇస్లామిక్ దేశాలు కూడా ఉండటం మరో అపురూప దృశ్యం. దేనికైనా హర్షామోదాలు లభించినట్టే శంకలూ, సందేహాలూ కూడా తప్పవు. పాకిస్థాన్, సౌదీ అరేబియా, బ్రూనీ, లిబియా వంటి ముస్లిం దేశాలు మాత్రమే కాదు...ఉత్తర కొరియా, స్విట్జర్లాండ్, మొనాకో వంటి ముస్లిమేతర దేశాలు కూడా యోగాను అనుమాన దృక్కులతో చూశాయి. ఇందులో వింతేమీ లేదు. సింధు నాగరికత చరిత్రతో పెనవేసుకుని అయిదువేల ఏళ్లుగా హిందూ మతంతో, సంప్రదాయంతో, ఆధ్యాత్మికతతో ముడిపడి ఉన్న యోగాను వాటికి దూరంగా చూడటం అంత సుల భం కూడా కాదు. అయితే, పాశ్చాత్య ప్రపంచం యోగాలోని ఆసనాలను ప్రధా నంగా తీసుకుని ఫిట్నెస్ సాధించడానికి తోడ్పడే వ్యాయామంగా రూపాంతరం చెందించి చాన్నాళ్లయింది. ప్రాచీన గ్రీకు నాగరికత కూడా దీన్ని అంతశ్శక్తులను పునరుజ్జీవింప చేసుకోవడానికి తోడ్పడే ప్రక్రియగా భావించింది. అందువల్లే ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ వేదికపై ఇందుకు సంబంధించిన ప్రతిపాదన పెట్టినప్పుడు అత్యధిక దేశాలనుంచి సానుకూలత వ్యక్తమైంది. ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదిక ఏ మతానికో, విశ్వాసానికో అనుకూలంగా వ్యవహరించిన చరిత్ర లేదు గనుక అది ఆమోదించిన ప్రక్రియకు అలాంటివాటిని అంటగ ట్టడం సరైంది కాదని ప్రగాఢంగా నమ్మినవారున్నారు. పురాతనకాలంనుంచీ మానవాళి అనుసరించి లబ్ధిపొందుతున్న ఈ ప్రక్రియ... ఐక్య రాజ్యసమితి విశ్వసిస్తున్న సిద్ధాంతాల్లో, విలువల్లో స్వాభావికంగా ఇముడు తుందని భావిస్తున్నట్టు సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తన ప్రసంగంలో అన్నారు గనుక అందుకు భిన్నంగా ఆలోచించరాదని భావించినవారున్నారు. వేల ఏళ్ల మనుగడలో మానవాళి సమష్టిగా సాధించిన జ్ఞానంలో యోగా కూడా ఒక భాగమని... దాన్ని ఏ మతానికో, సమూహాలకో ముడిపెట్టడం తగదని చెప్పిన వారున్నారు. అయితే, ఏదైనా పుట్టింది పుట్టినట్టుగానే ఉండిపోదు. ఆచరణలో అనేక రూపాంతరాలు చెందుతుంది. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా మారుతుంది. అనుసరించేవారికుండే విశ్వాసాల ప్రభావానికి లోనవుతుంది. ఈ క్రమంలో తానే ఒక విశ్వాసంగా మారుతుంది. అలా మారినప్పుడు దాన్ని విడదీసి చూడటం, దాని మౌలిక రూపాన్ని దర్శించడం...ఆ ప్రక్రియవల్ల సమకూరే ప్రయోజనాలను గుర్తించడం కాస్త కష్టమే. పైగా...యోగా అంటే ఇష్టంలేనివారు ‘హిందుస్థాన్’ను వదిలి వెళ్లొచ్చునని బీజేపీ ఎంపీ మహంత్ యోగి ఆదిత్యనాథ్... ఇది హిందువులకు మాత్రమే సంబంధించిందని ప్రవీణ్ తొగాడియా వంటివారు అన్న తర్వాత ఇక వేరే ఆలోచనలకు తావుండదు. అందుకే సూర్య నమస్కారాలను కొందరు ‘సూర్య ప్రార్థన’గా అర్థంచేసుకుని యోగా దినోత్సవానికి దూరంగా ఉండిపోయారు. సొంత ఎజెండా ఉన్నవారి చేతుల్లో పడితే... ఎలాంటి మంచి కార్యక్రమమైనా ఏ రూపం తీసుకుంటుందో, ఎలాంటి పర్యవసానాలకు దారి తీస్తుందో దీన్నిబట్టి అర్థమవుతుంది. అనవసర పట్టింపులూ, ఉద్రేకపూరిత ప్రసంగాలు దృష్టిని మసకబారుస్తాయి. ఇప్పుడు మన దేశంలోనూ, పాశ్చాత్య దేశాల్లోనూ అనుసరిస్తున్న అనేకానేక యోగా రూపాల వెనక ఎందరెందరో చేసిన కృషి ఉంది. కేవలం కొంతమంది వ్యక్తు లకు పరిమితమైపోయి ఎవరూ దృష్టి సారించనప్పుడు 1904లో పదహారేళ్ల వయ సులో తిరుమలై కృష్ణమాచార్య యోగాను ఆశ్వాసించి, అందులో మునిగి తేలడమే కాదు...దాన్ని ఇప్పటి ఆధునిక రూపానికి తీసుకొచ్చారు. అనంతరకాలంలో పట్టాభిజోయిస్, ఇంద్రాదేవి, బీకేఎస్ అయ్యంగార్లను అందులో నిష్ణాతులను చేశారు. వీరిలో అయ్యంగార్ వ్యక్తిగా చేసిన కృషి అసాధారణమైనది. యోగాకు ఎలాంటి మతపరమైన భావనలూ అంటించకుండా దేశ, విదేశాల్లో దాన్ని ఎందరికో అందించిన ఖ్యాతి ఆయనకు దక్కుతుంది. ఆయన స్థాపించిన యోగ విద్యా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా వంద శాఖలున్నాయంటే అయ్యంగార్ కృషి ఎంత గొప్పదో తెలుస్తుంది. పాశ్చాత్య దేశాల్లో, మన పొరుగునున్న చైనాలో అయ్యంగార్ పేరు తెలియనివారు ఉండరంటారు. 60వ దశకంలో సుప్రసిద్ధ వయోలిన్ విద్వాంసుడు యెహుదీ మెనూహిన్, విఖ్యాత తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తివంటివారికి దాన్ని నేర్పించి, వారిద్వారా పాశ్చాత్య ప్రపంచానికి ఆయన పరిచయమయ్యారు. యోగా అనేది మన ‘సాఫ్ట్ పవర్’ అయిన పక్షంలో దాన్ని దశాబ్దాల క్రితమే ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. నిరంతరం అభిమానించి, ప్రేమించాల్సిన వారి కోసం పాశ్చాత్యులు కొన్ని రోజులను కేటాయించడంపై మన దగ్గర చాలామందికి అభ్యంతరం ఉంటుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే వంటివాటిని అందుకే వ్యతిరేకిస్తారు. అలా చూస్తే యోగా కోసం ఒక రోజును కేటాయించడమేమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. కులమతాలకూ, ప్రాంతాలకూ, విశ్వాసాలకూ అతీతంగా అందరూ నిత్యమూ పాటించాల్సిన ఆ అపురూప ప్రక్రియను కొన్ని పరిమితుల్లో ఆలోచించడం సరైందేనా అన్న సందేహం వెలిబుచ్చేవారున్నారు. మిగిలిన పర్వదినాల్లోని అంతరార్థంలాగే యోగా దినోత్సవం వెనుకా ఒక ప్రయోజనం ఉంది. యాంత్రిక జీవనశైలిలో పడి కొట్టుకుపోతున్నవారికి ఆలంబనగా నిలిచి వారిని ఆరోగ్యవంతులుగా మార్చడమే దాని పరమార్థం. అందుకుని నిత్యమూ ఆచరించి లబ్ధిపొందడమా... శంకించి దూరం జరగడమా అన్నది మన చేతుల్లో ఉంది. -
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పలువురు ప్రముఖులు