వేలమంది గర్భిణీలు సాధించిన రికార్డ్ | 2,500 pregnant women created wordl record on world's Yoga day | Sakshi
Sakshi News home page

వేలమంది గర్భిణీలు సాధించిన రికార్డ్

Published Tue, Jun 21 2016 1:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

వేలమంది గర్భిణీలు సాధించిన రికార్డ్

వేలమంది గర్భిణీలు సాధించిన రికార్డ్

రాజ్ కోట్ : రెండవ ప్రపంచ యెగా దినోత్సవం సందర్భంగా  గుజరాత్ లోని రాజ్ కోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది  వేలమంది గర్భిణులు తమ యోగా ఆసనాలతో  ప్రపంచ రికార్డు నెలకొల్పారు.  రెండో అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో  సరికొత్త రికార్డు  సృష్టించి... గిన్నిస్ బుక్ రికార్డును  సొంతం చేసుకున్నారు. 940 గర్భిణీలతో ప్రస్తుతం చైనా పేరుతో ఉన్న  ఈ రికార్డును   మనవాళ్లు కొల్లగొట్టారు.  యోగా నిపుణులు, గైనకాలజిస్ట్ ల పర్యవేక్షణలో గిన్నీస్ బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించారని  రాజ్ కోట్ జిల్లా కలెక్టర్ విక్రాంత్ పాండే తెలిపారు.

యోగ ఇంటర్నేషనల్ డే'   మంగళవారం సుమారు 2,500 మంది గర్భిణీ స్త్రీలు రాజ్ కోట్ నగరంలో  యోగా స్వామినారాయణ్  దేవాయలంలో యోగా ఆసనాలు వేశారు.  లార్జెస్ట్ ప్రినాటల్ యోగ' లో కొత్త ప్రపంచ రికార్డుకు సాక్ష్యంగా నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement